The Greatest Faith
యేసును ఇలా కనుగొనండి: King Matthew 8 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
కదలలేని దృఢమైన రాతి పునాదిపై నిర్మించబడాలంటే, దేవుని వాక్యంలో మనకు బలమైన పునాది అవసరమని నిన్నటి దినమున మనము కనుగొన్నాము. మీరు ప్రతిరోజూ వాక్యాన్ని తవ్వితే, ఈ ప్రక్రియ మీ జీవితాన్ని సమూలంగా మార్చగలదని మేము నమ్ముతున్నాము.
పాఠము
మత్తయి సువార్త 8వ అధ్యాయములో, స్వస్థతను గూర్చిన అన్ని రకాల కథలు ఉన్నాయి. మొదటి నాలుగు వచనములు యేసు ముట్టుడం వలన స్వస్థత పొందిన కుష్ఠురోగి గురించి మాట్లాడుతున్నాయి. యేసు సంఘంతో సంభాషించాడు మరియు నిమగ్నమయ్యాడు. ఆయన మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి లోకంలోకి వెళ్లమని ఆజ్ఞాపించాడు. యేసు సంస్కృతిలో నిమగ్నమయ్యాడు.
మత్తయి 8:5-13: 5వ వచనంలో, యేసు సంస్కృతిలో నిమగ్నమయ్యాడు. యేసు కపెర్నహూములోకి ప్రవేశించి అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చాడు. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు బాధ్యత వహించే ఒక రోమా సైనిక అధికారి. ఈ అధికారులలో చాలామంది ఫోనీషియన్ (నేటి లెబనోను ప్రజలు) మరియు సిరియా నేపథ్యానికి చెందిన వారుగా ఉండేవారని కార్సన్ చెప్పాడు.1 శతాధిపతి సైన్యానికి వెన్నెముకగా ఉండేవాడు. కొత్త నిబంధన అంతటా మీరు శతాధిపతుల గురించి చదివినప్పుడు, ఇది ఎల్లప్పుడూ సానుకూల ప్రకటన. శతాధిపతులు నియంత్రణలో ఉన్న శక్తి మరియు సౌమ్యత యొక్క భావాన్ని కలిగి ఉంటాయి. యేసు దగ్గరకు వచ్చిన ఈ శతాధిపతి “నాకు సహాయం కావాలి” అని చెప్పగలిగాడు. యేసుకు విన్నవించడం ద్వారా, శతాధిపతి యేసు నియంత్రణలో ఉన్నాడని అంగీకరించాడు.
ఈ భాగము కొన్ని ఆశ్చర్యాలను కలిగి ఉంది. మొదటి ఆశ్చర్యం 5వ వచనం నుండి వచ్చింది. ఒక శతాధిపతి, సైనికాధికారి తనను తాను తగ్గించుకొని యేసును వేడుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
6వ వచనములో కనీసం రెండు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. మొదటిగా, శతాధిపతి యేసును "ప్రభువు"గా గుర్తించాడు. చాలా మంది వ్యాఖ్యాతలు శతాధిపతి ఈ పేరును పిలుచుటలో మర్యాదగా ఉన్నాడని మరియు యేసును దైవముగా సూచించడం లేదని చెబుతారు. శతాధిపతి యేసును వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని మనము ఇప్పటికే గుర్తించాము. తదుపరి పరిశీలన ఏమిటంటే, శతాధిపతి తన సేవకుడి కోసం వేడుకుంటున్నాడు, అంటే అతను యేసును సహాయం చేయగల అధికారం ఉన్న అధికారిగా గుర్తించాడని అర్థం.
7వ వచనంలో, యేసు తాను సేవకుణ్ణి స్వస్థపరుస్తానని బదులివ్వటం మరొక ఆశ్చర్యం. శతాధిపతి సహాయం కోసం వేడుకొన్నాడు మరియు యేసు కేవలం అవును అని చెప్పాడు. తండ్రి మనపై మంచి విషయాలు కురిపించాలను కుంటున్నారు. బహుమానములు ఇక్కడ నుండి వస్తాయి––మనం వేరొకరి కోసం ప్రార్థనలో మధ్యవర్తిత్వం చేసినప్పుడు. అది మీకు యేసుతో మాట్లాడాలనిపిస్తుంది. యేసు మన ప్రార్థనలను అర్థం చేసుకుని వింటాడు కాబట్టి మనం వినయంతో సింహాసనం ముందుకు రాగలము.
శతాధిపతి తన స్వంత అయోగ్యతను ప్రకటించినప్పుడు ఆశ్చర్యాలు 8వ వచనంలో కూడా కొనసాగాయి. మాక్ఆర్థర్ ఇలా పేర్కొన్నాడు, "అన్యజనుల ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఆచారబద్ధంగా అపవిత్రుడవుతాడని యూదా సంప్రదాయం భావించింది."2 ఒక యూదుడిగా, యేసు తన ఇంట్లోకి ప్రవేశిస్తే అపవిత్రం అవుతాడని శతాధిపతి గుర్తించాడు. ఇది యెరూషలేములోని పాట పట్టణ వద్దనున్న ద్వారము వెలుపల ఉంది. ముస్లింలు తూర్పు ద్వారాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు వారు గేటును సిమెంటు గోడ కట్టి మూసివేశారు. దీనిని బంగారు ద్వారము అని కూడా పిలుస్తారు మరియు దేవుని రాజ్యాన్ని పునరుద్ధరించడానికి మెస్సీయ ప్రయాణించే ద్వారం. ముస్లింలు ద్వారమును సిమెంటు గోడ కట్టి మూసివేయడమే కాకుండా, ఏ యాజకుడు స్మశానవాటిక గుండా వెళ్ళి తనను తాను అపవిత్రం చేసుకోరని వారికి తెలుసు కాబట్టి వారు దాని ముందు స్మశానవాటికను ఉంచారు. అయితే, యేసు అపవిత్రంగా ఉండడం గురించి ఆలోచించలేదు, బదులుగా ప్రజల జీవితాలను తాకాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు తిరిగి వచ్చే సమయం వచ్చినప్పుడు, ఆయన ఆ స్మశానవాటిక గుండానే వస్తాడు.
8వ వచనంలోని ఆశ్చర్యం ఏమిటంటే, తన సేవకుని స్వస్థపరిచే అధికారం యేసుకు ఉందని శతాధిపతి విశ్వసించాడు. మరొక ఆశ్చర్యం ఏమిటంటే, శతాధిపతి తాను యోగ్యుడిని కాదని కానీ యేసే యోగ్యుడని భావించాడు. అతను తన సేవకుని సహాయం కోసం తనను తాను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన ముందు వినయపూర్వకంగా లేకుంటే యేసు తన కృపను లేదా తన దయను మన జీవితాలపై కుమ్మరించాలనే కోరిక ఆయన కలిగియుండడు. తాను యోగ్యుడను కానని శతాధిపతి ప్రతిస్పందన, తన చెప్పులు విప్పడానికి కూడా అర్హుడును కాదని బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు సమాధానం ఇచ్చినట్లుగా ఉంది (మార్కు 1:7; యోహాను 1:27). యేసు చూస్తున్నది కూడా దాని కొరకే.
9వ వచనములో, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సేవకుడు ఒక సైనికుడు మాత్రమే కాబట్టి శతాధిపతి కేవలం తన అధికారం ఆధారంగా సహాయము చేయాలనుకున్నాడు. యేసు యొక్క అధికారం గొప్పదని అతను గుర్తించాడు.
10వ వచనంలో, యేసు ఆశ్చర్యపోయాడు. యేసు ఆశ్చర్యపోయాడనే వాక్యాన్ని మీరు ఎప్పుడైనా గ్రంథంలో ఎక్కడ చదివారు? శతాధిపతికి “రండి,” “వెళ్ళండి,” లేదా “చెయ్యండి” అని ఆజ్ఞాపించగలిగేంత గొప్ప విశ్వాసం ఉన్నందుకు యేసు ఆశ్చర్యపోయాడు. ఇది ఒక ఆశ్చర్యం! క్రీస్తు తనలో పెరుగుతున్నప్పుడు తనను తాను తగ్గించుకునే విధానములో ఉన్నవాడు మాత్రమే హెచ్చింపబడతాడని లేఖనం చెబుతోంది. యేసు ఏమి చేయగలడో అతను గుర్తించాడు కాబట్టి ఈ అన్యులకు గొప్ప విశ్వాసం ఉందని యేసు ఎత్తి చూపాడు. మరియు శతాధిపతి చేసినదంతా తన సేవకుని కొరకు వేడుకొనడమే. 6వ వచనంలో, శతాధిపతి యేసు సహాయం కోసం అడగలేదు. మరియు 8వ వచనంలో, అతను యేసుతో ఇలా అన్నాడు, " నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.." యేసు స్వస్థపరచే పనిలో ఉన్నాడని విషయమును నేను మన హృదయాలలో మరియు మనస్సులలోకి తిరిగి ఉంచాలనుకుంటున్నాను. ఇది అతని రాజ్య వ్యాపారం. ఆయన అధికారం కలిగి ఉన్నాడు మరియు రాజ్యానికి బాధ్యత వహిస్తాడు, కాబట్టి ఆయన తనకు కావలసినది చేయగలడు.
11వ వచనంలో, పరలోకంలో ఇశ్రాయేలు సమూహాన్ని యేసు వివరించాడు. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు యేసు ఒక అన్యజనుడిని అభినందించినందున ఇది విచిత్రమైన మార్పు. కానీ ఈ వచనం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఇశ్రాయేలు పరలోకములోనికి కలిసి వచ్చినప్పుడు జరిగే విందు యూదుల కొరకు మాత్రమే కాదని అక్కడ అన్యజనులు (తూర్పు మరియు పడమర నుండి వచ్చినవారు) కూడా విందులో పాల్గొంటారు. ఆనాటి మత పెద్దలు దేవుని రాజ్యం మరియు మెస్సియా విందు యూదులకు మాత్రమే అని భావించారు. 12వ వచనంలో, “రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడు దురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.”
యేసు పరలోకము గురించి ప్రత్యామ్నాయ దృక్పథంతో యూదులను సవాలు చేస్తున్నాడు. మరియు, ఆయన కేవలం ఒక అన్యజనుడిని అభినందించాడు, అన్ని ప్రాంతాల నుండి అన్యజనులు రాజ్యంలో జరిగే విందులో చేరతారని ఇది సూచిస్తుంది (యెషయా 59:19; మలాకీ 1:11). యేసు తాను కొట్టివేయడానికి రాలేదని, నెరవేర్చడానికే వచ్చానని చెప్పాడు. "నెరవేర్పు" అంటే ముగింపుకు రావడం కాదు, కానీ ఇప్పటికే అమలులో ఉన్న ప్రక్రియను పూర్తి చేయడం. ఈ ప్రవచనాత్మక పదాలు ఇంకా నెరవేరవలసి ఉన్నాయి. మెస్సియా విందు–– ఇంకా నెరవేరవలసి ఉంది. యేసు పేరు ఇశ్రాయేలులోనే కాక, సమస్త దేశాలలో గొప్ప చేయబడవలసి ఉన్నది- ఇంకా నెరవేరవలసి ఉంది. యూదులను బాధపెట్టిన విషయం ఏమిటంటే, ఈ విందు తమకు మాత్రమే అని వారు భావించారు. 12వ వచనం ముగింపు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటుంది. దీని గురించి మాట్లాడే అనేక లేఖన ప్రదేశాలు గ్రంథంలో ఉన్నాయి (మత్తయి 22:13).
ఈ కథ మధ్యలో, యూదులకు విశ్వాసం ఉంటే అన్యజనులు కూడా భోజనపు బల్ల యొద్దకు రావచ్చని యేసు చెప్పాడు; చివరికి, సేవకుడు పూర్తిగా స్వస్థత పొందాడు (వ. 13). మనకు రాజ్య మనస్తత్వం ఉన్నప్పుడు, మనం శతాధిపతిలా నడవగలము మరియు మనం యేసులా నడవగలము అని నేను నమ్ముతున్నాను. మనం ఒక వచనాన్ని చూడాలని, మరియు పరిశీలన ద్వారా వివరణ ప్రక్రియ ద్వారా ముందుకు సాగాలని మరియు అన్వయించుకోవాలని నేను కోరుకుంటున్నాను: " మీరు వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి. " (మత్తయి 10:7).
మీరు దేవుని సన్నిధితో నడిచినప్పుడు, క్రీస్తు మీ జీవితాన్ని మార్చినట్లుగా మీరు నడిచినప్పుడు, పరలోక రాజ్యం సమీపించింది, అప్పుడు మీరు చేయగలిగినది ఇదే: "రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.” (8 వ).
మనం ఈ విధేయతతో నడుచుకున్నప్పుడు, రాజైన యేసు మనకు అధికారాన్ని ఇచ్చాడని అర్థం చేసుకోండి మరియు మనలో ఉన్న పరిశుద్ధాత్మతో, మనం నిజంగా క్రీస్తు చేసిన దానిని చేయగలము . . . రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. మీకు ఏమి ఇవ్వబడిందో దానిని మీరు తిరిగి ఇవ్వాలి.
ముగింపు
ఈ పాఠంలో మీరు ఏమి చేయాలని నేను కోరుకుంటున్నానంటే వేగాన్ని తగ్గించి, లేఖనాలు ఏమి చెబుతున్నాయో పరిశీలించండి. అంతిమంగా, నేను ఈ పాఠం నుండి తీసివేసేది ఏమిటంటే, మీరు యేసుతో భోజనపు బల్లయొద్దకు వచ్చినప్పుడు, మీరు ఆయన నుండి నేర్చుకోవచ్చు, ఆ తరువాత "రండి," "వెళ్ళండి," మరియు "చేయండి". మనమందరం ఉచితంగా పొందుకున్నాము మరియు ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం మన వంతు.
డోనాల్డ్ ఎ. కార్సన్, "మాథ్యూ," మాథ్యూ-లూక్, సంపుటం. 8 ఆఫ్ ది ఎక్స్‌పోజిటర్స్ బైబిల్ కామెంటరీ, ed. ఫ్రాంక్ E. గేబెలిన్ మరియు J. D. డగ్లస్ (గ్రాండ్ రాపిడ్స్: జోండర్వాన్, 1983), 200; థామస్ L. కానిస్టేబుల్, డాక్టర్ థామస్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పోజిటరీ నోట్స్: మాథ్యూ, 238, https://planobiblechapel. org/tcon/notes/pdf/matthew.pdf.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005). p. 1136.
ప్రశ్నలు
-
కుష్టురోగి యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం ప్రకారం, మనిషి ఏమి చేయాలి (లేవీయకాండము 13:45)? ఈ “అపవిత్రుడైన” (మత్తయి 8:3) వ్యక్తి పట్ల యేసు ఎలా స్పందించాడు? మన సంస్కృతి అపవిత్రముగా భావించే వాటికి మీరు ఎలా స్పందిస్తారు?
దినవాక్యం
Laura Martin Matthew 8:10
“Hearing this, Jesus was amazed and said to those following Him, ‘I assure you: I have not found anyone in Israel with so great a faith!’”
ఒక శతాధిపతి యేసు దగ్గరకు వచ్చి, పక్షవాతంతో, భయంకరమైన వేదనతో ఇంట్లో పడి ఉన్న తన సేవకుని స్వస్థపరచమని అడిగాడు. రోమన్ సైన్యంలోని ఈ అన్యుల కమాండర్ యేసును ఆశ్చర్యపరిచాడు. అతను తన సేవకుని పట్ల అనవసరమైన ప్రేమను కనబరిచాడు మరియు యేసు సమక్షంలో తన స్వంత భూసంబంధమైన స్థానాన్ని మరియు ర్యాంక్‌ను విస్మరించాడు. మరియు అతను విశ్వాసాన్ని ప్రదర్శించాడు, యేసు ఒక మాట చెప్పడం ద్వారా అద్భుతంగా నయం చేయగలడని నమ్మాడు.
క్రీస్తు అనుచరునిగా, పరిశుద్ధాత్మచే శక్తిని పొంది, ప్రేమ, వినయం మరియు విశ్వాసంతో నడవడానికి మీకు బలం ఉంది, ఈ రోజు మీ ద్వారా యేసును "ఆశ్చర్యపరిచేలా" చేస్తుంది. మీరు ఏ మార్గంలో నడుస్తున్నప్పటికీ, శతాధిపతి వలె ప్రేమ, వినయం మరియు విశ్వాసంతో పరిస్థితిని చేరుకోండి. ప్రభువు పరిస్థితిని ఎలా కదిలిస్తాడో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు!
“యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను!’”
— మత్తయి 8:10
తదుపరి లేఖన భాగములు
- మత్తయి 8:13 — “అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.”
- యోహాను 20:29 — “యేసు నీవు నన్ను చూచి నమి్మతివి, చూడక నమి్మనవారు ధన్యులని అతనితో చెప్పెను.’”
- కొలస్సీ 1:10-11 — “ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.