Deuteronomy 32-34
యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 32-34 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ద్వితీయోపదేశకాండము యొక్క ఈ చివరి పాఠంలో, మనం ఎక్కడికి వెళ్తున్నామో దాని నేపథ్యాన్ని అందించడానికి నేను ద్వితీయోపదేశకాండము 31:30లో ప్రారంభించబోతున్నాను. నేను మొత్తం పాఠము యొక్క పూర్తి సారాంశాన్ని ఇస్తాను, ఆపై ఒక వచనంపై దృష్టి పెడతాను.
పాఠము
ద్వితీయోపదేశకాండము 31:30: 30వ వచనంలో, అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు పూర్తిగా సమాజమంతటికి చెప్పాడు -దాదాపు 2 మిలియన్ల ప్రజలు ఉన్నారు. మోషే నిర్గమకాండము 15:1-18లో మరొక కీర్తనను వ్రాసాడు, దానిని ఎర్ర సముద్రం వద్ద రక్షించబడినందుకు నివాళిగా వ్రాసాడు మరియు సంఖ్యాకాండము 21లో, ఇశ్రాయేలీయులు తమకు జీవనాధారమైన బావులు కలిగియున్నందున కీర్తనను పాడారు. ఇది మోషే మరణానికి ముందు పాడిన అంత్యక్రియల కీర్తన. ఇశ్రాయేలీయులు కనానీయులను ఓడించిన తర్వాత న్యాయాధిపతులు 5అధ్యాయములో దేబోరా మరియు బారాకు విజయగీతాన్ని పాడారు. ఇశ్రాయేలీయుల స్త్రీలు, 1 సమూయేలు 18:6-7లో, దావీదు గొలియాతును ఓడించినందుకు వేడుకగా కీర్తనను పాడారు. ఈ కీర్తనలలో చాలా వరకు వారు గెలిచిన జీవితాధార విజయాల గురించినవే. 2 దినవృత్తాంతములు 29:30లోని లేవీయులు యేరుషలేము దేవాలయానికి స్తుతి మరియు సమర్పణ కీర్తనను పాడారు. ఈ అధ్యాయంలో మోషే కీర్తన ఇశ్రాయేలును తిరుగుబాటు ప్రజలుగా చూపించింది.
ద్వితీయోపదేశకాండము 32:1-14: దేవుడు మార్పులేనివాడుగా/ స్థిరముగా ఉన్నాడు, కానీ మరెవరూ, ముఖ్యంగా ఇశ్రాయేలీయులు స్థిరంగా లేరు. ఈ ప్రక్రియలో మోషే దేవుని లక్షణాన్ని గుర్తించడం ప్రారంభించాడని వైర్స్బే చెప్పాడు.1 4 వ వచనం దేవుడిని "దుర్గముగాను ఆయన పని పరిపూర్ణమైనదిగను; ఆయన మార్గాలన్నీ పూర్తిగా న్యాయమైనవి. నమ్మకమైన దేవుడు, ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన నీతిమంతుడు మరియు సత్యమైనవాడుగను వివరించింది. అప్పుడు దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకోవడం తెలియపరచబడుతుంది దేవుడు ఇశ్రాయేలియుల కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు (వ. 8-9). అరణ్యంలో దేవుడు వారిపట్ల చూపుతున్న శ్రద్ధను వారికి గుర్తుచేస్తూ మోషే కీర్తన ప్రారంభమైంది. దేవుడు వారిని రక్షించాడు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయని మోషే వారికి గుర్తు చేశాడు (వ. 13-14).
ద్వితీయోపదేశకాండము 32:15-21: కానీ 15వ వచనంలో, మోషే దేవుని మంచితనాన్ని నిర్లక్ష్యానికి గురిచేశాడు: “యెషూరూను క్రొవ్వినవాడై తిరుగుబాటు చేసెను . . . మరియు ఆయన రక్షణ దుర్గమును తృణీకరించెను. " యెషూరూను" అనునది ఇశ్రాయేలు యొక్క మరొక పేరు, మరియు కొత్త నిబంధనలోని మూలరాయిని యూదులు ఎలా తిరస్కరిస్తారో సూచిస్తూ, పద్యం చివరిలో ఉన్న పదాలు భవిష్యవాణి అని నేను నమ్ముతున్నాను. ఇశ్రాయేలీయులు ఈ స్థితిలోనే ఉంటే, దేవుడు తమ ముందుకు తెచ్చిన ప్రతిదాన్ని వారు తిరస్కరిస్తారు. ఇశ్రాయేలీయులు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు భయపడని దేవతలకు బలి అర్పించిరి. (వ. 17). వారు దయ్యములకు తామెరుగని దేవతలకు లొంగిపోయారు. విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను. (వ. 20). వారు దైవము కానిదాని వలన రోషము పుట్టించిరి (వ. 21), కాబట్టి ఆయన " కాబట్టి జనముకాని వారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” సారాంశం తర్వాత మేము విడిది చేసే వచనము ఇది.
ద్వితీయోపదేశకాండము 32:28-52: దేవుడు ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలియులు ఆలోచన లేని జనము (వచనములు.28-33), కాబట్టి దేవుడు ఇశ్రాయేలియుల శక్తిని తొలగించాడు (వచనములు. 34-38). దేవుడు తన హస్థమును "ఆకాశముతట్టు ఆయన హస్తమెత్తి ప్రకటిస్తాడు: నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని" (వ. 40-42), మనకు క్రీస్తు యొక్క తళతళలాడు కత్తి యొక్క అందమైన చిత్రం ప్రకటన గ్రంధములో ఇవ్వబడింది. 43వ వచనంలో, జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” మోషే కీర్తన ఒక హెచ్చరికగా మారింది (వ. 46), కాబట్టి ప్రజలు హెచ్చరికను పాటించాలి. అప్పుడు దేవుడు మోషేను నెబో పర్వతం పైకి వెళ్లమని చెప్పాడు, అక్కడ అతను తన అవిస్వసమువలన చనిపోతాడు. మోషే కనాను దేశాన్ని చూడగలిగాడు, అయినప్పటికీ అతను దానిలోకి ప్రవేశించలేడు (వచనములు.48-52).
ద్వితీయోపదేశకాండము 33: 1-5 వచనాలలో, మోషే ఇశ్రాయేలీయులపై పూర్తి దీవెనలు ఇచ్చాడు, ఆపై 6వ వచనంలో ప్రారంభించి, రూబేను, యూదా, లేవీ, బెన్యామీను, యోసేపు, జెబులోను, గాదు, దాను నఫ్తాలి మరియు ఆషేరు గోత్రములను మోషే దీవించాడు. 26-29 వచనాలలో, వీటన్నింటిలో యెహోవాను పరిగణించమని ఇశ్రాయేలీయులకు సూచించాడు.
ద్వితీయోపదేశకాండము 34: మోషేకు ప్రమాణము చేసిన దేశమును (వ. 1-4) చూపించెను మరియు 5-8 వచనాలలో, మోషే మృతిపొందెను మరియు దేశము మొత్తం సంతాపము సలిపెను. 9-12 వచనాలు యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడాయెను, మోషేవంటి మరొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. ఇది మోషే శకం ముగింపు మరియు నాయకత్వం యెహోషువాకు బదిలీ చేయబడింది.
ఇప్పుడు, ద్వితీయోపదేశకాండము 32:21కి తిరిగి వెళ్దాము, మోషే ప్రవక్త యేసును సూచించిన ప్రవక్తగా పనిచేశాడు. అది ద్వితీయోపదేశకాండము యొక్క కథ. ఇశ్రాయేలీయులు తమ తిరుగుబాటును కొనసాగించినట్లయితే, ఇశ్రాయేలీయులను (యూదులను) అసూయపడేలా చేయడానికి అతను జనముకాని దేశాన్ని ఉపయోగిస్తాడని దేవుడు వారిని హెచ్చరించాడు. యూదులను అసూయపడేలా చేయడానికి దేవుడు మాట్లాడుతున్న సమూహం మనమే- యూదులు కానివారు, అన్యులు.
పంచ గ్రంథములను అధ్యయనం చేయడం ఎందుకు చాలా ముఖ్యమైనదో ఇక్కడ ఉంది. విశ్వాసులుగా మనం యూదుల కంటే దేవుని వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఎందుకు? క్రీస్తులో మనకు ఏమి ఉందో దానిని వారు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ యొక్క మొట్ట మొదటి ఐదు పుస్తకాలు చివరికి యేసును సూచిస్తాయి. . . సంతానం, విమోచకుడు, ప్రాయశ్చిత్తం, బండ మరియు ప్రవక్త ఈ ఐదు పదాలన్నీ యేసునే సూచిస్తున్నాయి.
యూదులు ఇప్పటికీ దేవుని చేత ఏర్పరచబడిన జనాంగమే “నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను స్వకీయజనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచు కొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువ వేగదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.”(ద్వితీయోపదేశకాండము 7: 6-8) . యూదులు దేవుడు ఏర్పరచుకున్న జనాంగము.
రోమన్లు 1:16: " సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ముప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ జేయుటకు అది దేవుని శక్తియైయున్నది." "మొదట" అనే పదానికి సువార్త యూదుల కోసం ఉద్దేశించబడింది. కానీ వారు సువార్తను (కొత్త ఒడంబడిక) తిరస్కరించడం ద్వారా రక్షణ అన్యజనులకు వచ్చింది. పంచగ్రంధాలు/ ధర్మశాస్త్రమును అధ్యయనం చేయడం ద్వారా ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును తిరస్కరించారు అని అర్ధమౌతుంది.
రోమీయులు 11:11: “కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రు పాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను”. వారి మొండితనం కారణంగా, వారికి బదులుగా అన్యజనులకు రక్షణ కలిగెను. ద్వితీయోపదేశకాండము 32:21 యూదులకు ఆగ్రహము తెప్పించడానికి అన్యజనులకు సువార్త వచ్చినప్పుడు ఈ ప్రవచనం ప్రవచించబడినది. యేసును తమ క్రీస్తుగా విశ్వసించే యూదుల శేషం ఉంది. ద్వితీయోపదేశకాండములో జరిగినదంతా అన్యజనులకు రక్షణకు దారితీసింది. దేవుడు యూదులను తిరస్కరించలేదు; ఆయన ఎన్నుకున్న ప్రజల కోసం ఇంకా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు.
రోమా 10:19-20: “మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుందేనా? జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగజేతును. అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. రోమాపత్రిక 11:12: “ఇప్పుడు వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన యెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!”
రోమా 11:24: "ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా?" మానవుని పతనం కారణంగా యూదులు రక్షణను అంగీకరించాలని దేవుడు ఉద్దేశించాడు మరియు వారిని తన కుటుంబంలోకి తిరిగి తీసుకురావాలని కోరుకున్నాడు. యూదులు దీనిని ఎప్పుడు పొందబోతున్నారు? మేము యేసుకు అవును అని చెప్పినప్పుడు, యూదులు మనకు ఉన్నదానిని కోరుకుంటారు. వారు అసూయపడే విధంగా క్రీస్తులో జీవిస్తున్నారా? మన దగ్గర ఉన్నవాటిని చూసేందుకు మనం వేరుగా ఉండాలి. మరియు యూదులు దానిని తిరస్కరించినప్పటి నుండి మనకు లభించిన ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు ఎన్నుకున్న ప్రజలైన యూదులలోకి మనం తిరిగి పోయాలి. ఇది దేవుడు ఎన్నుకున్న వ్యక్తులతో మొదలై, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులతో ముగుస్తుంది.
రోమా 15:27: “అవును, వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారైయున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులైయున్నారు.” అన్యజనులుగా, యూదులకు భౌతికంగా మరియు స్పష్టంగా వారికి అవసరమైన పరిచర్య చేయడానికి మనము బాధ్యత వహిస్తాము.
ముగింపు
యూదుల మొండితనానికి మరియు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటులో వారు అనుభవించిన వాటికి మనం లబ్ధిదారులం. వారికి ఏ విధంగానైనా పరిచర్య చేయడం మరియు తిరిగి ఇవ్వడం మన పని.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), p. 449.
ప్రశ్నలు
-
ఇశ్రాయేలు వారి చరిత్రను కీర్తనల ద్వారా అందించిన మార్గాలలో ఒకటి. ద్వితీయోపదేశకాండము 32:1-43లోని కీర్తనను ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకోవడానికి సహాయం చేయమని దేవుడు మోషేకు సూచించాడు. ఈ కీర్తనలోని ఏ భాగం మీతో ఎక్కువగా మాట్లాడుతుంది? మీకు ఇష్టమైన కీర్తనలు లేదా ఆరాధన పాటల్లో ఒకదానితో ఇప్పుడే ప్రభువును స్తుతించండి.
దినవాక్యం
Laura Martin Deuteronomy 33:29
How happy you are, Israel! Who is like you, a people saved by the LORD? He is the shield that protects you, the sword you boast in. Your enemies will cringe before you, and you will tread on their backs.
మోషే 120 సంవత్సరాల వయస్సులో మోయాబు దేశంలో చనిపోయే ముందు, అతను చివరి కీర్తనను పాడాడు మరియు ఇశ్రాయేలీయులపై చివరి ఆశీర్వాదాలు పలికాడు. అతని మాటలు జ్ఞాపకాలు మరియు మంచి సమయాలు, కష్ట సమయాలు రాబోయే రోజులు ప్రజల కోసం రానున్నాయని మోషేకు తెలుసు. ఇశ్రాయేలీయులు ప్రభువు యొక్క శక్తివంతమైన శక్తిని గురించి సాక్ష్యమివ్వడానికి ప్రభువుచే ఏర్పరచబడిన జనాంగము, ప్రభువు చేత రక్షించబడిన ఎంపిక చేయబడిన జనాంగము. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుడు చెప్పాడు, దేవునిని ముఖాముఖిగా చుసిన ఏకైక ప్రవక్త దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. రాబోయే రోజుల్లో ఇశ్రాయేలీయులు దేవునికి ఎలా ప్రతిస్పందిస్తారో మోషే ప్రవచించినప్పటికీ, “ఇప్పటికి?” అనే భావం అతని మాటల్లో ఇంకా ఉంది. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు నిజంగా దేవునితో ఎలా నడుస్తారు? వారు తమ పూర్ణ హృదయాలతో, ఆత్మలతో మరియు మనస్సులతో ప్రభువును అనుసరించడానికి ప్రతి కారణం ఉంది. కానీ వారు ఏమి నిర్ణయించుకుంటారు?
విశ్వాసులుగా, మీకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈరోజు గడపడానికి మీరు ఎలా ఎంచుకుంటారు? నీ పూర్ణహృదయముతో నీవు ప్రభువును అనుసరిస్తావా? మీరు ఆయన మార్గాల్లో నడుస్తారా? నిన్నటి నుండి అతని విశ్వసనీయతను మీరు గుర్తుంచుకుంటారా? లేదా మీరు వెనుదిరిగి మీ స్వంత ఆసక్తిని కోరుకునే ఎంపిక చేస్తారా? ఈ రోజు, ప్రభువు మిమ్మల్ని బేషరతుగా ప్రేమిస్తున్నాడని మరియు మీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారని విశ్వసించడానికి ఎంచుకోండి. మీరు అతని ప్రేమ యొక్క సత్యాన్ని స్వీకరించినప్పుడు, మీరు అతని మార్గాల్లో స్థిరంగా నడవడానికి మరియు ఇతరులను ప్రేమించే శక్తిని పొందుతారు.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
-ద్వితీయోపదేశకాండము33:29
తదుపరి లేఖన భాగములు :
- కీర్తన 28:7:- యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
- కీర్తన 143:8:- నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.
- రోమా 16:25-27:- సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడినప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.