Jesus' Family Tree
యేసును ఇలా కనుగొనండి: King Matthew 1 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
మనము మోషేచే వ్రాయబడిన పంచగ్రంథముల (ఆదికాండము, నిర్గమకాండము, లేవిటికస్, సంఖ్యలు మరియు ద్వితీయోపదేశకాండము) యొక్క మన అధ్యయనాన్ని ఇప్పుడే పూర్తి చేశాము మరియు మనము ఇప్పుడు సువార్తల (మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను) మన అధ్యయనాన్ని ప్రారంభించాము. మనము పాత నిబంధన నుండి కొత్త నిబంధనకు వెళ్లడం-రెండు సంవత్సరముల వ్యవధిలో ఆ పనిని కొనసాగించబోతున్నాం. “సువార్త” అనే పదానికి అక్షరార్థంగా “శుభవార్త” అని అర్థం. సువార్తల అంతటా, మనము శుభవార్త గురించి మాట్లాడబోతున్నాము. మనమందరం పాపం మరియు మరణం గురించి చెడు వార్తలను కలిగి ఉన్నాము, అయితే ప్రభువును స్తుతించండి, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన శుభవార్త మనకు ఉంది. పాత నిబంధనలో, ఆదికాండము పుస్తకానికి సంతానం వంటి ఒక పదమును ఇచ్చినట్లే మనం అధ్యయనం చేసిన ప్రతి పుస్తకానికి ఇచ్చామని గుర్తుంచుకోండి. అబ్రాహాము సంతానం ద్వారా, అది చివరికి సంతానమైన యేసుక్రీస్తును ఎలా సూచిస్తుందో మనం చూడగలము. యేసు గురించి మాట్లాడే మత్తయి సువార్త యొక్క ఒక పదం రాజు. మార్కు సువార్తలో, యేసు సేవకుడుగా ఉన్నాడు. లూకా సువార్తలో యేసు మనుష్యకుమారునిగా నొక్కివక్కాణించబడుచున్నాడు, మరియు యోహానులో, దేవుని కుమారునిగా నొక్కివక్కాణించబడుచున్నది. మత్తయిలో, మనముము యేసుపై రాజుగా దృష్టి పెడతాము. మత్తయి సువార్తలో “రాజు” అనే పదం 22 సార్లు మరియు “రాజ్యము” 32 సార్లు ఉపయోగించబడింది. రచయితయైన మత్తయి 12 మంది శిష్యులలో ఒకరు. అతను లేవి అని కూడా పిలువబడ్డాడు మరియు యేసును అనుసరించడానికి ప్రతిదీ విడిచిపెట్టిన మాజీ సుంకపుగుత్తదారి. ఎక్కువగా యూదా క్రైస్తవుల కొరకు ఈ సువార్త వ్రాయబడినది.
మత్తయి 1వ అధ్యాయములో, మనం యేసు వంశావళి గుండా నడుస్తాము. మత్తయి సువార్తకు అనేక ప్రత్యేకమైన విషయాలు కలవు: యేసు వంశావళి, యోసేపు కలలు, జ్ఞానుల సందర్శన, ఐగుప్తుకు పారిపోవడం, రెండేళ్లలోపు మగ పిల్లలందరినీ చంపుతానని హెరోదు బెదిరించడం, యూదా పశ్చాత్తాపం, పిలాతు భార్య యొక్క కల, బాప్తిస్మమిచ్చు యోహాను, సైనికుల లంచము తీసుకొనుట, మరియు గొప్ప ఆజ్ఞ. మత్తయి 1వ అధ్యాయమును అధ్యయనం చేయడం పంచగ్రంథములను అధ్యయనం చేయడం లాంటిది ఎందుకనగా ఇది పాత నిబంధన నుండి చారిత్రాత్మకమైన విషయాలను అందిస్తుంది.
పాఠము
మత్తయి 1:1-6a: 1వ వచనం యేసు వంశానికి సంబంధించిన చారిత్రక రికార్డును అందిస్తుంది. వంశావళి మొత్తం 42 తరాలకు ఒక్కొక్కటి 14 తరాలుగా మూడు విభాగాలుగా విభజించబడింది. మొదటి శతాబ్దంలో యేసు పేరు సర్వసాధారణమైనది, మరియు ఆయన చివరి పేరు "క్రీస్తు" కాదు. వేరొక విధమైన ఉచ్ఛారణతో హిస్పానిక్ మరియు లాటినో సంస్కృతులలో ఇది నేడు ఈ పేరు సాధారణమైన పేరు. మత్తయి మొదట యేసును దావీదు కుమారునిగా గుర్తించాడు. ఈ గుర్తింపు యొక్క ప్రాముఖ్యతను 2 సమూయేలు 7:12 అందిస్తుంది: "నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను." మత్తయి పాఠకులు యేసు వంశావళిని చదివినప్పుడు, అది దావీదుతో చేయబడిన నిబంధన వెంటనే దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా అనుసంధానించబడి యేసు వరకు వరకు వెళ్ళింది.
మత్తయికి యేసు వంశవృక్షం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అనేదానికి నెల్సన్ యొక్క వ్యాఖ్యానం మూడు కారణాలను ఇచ్చింది: (1) యేసు ఇశ్రాయేలీయుడని మరియు యూదుడని ధృవీకరించింది, (2) యేసు యూదా గోత్రముతో సంబంధం కలిగి ఉన్నాడని గుర్తించింది మరియు (3) ఆయన కొన్ని మతపరమైన విధులకు అర్హుడని అది చూపించింది.1 దీనర్థం ఒకరి వంశావళిని రుజువు చేయడం అతని పిలుపులో నడవడానికి అనుమతించింది. ఆదికాండము 12వ అధ్యాయము నిరంతరము పరిపాలించే సంతానం గురించి మాట్లాడుతుంది.
2వ వచనంలో, ఆయన వంశావళి అబ్రాహాము ఇస్సాకు, యాకోబు మరియు యూదాలతో ప్రారంభమవుతుంది. మొదటి 14 తరాలు అబ్రహం నుండి దావీదు వరకు ఉన్నాయి. యేసు వంశంలో, తామారు (తన మామగారితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నవాడు), రాహాబు (ఇశ్రాయేలీయుల గూఢచారులను రక్షించిన వేశ్య), మరియు రూతు (విదేశీయురాలు మరియు విగ్రహాలను ఆరాధించేది) సహా ఐదుగురు స్త్రీలు జాబితా చేయబడ్డారు. టామ్ కానిస్టేబుల్ స్త్రీలను ఎందుకు చేర్చుకున్నారో అనేక కారణాలను చెప్పాడు: (1) యేసు పాపుల కోసం వచ్చాడని చూపించడానికి, (2) లింగ లేదా జాతితో సంబంధం లేకుండా అందరి కోసం యేసు వచ్చాడని చూపించడానికి, (3) తన పాఠకులను పాత్ర కోసం సిద్ధం చేయడానికి మరియ యేసు వంశంలో ఒక భాగమని, (4) యేసు వంశంలో “క్రమరహిత వివాహ బంధాలు” ఉన్నాయని చూపించడానికి మరియు (5) “యూదులకు భిన్నంగా అసాధారణ విశ్వాసాన్ని”2 చూపించడానికి దేవుడు అన్యులను ఎలా ఉపయోగించుకున్నాడో చూపించడానికి. వంశవృక్షం యొక్క విభాగం రాజైన దావీదు గురించి మొదటి ప్రస్తావనతో ముగుస్తుంది (వ. 6). దేవుడు ఎవరినైనా ఏ సమయంలోనైనా ఉపయోగించుకోగలడని, వారి జీవితాలలో తప్పులతో సంబంధం లేకుండా ఇవి చూపుతాయి.
మత్తయి 1:6b-11: 6b వచనంలో, "దావీదు ఊరియా భార్య ద్వారా సొలొమోనుకు జన్మనిచ్చాడు" అని మత్తయి వ్రాశాడు. మత్తయి బత్షెబా పేరు పెట్టలేదు ఎందుకంటే అతను ఆమెను హిత్తీయురాలుగా చూస్తున్నాడు, దేవుడు విదేశీయులను కూడా ఉపయోగించుకోగలడని అతను మనకు చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బానిసలుగా తీసుకెళ్ళబడినప్పుడు 14 తరాల రెండవ సమూహముగా దావీదు నుండి బబులోను చెరలోనికి వెళుతుంది. ఈ విభాగం పూర్తిగా పేర్లు తెలియని వ్యక్తులతో నిండి ఉంది, ఇది దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడని, వారిని విమోచించగలడని మరియు మెస్సీయను సూచించడానికి వారిని ఉపయోగించగలడని మళ్లీ చూపిస్తుంది. యోహాను 1:14 ఆయన రాకడ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది: “వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను.” మత్తయి వంశావళిలో అందరినీ చేర్చలేదని గమనించండి, కానీ అది యేసు లేదా అతని వంశం యొక్క నేపథ్యాన్ని ప్రభావితం చేయదు.
మత్తయి 1:12-16: 14 తరాల మూడవ సమూహము బబులోను చెర ముగింపు నుండి మెస్సీయ వరకు వెళుతుంది. మత్తయి 1 వ వచనంలో యేసుతో వంశావళిని ప్రారంభించి యేసుతోనే ముగించాడు. 16వ వచనంలో, మత్తయి యేసు వంశాన్ని యోసేపుతో ముడిపెట్టాడు. యోసేపు యేసు యొక్క భౌతికసంబంధమైన తండ్రి కానప్పటికీ, ఇది ఎంత ముఖ్యమైనదో మాక్ఆర్థర్ వివరించాడు: " ఏమైనప్పటికీ, దావీదు సింహాసనం యోసేపు యొక్క చట్టబద్ధమైన వారసుడిగా అతని వాదనను వంశావళి, స్థాపించింది."3
మత్తయి 1:17: 17వ వచనం యేసు యొక్క 42 తరాల విచ్ఛిన్నతను సంగ్రహిస్తుంది. యేసు కుటుంబ వంశాన్ని స్థాపించిన తర్వాత, మత్తయి యేసు జనన వివరాలను అందించడానికి వెళ్లాడు. మత్తయి గ్రంధంలోని మిగిలిన భాగం యేసు జీవితానికి సంబంధించినది.
మత్తయి 1:18-25: మొదటి శతాబ్దంలో, నిశ్చితార్థం చట్టబద్ధమైన వివాహం వలె బంధించబడింది. 18 వ వచనంలో, యోసేపు"వారు కలవక ముందే ఆమె (మరియ) పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అని కనుగొన్నాడు." మరియను అవమానపరచడానికి ఇష్టపడని నీతిమంతుడిగా యోసేపు వర్ణించబడ్డాడు మరియు రహస్యంగా ఆమెకు విడాకులు ఇవ్వబోతున్నాడు (వ. 19). అయితే, యోసేపు ఈ పనులు చేయడానికి ముందు, ఒక దేవదూత అతనికి కనిపించింది (వ. 20). దేవదూత యోసేపు వంశాన్ని (దావీదు కుమారుడు) తెలిసియుండి మరియు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరియ గర్భాన్ని యిచ్చాడని వివరించింది. 21వ వచనంలో, యోసేపు ఆ బిడ్డకు “యేసు” అని పేరు పెట్టాడు, ఎందుకనగా ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు”
ముగింపు
మనము యూదుల యొక్క మొండితనము నుండి, అనగా దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేయుటను బట్టి ప్రయోజనము పొందాము, మరియు మనం చేయగలిగిన విధంగా వారికి పరిచర్య చేయడం మరియు తిరిగి ఇవ్వడం మన పని.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds. నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్, 1999), పేజి. 1137.
థామస్ L. కానిస్టేబుల్, డాక్టర్ థామస్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పోజిటరీ నోట్స్: మాథ్యూ, 34, https://planobiblechapel.org/tcon/notes/pdf/matthew.pdf.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005), 1120.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005), pp. 1120.
ప్రశ్నలు
-
మత్తయి 1వ అధ్యాయములో దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని మీరు ఎలా చూస్తారు? (ఆదికాండము 12:3; మత్తయి 1:1, 16).
దినవాక్యం
Laura Martin Matthew 1:21
She will give birth to a son, and you are to name Him Jesus, because He will save His people from their sins.
ప్రపంచం కోసం దేవుని ప్రణాళికలో భాగంగా, యోసేపు మరియు కన్యకయైన మరియకు జన్మించిన కుమారుడు ఉన్నాడు. ఎవరికైనా శిశువు పుట్టిందన్న వార్త విన్నప్పుడు, చాలాసార్లు మీరు అడిగే మొదటి ప్రశ్న, “తల్లిదండ్రులు శిశువుకు ఏం పేరు పెట్టారు?” అని. ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించిన తర్వాత, అతను విధేయతతో వారి కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు, హెబ్రీ పేరు యెహోషువా, దీని యొక్క గ్రీకు రూపము "యెహోవా రక్షిస్తాడు" అని అర్థం. యోసేపు మరియు మరియలు యేసు పుట్టిన సమయంలో ఆయన పేరు యొక్క పరిమాణాన్ని గ్రహించి ఉండకపోవచ్చు, వారి నవజాత కుమారుడు ప్రపంచ రక్షకుడిగా జన్మించాడు. ప్రవక్తలు ముందే చెప్పినట్లు ఆయన ఇమ్మానుయేలు—దేవుడు మనతో ఉన్నాడు.
మీ స్వంత పేరు యొక్క అర్థం గురించి ఆలోచించండి మరియు దాని అర్థం గురించి ప్రార్థించండి. దేవుని రాజ్యాన్ని ప్రభావితం చేయడానికి ఆయన మిమ్ములను ఎలా ఉపయోగించాలనుకుంటున్నాడో మీకు బయలుపరచమని ప్రభువును అడగండి. మీ పాపాల నుండి మిమ్మల్ని రక్షించడానికి మరియు విడిపించడానికి జన్మించిన గొప్ప ‘నేను’ అయిన యేసు, యేసుకు కృతజ్ఞతలు చెప్పండి.
“తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.”
— మత్తయి 1:21
తదుపరి లేఖన భాగములు
- ఆదికాండము 32:28 — “‘అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.’”
- లూకా 2:11 — “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.”
- 1 యోహాను 4:10 — “మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.