The Choice of Life and Death
యేసును ఇలా కనుగొనండి: King Matthew 7 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
ఈరోజు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఉన్నాము. మత్తయి 7లోని మొదటి ఆరు వచనాలు ఇతరులను తీర్పు తీర్చకుండా జాగ్రత్తపడటం గురించి. 3వ వచనం మనకు మన స్వంత కన్నులో ఏదైనా ఉంచుకొని వేరొకరి కన్నులో ఉన్నదాన్ని మనం ఎత్తి చూపకూడదని చెబుతుంది. నిన్నటి దినమున కన్నులు మన జీవితాలకు వెలుగునివ్వగలవు కానీ చీకటిని దూరంగా ఉంచడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాము.
పాఠము
ఈ రోజు మనం అధ్యయనం చేయబోయే వచనాలలో, యేసు ప్రతిదానిలో రెండింటి గురించి మాట్లాడుతున్నాడు: రెండు ద్వారాలు, రెండు మార్గాలు, రెండు నాశనములు (మరణం), రెండు సమూహాలు, రెండు ఇళ్ళు, ఇద్దరు నిర్మాణకులు, రెండు పండ్లు, రెండు చెట్లు, రెండు వాదనలు. మనము కలిగి ఉన్న ఎంపికలను అర్థం చేసుకోవడం చాలా అవసరం అని నేను నమ్ముతున్నాను. మనం ఎంచుకునే ప్రయాణంలో నిరంతరం ఉంటాము (ద్వితీయోపదేశకాండము 30:19; కీర్తన 1:1-2; యిర్మీయా 21:8). మనం మేల్కొన్న ప్రతి రోజు, మనకు ఒక ఎంపిక ఉంటుంది––జీవ మార్గం లేదా మరణ మార్గం. రాజైన యేసును గౌరవించడానికి మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు? అదే ఈ వచనాల నేపథ్యం.
మత్తయి 7:13-16: సులభతరమైన మార్గం ఉందని దానిని అనుసరించడం చాలా సులభమే కాని అది నాశనానికి దారితీస్తుందని యేసు చెప్పాడు (వ. 13). నెల్సన్స్ కామెంటరీ ఇలా నొక్కిచెబుతోంది, “ప్రపంచంలోని చాలా మంది ప్రజలు శాస్త్రులు మరియు పరిసయ్యుల వంటి అదే వైఖరిని కలిగి ఉన్నారు. వారి బాహ్య క్రియలే ముఖ్యమైనవి అని వారు సరళంగా నమ్ముతారు.”1 తరువాత, ఇతర మార్గమును ఇరుకైనది, కష్టమైనది మరియు కొంతమంది దానిని కనుగొంటారని యేసు చూపించాడు (వ. 14). ఈ భాగములు ప్రతి మార్గం యొక్క ఖరీదు/ప్రతిఫలానికి సంబంధించినవి: మత్తయి 25:46; యోహాను 17:2; మరియు రోమా 9:22. విశాలమైన దారి నాశనానికి దారి తీస్తుంది. ఇరుకైన మార్గం జీవమునకు దారి తీస్తుంది. ఆయన మనలను ఏమి చేయమని అడుగుతున్నాడో దాని మధ్య స్పష్టమైన, నిజమైన వైరుధ్యం ఉంది. చాలా మంది వ్యక్తులు సులభమైన సందేశాలు మరియు విశాలమైన మార్గములను ఇష్టపడతారు (మత్తయి 10:38-39; 16:24-25; యోహాను 15:18-19).
చాలా మంది వ్యక్తులు ఇరుకైన మార్గం కంటే విశాల మార్గం యొక్క సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారు. అది 15వ వచనానికి దారి తీస్తుంది: " నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు." (అపొస్తలుల కార్యములు 20:29). మీరు బాధపడాలని యేసు కోరుకోవడం లేదని, అయితే మీ ఆనందము కొరకు మీరు మరిన్ని విషయాలను పొందాలని కోరుకుంటున్నారని వారు చెబుతారు. మాక్ఆర్థర్ ఇలా అంటాడు, "ఇవి గొర్రెల వేషధారణ ద్వారా కాదు, నిజమైన గొర్రెల కాపరులుగా నటించడం ద్వారా మోసం చేస్తాయి."2 వారు నిజంగా మంచి సందేశాలను కలిగి ఉంటారు.
పేతురు ఇలా వ్రాశాడు, “మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు” (యిర్మీయా 6:13-15; 2 పేతురు 2:1). రెండు చెట్లు ఉన్నాయి, ఇచ్చేవి మరియు ఫలాలు లేనివి (వ. 16). మాక్ఆర్థర్ ఇలా అన్నాడు: "తప్పుడు సిద్ధాంతం శరీరాన్ని నిరోధించదు, కాబట్టి తప్పుడు ప్రవక్తలు దుష్టత్వాన్ని ప్రదర్శిస్తారు."3 చెడ్డ చెట్లు మంచి ఫలాలను ఇవ్వలేవు.
మత్తయి 7:17-20: మంచి చెట్లు మంచి ఫలాలను మరియు జీవమును ఉత్పత్తి చేస్తాయి, అయితే చెడ్డ చెట్లు చెడు ఫలాలను మరియు మరణాన్ని ఉత్పత్తి చేస్తాయి (వ. 17). “మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.” (వ. 18-20). రెండు ద్వారములు మరియు రెండు చెట్లు సమాంతర పరిణామాలను కలిగి ఉంటాయి. విశాలమైన ద్వారం మరియు చెడ్డ పండ్ల చెట్టు రెండూ నాశనం చేయబడ్డాయి; ఇరుకైన ద్వారం మరియు మంచి పండ్ల చెట్టు జీవాన్ని ఇస్తాయి. జీవ మార్గాన్ని లేదా మరణ మార్గాన్ని అనుసరించడానికి మీకు ఎంపిక ఉంది (యూదా 3-4). అమెరికన్ సమాజంలోని సమస్యల్లో ఒకటి ఏమిటంటే, అక్కడ తప్పుడు బోధకులు ఉన్నారని కూడా మాకు తెలియదు. వ్యాఖ్యాలోని సత్యాన్ని పరీక్షించకుండానే మనం విన్నది బోధించే వాని స్థాయిని బట్టి తీసుకుంటాము. అది ఆందోళనకరమైన భాగం.
మత్తయి 7:21-28: 21వ వచనంలో, దేవుని చిత్తాన్ని అనుసరించని వారు దేవుని నుండి వెళ్ళిపోవాలి (వెళ్లిపోవాలి). ఈ ఎంపికలన్నీ జీవితానికి దూరంగా ఉంటాయి. వైర్స్బే ఇలా వివరిస్తున్నాడు, “రెండు మార్గాలు [గేట్లు] విశ్వాసం యొక్క జీవిత ప్రారంభాన్ని వివరిస్తాయి; రెండు చెట్లు ఇక్కడ మరియు ఇప్పుడు విశ్వాస జీవితం యొక్క పెరుగుదల మరియు ఫలితాలను వివరిస్తాయి; మరియు రెండు ఇళ్ళు ఈ విశ్వాస జీవితానికి ముగింపుని వివరిస్తాయి, దేవుడు ప్రతిదానిని తీర్పుకు తీసుకువస్తాడు."4 వచనాలు 24-25 కోసం, మనం రెండు ఇళ్ళు లేదా ఇద్దరు నిర్మాణకులలో మొదటిదాన్ని చూడవచ్చు. ఇల్లు రాతిపై మంచి పునాదితో నిర్మించబడింది-ఇది తుఫాను దెబ్బతినకుండా తట్టుకుంది. ఇక్కడి ప్రజలు విన్నది విన్నాట్లు ప్రవర్తించారు. 26-27 వచనాలు ఇతర నిర్మాణకుడు మరియు ఇంటిని వివరిస్తాయి, ఇది ఇసుకతో కూడిన భయంకరమైన పునాదిపై నిర్మించబడి, తుఫాను సమయంలో కూలిపోయి నాశనం చేయబడింది. ఈ వ్యక్తులు విన్నారు గాని దాని ప్రకారము ప్రవర్తించలేదు.
ఇల్లు మీ మతపరమైన జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, వర్షం దైవిక తీర్పును సూచించగలదని మరియు దేవుని వాక్యానికి విధేయత అనే పునాదిపై నిర్మించబడినది మాత్రమే నిలుస్తుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నాడు. 28వ వచనంలో, యేసు ప్రసంగాన్ని ముగించినప్పుడు, “యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహ ములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.” ఆయన అధికారాన్ని చూసి జనాలు ఎందుకు ఆశ్చర్యపోయారు? శాస్త్రులు మరియు పరిసయ్యులు తమ స్వంత ఆలోచనలను బోధించలేదు, బదులుగా “ఎల్లప్పుడూ వివిధ బోధకులు మరియు చట్టంలోని నిపుణులను మాటలను చెప్తూ ఉంటారు. యేసు తన మాటలకు అధికారాన్ని జోడించుటకు ఆయనకు మానవ గురువు అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిగా మాట్లాడాడు. ”5
ఏ ఇతర అభిప్రాయాన్ని సూచించకుండా యేసు పూర్తి అధికారంతో మాట్లాడాడు (మార్కు 1:22). నేను పరిశుద్ధాత్మపై ఎంత ఎక్కువగా ఆధారపడతానో, ఆయన నాకు ఇచ్చే అధికారంతో నేను అంత ఎక్కువ అధికారముతో మాట్లాడతాను. సవాలు ఏమిటంటే, మనం ఆత్మ నుండి వచ్చిన ఈ అధికారంలో నడుస్తున్నామా (మార్కు 1:22; 11:28)? మనకు అధికారం ఉందని మనం విశ్వసించినప్పుడు, మనం ఇరుకైన మార్గంలో నడవగలము, మంచి ఫలాలను అనుభవించడం ప్రారంభించగలము మరియు బండ మీద మన పునాదిని నిర్మించగలము, మనతో రాజైన యేసు ఉన్నాడని నమ్మినప్పుడు. మనం ఇక భయపడాల్సిన పనిలేదు. లూకా 6:48: “వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలి యుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున2 దాని కదలింపలేకపోయెను.” మనము వాక్యమును లోతుగా త్రవ్వినప్పుడు మరియు మన జీవితాలలో క్రీస్తు యొక్క మూలములలోనికి త్రవ్వినప్పుడు, ఏదియు మనలను కదిలించదు. ఏ నాశనము మనపై ప్రభావం చూపదు. మనము ఈ అధికారంతో నడుస్తాము.
ముగింపు
ఈ రోజు ఈ అధికారంతో సంఘములో నడవడం ప్రారంభించే సమయం ఇది. . . వాస్తవానికి మన జీవితాల్లో క్రీస్తు ఉన్నాడు మరియు మనం సమూలంగా మార్చబడ్డాము, తద్వారా ప్రజలు మన వద్ద ఉన్నదాన్ని కోరుకుంటారు. మన పునాది కదిలిపోకుండా దేవుని వాక్యంలో లోతుగా త్రవ్వడం కొనసాగిద్దాం.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds. నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 1999), పేజి. 1153.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005). p. 1135.
మాక్ఆర్థర్, పే. 1135.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: మాథ్యూ-గలటియన్స్ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 1989), p. 31.
వీయర్సబీ, పేజి 32.
ప్రశ్నలు
-
నీ కంటిలో దూలము ఉందని ప్రభువు నీకు ఎప్పుడైనా బయలుపరచాడా (మత్తయి 7:3-5)? అలా అయితే, మీరు వేరొకరి కంటి నుండి నలుసును చూచూటకు సహాయం చేయడానికై ప్రయత్నించినందుకా ఇలా కనపడింది?
దినవాక్యం
Laura Martin Matthew 7:1-2
“Do not judge, so that you won’t be judged. For with the judgment you use, you will be judged, and with the measure you sue, it will be measured to you.”
కొండమీది ప్రసంగం మధ్యలో, యేసు తన శిష్యులకు ఇతరులకు తీర్పు తీర్చవద్దని చెప్పాడు. మీరు ఒకే సమయంలో ప్రేమించలేరు మరియు తీర్పు చెప్పలేరు. దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఎవరినైనా తీర్పు తీర్చినప్పుడు, వారి రోజులో, వారి గతంలో లేదా వారి పెంపకంలో కూడా వారికి ఏమి జరిగిందో మీకు తెలియదు.
మీ స్వంత జీవితం గురించి ఆలోచించండి మరియు ప్రభువు మిమ్మల్ని మరియు మీరు తీర్పు చెప్పే వ్యక్తిని సమానంగా ప్రేమిస్తున్నారని గుర్తుంచుకోండి. మీరు ఇతరులను కనికరంతో ఎలా ప్రేమించాలో యేసు నమూనాగా చెప్పాడు. అదే ప్రేమ మరియు కరుణతో మీరు ఈ రోజు ప్రేమించబడ్డారు. యేసు మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తున్నాడు మరియు అదే ప్రేమతో ఇతరులను ప్రేమించమని ఆయన మిమ్మల్ని అడుగుతాడు. ఈరోజు, మీరు ఒకరి పట్ల తీర్పుతో కూడిన ఆలోచనను కలిగి ఉన్న ప్రతిసారీ, అతను చూసే వాటిని చూడటానికి మీకు కళ్ళు మరియు అతను వారిని ప్రేమిస్తున్నట్లుగా వారిని ప్రేమించే హృదయాన్ని ఇవ్వమని ప్రభువును అడగండి.
“మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.”
— మత్తయి 7:1-2
తదుపరి లేఖన భాగములు
- మార్కు 12:31 — “రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరే దియు లేదని అతనితో చెప్పెను.”
- రోమా 14:10 — “అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.”
- యాకోబు 4:11 — “సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.