Unauthorized Offering
యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 10 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
లేవియకాండము మెస్సీయాను సూచిస్తుంది. మీరు ఎక్కడ చూసినా, మన ఒక పదము, ప్రాయశ్చిత్తం అని కనిపిస్తుంది. లేవీయకాండము 9, అహరోను అర్పణలను అర్పించిన మొదటి రోజు పనిని వివరించినట్లు జ్ఞాపకముంచుకొనుడి: పాపపరిహారార్థబలి మరియు దహనబలి తన కొరకు మరియు తరువాత సహవాస అర్పణ మరియు ధాన్యార్పణ ఇశ్రాయేలీయుల కొరకు జరిగింది. ఆ తర్వాత, అహరోను ప్రజలను ఆశీర్వదించాడు, ఆపై అతను మరియు మోషే మళ్లీ ప్రజలను ఆశీర్వదించారు. అప్పుడు దేవుని యొక్క అగ్ని మరియు మహిమ దిగివచ్చెను. ఇద్దరూ మెస్సీయా యొక్క రాకడను సూచించారు.
నిర్గమకాండము 28:4లో, యాజకులకు ప్రత్యేక వస్త్రాలు తయారు చేయబడ్డాయి. లేవీయకాండము 8లో, అహరోను మరియు అతని కుమారులు ప్రభువు యొక్క పనిని చేయడానికి ప్రతిష్ఠించబడి నియమించబడ్డారు. ఇంకా లేవీయకాండము 10లో, ఈ ప్రత్యేక అభిషేకం ఉన్నప్పటికీ, అగ్ని దిగిరావటాన్ని చూసినప్పటికీ, అహరోను కుమారులు తమ స్వంత పనిని చేయడానికి నిర్ణయించుకున్నారు.
పాఠము
లేవీయకాండము 10:1: నాదాబు మరియు అబీహు అనధికార/విచిత్రమైన అగ్నిని ప్రభువుకు సమర్పించారు, అది చేయమని ఆయన వారిని ఆజ్ఞాపించలేదు. ప్రత్యక్ష గుడారమంతా ఒక పెద్ద ఆజ్ఞ. ఈ యాజకులు ఇప్పటికే అన్ని ఆజ్ఞలను పాటించడంలో అలసిపోయారా?
లేవీయకాండము 10:2: " యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి." వెంటనే, ఒక ఉదాహరణ ఏర్పాటు చేయబడింది: మీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోతే, మీరు కూడా అంతే. ఈ పరిస్థితిలో ఈ ఇద్దరు వ్యక్తులు ఎలా తప్పు చేశారో అని వైర్స్బే వివరించాడు.1 మొదటిది, వారు ఈ అర్పణ చేయడానికి సరి అయిన వ్యక్తులు కాదు. ప్రధాన యాజకుడైన, వారి తండ్రి అహరోను మాత్రమే ఈ అర్పణ చేయగలడు (నిర్గమకాండము 30:7-10). రెండవది, వారు తప్పుడు ఉపకరణములు ఉపయోగించారు, అవి వారి స్వంత ఉపకరణములు (నిర్గమకాండము 40:9). మూడవది, అది సరి అయిన సమయం కాదు. అది ప్రాయశ్చిత్త దినమున మాత్రమే అర్పించబడాలి (లేవీయకాండము 16:11). నాల్గవది, వారు తప్పుడు అధికారంతో వచ్చారు. వారు దేవుని అధికారంతో కాక వారి స్వంత అధికారంతో వచ్చారు. ఐదవది, వారు తప్పుడు అగ్నిని తీసుకువచ్చారు. బలిపీఠం నుండే అగ్ని రావాలి, అది ఆకాశం నుండి అగ్ని క్రిందకు దిగివచ్చినప్పుడు వెలిగించబడింది (లేవీయకాండము 16:12). ఆరవది, వారికి తప్పుడు ఉద్దేశ్యం ఉంది; వారు తమ స్వంత మహిమను పొందేందుకు ప్రయత్నించారు (లేవీయకాండము 10:3). ఏడవది, వారు తప్పుడు శక్తితో బల్ల యొద్దకు వచ్చారు. వారు పూర్తిగా మత్తులై ఉండడానికి పూర్తి అవకాశం ఉంది (లేవీయకాండము 10:9).
లేవీయకాండము 10:3: “నాయొద్ద నుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచుకొందును;” అని మోషే చెప్పినప్పుడు, “యెహోవా ఉద్దేశ్యం ఇదే” అని అహరోను మౌనంగా ఉన్నాడు. బహుశా అతని మౌనం ఆశ్చర్యపోడం వలన జరిగిందేమో? అహరోను (మరియు యాజకులందరికి) నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. యాకోబు 3:1 ఇలా హెచ్చరిస్తోంది: “నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.” ఈ రోజు కృప ఉంది, కానీ భోధకులు మరింత జవాబుదారీగా ఉంటారు. 1 కొరింథీయులు 10:12లోని హెచ్చరికను మనం తీసుకోవాలి: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” మనం అహంకారంతో నడిచినప్పుడు పాపం లోపలికి ప్రవేశించవచ్చు మరియు అది పతనానికి దారి తీస్తుంది. హెబ్రీయులు 12:28–29 ఇలా సలహా ఇస్తోంది, “కృపను కలిగియుందుము. . . (అప్పుడు) మనం దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము.”
లేవీయకాండము 10:4–5: మోషే మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధస్థలము నెదుట నుండి పాళెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోవుడని వారితో చెప్పెను! చనిపోయిన మనుష్యులు దగ్గరి కుటుంబ సభ్యులు మోయకూడదు ఎందుకంటే వారు అపవిత్రులవుతారు (లేవీయకాండము 21:1-2).
గుర్తుచేయులాగున, మోషేగాని లేదా అహరోను గాని పరిపూర్ణులు కాదు; ఇద్దరు తప్పిదములు చేశారు. అహారోను బంగారు దూడను చేశాడు (నిర్గమకాండము 32), కానీ ఇప్పుడు అతను ప్రధాన యాజకుడు. మోషే సంఖ్యకాండము 20లో తప్పిదము చేశాడు గనుక వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడలేదు. 1 సమూయేలు 6:19 లో, యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. దేవుడు ప్రజలను హతము చేసినప్పుడు మరియు చేయనప్పుడు ఎలా ప్రజలను ఎంచుకుంటాడో అర్థం చేసుకోవడం కష్టం. ఆ 70 మంది ఎందుకు? నాదాబు మరియు అబీహును ఎందుకు హతము చేయాలి? మోషే వాగ్దాన దేశంలోకి ఎందుకు వెళ్లలేకపోయాడు, అయితే అహరోను ఇంకా ప్రధాన యాజకుడిగా ఉండగలడా?
లేవీయకాండము 10:6-7: అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, కుమారులు/సోదరుల గురించి దుఃఖించవద్దని చెప్పాడు. అయితే వారి మృతి పట్ల సమాజం విచారం వ్యక్తం చేసింది. బదులుగా, అహరోను మరియు అతని కుమారులు ఇశ్రాయేలీయుల ఇంటికి సేవ చేస్తారు. యెహోవా అభిషేక తైలం వారిపై ఉన్నందున వారు సన్నిధి గుడారం నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడలేదు. వారికి చేయవలసిన పని ఉంది.
మీ కుటుంబం కంటే మీ జీవితంపై దేవుని యొక్క పిలుపు చాలా పెద్దది. లూకా 9:59-60లో, కుటుంబం మరియు దేవుని రాజ్యం గురించి అనుచరుడికి యేసు కఠినమైన సందేశాన్ని అందజేయడాన్ని మనం చూస్తాము. యేసు తన శిష్యులతో తనను వెంబడించడానికి అన్నింటినీ విడిచిపెట్టమని చెప్పాడు. కొన్నిసార్లు మన దేశములో, ప్రభువు మనల్ని ఏమి చేయమని పిలుస్తున్నాడో మనం వక్రీకరించే స్థాయికి మన కుటుంబాన్ని పెంచుతాము. దేవుడు ఎల్లప్పుడూ ఒక పెద్ద చిత్రాన్ని మనస్సులో ఉంచుకుంటాడని గుర్తుంచుకోవడం ముఖ్యం.
లేవీయకాండము 10:8-11: అహరోను మరియు అతని కుమారులు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించినప్పుడు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు లేదా వారు చనిపోతారని దేవుడు చెప్పాడు. ఇది అహరోను కుటుంబానికి శాశ్వతమైన శాసనం. అహరోను (మరియు యాజకులందరు) పవిత్రమైన మరియు సాధారణమైన, శుభ్రమైన మరియు అపవిత్రమైన వాటి మధ్య తేడాను గుర్తించాలి. అహరోను ప్రజలకు యెహోవా యొక్క శాసనాలను బోధించబోతున్నందున అతనికి స్పష్టమైన మనస్సు ఉండాలి. యాజకులు వివేచన అనే వరాన్ని కలిగి ఉండాలి, "మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించే" సామర్థ్యం ఉండాలి (హెబ్రీయులు 5:13-14). యాజకులు ప్రపంచంలోని ఇతరులకు భిన్నంగా ఉన్నారు. వారు పవిత్రతతో పనిచేశారు.
లేవీయకాండము 10:12-15: అహరోను మరియు అతని మిగిలిన కుమారులు, ఎలియాజరు మరియు ఈతామారు, యెహోవాకు అర్పణలతో ముందుకు సాగారు. వారు ధాన్యార్పణలు మరియు అలంకార అర్పణలు నిర్వహించారు.
లేవీయకాండము 10:16-18: అహరోను మరియు అతని కుమారులు పాపపరిహారార్థ బలిని తినలేదని మోషే గ్రహించినప్పుడు, బదులుగా దానిని కాల్చడానికి అనుమతించినప్పుడు, అతను వారిపై అగ్రహాపడెను. యెహోవా సన్నిదిలో పాపపరిహారం తినాలనే సూచనలను ఎందుకు పాటించలేదో తెలుసుకోవాలనుకున్నాడు.
లేవీయకాండము 10:19–20: అహరోను మోషే యొక్క ఆరోపణకు ప్రతిస్పందించెను (వ. 19) ఇలా అడిగాడు, “నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన యెడల అది యెహోవా దృష్టికి మంచిదగునా? అనెను.” కానిస్టేబుల్ ఇలా చెప్పాడు అహరోను మంచి మనస్సాక్షితో నైవేద్యాన్ని తినలేదని చెప్పాడు, మరియు అతను దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నించడం లేదు, బదులుగా ఉపవాసం చేయాలి అనుకున్నాడు.2 అహరోను తన హృదయాన్ని చూస్తూ దేవునిపై దృష్టి పెట్టాడు.
ముగింపు
దేవుడు మన విధేయతను కోరుకుంటున్నాడు, మన త్యాగం మాత్రమే కాదు. మీరు మీ జీవితంలో దేవుని పిలుపు నుండి బయటికి వెళ్లినప్పుడు, ఆయన పిలుపు యొక్క తీవ్రతను అర్థం చేసుకుంటాడు. మీరు ఆయన యొక్క పిలుపు నుండి బయటకువెళ్లినప్పుడు. మీ హృదయం మరియు మీ ఉద్దేశ్యం ప్రభువును సేవించడమే అయితే, ఆయన కృపను తప్పనిసరిగా మీమీద విస్తరింపజేస్తాడు.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), p. 264.
థామస్ కానిస్టేబుల్, డాక్టర్. కానిస్టేబుల్ ఎక్స్పోజిటరీ (అధ్యయనం) గమనికలు: లెవిటికస్, పే. 84; ఆన్లైన్లో https://planobiblechapel.org/tcon/notes/pdf/leviticus.pdf లో అందుబాటులో ఉంది.
ప్రశ్నలు
-
లేవీయకాండము 10:1–3లో అహరోను ఇద్దరు కుమారులు చేసిన అనధికార అర్పణ ఏమిటి? వారు అనధికారికంగా బలి ఇవ్వాలనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? అహరోను కుటుంబంలో (యాజకుల) భయం ఉందని మీరు అనుకుంటున్నారా?
దినవాక్యం
Laura Martin Leviticus 10:1-2
“Aaron’s sons Nadab and Abihu each took his own firepan, put fire in it, placed incense on it, and presented unauthorized fire before the LORD, which He had not commanded them to do. Then fire came from the LORD and burned them to death before the LORD.”
దేవుని మహిమ యొక్క అద్భుతమైన ప్రదర్శన మధ్యలో కూడా, యాజకులైన అహరోను ఇద్దరు కుమారులు ప్రభువు ఆజ్ఞలకు విరుద్ధంగా వెళ్లి, ఆయన ముందు అనధికార అగ్నిని సమర్పించారు. ప్రభువు వారికి తక్షణమే తీర్పు ఇచ్చాడు మరియు వారిని కాల్చి చంపాడు.
క్రీస్తు యొక్క రాజులైన యాజక సమూహముగా, ప్రభువు పని మధ్యలో కూడా, మీరు దేవుని ముందు "అనధికారిక అగ్ని" ఉంచడానికి శోదించబడవచ్చు. మీరు వ్యసనాలతో నిండిన స్వార్థపూరిత, గర్వం లేదా అన్యదేవతరాధనలో జీవించడానికి శోదించబడవచ్చు.
జ్ఞాపకముచేసుకోండి, క్రీస్తు యొక్క ఏర్పరచబడిన జనాంగముగా, మీరు చీకటిలోనుండి, పాపములోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. మీ స్వంత పనిని చేయాలనే శోధనను నిరోధించండి. ఈ రోజు, మీరు బలంగా నిలబడటానికి ప్రభువు నుండి శక్తిని పొందండి.
“అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.”
లేవియకాండము 10:1-2
తదుపరి లేఖనభాగములు
- రోమా 6:22-23- “అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.”
- యాకోబు 1:13-15- “దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.”
- 1 పేతురు 2:9-10- “అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.