The Pentateuch Leviticus

Skin Diseases

యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 13 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 59వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

నిన్నటి దినమున, పవిత్రమైన మరియు అపవిత్రమైన భూ జంతువులు, జలరాసులు, ప్రాకుపురుగులు, కీటకాలు మరియు పక్షుల జాబితాను చూసాము. దేవుడు తన ప్రజలను ప్రత్యేక పరచడానికి పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులను ఉపయోగించాడు; ఇది దేవుని పరిశుద్దమైన జనాంగము. నేడు, మనము మరొక జాబితాను తెలుసుకోనబోవుచున్నాము: రోగములు. లేవీయకాండము 10లో, యెహోవా అహరోనుతో మాట్లాడి, యాజకులు మద్యం సేవించరాదని చెప్పారని జ్ఞాపకము చేసుకోనుడి, ఎందుకంటే వారు పరిశుద్ధమైన మరియు సాధారణమైన, పవిత్రమైన మరియు అపవిత్రమైన వాటి మధ్య తేడాను గుర్తించాలి.

పాఠము

లేవీయకాండము 13:1: దేవుడు మోషే మరియు అహరోనులతో వివిధ చర్మ వ్యాధుల గురించి మాట్లాడాడు మరియు ప్రతి పరిస్థితిని ఎలా పరిశీలించాలనే దాని గురించి యాజకులకు నిర్దిష్ట సూచనలు ఇవ్వబడ్డాయి. యాజకులు వ్యక్తులపై మరియు వారి బట్టలలో ఏది పవిత్రముగా మరియు అపవిత్రముగా ఉందో పరిశీలించి, నిర్ణయించే బాధ్యతను కలిగి ఉన్నారు.

లేవీయకాండము 13:2–8: చర్మానికి సంబంధించిన వివిధ రకాల వ్యాధులను పరీక్షించడానికి దేవుడు తమకు ఐదు నియమ పరీక్షలను ఇచ్చాడని కానిస్టేబుల్ ఎత్తి చూపాడు.1 మొదటి పరీక్ష దద్దుర్లు కోసం. అతని శరీరంపై వాపు, కుష్టము లేదా మచ్చ కలిగిన వారు ఎవరైనా యజకులచే పరీక్షించబడాలి, ఆ వ్యక్తి పవిత్రముగా ఉన్నారా లేదా అపవిత్రముగా ఉన్నారా అని చివరికి నిర్ణయిస్తారు.

లేవీయకాండము 13:9–17: ఈ వచనాలు చర్మ వ్యాధికి సంబంధించిన రెండవ పరీక్షలను తెలియ చేస్తాయి. వ్యక్తి చర్మంపై తెల్లటి వాపు, తెల్ల వెంట్రుకలు లేదా వాపులో పచ్చి మాంసం యొక్క మచ్చలు ఉన్నట్లయితే, యాజకుడు అతన్ని అపరిశుభ్రంగా ప్రకటిస్తాడు (వ. 10-11). మరియు పచ్చి మాంసం తెల్లగా మారినప్పుడు, యాజకుడు అతన్ని పవిత్రమని ప్రకటించవచ్చు (వ. 17).

లేవీయకాండము 13:18-23: ఈవచనాలలో చర్మంపై కురుపుల కోసం మూడవ పరీక్షలను తెలియ చేస్తాయి మరియు యాజకుడు వ్యక్తిని అపవిత్రంగా లేదా పవిత్రమైన వారని పేర్కొన్న పరిస్థితులను వివరిస్తాయి.

లేవీయకాండము 13:24-28: ఈ వచనాలు ఒక వ్యక్తి యొక్క శరీరంపై కాలిన గాయాలను పరిశీలించడానికి నాల్గవ పరీక్ష తెలియ చేస్తాయి. కాలిన గాయాలను పరిశీలించిన తరువాత, యాజకుడు అ వ్యక్తి అపవిత్రుడు అని ప్రకటిస్తాడు. కాలిన గాయం నయం అయినప్పుడు, యాజకుడు ఆ వ్యక్తిని మళ్లీ పవిత్రునిగా ప్రకటిస్తాడు.

లేవియకాండము 13:29-37: ఈ వచనాలు అంటువ్యాధులను పరిశీలించడానికి ఐదవ పరీక్ష తెలియ చేస్తాయి. ప్రభావిత చుసిన తర్వాత, యాజకుడు అ వ్యక్తి పవిత్రుడా లేదా అపవిత్రుడా అని నిర్ణయిస్తారు.

లేవీయకాండము 13:38–44: యాజకులు దద్దుర్లు లేదా బట్టతల/ వెంట్రుకలు రాలి ఉన్న వ్యక్తులను పరీక్షించి, వారు పవిత్రుడా లేదా అపవిత్రుడా అని నిర్ధారిస్తారు.

లేవీయకాండము 13:45–46: ఎవరైనా అపవిత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి బట్టలు చింపివేయబడాలి, వారి తల విరబోసుకోనవలెను, తన పైపెదవిని (వారి పై పెదవి లేదా మీసం) కప్పుకొని “అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.” వారు మృత్యువాత పడుతున్నందుకు ఇది సంతాపానికి సంకేతం. చర్మవ్యాధి లేదా కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గర ఉండేందుకు ఎవరూ ఇష్టపడరు. ఈ సమయంలో ఆ వ్యక్తిని పాళెము వెలుపలికి తీసుకెళ్లాలి, పాళెం వెలుపల ఉన్న వ్యక్తులు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారని వీర్స్‌బే చెప్పారు.2 పాపం కారణంగా ఒక వ్యక్తి వేరు పరచబడతాడు అనేది అంతిమ విషయం. చాలా మంది వేదాంతులు ఈ సందర్భంలో ఏదో ఒక పాపం యొక్క ఫలితం అని చెబుతారు.

లేవీయకాండము 13:47-59: ఈ వచనాలు యాజకులను వివిధ రకాల వస్త్రములు పవిత్రముగా లేదా అపవిత్రముగా ఉన్నాయా లేదా పరిశీలించడంలో మార్గనిర్దేశం చేశాయి మరియు అపరిశుభ్రమైన బట్టలను కాల్చివేయవలసి ఉంటుందని పేర్కొనబడింది.

ఇశ్రాయేలుకు కుష్టువ్యాధి ఎంత తీవ్రంగా ఉందో మరియు గ్రంథంలో దాని ప్రాముఖ్యతను ఈ జాబితా చూపిస్తుంది. నిర్గమకాండము 4:7లో, మోషే తన చేతిని తన అంగీ లోపల పెట్టినప్పుడు అది కుష్టు వ్యాధితో కప్పబడి ఉంది. అప్పుడు అతను మళ్ళీ తన వస్త్రము లోపల చేయి పెట్టినప్పుడు కుష్టు వ్యాధి నయమైంది. సంఖ్యాకాండము 12:10లో, మిర్యాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కుష్టురోగముతో బాధపడింది. 2 రాజులు 5లో, నయమాను ఒక అద్భుతమైన యోధుడు, అతను కుష్టు వ్యాధితో బాధపడ్డాడు (దీని గురించి మరింత తరువాత పాఠంలో). కాబట్టి, చర్మ వ్యాధుల గురించిన ఈ సమాచారంతో మనం ఏమి చేయాలి?

వీటన్నింటిని ఎలా స్వీకరించాలో మరియు ఇశ్రాయేలియులకు మరియు మన జీవితాలకు ఎలా అన్వయించాలో వైర్స్‌బే వివరించాడు. వైర్స్బే ప్రకారం, వ్యాధి పాపానికి ఒక ఉదాహరణ.3

  • పాపం యొక్క లక్షణాలు చర్మం కంటే లోతుగా ఉంటాయి. లేవీయకాండము 13:3-4లో, యాజకులు అది చర్మం కంటే లోతుగా ఉందో లేదో తెలుసుకోవడానికి రోగమును పరిశీలించారు. యిర్మీయా 17:9 మనల్ని హెచ్చరిస్తోంది: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” రోమా ​​​​7:18లో, పౌలు, నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
  • పాపం వ్యాప్తి చెందుతుందని ఆశించండి. లేవీయకాండము 13:5–7, 34–36, వ్యాపించే వ్యాధి అపవిత్రమని పేర్కొంది; కానీ వ్యాధి వ్యాప్తి చెందనప్పుడు, అవ్యక్తి పవిత్రముగానే ఉన్నాడు. యాకోబు 1:14-15లో ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
  • పాపం చాలా స్పష్టంగా అపవిత్రం చేస్తుంది. లేవీయకాండము 13:44–45 ప్రకారం, యాజకుడు అపవిత్రుడు అని ప్రకటించిన వ్యక్తి “అపవిత్రుదను” అని కేకలు వేయవలసి ఉంటుంది. యెషయా 6:5లో, యెషయా తనను తాను “అపవిత్రమైన పెదవులు గలవాడను” అని ప్రకటించుకున్నాడు, అతను “అపవిత్రమైన పెదవుల మధ్య” నివసించాడు. తరువాత ఆయన ఇలా అన్నాడు, "మేమందరము అపవిత్రులవంటి వారమైతిమి" (యెషయా 64:6). పాపం ఎల్లప్పుడూ అపవిత్రతకు దారితీస్తుంది. 51వ కీర్తనలో, పాపం తన కళ్ళు (వ. 3), మనస్సు (వ. 6), చెవులు మరియు ఎముకలు (వ. 8), గుండె (వ. 10) మరియు నోరు (వ. 13-14) ప్రభావితం చేసిందని దావిదు ఒప్పుకున్నాడు.
  • పాపం మీ అంతరంగంలోకి వెళుతుంది మరియు మీ గురించిన ప్రతిదీ అపవిత్రమైంది. అందుకే దావీదు పవిత్రపరచటం (వ. 2) మరియు శుద్దికోసం (వ. 7) కోసం ప్రార్ధించాడు. మీరు పాపముచే అపవిత్రమైనప్పుడు మీరు శుద్ధి చేయబడాలి.
  • పాపము వేరుచేస్తుంది/ వంటరిని చేస్తుంది. లేవీయకాండము 13:46లో, అపవిత్రుడైన వ్యక్తి పాళెం వెలుపల ఒంటరిగా జీవించాడు. 2 రాజులు 15:5లో, అజర్యా రాజు తీవ్రమైన కుష్టు వ్యాధితో బాధపడ్డాడు మరియు అతను ఒక ప్రత్యేక ఇంటిలో నివసించాడు. మిమ్మల్ని మీరు ఒంటరిగా చేసుకోవడం ప్రారంభించినప్పుడు పాపం మీమ్మును పట్టుకుందని మీకు తెలుస్తుంది.
  • పాపం అగ్నికి మాత్రమే సరిపోతుంది. కలుషితమైన వస్త్రములను అగ్నిలో కాల్చవలసి వచ్చింది (లేవీయకాండము 13:52, 55, 57). మీకు క్రీస్తుతో సంబంధం లేకుంటే మరియు పాపం మీ జీవితాన్ని ఆక్రమించినట్లయితే, అది అగ్నికి దారి తీస్తుందని అని మార్కు 9:44 వెల్లడిస్తుంది. మత్తయి 25:41 శపించబడిన వారు "నిత్యమైన అగ్నిలో" పడవేయబడతారు.

ఈ లక్షణాలన్నీ ఒక పెద్ద సమస్యగా -పాపాన్ని సూచించాయి. ఇశ్రాయేలీయులు నిరంతరం పరీక్షించబడ్డారు మరియు వారి పాపనికి పరిణామాలను ఎదుర్కొన్నారు.

ముగింపు

లూకా 5:12-16లో నమోదు చేయబడిన కథను పరిశీలిద్దాం. ఒక వ్యక్తికి తీవ్రమైన కుష్టువ్యాధి ఉంది-అది శరీరమంతా వ్యాపించింది, కాబట్టి అతను అపవిత్రుడు (వ. 12). ఆ వ్యక్తి తనను శుద్దునిగా చేయమని యేసును వేడుకున్నాడు (వ. 12). అతను అపవిత్రుడైనప్పటికీ, ఆ వ్యక్తి యేసు దగ్గరకు వచ్చాడు. మరియు కుష్టురోగులు సమాజము వెలుపలికి వెళ్లవలసి ఉన్నప్పటికీ, యేసు అతనిని తాకాడు (వ. 13). యేసు చెయ్యిచాపి ఆ మనిషిని సమూలంగా స్వస్థపరిచాడు. వెంటనే అతడు స్వస్థత పొంది శుద్ధి చేయబడ్డాడు (వ. 13). అప్పుడాయన నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. (వ. 14). యేసుని గూర్చిన సమాచారము త్వరగా వ్యాపించాయి మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వస్థత పొందారు (వ. 15).

అపవిత్రుడైన వ్యక్తి క్రీస్తు స్పర్శ ద్వారా పవిత్రుడయ్యాడు. ప్రభువు వైపు తిరగండి. మీరు ఏమి అనుభవిస్తున్నప్పటికీ, పాపం లేదా అనారోగ్యం అయినా, ప్రభువు వైపు తిరగండి. యేసు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. ఆయన మీ గురించి ప్రతి విషయాన్ని నయం చేయాలనుకుంటున్నాడు. మీరు సంపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అది క్రీస్తు రక్తం ద్వారా జరుగుతుంది.

  1. థామస్ కానిస్టేబుల్, డాక్టర్. కానిస్టేబుల్ ఎక్స్‌పోజిటరీ (అధ్యయనం) గమనికలు: లెవిటికస్, పే. 112; ఆన్‌లైన్‌లో https://planobiblechapel.org/tcon/notes/pdf/leviticus.pdfలో అందుబాటులో ఉంది.

  2. వారెన్ W. వైర్స్‌బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), p. 271.

  3. వైర్స్బే, p. 270–271.

ప్రశ్నలు

  1. యాజకులకు సంబంధించిన కొన్ని నిబంధనల గురించి మనం చదివాము. వీటిలో మద్యము లేదా ద్రాక్షరసము తాగకపోవడం, పవిత్రమైన మరియు అపవిత్రమైన, పరిశుభ్రమైన మరియు అపవిత్రమైన వాటి మధ్య తేడాను గుర్తించడం, అలాగే ఇశ్రాయేలీయులకు దేవుని శాసనాలన్నింటినీ బోధించడం వంటివి ఉన్నాయి (లేవీయకాండము 10:9-11). లేవీయకాండము 13లో యాజకుల యొక్క మరొక నియమం/పాత్ర ఏమిటి? (లేవీయకాండము 13:3, 5–6, 10)

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Leviticus 13:46

“He will remain unclean as long as he has the infection; he is unclean. He must live alone in a place outside the camp.”

చర్మ వ్యాదులు మరియు దద్దుర్లు సరదాగా ఉండవు! మీరు ఎప్పుడైనా మీ ముఖంపై మొటిమను కలిగి ఉంటే, అది మిమ్మల్ని ఎంత ఇబ్బందికరంగా మరియు స్వీయ-అవగాహన కలిగిస్తుందో మీకు తెలుసు. ఇశ్రాయేలీయుల జీవితాలను ఊహించడం కష్టం, వారు ప్రతి దద్దుర్లు, పుండ్లు లేదా చర్మపు రోగముతో యాజకులు వద్దకు వెళ్లవలసి ఉంటుంది మరియు వారు పూర్తిగా స్వస్థత పొందే వరకు సంఘం వెలుపల జీవించవలసి వస్తుంది.

యేసు యొక్క ప్రేమ మరియు కృప కారణంగా, మీరు క్రీస్తుకు చెందినవారుగా ఆయన శరీరములోనికి అంగీకరించబడ్డారు. తమ శారీరక వ్యత్యాసాల కారణంగా తమకు చెందినవారు కాదని భావించే బయటి వ్యక్తులను చూడటానికి మీ కళ్ళు తెరవండి. లేదా మీరు ఎవరి స్వంతం కాదని భావించే వ్యక్తి మీరు కావచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఎప్పటికీ దేవుని కుటుంబంలో భాగమే, ఆయన ప్రేమ నుండి ఏదీ మిమ్మల్ని వేరు చేయదు. ఆయన ప్రేమ ఈ రోజు మీపై ప్రకాశించును గాక.

“ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.”

లేవియకాండము 13:46

తదుపరి లేఖనభాగములు

  • కీర్తనలు 139:14- “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.”
  • మత్తయి 5:44-45- “నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.”
  • రోమా 8:38-39- “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.”