The Gospels Mark

Watch! Be Alert!

యేసును ఇలా కనుగొనండి: Servant Mark 13 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 151వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

మత్తయి మరియు మార్కు సువార్తల అధ్యయనంలో ఇప్పటివరకు, మనము ఒకే అంశమునును ఒకటి కంటే ఎక్కువసార్లు అధ్యయనం చేయలేదు. ఏమైనప్పటికిని, మార్కు సువార్త 13వ అధ్యాయము దాదాపుగా మత్తయి 24వ అధ్యాయము వలె ఉంటుంది, కాబట్టి మనకు ఎంపిక లేదు. నేను దీని ద్వారా ప్రార్థించాను మరియు మార్కు 13వ అధ్యాయమును ఎలా వ్యత్యాసమైనదిగా చేయాలో అని దేవుణ్ణి అడిగాను. ఆయన ప్రతిస్పందన, "వద్దు"! అని వచ్చింది. మనం మార్కు 13 గుండా నడుస్తున్నప్పుడు, అంత్య కాలములు ఎలా ఉంటాయో చూడటం ప్రారంభిస్తాము, తద్వారా ఆయన తిరిగి రావడానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకోవచ్చు.

పాఠము

మార్కు 13:1-2: శిష్యులలో ఒకరు దేవాలయంలోని పెద్ద పెద్ద రాళ్లను ఎత్తి చూపినప్పుడు, రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని యేసు ప్రతిస్పందించాడు. క్రీ.శ. 70లో సంభవింపబోయే ఆలయ విధ్యంసమును యేసు సూచిస్తున్నాడు. ఇది ఇప్పటికే జరిగింది.

మార్కు 13:3-6: 3-8 వచనాలు “యుగసమాప్తికి సంబంధించిన సూచనలను” లేదా అంతం సమీపిస్తోందనే సూచనలను ఇస్తున్నాయి. యేసు ఒలీవల కొండపై కూర్చొని కిద్రోను లోయ గుండా దేవాలయము వైపు చూస్తున్నాడు. ఆయన తన నలుగురు శిష్యులతో ఉన్నాడు: పేతురు, యాకోబు, యోహను మరియు ఆంద్రెయ (v. 3). అంత్య కాలానికి ముందు వచ్చే సూచనల గురించి వారు ఏకాంతంగా అయనను అడిగారు (వ. 4).  ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి అని మొదట జాగ్రత్తగా యేసు ప్రతిస్పందించాడు (వ. 5). అనేకులు నా పేరట వచ్చినేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరని యేసు చెప్పాడు (వ. 6). ఇందులో అబద్ధపు మెస్సీయాలు మరియు అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు (మత్తయి 7:15; అపొస్తలుల కార్యములు 20:28-31).

మార్కు 13:7-8: యేసు ఇంకా అనేక సూచనలతో కొనసాగించాడు: మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు విను నప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.  (వ. 7-8a). అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకుప్రారంభము. (v. 8b).

మార్కు 13: 9-13: హింసానుభవములు కూడా కలుగుతాయి, కాబట్టి యేసు అనుచరులు జాగ్రత్తగా ఉండాలి (వ. 9). యేసు అనుచరులు బంధించబడి హింసింపబడతారు, కానీ వారు అన్ని దేశాలకు ఆయన సాక్షులుగా ఉండాలి (వ. 10). ఆయన అనుచరులు ఏమి చెప్పుదమా అని చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మయే వారి పక్షముగా మాట్లాడుతాడు (వ. 11). కుటుంబాలు ఒకటితో ఒకటి పోరాడుతాయి మరియు మరణం వరకు కూడా ఒకటితో ఒకటి ద్రోహం చేసుకుంటాయి (వ. 12). ప్రతి ఒక్కరూ యేసు అనుచరులను ద్వేషిస్తారు, " అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును." (వ. 13). ఇది 1వ దశ మరియు ప్రారంభం అని ఒక వ్యాఖ్యాత చెప్పారు. ఇశ్రాయేలుతో ఏడేళ్ల శాంతి ఒప్పందం చేసుకునే పది యూరోపియన్ దేశాల నాయకుడు ఒకడు ఉంటాడు.

మార్కు 13:14-20: 2వ దశ, ఇది మూడున్నర సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది, ఇది 14-23 వచనాలలో వివరించబడింది. " నాశకరమైన హేయవస్తువు" "మహా శ్రమ" అని కూడా సూచించబడుతుంది (డేనియల్ 9:27). క్రీస్తు విరోధి శాంతి ఒప్పందాన్ని స్థాపించే వ్యక్తిగా ఉంటాడు మరియు మూడున్నర సంవత్సరాల తర్వాత, అతను ఒప్పందాన్ని ఉల్లంఘించి యెరూషలేముకు వెళ్తాడు. అక్కడ, యెరూషలేములో పునర్నిర్మించబడిన దేవాలయంలో క్రీస్తు విరోధి ("అన్యాయపు మనిషి") తన స్వంత ప్రతిమను ఏర్పాటు చేస్తాడు (2 థెస్సలొనీకయులు 2:3-4). అతను తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటూ దేవుని పరిశుద్ధ స్థలములో కూర్చుంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి, గమనిస్తూ ఉండాలి! క్రీస్తు విరోధి యొక్క ఇతర పేర్లు: "రాబోయే రాజు," డేనియల్ 9:26; “మృగం” లేదా “మొదటి మృగం,” ప్రకటన 13:1; మరియు “తెల్ల గుర్రం” మీద “గుర్రపు రౌతు”, ప్రకటన 6:2.

మూడున్నర సంవత్సరాల వ్యవధిలో, మీరు మరియు సంఘము సిద్ధంగా ఉండటం మంచిది. మీరు ఎక్కడికి వెళ్లాలి? మార్కు 13:14 “యూదయలో ఉన్నవారు పర్వతాలకు పారిపోవాలి” అని చెబుతోంది. 15-16 వచనాలు మీ వస్తువులను తీసుకోవడానికి ప్రయత్నించకుండా పారిపోవాలని అర్థం. గర్భిణులు, మరియు పాలిచ్చు వారు పారిపోయినప్పుడు శారీరకంగా కష్టపడతారు (వ. 17). క్రీస్తు విరోధి శీతాకాలంలో రాకూడదని ప్రార్థించమని యేసు తన శిష్యులను ఆదేశించాడు కాబట్టి ఆయన అనుచరులు వాతావరణంలో కష్టపడరు (వ. 18).

ఇది ప్రారంభమైనప్పుడు, నరకం అంతా విరుచుకుపడుతుంది: “అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.” (వ. 19-20).

మార్కు 13:21-23: 3వదశ లో, ఎక్కువ మంది అబద్ధపు మెస్సీయాలు మరియు అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. విశ్వాసులు ఏమి చేయాలో 23వ వచనం నొక్కి చెబుతోంది: “మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.”

మార్కు 13:24-27: శ్రమకాలము తర్వాత, “చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును.  అప్పుడు మనుష్యకుమారుడు.” (వ. 24-25). మనుష్యకుమారుడు (క్రీస్తు) మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అపొస్తలుల కార్యములు 1:11లో, యేసు తన ఆరోహణములో ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే తాను తిరిగి వస్తానని వారితో చెప్పాడు. భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును.

మార్కు 13:33-37: “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.” (వ. 33).

ముగింపు

యేసు తిరిగి వస్తున్నాడని నేను ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా నమ్మలేదు! అంత్య కాలానికి మనం చాలా దగ్గరవుతున్నాం. ఈ ముక్కలన్నీ వాటి స్థానములో పడిపోతూనే ఉంటాయి. మెస్సీయ రాకడ కొరకు సంఘము సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన తిరిగి వస్తున్నాడు. మనం జాగ్తత్తగా ఉండాలి!

ప్రశ్నలు

  1. మార్కు 13లో, యుగాంతంలో ఏమి జరుగుతుందో యేసు వివరిస్తున్నాడు. మనం అంత్యకాలంలో జీవిస్తున్నామని మీరు నమ్ముతున్నారా? ఎందుకు లేదా ఎందుకు కాదు? మీ సమాధానాన్ని బలపరచడానికి గ్రంథాన్ని ఉపయోగించండి.

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Mark 13:23

“And you must watch! I have told you everything in advance.”

యేసు తన శిష్యులను అంత్య కాలానికి సిద్ధం చేశాడు. ఈ అధ్యాయంలో, ఆయన అదే సందేశంతో ఏడుసార్లు వారిని ప్రోత్సహించాడు: జాగ్రత్తగా ఉండండి, ఆందోళన చెందకండి, అప్రమత్తంగా ఉండండి, మెలకువగా ఉండండి. శిష్యులు తెలుసుకోవాలని మరియు ముగింపు సూచనల కోసం చూడాలని అతను కోరుకున్నాడు, కాని వారు భయపడకూడదని అతను కోరుకున్నాడు. యేసు వారిని సిద్ధం చేసి, వారు ముందుగానే తెలుసుకోవలసినవన్నీ చెప్పాడు.

శిష్యులు అంత్య కాలానికి సిద్ధమైనట్లే, మీరు కూడా క్రీస్తు అనుచరులుగా ఉన్నారు. మీరు మీ రోజును గడుపుతున్నప్పుడు, ఈ శాశ్వతమైన, ఆశాజనకమైన దృక్పథంతో మీరు ముగింపు సంకేతాల కోసం మరియు జీవితాన్ని గడుపుతున్నారా? భూకంపాలు, యుద్ధాలు, హింసలు లేదా అబద్ధ ప్రవక్తలు ఏమి జరిగినా, మీరు భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీకు రక్షణ యొక్క నిరీక్షణ ఉంది. విశ్వాసంతో నడుచుకోండి, మీ రోజులను గుర్తించడానికి జ్ఞానం కోసం ప్రభువును అడగండి. నేడు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు లేదా సంఘటనలతో సంబంధం లేకుండా యేసును విశ్వసించండి. ఏమి జరుగుతుందో యేసు మిమ్మల్ని సిద్ధం చేసాడు, కాబట్టి భయపడవద్దు. ప్రభువు నీతో ఉన్నాడు!

“ మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.”

మార్కు 13:23

తదుపరి లేఖన భాగములు

  • లూకా 12:35-36 — “ మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.”
  • 1 కొరింథీయులు 16:13-14 — “ మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి."
  • ప్రకటన 16:15 — “ ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.”