Stay Awake and Pray!
యేసును ఇలా కనుగొనండి: Servant Mark 14 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మత్తయి సువార్తలో, మనం యేసును రాజుగా చూశాము. మార్కు సువార్తలో, మనము యేసును సేవకునిగా చూశాము. మార్కులో యేసు చెప్పినదంతా చూస్తే రాజుగా ఉండాలంటే, ఆయన సేవకునిగా రావాలని చూపిస్తున్నది (కీర్తన 78:70-72). మార్కు 10:45 అనేది మార్కు సువార్త అంతటికి మూల వచనము మరియు యేసును సేవకునిగా అర్థం చేసుకోవడానికి మద్దతు ఇస్తుంది: “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను." సేవకుడైన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం తన ప్రాణాలను అర్పించాడు. 14-16 అధ్యాయాలలో, మనం యేసును ఎలా సేవించవచ్చో పరిశీలిద్దాము.
పాఠము
మార్కు 14: 1-26: 1-2 వచనాలు యేసును చంపడానికి చేసిన కుట్రను వెల్లడిస్తున్నాయి మరియు 3-11 వచనాలు బేతనియలో యేసు అభిషేకం గురించి వివరిస్తున్నాయి. 12-16 వచనాలు పస్కా పండుగకు చేసిన సన్నాహాలను వివరిస్తున్నాయి. 17-21 వచనాలు యేసు శిష్యులలో ఒకరు తనకు విరోధమగుట ద్వారా ద్రోహం చేస్తాడని ముందే చెప్పడం గురించి వివరిస్తుంది. ఆ తర్వాత 22-26 వచనాలలో, శిష్యులు యేసుతో ప్రభువు రాత్రి భోజనాన్ని పంచుకున్నారు. అది నేటి అధ్యయనానికి నేపథ్యం.
మార్కు 14:27-31: రాత్రి భోజనం ముగించిన తరువాత, యేసు మరియు శిష్యులు ఒలీవల కొండకు వెళ్లారు. వారు నడుస్తూ ఉండగా, యేసు వారితో ఇలా అన్నాడు, "అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱల కాపరిని కొట్టుదును; గొఱ్ఱలు చెదరి పోవును” అని వ్రాయబడింది (వ. 27). కష్టాలు వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోతారని యేసు నొక్కి చెప్పాడు. అప్పుడు, "అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లెదను." (వ. 28) అని వారితో చెప్పాడు. వారు చెల్లాచెదురుగా పారిపోయిన తర్వాత, వారు గలిలయలో ఆయనను కలుసుకోగలరని ఆయన వారికి చెప్పెను. "అందరు అభ్యంతరపడినను " (వ. 29) తాను ఎప్పటికీ అభ్యంతరపడనని పేతురు ఖండించాడు. యేసు ఇలా అన్నాడు, “చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!” (వ. 30). కానీ పేతురు యేసును విడిచిపెట్టే ముందు అతనితో చనిపోతానని పట్టుబట్టాడు మరియు ఇతర శిష్యులు అంగీకరించారు (వ. 31). కాబట్టి, ఎదురులేని సేవకుని సేవకులు ఆయనను ఎలా సేవించారు?
మార్కు 14:32-36: “గెత్సేమనే” అనే పేరు కేవలం రెండుసార్లు మాత్రమే లేఖనంలో ప్రస్తావించబడింది, అది ఇక్కడ మరియు మత్తయి 26:36. ఇది యేసు నిత్యమూ వెళ్ళే ప్రదేశం (యోహాను 18:1). యేసు ఎక్కడ ఉంటాడో యూదాకు కూడా తెలుసు. "గెత్సెమనే" అనే పేరుకు "త్రొక్కబడిన ఒలీవ" అని అర్ధం. రాడ్నీ కూపర్ ఇలా వ్రాశాడు, "మన పాపాలకు 'బలి'గా తన లక్ష్య నెరవేర్పు గురించి యేసు ఇప్పుడు గట్టిగా ఒత్తిడి చేయబడతాడు."1 యేసు తన శిష్యులతో ఉండి ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు అయన తనతో పాటు పేతురు, యాకోబు మరియు యోహానులను తోటలోకి తీసుకెళ్లాడు (వ. 32-33). యేసు యొక్క మానవత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన "మిగుల విభ్రాంతినొందాడు మరియు చింతాక్రాంతుడయ్యాడు" (v. 33b). ఆయనకు తన అంతరంగములో మానసిక మరియు శారీరక మద్దతు అవసరం. ఆయనకు నైతిక మద్దతు అవసరం. తాను ఏమి అనుభవించబోతున్నాడో యేసుకు ఖచ్చితంగా తెలుసు. పేతురు, యాకోబు మరియు యోహాను మూడు సార్లు యేసుతో ఒంటరిగా ఉన్నారు: రూపాంతర కొండపై, యాయీరు కుమార్తె స్వస్థత సమయంలో మరియు గెత్సేమనేలో (ఫిలిప్పీయులు 3:10).
మాక్ఆర్థర్ "మిగుల విభ్రాంతి" (NIV "ఇబ్బందిపడ్డాడు") అనే పదాన్ని "భయంతో కూడిన ఆశ్చర్యపరిచే అనుభూతిని సూచిస్తుంది. పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్నంతటిని భరించే భయంకరమైన నిరీక్షణలో, యేసు భయాందోళనలో ఉన్నాడు.”2 34వ వచనంలో, “నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది” అని యేసు చెప్పాడు. యేసు లోక పాపాన్ని మోయబోతున్నాడు కాబట్టి (2 కొరింథీయులు 5:21) కలవరపడ్డాడని నేను అనుకుంటున్నాను. మాక్ఆర్థర్ ఇలా అన్నాడు, "యేసు యొక్క దుఃఖం చాలా తీవ్రంగా ఉంది, అది ఆ సమయంలో అయన మరణానికి కారణమయ్యే ప్రమాదం ఉంది."3(లూకా 22:44). అయన ప్రతిదానిని - భూత, భవిష్యత్త్, మరియు వర్తమాన పాపాలన్నింటిని తీసుకుంటాడు. ఆయన తన స్నేహితులను కోరినదంతా తనతోపాటు మెలకువగా ఉండటమే (వ. 34). 36 వ వచనంలో, యేసు తాను రాబోయే దాని నుండి బయటపడగలనా అని అడగలేదు, "అది దేవుని ప్రణాళికలో సాధ్యమైతే."4 దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి మరొక మార్గం ఉందా అని యేసు అడిగాడు. "గడియ" (వ. 35) "దేవునిచే నిర్ణయించబడిన ఆయన బలిగా మరణించే సమయాన్ని సూచిస్తుంది. ఇది నమ్మకద్రోహం నుండి, యేసు యొక్క శ్రమలు, అపహాస్యం మరియు అతని సిలువవేయడం వరకు ప్రతి దానిని కలిగియుంది.”5 (యేసు తన పరిచర్య అంతటా “గడియ”ను ఉపయోగించాడు: యోహాను 2:4; 7:30.) మరియు ఇప్పుడు వేరే మార్గం ఉందా అని దేవుడిని అడిగాడు (v. 35b). ఈ మధ్యవర్తిత్వం హెబ్రీయులు 5:7లో ప్రస్తావించబడింది: "శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను." అబ్బా అంటే డాడీ లేదా తండ్రీ అనే పదం. యేసు తాను చేయవలసిన పనిని ఇష్టపడకపోవచ్చు, కానీ ఆయన నుండి కోరబడినదానిని ఇష్టపూర్వకంగా చేశాడు (వ. 36).
మార్కు 14:37-43: మూడు సార్లలో యేసు మొదటి సారి తిరిగి వచ్చి తన సన్నిహిత మిత్రులు నిద్రపోతున్నట్లు కనుగొన్నాడు. వారు ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయారు (వ. 37). ప్రార్థించమని యేసు వారికి మళ్లీ చెప్పాడు మరియు "ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనమని" (వ. 38) నొక్కి చెప్పాడు. "ప్రార్థనలో మెలకువగా ఉండి దేవునిపై ఆధారపడేవారికి ఆత్మీయ విజయం లభిస్తుందని మరియు ఆత్మవిశ్వాసం మరియు ఆత్మీయ సంసిద్ధత ఆత్మీయ విపత్తుకు దారితీస్తుందని శిష్యులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది"6 అని మాక్ఆర్థర్ సూచించాడు. మనం దేవుని ఆశ్రయించాల్సిన అవసరం లేదని భావిస్తే, మనం ఆత్మీయ నాశనము వైపు వెళ్తున్నాము.
యేసు రెండవసారి ప్రార్థించాడు, అదే ఆందోళనలను దేవునికి వినిపించాడు, ఆపై శిష్యులు మళ్లీ నిద్రపోతున్నట్లు కనుగొనడానికి తిరిగి వచ్చాడు. యేసు మూడవసారి ప్రార్థించడానికి వెళ్ళాడు మరియు శిష్యులు ఇంకా నిద్రపోతున్నట్లు చూశాడు. యేసు, “ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు;” (వ. 41). అంచనాలు వాస్తవం కాలేదు. యేసు తన శిష్యులతో లేచి, తనను అప్పగించేవానిని కలవడానికి తనతో రమ్మని చెప్పాడు (వ. 42). యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, యూదా ప్రధాన యాజకులతోను, శాస్త్రులతోను మరియు పెద్దలతోను కలిసి వచ్చాడు (వ. 43).
ముగింపు
సర్వోన్నతుడైన దేవుని సేవకులుగా మనం మెలకువగా ఉండి ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలి.
కొలొస్సయులు 4:2-4: “ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధక ములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.” ( లూకా 11:8; 18:4-5).
1 థెస్సలొనీకయులు 5:17: “యెడతెగక ప్రార్థనచేయుడి;” (NASB 1995).
రోమన్లు 13:11: "మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది."
మనం ఎలా సిద్ధపడాలి? మెలకువగా ఉండి ఎలా ప్రార్థించండి!
రోడ్నీ కూపర్, హోల్మాన్ కొత్త నిబంధన వ్యాఖ్యానం: మార్క్(నాష్విల్లే: బ్రాడ్‌మాన్ & హోల్మాన్ పబ్లిషర్స్, 2000), కిండ్ల్ లొకేషన్ 5580.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజి. 1252.
మాక్ఆర్థర్, పే. 1252.
మాక్ఆర్థర్, పే. 1252.
మాక్ఆర్థర్, పే. 1252.
మాక్ఆర్థర్, పే. 1252.
ప్రశ్నలు
-
3-5 వచనాలలో శిష్యులు ఎందుకు కలత చెందారు? ఈ సమయంలో, వారు నిజంగా యేసు ఎవరో చూడలేకపోయారని మీరు అనుకుంటున్నారా? ఎందుకు లేదా ఎందుకు కాదు?
దినవాక్యం
Laura Martin Mark 14:38
“Stay awake and pray so that you won’t enter into temptation. The spirit is willing, but the flesh is weak.”
గెత్సేమనే తోటలో యేసు తన తండ్రికి ప్రార్థించాడు. తన శిష్యులకు దగ్గరలో కూర్చుని ప్రార్థించమని చెప్పాడు. మూడుసార్లు యేసు శిష్యులు నిద్రపోతున్నట్లు చూశాడు. మరియు యేసు మూడుసార్లు వారిని, “ మీరు మెలకువగా ఉండలేరా?” అని అడిగాడు.
క్రీస్తు పునరాగమనం కోసం మీరు ఎదురుచూస్తున్నప్పుడు, ప్రార్థనకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి మరియు అప్రమత్తంగా ఉండండి. యేసు హెచ్చరించాడు, ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరము బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి మీరు ప్రార్థన కొనసాగించాలి. ఇది సరళంగా అనిపిస్తుంది, కాని శిష్యులు నిద్రపోయారు మరియు ఒక గంట కూడా మేల్కొని ఉండలేకపోయారు. క్రీస్తు అనుచరునిగా ఆయన తిరిగి రావడానికి ఎదురుచూస్తూ, మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రార్థనలో సమయాన్ని వెచ్చించండి మరియు అది మీకు రోజుకి ఎలా బలాన్ని ఇస్తుందో చూడండి.
“మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను”
మార్కు 14:38
తదుపరి లేఖన భాగములు
- రోమా 13:11 — “మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.”
కొలొస్సయులు 4:2 — “ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.”
1 థెస్సలొనీకయులు 5:17 — “యెడతెగక ప్రార్థనచేయుడి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.