Clean and Unclean Animals
యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 11-12 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
లేవీయకాండము 8లో, అహరోను మరియు అతని కుమారులు ప్రతిష్టించబడి వారి పిలుపును పొందుకున్నారు. లేవీయకాండము 9లో, వారి మొదటి రోజు, వారు నాలుగు అర్పణలు చేశారు. అహరోను ప్రజలను ఆశీర్వదించాడు, ఆపై మోషే మరియు అహరోను ఇద్దరూ ప్రత్యక్ష గుడారం వద్ద నిలబడి ప్రజలను ఆశీర్వదించారు. లేవీయకాండము 10 వరకు, నాదాబు మరియు అబీహు తమ స్వంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకునే వరకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. ఈ ఇద్దరు యాజకులను కోల్పోయినందుకు ఇశ్రాయేలియులు సంతాపం వ్యక్తం చేశారు. అహరోను ఉపవాసంతో దుఃఖించాడు, కానీ అతనికి ఇంకా ఒక పని ఉంది. లేవీయకాండము 10:8-9లో వివరించినట్లుగా, యాజకునిగా అహరోను పాత్ర వేరుగా ఉంచబడింది. యాజకులు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించినప్పుడు ద్రాక్షారసం లేదా మద్యం తాగకూడదు. వారు పవిత్రమైన మరియు సాధారణమైన, పరిశుభ్రమైన మరియు అపవిత్రమైన వాటి మధ్య తేడాను గుర్తించాలి. వారు ప్రజలకు దేవుని శాసనాలను బోధించాలి. లేవీయకాండము 11లో, ఇశ్రాయేలీయులతో పంచుకోవడానికి దేవుడు మోషే మరియు అహరోనులకు ఆహార నియమాలను ఇచ్చాడు.
పాఠము
లేవీయకాండము 11:1-8: దేవుడు భూమిమీదనున్న జీవుల గురించి ఆహార మార్గదర్శకాలను వెల్లడించాడు. " జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చు (వ. 3). నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. ద్వితీయోపదేశకాండము 14:4–5 వారు తినగలిగే జంతువుల సానుకూల జాబితాను అందించారు ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేక పిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే.
వారు మాంసాన్ని తినలేరు లేదా అపవిత్రమైన జంతువు యొక్క కళేబరముల ముట్టుకొనకూడదు. పవిత్రమైన మాంసము దేవునికి ఆమోదయోగ్యమైనది; హేయమైనవి దేవునికి అంగీకారయోగ్యం కాదు. లేవీయకాండములో "అపవిత్రత" అనే పదం 32 సార్లు ప్రస్తావించబడింది. ఏది పవిత్రమైనవి మరియు అపవిత్రమైనది అని నిర్ణయించే పనిని యాజకులకు ఇవ్వబడింది, కాబట్టి వారు మత్తులు లేకుండా ప్రత్యక్ష గుడారానికి రావాలి. వారు స్పష్టమైన మనస్సు, స్పష్టమైన మనస్సాక్షి కలిగి ఉండాలి మరియు దేవుని ఆత్మ పని చేయడానికి అనుమతించాలి.
ఇశ్రాయేలియులు ఏమి తినాలి, అది ఎందుకు ముఖ్యమైనది? జాన్ మెక్ఆర్థర్ ఇలా అన్నాడు, " కారణాలు ఉన్న దాని గురించి అవగాహనా లేకున్నా ఇశ్రాయేలీయులు దేవుని సంపూర్ణ ప్రమాణానికి లోబడి ఉండాలి."1 దేవుడు వారిని తినమని లేదా తినకూడదని ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవడం లేదా గుర్తించడం వారికి ఇష్టం లేదు. అలాగే, మనం కేవలం విధేయులైయుండాలి. విశ్వాసం ద్వారా నడవడం అంటే అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నించడం కాదు, విధేయత చూపడం. ఇశ్రాయేలు యొక్క ఆహారం ప్రత్యేకమైనది, తద్వారా ఇశ్రాయేలియులు ఇతర దేశాలతో వారి అబద్ద విగ్రహాలతో రాజీపడరు.2 ఇతర మతాలు జంతువులను తమ మతపరమైన సేవలలో చేర్చుకున్నాయి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి పాత పద్ధతుల నుండి వేరుగా ఉంచుతున్నాడు. అతను ఎన్నుకున్న ప్రజలను తప్పుదారి పట్టించే మరియు ఇతర దేశాల తప్పుడు విగ్రహాల వైపుకు దారితీసే దేనినైనా అతను తొలగించాడు.
నెల్సన్ యొక్క వ్యాఖ్యానం యూదులు మరియు ముస్లింలు పంది మాంసం తినడానికి ఎందుకు అనుమతించబడలేదని వివరిస్తుంది.3 మొదటిది, పంది మాంసం తరచుగా తక్కువగా వండేవారు; సరిగా వండని పంది మాంసం మానవులకు వ్యాధిని వ్యాపింపజేస్తుంది. రెండవది, పందులను తరచుగా ఇతర దేవతలకు లేదా అన్యమత దేవతలకు బలి ఇస్తారు. శోధించబడడం పాపం కాదు, కానీ సాతాను ఇశ్రాయేలీయులను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ అపవిత్రమైన జంతువుకు అవిధేయులైతే, వారు తప్పుడు విగ్రహాలలో పాలుపంచుకోవచ్చని వైర్స్బే చెప్పారు.4 పందిని తినడం మరణానికి దారితీయవచ్చు మరియు యెహోవా తన ప్రజలను అది వారి దరిదాపుల్లో ఉండకూడదు అని చెప్పాడు. దానిని రుచి చూడవద్దు అని దేవుడు చెప్పినప్పుడు, ఆయన ఆజ్ఞాపించిన దానికి విధేయతతో విశ్వాసముంచమని వారిని కోరాడు. దేవుడు తన ప్రజలను వేరుగా మరియు విభిన్నంగా చేయడానికి చాలా స్పష్టంగా ప్రయత్నిస్తున్నాడు.
లేవీయకాండము 11:9–12: దేవుడు తర్వాత పరిశుభ్రమైన మరియు అపరిశుభ్రమైన జలచరాలను గుర్తించాడు. ఇశ్రాయేలీయులు నీటిలోని రెక్కలు మరియు పొలుసులు ఉన్నవన్నీ తినవచ్చు, ఎందుకంటే వాటిని శుభ్రంగా భావించేవారు. కానీ రెక్కలు మరియు పొలుసులు లేనివి ఏవైనా సముద్రాలలో లేదా ప్రవాహాలలో ఏదైనా అపరిశుభ్రంగా పరిగణించబడుతుంది మరియు తినకూడదు (పీతలు, ఆల్చిప్పలు, రొయ్యలు, ఎండ్రకాయలు మరియు మలుగు చేప వంటివి).
లేవీయకాండము 11:13-19: దేవుడు అపరిశుభ్రమైన పక్షులను గుర్తించాడు: “మీరు ఈ పక్షులను అసహ్యించుకోవాలి. అవి అసహ్యకరమైనవి కాబట్టి వాటిని తినకూడదు.” అసహ్యకరమైనది అపవిత్రత కంటే అధ్వాన్నమైన దానిని సూచిస్తుంది. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, మరియు గబ్బిలము. అపరిశుభ్రమైనవి కాబట్టి నిషేధించబడింది.
లేవీయకాండము 11:20-23: దేవుడు పవిత్రమైన మరియు అపవిత్రమైన ఎగిరే కీటకాలను కూడా గుర్తించాడు. రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చలించు చరము లన్నియు మీకు హేయములు. అయితే నాలుగుకాళ్లతో చలించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును. ఇశ్రాయేలీయులు నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినడానికి అనుమతించబడింది.
లేవీయకాండము 11:24-40: చనిపోయిన జంతువుల కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును మరియు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. (24-25) 26వ వచనంలో, రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. వాక్యభాగాములో సంసోను దీనికి ఒక ఉదాహరణ. అతను నాజీరు చేయబడినవాడు, అంటే అతను దేవుని కోసం ప్రత్యేకంగా ఎన్నుకోబడినవాడు -ఈ జాబితాలు అతనికి తెలుసు. న్యాయాధిపతులు 14:5–9 సంసోను సింహాన్ని చంపాడు; ఈ సమయంలో తప్పు లేదు. కానీ, కొంత సమయం తరువాత, అతను తిరిగి వచ్చి సింహం కళేబరం నుండి కొంచెం తేనె తీసుకున్నాడు. దాన్ని తిని తల్లిదండ్రులకు ఇచ్చాడు. అది అపవిత్రమని అతనికి తెలుసు. ఇది అతని మరణానికి దారితీసి ఉంటుందా?
నేలపై గుంపులుగా తిరిగే జంతువులు అపరిశుభ్రంగా ఉంటాయి, కాబట్టి చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, తొండ, మరియు ఊసరవెల్లి అపవిత్రమైనవి మరియు నిషేధించబడ్డాయి. దేవుడు అపరిశుభ్రత విషయంలో గంభీరంగా ఉన్నాడు. ఈ అపవిత్రమైన జంతువులలో ఒకదానిని తాకితే వారి మంటి పాత్రలు పగలగొట్టమని వారికి ఆజ్ఞాపించెను (వ. 33). వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. (వ. 35).
లేవీయకాండము 11:41–46: నేలమీద ప్రాకే జీవరాసులు (వ. 41) అలాగే కడుపుతో నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో నాలుగుకాళ్లతో చలించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు అని దేవుడు చెప్పాడు.
ఈ ఆంక్షలు ఏమిటంటే, ఇశ్రాయేలియులు పవిత్రముగా ఉండాలని మరియు అపవిత్రమైన జనాంగముగా కాకుండా పవిత్రమైన జనాంగముగా పనిచేయాలని; వారు ఒక సాధారణ దేశంగా కాకుండా పవిత్ర దేశంగా పనిచేయాలి దేవుడు కోరుకున్నాడు. ఈ ఆహార నియమావళి వలన దేవుడు ఇశ్రాయేలియులు ఎన్నుకోబడిన దేశం అనే తేడాను చూపాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వారు పవిత్రులుగా ఉండాలి. తరచుగా, మనం విషయాలు ఇలా ఉండాలని కోరుకుంటున్నాము అని ప్రభువు వద్దకు వస్తాము, కానీ దేవుడు ఇలా అంటాడు, “లేదు, ఇది ఇలాగే ఉంటుంది.”
ముగింపు
దేవుడు ఇశ్రాయేలీయులను పవిత్రంగా ఉండాలని పిలిచాడు మరియు లేవీయకాండము 11లో జాబితా చేయబడిన ఆహార మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా, ఇశ్రాయేలు ప్రత్యేకించబడింది. ఈ జాబితా భారం కాకూడదు, ఇది ఒక ప్రత్యేక హక్కుగా ఉద్దేశించబడింది. 1 పేతురు 1:13-16లో, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండమని పిలువబడ్డాము.
ఈ బోధన కోసం, ఇశ్రాయేలియులు, యూదు ప్రజలు మరియు రాబోయే మెస్సయాలోని సంస్కృతిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లేవియకాండము కోసం మా ఒక పదం ప్రాయశ్చిత్తం, రక్తం మనకు ఎలా ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఆరోపణ మనది అని భావించిన అపరాధాన్ని మరొకరిపై మోపుతుంది. ఇదంతా మెస్సీయాను సూచించింది.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005), p. 148
మాక్ఆర్థర్, పే. 148.
ర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds. నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 1999), పేజి. 168.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), p. 266.
ప్రశ్నలు
-
“పవిత్రత” మరియు “అపవిత్రత” నిర్వచించండి. ఇశ్రాయేలు పవిత్రముగా మరియు పరిశుద్దముగా ఉండాలనే దేవుని కోరికను అర్థం చేసుకోవడానికి లేవీయకాండము 11-12 మీకు ఎలా సహాయం చేస్తుంది? (లేవీయకాండము 11:44–45)
దినవాక్యం
Laura Martin Leviticus 11:44-45
“For I am Yahweh your God, so you must consecrate yourselves and be holy because I am holy. You must not defile yourselves by any swarming creature that crawls on the ground. For I am Yahweh, who brought you up from the land of Egypt to be your God, so you must be holy because I am holy.”
దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇశ్రాయేలీయులను పరిశుద్దముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులకు, నిర్దిష్టమైన ఆహారాన్ని తినాలి అని అర్థం. దేవుడు తన ప్రజలను ప్రత్యేకముగా ఉంచాలని కోరుకున్నాడు మరియు ఈ నిర్దిష్టమైన వాటిని తినడం విధేయత మరియు పరిశుద్ధ మార్గాన్ని అనుసరించటం యొక్క బాహ్య చర్య.
క్రీస్తు అనుచరులుగా, మీరు ఎన్నుకోబడ్డారు, మరియు మీరు పరిశుద్ధులు. మీరు పాపంనుండి మరియు లోకము నుండి వేరుగా ఉండటమే కాదు, దేవుని ఉద్దేశాల కోసం కూడా ప్రత్యేకపరచబడి ఉండుటకు కూడా పిలువబడ్డారు. మీరు తినే లేదా తినని వాటిపై దృష్టి పెట్టే బదులు, కరుణ, దయ, వినయం, సౌమ్యత మరియు సహనాన్ని ధరించడానికి ఎంచుకున్నారు. నేడు, మీరు ఏమి చేసినా, దేవుని మహిమ కొరకు ప్రతిదీ చేయండి.
“నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు. నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.”
లేవియకాండము 11:44-45
తదుపరి లేఖనభాగములు
- ద్వితీయోపదేశకాండము 7:6- “నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.”
- కొలస్సీ 3:12- “కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి..”
- 1 కొరింథీ 10:31- “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.