The Parable of the Vineyard
యేసును ఇలా కనుగొనండి: Servant Mark 12 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఈ రోజు మరొక ఉపమానాన్ని అధ్యయనం చేయడానికి మార్కు సువార్త 12వ అధ్యాయము మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఒక ఉపమానం ఆత్మీయ పాఠాన్ని బోధించడానికి రోజువారీ వస్తువును ఉపయోగిస్తుంది.
పాఠము
మార్కు 12:1: ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచె వేయించి, “ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి”, (వ. 1). యజమాని కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను. ద్రాక్షతోట, కంచె, తొట్టి, గోపురము మరియు కథలోని వ్యక్తులు ఉపమానానికి వస్తువులు. పరిశీలించే స్థంభము, ఆశ్రయము మరియు వస్తువులను నిల్వ ఉంచేదిగా గోపురము ఉంది.
మాక్ఆర్థర్ ఇలా వివరించాడు, "యజమాని నమ్మకముగా చూచుకొనే వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నాడు, వారు వచ్చిన డబ్బులో కొంత శాతాన్ని అతనికి అద్దెగా చెల్లించాలి."1 మిగిలిన డబ్బు కౌలు రైతులకు చేరింది. ద్రాక్షతోట యొక్క చిత్రం ఈ ప్రాంతంలో చాలా సాధారణం. మాక్ఆర్థర్ ఇలా అంటాడు, "పాలస్తీనాలోని కొండ ప్రాంతాలు ద్రాక్ష ద్రాక్షతోటలతో కప్పబడి ఉన్నాయి, ఇవి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక."2 ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముక బాగా ఉన్నప్పుడు, దేశమంతా బాగుంటుంది. వెన్నెముక విరిగితే దేశమంతా బాధపడుతుంది. ద్రాక్షతోట ఇశ్రాయేలుకు మంచి మరియు చెడు రెండింటికి చిహ్నంగా ఉపయోగించబడింది (కీర్తన 80:8-16; యిర్మీయా 2:21). ఇశ్రాయేలు (ద్రాక్షతోట) మరియు దేవుడు (యజమాని) గురించిన ఈ ఉపమానానికి యేసు యెషయా 5:1-2,7 వచనములను ఆధారంగా ఉపయోగించాడు.
మార్కు 12:2-5: ఒక దాసుడు ద్రాక్షతోటలోని పండ్లలో కొంత భాగాన్ని సేకరించడానికి వచ్చాడు, కానీ వారు అతనితో అన్యాయంగా ప్రవర్తించి మరియు ఏమీ ఇవ్వకుండానే పంపించివేశారు (వ. 2-3). అప్పుడు, యజమాని రెండవ దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. (వ. 4). యజమాని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులనుపంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. (v. 5). వైర్స్బే ఇలా అంటాడు, “పండు ఉపయోగించని మూడు సంవత్సరాలను మార్కు 12:2-5లో వ్రాశాడు, అనగా నాల్గవ సంవత్సరంలో ప్రియమైన కుమారుడు పంపబడ్డాడు.”3 కాబట్టి ఈ దాసులు దేవుని సందేశమును ప్రకటించడానికి పంపబడిన ప్రవక్తలను సూచిస్తారు. మరియు వారు నిరంతరం రాబోయే మెస్సీయ వైపే చూపారు. ఈ ఉపమానంలో, కౌలు రైతులతో మాట్లాడటానికి దేవుడు ప్రజలను పంపుతున్నాడు (ఈ ఉపమానంలో వీరు యూదా మత నాయకులను సూచిస్తారు). పదే పదే, మత పెద్దలు ప్రవక్తల సందేశాన్ని వినడానికి నిరాకరించారు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం "ఈ కథ ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్న అపారమైన సహనాన్ని వివరిస్తుంది" అని పేర్కొంది.4
మార్కు 12:6-8: యజమాని (దేవుడు) పంపడానికి మరొక వ్యక్తిని కలిగి ఉన్నాడు––అతని కుమారుడు (వ. 6). కౌలు రైతులు కొడుకును వారసుడిగా గుర్తించి, అతని వారసత్వాన్ని పొందేందుకు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు (వ. 7). మాక్ఆర్థర్ "ద్రాక్షతోటలు చేసేవారు అత్యాశతో ఉన్నారు" మరియు "పంటనంతటిని మరియు ద్రాక్షతోటను తమ కొరకు కోరుకున్నారు."5 కౌలుదారులు తమ కోసం ప్రతిదీ కోరుకున్నారు, కాబట్టి వారు కుమారుని చంపి "ద్రాక్షతోట నుండి బయటకు" (వ. 8) విసిరేశారు. యేసు కూడా ద్వారాల వెలుపల ఉంచబడ్డాడు (హెబ్రీయులు 13:12-13). మార్కులో మూడుసార్లు, యేసు తన స్వంత మరణం, సమాధి మరియు పునరుత్థానాన్ని ఊహించాడు. ఈ ఉపమానంలో, అది ఇప్పటికే జరుగుతోందని యేసు చూపించాడు. నాల్గవ సంవత్సరం "పండ్లను ప్రభువుకు అంకితం చేసే సంవత్సరం (లేవీయకాండము 19:24)."6 ఇది ప్రభువుకు సమర్పించబడిన అర్పణగా కుమారుని రాకడను మరింత ముఖ్యమైనదిగా చేస్తుంది.
మార్కు 12:9-11: “కాబట్టి, ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు?” (వ. 9). ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇస్తాడు. క్రీ.శ.70లో రోమ్ సామ్రాజ్యము దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు రైతుల విధ్వంసం జరిగింది. ద్రాక్షతోటను ఇతరులకు ఇవ్వడమనేది "క్రీస్తు సంఘము మరియు దాని ఎక్కువగా అన్యజనులైన నాయకుల స్థాపనలో” నెరవేరుతోందని మాక్ఆర్థర్ వివరించాడు,7 (కీర్తన 118:22-23).
మార్కు 12:12: యేసు ద్రాక్షతోట గురించి ఒక ఉపమానం చెప్పాడు, ఈసారి మత పెద్దలు ఆ ఉపమానాన్ని అర్థం చేసుకున్నారు.
ద్రాక్షతోట యూదులను సూచిస్తుంది. దేవుడు ద్రాక్షతోటను మనకు కాకుండా యూదులకే ఎందుకు ఇచ్చాడు? జాన్ పైపర్ "దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలుగా యూదులకు అన్యుజనులకన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వబడినది" (ఆదికాండము 12:1-3; నిర్గమకాండము 19:6; ద్వితీయోపదేశకాండము 14:2; నెహెమ్యా 9:7; ఆమోసు 3:2). రెండవది, పైపర్ "దేవుని ప్రత్యేకమైన ప్రత్యక్ష్యత - పాత నిబంధన గ్రంథాల సంరక్షకులుగా అన్యుల కంటే యూదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది" (రోమా 3:1-2; 9:4).
మూడవదిగా, పైపర్ ఇలా పేర్కొన్నాడు, "యూదులకు అన్యజనుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, అందులో మెస్సీయాయైన యేసు, స్వయంగా యూదుడై యూదుల వద్దకు యూదుడిగా మొదటిగా వస్తాడు " (మత్తయి 10:5-6; 15:24; రోమా 1:3; 9:5 ) నాల్గవది, పైపర్ "రక్షణ యూదుల నుండి వచ్చే విషయములో అన్యుల కంటే యూదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది" (యోహాను 4:22).8
యోహాను 1:11-12 ఇలా చెబుతోంది: “ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తిరస్కరణ కారణంగా (మార్కు 12:9), దేవుడు కాపులను నాశనం చేసి ఇతరులకు ద్రాక్షతోటను ఇస్తాడు. రోమా 11:11-12 ఇతరులు ఎవరో వివరిస్తుంది-అన్యజనులు. రోమా 11:25 దీనిని క్లుప్తంగా వివరిస్తుంది: " సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరు చున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను."
ముగింపు
వీటన్నింటిలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రవక్తలను మరియు ఆయన కుమారుని తిరస్కరించినప్పటికీ, దేవుడు అన్యులను కలిగి ఉన్న ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు - మనం!
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషింగ్, 2005), p. 1240.
మాక్ఆర్థర్, పే. 1240.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ(కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 1989), p. 151.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), p. 1230.
మాక్ఆర్థర్, పే. 1240.
వీయర్స బీ, p. 151.
మాక్ఆర్థర్, పే. 1240.
జాన్ పైపర్, “మొదట యూదులకు, అలాగే గ్రీకులకు”; ఆన్లైన్లో https://www.desiringgod.org/messages/to-the-jew-first-and-also-to-the-greekలో అందుబాటులో ఉంది.
ప్రశ్నలు
-
యేసు ద్రాక్షతోట గురించి యూదావారితో మాట్లాడాడు, ఎందుకంటే పాత నిబంధనలో ద్రాక్షతోట దేనికి సంబంధించిన చిత్రంగా ఉపయోగించబడిందని వారికి తెలుసు? (యెషయా 5:1-7)
దినవాక్యం
Laura Martin Mark 12:42-43
“And a poor widow came and dropped in two tiny coins worth very little. Summoning His disciples, He said to them, ‘I assure you: This poor widow has put in more than all those giving to the temple treasury.’”
యేసు మరియు ఆయన శిష్యులు ఆలయ కానుక పెట్టె వద్ద ఉన్నారు. ఆరాధకులు తమ స్వేచ్చార్పణలను సమర్పించడానికి ఉపయోగించే పదమూడు బూర ఆకారపు పెట్టెల్లోకి వ్యక్తులు తమ డబ్బును వేయడాన్ని యేసు చూశాడు. ధనవంతులు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం యేసు చూశాడు, అలాగే ఒక వితంతువు రెండు చిన్న నాణేలను చిన్న మొత్తంలో అర్పించడం కూడా చూశాడు. కానీ ప్రజలు కానుక పెట్టెలో డబ్బు పెట్టడం కంటే యేసు ఎక్కువగా దానిని చూశాడు, వారు ఇచ్చేటప్పుడు వారి హృదయాలను చూశాడు. వితంతువు ఇచ్చిన మొత్తం భౌతికంగా, ఆత్మీయముగా చాలా తక్కువ అయినప్పటికీ, ఆమె హృదయం యొక్క బహుమతి ఇతరులందరి కంటే గొప్పది.
తమ దేవుడైన ప్రభువును తమ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మరియు పూర్ణ శక్తితో ప్రేమించాలనేది గొప్ప ఆజ్ఞ అని యేసు గతంలో శిష్యులతో పంచుకున్నాడు. విధవరాలు తన దేవుడైన యెహోవా ప్రేమను కార్యరూపం దాల్చింది. మీరు మీ డబ్బు, సమయం లేదా ప్రతిభను ప్రభువుకు ఇచ్చినప్పుడు, మీకు ఉన్నదంతా యేసును ప్రేమించే స్థలం నుండి ఇవ్వండి. ఇది బాధ్యత లేదా చట్టం కాబట్టి అయన మిమ్మల్ని ఇవ్వమని పిలవడు. అయినప్పటికి, ఆయన పట్ల మీకున్న ప్రేమ కారణంగా మీరు ఇవ్వాలనుకుంటున్నారు. మీరు యేసును ప్రేమిస్తున్నందున, మీరు ఇతరులను కూడా ప్రేమిస్తారు. అందువల్ల, మీరు ఉన్నదంతా మరియు మీకు ఉన్నదంతా ఇవ్వడం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు, మీ హృదయాన్ని పరిశీలన చేసుకొనండి. మీరు యేసును ప్రేమించే హృదయం నుండి ఇస్తున్నారా లేదా అది మీ క్రైస్తవ కర్తవ్యంగా భావిస్తున్నారా?
“ ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచికానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.”
మార్కు 12:42-43
తదుపరి లేఖన భాగములు
- మత్తయి 6:21 — “ నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.”
- 2 కొరింథీయులు 8:1-3 — “సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము. ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వక ముగా మమ్మును వేడుకొనుచు,.
- 2 కొరింథీయులు 9:7 — “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.