No Condemnation Through Christ
యేసును ఇలా కనుగొనండి: Justifier Romans 8 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
బైబిల్లో అత్యంత అందమైన అధ్యాయం రోమా 8 అని చాలా మంది పండితులు సూచిస్తున్నారు. ఎందుకు? మొదట, ఈ అధ్యాయంలో ఏ శిక్షా లేదా ఏ తీర్పు లేదు. మరియు ఇది ధర్మశాస్త్రముకు మరియు ఆత్మకు వ్యత్యాసమును చూపిస్తుంది. ఈ అధ్యాయాన్ని నాలుగు విభాగాలుగా విభజించవచ్చు: (1) తీర్పు నుండి స్వేచ్ఛ - శిక్ష లేదు (వ. 1-4); (2) ఓటమి నుండి స్వేచ్ఛ - నిర్భంధము లేదు (వ. 5-17); (3) నిరుత్సాహం నుండి స్వేచ్ఛ - నిరాశ లేదు (వ. 8-30); మరియు (4) భయం నుండి స్వేచ్ఛ - ఎడబాటు లేదు (వ. 31-39).
పాఠము
రోమా 8:1-4: “శిక్ష” అనే పదానికి అర్థం ఏదో ఒకదాని గురించి లేదా ఒకరి గురించి బలమైన అసమ్మతిని వ్యక్తపరచడం. కానీ క్రీస్తు యేసులో ఉన్నవారికి బలమైన అసమ్మతి లేదు, ఎందుకంటే నీతిమంతుడు శిక్షను తొలగించాడు (వ. 1). విశ్వాసులమైన మన జీవితాల్లో పాపానికి సంబంధించిన ఏ శిక్ష నుండి అయినా విముక్తి పొందాము (వ. 2). జీవాత్మ మన్ అలను స్వతంత్రులనుగా చేశాదు. అయితే, కొన్నిసార్లు మనం విషయాల నుండి విముక్తి పొందుతాము మరియు ఆ స్వేచ్ఛలో ఎలా నటించాలో మనకు తెలియదు. ఉదాహరణకు, ది షావ్‌శాంక్ రిడంప్షన్ సినిమాలో, మోర్గాన్ ఫ్రీమాన్ పాత్ర జైలు నుండి విముక్తి పొందింది, కానీ ఆ స్వేచ్ఛతో ఎలా ప్రవర్తించాలో అతనికి తెలియదు ఎందుకంటే అతను జైలులో తన జీవితాన్ని పాలించిన చట్టాలకు చాలా కట్టుబడి ఉన్నాడు.
శరీరం ద్వారా ధర్మశాస్త్రము బలహీనపడింది గనుక దేవుడు ఏమి చేయాలని అనుకున్నాడో అది ఇకపై చేయలేదు. మనల్ని పరిశుద్ధముగా ఉంచడానికి లోపలికి పరిగెత్తడానికి దారులు మరియు లోపల ఉండటానికి సరిహద్దులతో మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము ఏర్పాటు చేయబడింది. మనము ఆ సరిహద్దులను విస్మరించాలని ఎంచుకున్నాము, మన జీవితాల్లో ధర్మశాస్త్రము ఉనికిని బలహీనపరిచాము. నేను చిన్నతనంలో, నేను పిల్లల స్కీ స్కూల్లో జారుడుబల్ల బోధకుడిని. కొన్నిసార్లు చిన్న పిల్లలతో వాలుపై ఉన్న రోజు కఠినంగా ఉండేది. పిల్లలు లేకపోతే అది సరైన పనిగా ఉంటుంది అని అ తరువాత మేము నవ్వుకొనేవాళ్ళం. అయితే, మా ఉద్దేశ్యమంతా వారి కోసం ఉండటమే. అదేవిధంగా, ధర్మశాస్త్రము మనకు సహాయం చేయడానికి ఇవ్వబడింది, కానీ మనము దానిని గందరగోళానికి గురిచేసి బలహీనపరుస్తాము.
"శరీరానుసారంగా నడుచుకోని వారు" అనే పదబంధం కొన్ని నమ్మదగిన వ్రాత ప్రతులలో లేదు. ఇది ఒక గమ్మత్తైన ప్రకటన, ఇది క్రీస్తులో జీవితాన్ని పొందడానికి - ఆత్మలో జీవించడానికి - కలుసుకోవలసిన పరిస్థితుల చిత్రాన్ని చిత్రించడానికి మొగ్గు చూపుతుంది. యేసును కలవడానికి మనం ప్రదర్శన ఇవ్వవలసిన అవసరం లేదు. క్రీస్తులో ఎటువంటి శిక్ష లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మనల్ని విడిపించాడు మరియు మనం ఉన్న చోట ఆయన మనల్ని కలుస్తాడు (రోమా 5:8). మనం తీర్పు నుండి విముక్తి పొందాము గనుక మనకిక శిక్ష లేదు. దేవుడు అక్కడ కూర్చుని మన పాపముల గురించి జాబితాలు తయారు చేయడం లేదు మరియు తన పిల్లలపై తీర్పు విధించడం లేదు.
రోమా 8:5-17: విశ్వాసులుగా, మనమందరం క్రీస్తులో పెరిగే “ప్రక్రియలో” ఉన్నాము. ఈ వచనాల విభాగంలో, కొంతమంది పండితులు రక్షింపబడిన వారిని లేదా కాదనే విషయాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ, విశ్వాసులందరూ క్రీస్తులో “ప్రక్రియలో” ఉన్నారని మరియు ఎల్లప్పుడూ పెరుగుతున్నారని మనం గుర్తుంచుకోవాలి, కాబట్టి దానిని గుర్తుంచుకోండి.
5వ వచనం విశ్వాసులను రెండు గ్రూపులుగా విభజిస్తుంది - శరీర విషయముల మీద మనస్సునుంచేవారు మరియు ఆత్మ విషయముల మీద మనస్సునుంచేవారు. నేను విశ్వాసిగా మారినప్పుడు మరియు నా మదిలో ఇంకా ఆలోచనలు ఉన్నాయని నాకు గుర్తుంది - ఇతరులను తీర్పు చెప్పే ఆలోచనలు, అవి విచిత్రమైనవి, అవి రంగులేనివి. క్రీస్తు నా జీవితం నుండి అవన్నీ ఎందుకు తీసుకోలేదని నేను నన్ను నేను ఆశ్చర్యపరిచాను. నేను కొంచెం ఓడిపోయాను, నేను ఏమి తప్పు చేస్తున్నానో అని ఆలోచిస్తున్నాను.
యోహాను 15:1-4 ఒక తీగ నుండి కొమ్మలను కత్తిరించడం గురించి మాట్లాడుతుంది. కొమ్మల మద్దతు నుండి పండ్లు పెరుగుతాయి. ఆ కొమ్మలను కత్తిరించడానికి సమయం పడుతుంది; అవి రాత్రికి రాత్రే పెరగవు. మా ఇంటి వెనుక పెరట్లో ఒక పీచు చెట్టు ఉంది. నేను టన్నుల కొమ్మలను నరికివేశాను, మరియు నేను కత్తిరించిన కొమ్మలు తిరిగి రావడానికి, అవి పూర్తిగా పెరగడం చూడటానికి మేము ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం వేచి ఉండాల్సివచ్చేది. చెట్టు నిండినప్పుడు, అది ఉత్తమ ఫలాలను ఉత్పత్తి చేయడానికి నేను కోరుకున్న విధంగా నిండుతుంది. (గలతీయులు 5:22-24 — ఆత్మ ఫలం పెరగాలి.)
ఆత్మలో ఉండటం జీవితం మరియు శాంతికి సంబంధించినది, అయితే శరీరములో ఉండటం దేవుని పట్ల శత్రుత్వం (వచనాలు 6-7). నేను నా విశ్వాసంలో పెరిగేకొద్దీ, క్రీస్తు విషయాలపై నా మనస్సును ఉంచడం నేర్చుకున్నాను. నాలో పాపం చనిపోయిందని నాకు తెలుసు, కానీ నేను నా మెదడును మరియు నా శరీరాన్ని ఆత్మలో తిరిగి శిక్షణ పొందవలసి వచ్చినట్లుగా ఉంది. ఆలోచనలు, హాస్యము, భావాలు మరియు భావోద్వేగాలు ఇప్పటికీ నా మెదడులోకి చొచ్చుకుపోతాయి, కానీ నేను పాపము విషయములో చనిపోయానని మరియు క్రీస్తులో జీవితాన్ని కలిగి ఉన్నానని నాకు తెలుసు కాబట్టి, నేను వాటిని విసిరివేయగలను. కాలక్రమేణా, నేను ఆ చిన్న యుద్ధాలను గెలుస్తూనే ఉన్నాను మరియు నేను ఓటమి నుండి స్వేచ్ఛను అనుభవించాను. నేను ఆ చిన్న యుద్ధాలను గెలవగలనని నాకు తెలుసు మరియు వాటికి లొంగిపోవాల్సిన నిర్భంధము నాకు లేదు (ఎఫెసీయులు 5:7-10). మనలో దేవుని ఆత్మ లేకపోతే, క్రీస్తు మనకు చెందినవాడు కాదు (వచనం 9). కాబట్టి, విశ్వాసులుగా, మనం శరీర స్వరూపులం కాదు. క్రీస్తుతో, జీవాత్మ మరియు ఆయన నీతి మనలో ఉన్నాయి.
ఆత్మ యేసును మృతులలో నుండి లేపాడు, మరియు ఆయన మనలో నివసిస్తూ మనకు జీవాన్ని ఇస్తాడు (వచనం 11). కాబట్టి మనం శరీరానికి కాదు, ఆత్మకు రుణగ్రస్తులం (వచనం 12). మనం పాపమునకి బానిసలం కాదు, దానికి మనం ఏమీ రుణపడి ఉండము. మనం శరీరానుసారంగా జీవిస్తే, మనం చనిపోతాము; కానీ ఆత్మలో నడుస్తూ జీవించడం ద్వారా మనం శరీరాన్ని చంపి జీవించగలము (వచనం 13). మనం ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు, దేవుని కుమారులుగా దత్తత తీసుకోబడినప్పుడు (వచనాలు 14-17), మనం తండ్రి పిల్లలుగా మన జీవితాలను గడుపుతాము - ఆత్మ ద్వారా మనల్ని నీతిమంతులలోకి నడిపించాలనుకునే వ్యక్తి యొక్క పిల్లలము. మన పిల్లలను మరియు మన చుట్టూ ఉన్నవారిని నడిపించేవారిగా మనం ఉండాలి. మనం వారిని క్రీస్తుతో సంబంధంలోకి నడిపిస్తాము; ఆత్మ ద్వారా జీవించడంలో ఒక మాదిరిని చూపుతాము; మన స్వంత అనుభవాలను పంచుకుంటాము మరియు నడుచుకుంటాము; అదే చేయమని వారికి నేర్పిస్తాము; మరియు విచారణ మరియు తప్పులలో వారిని శిష్యులను చేస్తాము.
రోమా 8:18-30: ఈ ప్రస్తుత యుగంలోని శ్రమలు తాత్కాలికమైనవి (2 కొరింథీయులు 4:17-18)—అవి వస్తూ పోతూ ఉంటాయి (వచనం 18). మనమందరం ఇంకా దేవుని కుమారుని రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాము (వచనం 19). దేవుడు వస్తున్నాడు; ఆయన సృష్టిని కూడా అవినీతి బానిసత్వం నుండి విడిపించే ప్రణాళిక ఆయనకు ఉంది (వచనం 20-21). దేవుని సృష్టి అంతా కలిసి మూలుగుతూ ఉంది, మానవాళి కూడా వేచి ఉంది (వచనం 22-23). వియర్స్బే ఇలా వ్రాశాడు, “నేటి మూలుగు బంధనం రేపటి మహిమాన్విత స్వేచ్ఛ కోసం మార్పిడి చేయబడుతుంది!”1 మనం ఆత్మ ద్వారా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు, తద్వారా మనం ఆయన తిరిగి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన ప్రణాళిక నుండి బయటపడవచ్చు (వచనం 24-25). మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మ మనకు సహాయం చేస్తుంది మరియు మాటలకు అందని లోతైన మూలుగులతో మన కోసం మధ్యవర్తిత్వం చేస్తుంది (వచనం 26-27). మనమందరం విధేయతతో యేసు ప్రభువుకు లోబడితే, ఆయన అందరినీ ఒకచోట చేర్చేలా చేస్తాడు (వచనం 28). దేవుడు మనల్ని క్రీస్తు స్వరూపంలో ఉండమని పిలుస్తున్నాడు (వచనం 29). యేసు తిరిగి రావడానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు (వచనం 30).
రోమా 8:31-39: పౌలు 31b వచనంలో ఈ శక్తివంతమైన మాటలను మనకు ఇచ్చాడు: “దేవుడు మన పక్షమున ఉంటే, మనకు విరోధి ఎవడు?” ఆయన తిరిగి రావడానికి మనం సిద్ధంగా ఉండేలా దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని సమకూర్చాడు (వచనం 32).
ముగింపు
దేవుడు తన సృష్టికి, తన ప్రజలకు మరియు తన తిరిగి రావడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనం శిక్షలో లేదా భయంతో నడవము. మన పట్ల మరియు తన రాజ్యం పట్ల ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మనం దేవుని ఆత్మ ద్వారా నడుస్తాము.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: న్యూ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి. కుక్, 1989), పేజీ 540.
ప్రశ్నలు
-
రోమా 8:1 శిక్ష గురించి మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా శిక్షించబడ్డారని మీరు గ్రహించారా? అలా అయితే, మిమ్మల్ని మీరు విడుదల చేసుకున్నారా? లేకపోతే, ఆ భారాన్ని మీ నుండి తొలగించమని యేసును అడగడానికి కొన్ని నిమిషాలు కేటాయించండి.
దినవాక్యం
Laura Martin Romans 8:37–39
“No, in all these things we are more than victorious through Him who loved us. For I am persuaded that not even death or life, angels or rulers, things present or things to come, hostile powers, height or depth, or any other created thing will have the power to separate us from the love of God that is in Christ Jesus our Lord!”
దేవుని ఆత్మపై ఉంచబడిన మనస్సు జీవాన్ని, శాంతిని తెస్తుంది, అయితే శరీరాన్ని బట్టి ఉంచబడిన మనస్సు మరణాన్ని తెస్తుంది. కాబట్టి, మీ మనస్సును ఆత్మపై ఉంచండి. ఆత్మ శక్తిలో నడవండి. బాధలు మరియు శ్రమలు వచ్చినప్పుడు, మీరు ఆత్మలో నడిచినప్పుడు, మీరు మీ శరీరంలో కాకుండా ఆత్మలో స్పందిస్తారు. మీరు బాధ ద్వారా నడిచినప్పటికీ, ఆత్మలో మీరు సమాధానము మరియు ఆనందం యొక్క ఫలాలను పొందుతారు. మీరు దేవుని ప్రేమలో నడుస్తారు. మీరు దేవుని విశ్వాసాన్ని నమ్ముతూ నడుస్తారు, దేవుణ్ణి ప్రేమించేవారికి మరియు ఆయన ఉద్దేశ్యం ప్రకారం పిలువబడిన వారికి మంచి కోసం ప్రతిదీ కలిసి పనిచేయడానికి అనుమతిస్తారు. ఇది ఆత్మలో నడవడం.
విశ్వాసులుగా, మీరు విజయంలో జీవితాన్ని గడుపుతారు, ఓటమిలో కాదు! మిమ్మల్ని ప్రేమించి మీ కోసం తన జీవితాన్ని ఇచ్చిన క్రీస్తు ద్వారా మీరు ఎక్కువ విజయం సాధించారు. మీరు ఆత్మలో నడుస్తున్నప్పుడు, దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని వేరు చేసే శక్తి ఏదీ లేదని నమ్ముతూ నడుస్తారు. ఏమీ లేదు. కాబట్టి ఓడిపోయి జీవించకండి. మీ భుజాలు వెనుకకు ఉంచి, మీ కళ్ళు క్రీస్తుపై ఉంచి, ఆయన పునరుత్థాన శక్తిలో నడవండి. మీకు క్రీస్తులో విజయం ఉంది. ఆయన ప్రశాంతమైన, జీవాన్ని ఇచ్చే ఆత్మలో నడవండి. స్థిరంగా నిలబడి క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండండి.
“అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.”
- రోమా 8:37–39
తదుపరి లేఖన భాగములు
రోమా 8:5–6— “శరీరానుసారులు శరీరవిషయ ములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయ ములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమా ధానమునై యున్నది.”
రోమా 8:28— “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”
1 కొరింథీయులు 15:57— “అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.