The Pentateuch Deuteronomy

Deuteronomy 31

యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 31 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 109వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

ద్వితీయోపదేశకాండము మరియు పంచగ్రంథములలో మోషే యొక్క రచనలన్నీ (ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము) మనము అధ్యయనాన్ని పూర్తి చేయడానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. గత కొన్ని రోజులుగా ఆశీర్వాదాలు మరియు శాపాలు గురించి చాలా ఎక్కువగా చెప్పుకున్నాము. ద్వితీయోపదేశకాండము 30 చెప్పినట్లుగా మనం జీవితాన్ని ఎంచుకుందాం. మనము ద్వితీయోపదేశకాండము 31ని లోతుగా త్రవ్వినప్పుడు, మనం అనుసరించగల స్పష్టమైన, ఆచరణాత్మక కథల గురించి తర్కించుకుంటాము. నిజానికి మోషే నుండి యెహోషువా వరకు నాయకత్వంలో మార్పు, మొదటి ఎనిమిది వచనాలలో ఉంది.

పాఠము

ద్వితీయోపదేశకాండము 31:1-2: “మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పెను” అని 1వ వచనం చెబుతోంది. అతని ఉపన్యాసం కొనసాగుతుంది. 2వ వచనములో, మోషే తన వయస్సు 120 సంవత్సరాలు, అతను వృద్ధుడని మరియు అతను యోర్దాను దాటలేడని పేర్కొన్నాడు.

మోషే జీవితం గురించి మనకు ఏమి తెలుసు?

  • మొదటి 40 సంవత్సరాలు మోషే ఐగుప్తులో జీవించాడు
  • రెండవ 40 సంవత్సరాలు, మోషే మిద్యానులో గొర్రెలను మేపుకుంటూ తన కుటుంబంతో గడిపాడు.
  • ఆకరి 40 సంవత్సరాలు, మోషే అరణ్యంలో గడిపాడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించాడు.
  • అతను 120 సంవత్సరాల వయస్సులో మరణించాడు, అతని కంటి చూపు బాగానే ఉంది మరియు అతను శక్తితో నిండి ఉన్నాడు అతని ఆరోగ్యం మరియు సామర్థ్యం అతన్ని నడిపించకుండా నిరోధించలేదు (ద్వితీయోపదేశకాండము 34:7). అతని పాపము ఆయనను అడ్డుకుంది.
  • మోషే యొక్క పాపము వాగ్ధాన దేశములోనికి ప్రవేశించకుండా నిరోధించింది (ద్వితీయోపదేశకాండము 1:37-38).
  • వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి మరియు ప్రజలను నడిపించడానికి తనను అనుమతించమని మోషే యెహోవాను వేడుకున్నాడు.
  • దేవుడు నిరాకరించాడు మరియు కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి మోషే పాపాన్ని ఉపయోగించాడు (ద్వితీయోపదేశకాండము 3:23-29).

ద్వితీయోపదేశకాండము 31:3-6: యెహోషువా వారిని యోర్దాను దాటి నడిపిస్తాడని మోషే ఇశ్రాయేలీయులకు వివరించాడు (వ. 3). మరియు యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఒగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే యీ జనములకును చేసి వారిని ఇశ్రాయేలీయులకు అప్పగించాడు (వ. 4-5). యెహోషువా 1:5 ప్రకారం, దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, “నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను ఎడబాయను ఆ మాట నేటికీ బావుంది. మనము వ్యసనములు, వివాహ సమస్యలు, చెడు నిర్ణయాలు ఎదుర్కొంటున్నా- దేవుడు మనల్ని విడిచిపెట్టడు లేదా ఎడబాయడు. కాబట్టి, 6వ వచనంలో మోషే యెహోషువతో ఇలా చెప్పాడు: “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము; వారికి భయపడవద్దు. నీ దేవుడైన యెహోవా నీతో కూడ వచ్చును; ఆయన నిన్ను విడువడు ఎడబాయాడు. “వారు” ఇశ్రాయేలీయులను సుచిస్తుంది. తాను నడిపించబోయే జనాంగమును గూర్చి యెహోషువా భయపడాలని లేదా మోషే అక్కడ ఉండడని భయపడాలని మోషే కోరుకోలేదు, బదులుగా, యెహోషువ దేవునిపై ఆధారపడాలని మోషే కోరుకున్నాడు. యెహోషువా 1వ అధ్యాయములో, దేవుడు యెహోషువా మరియు ప్రజలను మూడుసార్లు నిబ్బరము మరియు ధైర్యంగా ఉండాలని ఆజ్ఞాపించాడు (వ. 6-7, 9). లూయిస్ బి. స్మీడెస్ ఇలా అంటాడు, "ధైర్యం అనేది ప్రార్ధనలో భయం మాత్రమే."1 మనం ధైర్యంగా బయటికి వెళ్లగల ఏకైక మార్గం ఏమిటంటే, మనం ఒక కొత్త దేశంలోకి వెళ్ళేటప్పుడు మన భయాలను అధిగమించడానికి సహాయం చేయమని ప్రార్థించడం మరియు దేవుడిని అడగడం, ఎందుకంటే దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి.

ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళ్లమని ఆజ్ఞాపించబడ్డారు. మత్తయి 28:18-20 ప్రకారం, అన్ని రకాలైన దేశాలు, స్థానిక పొరుగు ప్రాంతాలు, పెద్ద నగరాలు మరియు విదేశాలకు వెళ్లి, తండ్రి, కుమారుని నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వడానికి సమస్త అధికారాలు గల యేసు ద్వారా మనము నియమించబడ్డాము. మనము బోధించడానికి మరియు శిష్యులను చేయడానికి నియమించబడ్డాము. మనం ఎక్కడికి వెళ్లినా దేవుడు అక్కడ ఉంటాడు, మనల్ని ఎన్నటికి విడిచిపెట్టడు. "యుగాంతం" అనే పదానికి యేసు తిరిగి వచ్చే వరకు అని అర్థం; ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటాడు. భయం దారిలోకి వచ్చినప్పుడు, ఇవేవీ పని చేయవు.

ద్వితీయోపదేశకాండము 31:7-8: మోషే ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువాను పిలిచి ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపిస్తాడు అని చెప్పాడు (వ. 7). వాల్టర్ లిప్‌మాన్ ఇలా అంటాడు, "ఒక నాయకుడి యొక్క చివరి పరీక్ష ఏమిటంటే, అతను ఇతర వ్యక్తులలో నమ్మకాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని కొనసాగించటం."2 మోషే యెహోషువాను అతని తర్వాత నడిపించాడు. ఇది స్పష్టంగా దైవిక నాయకత్వం యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క నమూనా. యేసు మరియు అపొస్తలుల గురించి ఆలోచించండి. అయన 12 మందిని కలిగి ఉన్నాడు. 12 మందిలో ఒకరు ఆయనకి విడిపించుస్టకు అనుమతి తీసుకోవడం మనకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఆయన నిజముగా ముగ్గురిపై ఆత్మను కుమ్మరించెను వారిలో ఒకరు అపనమ్మకము కలిగిన వారు. ఇది పరిపూర్ణ సమూహం కాదు. అపొస్తలుడైన పౌలు తిమోతి మరియు తీతులపై తన ఆత్మను కురిపించాడు. యెహోషువా విషయంలో ఏం జరిగిందంటే, మోషే ప్రజల ముందు నిలబడి యెహోషువాపై మరింత నమ్మకము కలిగియున్నాను అని ప్రకటించాడు. ఇది నాయకత్వ బదిలీ. నాయకత్వ మార్పు లేనప్పుడు, అది తన ప్రజలపై దేవుని తీర్పుకు రుజువు అని వైర్స్బే చెప్పారు3. (యెషయా 3:1-4; ద్వితీయోపదేశకాండము 1:38; 31:14; 32:51-52) దేవుడు చేసిన బదిలీ పని చేయనప్పుడు, అది అవిధేయత వలన ఏర్పడిన అస్థిరత కారణంగా జరుగుతుంది. దేవుని ఆత్మ యెహోషువాపై ఉన్నందున అతను ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్దముగా ఉన్నాడు. యెహోషువా, మోషేతో పాటు ప్రజల ఎదుటకు వచ్చి మోషే యొక్క కీర్తనను చదివెను, మోషే తన అధికారాన్ని యెహోషువాకి ఇవ్వడానికి సిద్దముగా ఉన్నాడు అని మనకు తెలియచేస్తుంది.

ద్వితీయోపదేశకాండము 31:9-13: మోషే నుండి యెహోషువకు నాయకత్వం మారినప్పుడు, పెద్దలు మరియు పిల్లలు అందరూ సమావేశమయ్యే ముందు ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి ధర్మశాస్త్రాన్ని చదవమని మోషే యాజకులకు సూచించాడు. ఎవరు బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనివ్వాలి. ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, పునాదిగా ఉండవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్లినా ధర్మశాస్త్రమును తప్పక తీసుకువెళ్ళాలి.

ద్వితీయోపదేశకాండము 31:14-15: యెహోవా చూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువాను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా, మోషేయు యెహోషువాయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలిచెను, కాబట్టి దేవుడు యెహోషువతో ఉన్నాడని ప్రజలు చూడగలిగారు.

ద్వితీయోపదేశకాండము 31:16-23: యెహోవా మోషేతో యిట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో మరణించబోవుచున్నావు. మరియు ఈ ప్రజలు అవిధేయులై అపనమ్మకస్తులై యుందురు. (16వ). కావున ఆయన వారిపట్ల కోపపోద్రిక్తుడై వారిని నిషేధిస్తాడు, గనుక వారు సమస్యలు మరియు బాధలను ఎదుర్కొందురని దేవుడు చెప్పాడు. ఒకరోజు దేవుడు వారిని నిషేధించాడు కాబట్టి ఈ సమస్యలు కలిగినవని వారు గ్రహిస్తారు (17వ). కాబట్టి, మోషే ఇశ్రాయేలీయులకు బోధించగలిగే పాటను వ్రాయవలసి ఉంది, తద్వారా అది దేవుని గురించి సాక్షిగా ఉంటుంది (19వ). మోషే ఆ దినమందే కీర్తనను వ్రాసి ఇశ్రాయేలీయులకు బోధించాడు (22వ). మరియు యెహోషువా నియమించబడ్డాడు (23వ).

ద్వితీయోపదేశకాండము 31:24-29: మోషే వ్రాసిన కీర్తన ద్వారా దేవుని వాక్యాన్ని భద్రపరచబడటం జరిగింది. ఎందుకంటే 24వ వచనం ఇలా చెబుతోంది, “ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత,” ఈ కీర్తన నిజానికి మొత్తం పంచగ్రంథములు/ ధర్మశాస్త్రం అని కొందరు అనుకుంటారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును అని మోషేకు సూచించబడింది (వ. 26). పాపం, మోషే వారిని విడిచిపెట్టినప్పుడు, ఇశ్రాయేలీయులు విధేయులుగా ఉన్నారు, మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు (v.29).

ముగింపు

మోషే తన నాయకత్వ సమయాన్ని ఈ కీర్తనతో ముగించాడు, ఇశ్రాయేలీయులకు వారి స్వంత పాపాల గురించి చెప్పే వ్రాతపూర్వక వారసత్వం. ఏమి జరగబోతోందో తెలుసుకోవడం మోషేకు అంత సులభం కాదు, కానీ దేవుడు ఆజ్ఞాపించినట్లు అతను చేశాడు, దేవునికి నమ్మకంగా మరియు విధేయతతో ఉండడం ద్వారా తన నాయకత్వ సమయాన్ని ముగించాడు.

  1. లూయిస్ స్మీడెస్, “యాన్ ఇంట్రడక్షన్ టు మిషన్ బియాండ్ ది మిషన్,” థియాలజీ, న్యూస్ మరియు నోట్స్ (అక్టోబర్ 1983), p. 3; డాక్టర్ థామస్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్‌పోజిటరీ నోట్స్‌లో కోట్ చేయబడింది, డ్యూటెరోనమీ;p. 171; ఆన్‌లైన్‌లో https://planobiblechapel.org/tcon/notes/pdf/deuteronomy.pdfలో అందుబాటులో ఉంది

  2. వాల్టర్ లిప్‌మాన్, కోట్స్, బ్రిటానికా, https://www.britannica.com/quotes/biography/Walter-Lippmann.

  3. వారెన్ W. వైర్స్‌బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), పేజి. 447.

ప్రశ్నలు

  1. ఇశ్రాయేలీయుల ముందు ఈ దేశాలను నాశనం చేయడానికి ఎవరు యోర్దాను దాటుతారు (ద్వితీయోపదేశకాండము 31:3)? మన శత్రువులను నాశనం చేయడానికి క్రీస్తు మన ముందుకు వస్తున్నాడని ఇది ఎలా సూచిస్తుంది (యోహాను 14:3; కొలొస్సీ 2:15; 1 యోహాను 3:8b)? యెహోషువా అనే పేరు యాషువా యొక్క ఉత్పన్నం అని మీకు తెలుసా (మరియు ఇది ముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారా)?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Deuteronomy 31:6

Be strong and courageous; don’t be terrified or afraid of them. For it is the LORD your God who goes with you; He will not leave you or forsake you.

మోషే తదుపరి నాయకుడిగా యెహోషువా యొక్క నియామకాన్ని ప్రారంభించినప్పుడు, మోషే ఈ శక్తివంతమైన ప్రోత్సాహక పదాలను మూడుసార్లు పునరావృతం చేశాడు:

“నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెను.

మోషే మరియు యెహోషువా తమ జీవితాల్లో మార్పును ఊహించారు. మీరు కూడా అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొన్నప్పుడు మీ జీవితంలో మార్పుల సమయాలు ఉంటాయి మరియు మీకు ఎంపిక ఉంటుంది. మీరు భయంతో మరియు వణుకుతో నడవవచ్చు లేదా మీరు బలంగా మరియు ధైర్యంగా ఉండవచ్చు, ప్రభువు మీకు తోడుగా ఉన్నారు మరియు మిమ్మల్ని విడిచిపెట్టరు.

ఈరోజు మీరు దేనిని ఎదుర్కొన్నా, ధైర్యంగా నడవడానికి మీకు శక్తినిస్తూ, మీతో ఉన్న ప్రభువు ద్వారా మీరు బలపడినట్లు భావిస్తారు. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు మరియు భవిష్యత్తులో ఏమైనా ఎదుర్కొనేందుకు మీకు సహాయం చేస్తాడు. మీరు దీన్ని చేయవచ్చు!

“భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.”

-ద్వితీయోపదేశకాండము 31:6

తదుపరి వాఖ్యభాగము

  • కీర్తన 32:8:- నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
  • యెషయా 43:2:- నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లినప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు
  • యిర్మీయా 29:11:- నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.