The Priestly Ministry Inaugurated
యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 8-9 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
లేవియకాండము అనేది ఒక స్పష్టమైన, ఆచరణాత్మక గ్రంధము, ఇది ఇశ్రాయేలీయులకు దేవునితో ప్రతిదినము ఎలా పని చేయాలో చూపించింది. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడంలో సహాయం చేసిన బెసలేలు మరియు అహోలీయాబును గుర్తున్నారా? దేవునితో సంభాషణ చేయడానికి ఇశ్రాయేలీయులకు ప్రత్యక్ష గుడరాన్ని ఎలా ఉపయోగించాలో చెబుతున్నాడు. లేవీయకాండము 8 మరియు 9 అధ్యాయములు అహరోను మరియు అతని కుమారుల నియామకం గురించి వివరించుచున్నది.
పాఠము
లేవీయకాండము 8:1–5: సభాసమాజం అంతా అబిషేకానికి సమకూరారు. యాజకులు రోజు విడిచి రోజు నమ్మకంగా సేవ చేయబోతున్నారు కాబట్టి, ప్రభువు వారిని నియమించబోతున్నాడు. వారి పాత్ర యెహోవాను సేవించడమే కాకుండా ఇశ్రాయేలీయులకు కూడా సేవ చేయడం.
లేవీయకాండము 8:6-9: అహరోను మరియు అతని కుమారులకు నీళ్లతో స్నానము చేయించబడ్డారు. పరిశుద్దమైన వస్త్రాములతో అహరోను ధరించబడెను: దట్టీనీ, నిలువుటంగీని, ఏఫోదు, నడికట్టును, ఊరీము మరియు తుమ్మీము, మరియు తలపాగాను పెట్టి బంగారు రేకును కట్టెను. ఈ వస్తువులు ఆహరోను యొక్క యూనిఫారాన్ని సమకూర్చాయి. ఆదికాండము కొరకు మన పదము సంతానము, నిర్గమకాండమునకు విమోచకుడు మరియు లేవీయకాండమునకు ప్రాయశ్చిత్తము. మెస్సీయా వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అయితే ప్రస్తుతానికి యాజకులు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు.
లేవీయకాండము 8:10-36: అహరోనును మరియు ప్రత్యేక్ష గుడారమును అభిషేకించిబడినవి. అహరోను కుమారులు వస్త్రములను ధరించి వివిధ బలులు అర్పించారు. వారు సిద్ధమైన తరువాత! అభిషేకం జరిగింది. యాజకులు శుద్దిచేయబడ్డారు. అభిషేకించబడిన పొట్టేలును తినవలెను. యాజకులు అభిషేకించబడిన తర్వాత, ఏడు రోజుల పాటు ఎక్కడికీ వెళ్లవద్దని చెప్పారు.
లేవీయకాండము 9:1-3: ఏడు రోజుల నియమావళి తర్వాత ఎనిమిదవ రోజున, మోషే నాలుగు ప్రధాన అర్పణలను అర్పించాడు. మొదటి రెండు అర్పణలు కోడెదూడ (పాపపరిహారార్థ బలిగా) మరియు పొట్టేలు (దహనబలిగా). ఇశ్రాయేలీయులందరి పక్షముగా అహరోను స్వరం వినిపించడం ఇదే మొదటిసారి. ఒక మగ మేక (పాపపరిహారార్థ బలి), కోడేదూడను మరియు పొట్టేలు (దహనబలి) కూడా బలి ఇవ్వబడాలి.
లేవీయకాండము 9:4: రెండవ రకమైన అర్పణలో రెండు వేర్వేరు అర్పణలు ఉన్నాయి: కోడెను మరియు పొట్టేలు (సహవాస అర్పణ) మరియు నూనెతో కలిపిన ధాన్యాలు (ధాన్యార్పణ). ప్రత్యక్ష గుడారం పూర్తి అయ్యేంతవరకు అది వ్యాపారం కోసం తెరవబడలేదని జ్ఞాపకము చేసుకోండి! ఇది ప్రారంభించబడడానికి అతను మొదటి నాలుగు అర్పణలను నిర్వహించబోతున్నాడు. పాపానికి ప్రాయశ్చిత్తం మరియు దేవునితో సమాధానం కలిగియుండటం మధ్య సమతుల్యత ఉంది.
బంగారపు దూడను సృష్టించడం ద్వారా నిర్గమకాండము 32:1–4లో అహరోను గందరగోళం సృష్టించాడు. ఆదికాండము నుండి, ఏర్పరచబడిన వారందరు తప్పులు చేయడాన్ని మనం చూశాము. దేవుడు సరిపోని వ్యక్తులను ఉపయోగిస్తాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు నాలుగు నైవేద్యాలను అర్పించి దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాడు. రెండు అర్పణలు పాప ప్రాయశ్చిత్తానికి మరియు రెండు అర్పణలు దేవునితో సహవాసం కలిగి ఉండటానికి. బంగారు దూడను తయారు చేసిన పాపానికి అహారోనుకు దేవుడు విధించిన శిక్ష గుర్తుందా? ఇకపై ఇశ్రాయేలీయులతో అతడు వెళ్లబోడని దేవుడు మోషేతో చెప్పాడు. మరియు ఆ ప్రత్యక్ష గుడారములోనికి ప్రభువు సన్నిధిని చేరడానికి ఎవరు వచ్చారో చూడండి – అహారోను! దేవుడు విమోచించే దేవుడు!
మనము అపరాధము యొక్క స్థానములో జీవించలేము, మనము సమాధానముతోను, సహవాసముతోను దేవునితో నడుచుకొనవలెను అది ప్రాయశ్చిత్తము చూసుకుంటుంది. మీ గతంలోని "బంగారు దూడలను" వదిలేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యేసు సిద్దముగా ఉన్నాడు! మరి మనము ఉన్నామా?
లేవీయకాండము 9:5-7: సమాజమంతయు వచ్చి ప్రభువు సన్నిధిని నిలిచెను. మోషే నాలుగు అర్పణలను అమలు చేయడం ప్రారంభించాడు. మనము ఇశ్రాయేలీయులలోని వివిధ వ్యక్తుల సమూహాల గురించి మాట్లాడినప్పుడు జ్ఞాపకము చేసుకోండి: యాజకులు, సమాజము, నాయకులు మరియు సాధారణ ప్రజల గురించి మనం మాట్లాడినప్పుడు గుర్తుందా? అహరోను ముందుగా తన కోసం నైవేద్యాన్ని అర్పించి, తర్వాత ప్రజల కోసం బలి అర్పించాలి. కాబట్టి మనం వేరొకరితో పరిచర్య చేయాలంటే ప్రభువుతో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి.
లేవీయకాండము 9: 8-11: అహరోను కొరకు పాపపరిహారార్థ బలి జరగాలి. వారు నిర్మించినవన్నీ, చివరకు దాని ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించబడుతున్నాయని చూడడానికి కొంత ఆసక్తితోనిండిన సంతృప్తి ఉండాలి. ప్రభువు ఆజ్ఞాపించినట్లు ఇది జరిగింది. అహరోను పాళెము వెలుపల మాంసమును అగ్నితో కాల్చివేసెను. యేసు గవిని వెలుపట బలి ఇవ్వబడ్డాడు (హెబ్రీయులు 13:11-13). అహారోనుకు రెండవ అవకాశం ఇవ్వబడింది మరియు యేసు, మరొక అవకాశం మనకు కూడా ఇచ్చాడు!
లేవీయకాండము 9:12-16: దహనబలి జరిగింది. ఎందుకు? దహనబలి రోజువారీ అర్పణ మరియు అది పాళెము వెలుపలకు వెళ్ళలేదు. పాపపరిహారార్థ బలి మాత్రమే పాళెము వెలుపలికి వెళ్ళవలసి వచ్చింది. లేవీయకాండము 16:5 మేకను పాపపరిహారార్థబలిగా అర్పించే ప్రాయశ్చిత్త దినాన్ని వివరిస్తుంది. లేవీయకాండము 9లో ఇక్కడ జరుగుతున్నది ప్రాయశ్చిత్త దినమును సూచిస్తుంది.
లేవీయకాండము 9:17-21: ధాన్యార్పణ జరిగింది. మీరు ఎప్పుడునూ వేడుక స్థితిలో ఉండలేరు, అలాగే మీరు ఎల్లప్పుడూ పశ్చాత్తాప స్థితిలోను ఉండలేరు. సమపాళ్ళలో ఉండాలి. అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించాడు, ఇది అహరోను పనిలో మొదటి రోజు.
లేవీయకాండము 9:22: అహరోను ప్రజలను దీవించడం ఇదే మొదటిసారి. అహరోనుకు ఇది ఎవరు నేర్పించారు? అది ఆయన అభిషేకించబడినందున చేయగలిగాడు. దేవుని యొక్క ఆత్మ అతని అడుగులను మరియు అతని చేతులను నిర్దేశించుచున్నది. అహరోను తన చేతులు ప్రజలను ఆశీర్వదించడానికి ఎత్తాడు. సంఖ్యాకాండము 6:24-26 ఇది అహరోనుకు దీవెనగా సూచించబడింది.
లేవీయకాండము 9:23: అహరోను మొత్తం ప్రక్రియ ద్వారా వెళ్ళాడు, ఇప్పుడు అహరోను మరియు మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళారు. తర్వాత వారిద్దరూ బయటకు వచ్చి ప్రజలను మళ్లీ ఆశీర్వదించారు. ప్రభువు మహిమ ప్రజలందరికీ కనిపించింది! మరియు మోషే కూడా దేవుని మహిమను అనుభవించాడు:
- నిర్గమకాండము 3 – మండుచున్న పొద
- నిర్గమకాండము 24 – మేఘం
- నిర్గమకాండము 33 – సీనాయి పర్వతం యొద్ద బండ
- నిర్గమకాండము 40 – ప్రత్యక్ష గుడారం నిండిపోయింది
- నిర్గమకాండము 40 – ప్రజలను మేఘ స్తంభము మరియు అగ్ని స్తంభము నడిపించాయి
1 రాజులు 8లో, ఆలయం దేవుని మహిమతో నిండిపోయింది. ప్రజలు తన మహిమను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను 1:14లో, వాక్యము శరీరముగా మారింది మరియు మేము అతని మహిమను అనుభవించాము! క్రీస్తుతో మనకున్న సంబంధం ద్వారా మనం ఆయన మహిమను అనుభవించగలుగుతాం. మత్తయి 24:29-30 ఆయన మహిమతో తిరిగి వస్తున్నాడని చెబుతోంది! “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచును" లేవీయకాండము 9లో " ఇక్కడ వలె ప్రజలందరికి యెహోవా మహిమ కనిపించినప్పుడు". ఇది రాబోయే మెస్సయ యొక్క చిత్రము!
లేవీయకాండము 9:24: ప్రభువు సన్నిది నుండి అగ్ని వచ్చెను. ప్రజలందరు దానిని చూశారు! బలిపీఠం (7.5’ x 4.5’) అగ్నితో నిండిపోయింది! నాకు కావలసింది ఇదే. నేను ఆయన మహిమను మరియు ఆయన అగ్నిని అనుభవించాలనుకుంటున్నాను! మీరు యేసుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, మీరు దీన్ని అనుభవించవచ్చు! ఆయన మనకు పరిశుద్ధాత్మతోను మరియు అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు.
పాత నిబంధనలో అనేక సార్లు, మనం అగ్నిలో దేవుణ్ణి చూస్తాము: ద్వితీయోపదేశకాండములో మనం దేవునిని దహించే అగ్నిగా చూస్తాము; 18వ కీర్తనలో మనం అగ్ని రూపాలను చూస్తాము; యెహెజ్కేలు 1:4 లో దేవుడు ముందుకు వెనుకకు మెరుస్తున్న ఒక గొప్ప అగ్ని మేఘము వంటివాడు; మరియు మలాకీ 3:2లో, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. నేను మత్తయి 24:29-30లో వచ్చే అగ్ని గురించి నేను ఆలోచిస్తున్నాను. క్రీస్తు తిరిగిరాబోవుచున్నాడు. మహిమ మరియు అగ్ని దిగిరాబోవుచున్నాయి మీరు సిద్ధంగా ఉన్నారా? అహరోను అర్పణల పాఠం ద్వారా మీరు సిద్ధపడగలరని నేను నమ్ముతున్నాను: పాపపరిహారార్థబలి, దహనబలి, నెవేద్య బలి మరియు సహవాసబలి. క్రీస్తు ప్రాయశ్చిత్తం మరియు అతనితో సహవాసం ద్వారా, మనం సిద్ధంగా ఉండవచ్చు.
ముగింపు
మహిమ మరియు అగ్నిని అనుభవించడానికి మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది మీరు చేసినప్పుడు, మీరు మునుపెన్నడూ అనుభవించనంతగా ఆయనను అనుభవిస్తారు. అహరోను మరియు మోషే నడిచిన దాని కారణంగా, ఇశ్రాయేలీయులందరూ ప్రభువు మహిమను అనుభవించారు.
ప్రశ్నలు
-
మోషే ప్రతిష్ట దినమున ఎవరికి అభిషేకం చేస్తున్నారు? ఈ ప్రతిష్టదినము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు ప్రతిదీ ఈ విధంగా ఆదేశించబడింది? (లేవీయకాండము 8:34)
దినవాక్యం
Laura Martin Leviticus 9:23b-24
“When they came out, they blessed the people, and the glory of the LORD appeared to all the people. Fire came from the LORD and consumed the burnt offering and the fat portions on the altar. And when all the people saw it, they shouted and fell facedown on the ground.”
దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమయ్యేలా చేయమని మోషే, అహరోను మరియు అహరోను కుమారులకు యెహోవా ఆజ్ఞాపించినట్లే వారు చేసారు! ప్రతిష్టదినము యొక్క ఏడు రోజుల ప్రక్రియ వివరంగా మరియు పాలుపొందేదిగా ఉన్నది, అయినప్పటికీ, వారు ప్రతి వివరానికి కట్టుబడి ఉన్నారు. ఎనిమిదవ రోజున, ప్రభువు తన మాటను ఘనపరిచాడు, మరియు దేవుని మహిమ అగ్నివలే దిగి వచ్చినందున ప్రజలందరూ సాగిలపడి పడి కేకలు వేయడానికి కారణమైంది! వారు వినయముతోను మరియు సంతోషముతోను యెహోవాను ఆరాధించారు.
యేసుక్రీస్తు తన మరణం, సమాధి మరియు పునరుత్థానం ద్వారా ప్రభువు మీ కోసం తన మహిమను ప్రదర్శించాడు. మీరు విధేయత మరియు ఆనందంతో యెహోవాకు ఆరాధనలో సాగిలపడటం ఎప్పటికీ ఆపకూడదు! మీరు యెహోవాను ఆరాధించేటప్పుడు, ఆయన రూపాంతర మహిమను అనుభవిస్తారు!
వారు వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను. యెహోవా సన్నిధినుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠము మీద నున్న దహనబలిద్రవ్యమును క్రొవ్వును కాల్చి వేసెను; ప్రజలందరు దానిని చూచి ఉత్సాహధ్వనిచేసి సాగిలపడిరి.
- లేవియకాండము 9:23b-24
తదుపరి లేఖనభాగములు
లేవియకాండము 9:6 – “మోషే మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞా పించినది ఇదే; అట్లు చేయుడి. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను.”
మత్తయి 17:5-6 – “అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడెను.”
రోమా 6:4 – “కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.