The Fellowship Offering
యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 7 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మనము వివిధ రకాల అర్పణలను గురించి అధ్యయనం చేస్తున్నాము: అపరాధ పరిహారార్థబలి, దహనబలి, పాపపరిహారార్థబలి, ధాన్యార్పణ, మరియు సహవాస సమాధాన బలి. మనం నెమ్మదిగా, ఇప్పటివరకు నేర్చుకున్న వాటిని పరిశీలించాలనుకుంటున్నాను.
దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడినప్పుడు, “నా జానాంగము, నా సంపద, నా పరిశుద్ద యాజకత్వం, నా పరిశుద్ద దేశం, నాతో ఈ విధంగా పాలుపంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. వారు తమ పాపములనుండి శుద్ధి చేయబడి, నన్ను ఎక్కువగా అనుభవించగలిగేలా వారు అర్పణలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.” అని చెప్పాడు.
ఇశ్రాయేలీయులీయులలో, యాజకులు, నాయకులు లేదా సాధారణ ప్రజలు క్షమాపణ ఎలా అనుభవించవచ్చో దేవుడు మోషేకు బోధించాడు. అదంతా కేవలము రక్తము ద్వార ప్రాయశ్చిత్తం కలుగును. మరణం ద్వారానే, జీవము ఉంది.
ఈ సమర్పణలలోని ప్రతిదానిలో క్రీస్తు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఇక్కడ ఉంది:
దహన బలి | లేవియకాండము 1 | ప్రాయశ్చిత్తము | క్రీస్తు పాపరహిత స్వభావం |
ధాన్య అర్పణ (లేదా తృణధాన్యాల సమర్పణ) | లేవియకాండము 2 | సమర్పణ మరియు పరిశుద్దత | క్రీస్తు పూర్తిగా తండ్రి యొక్క ఉద్దేశ్యానికి అంకితమైనాడు |
సహవాస అర్పణ (లేదా సమాధాన అర్పణ) | లేవియకాండము 3 | సహవాసము | క్రీస్తు దేవునితో సమాదానమును కలిగి ఉన్నాడు |
పాపపరిహారార్థ అర్పణ | లేవియకాండము 4 | ప్రాయశ్చిత్తము | క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణం |
అపరాధ అర్పణ (లేదా పునరావాస సమర్పణ) | లేవియకాండము 5-6 | పశ్చాత్తాపం | పశ్చాత్తాపం కొరకు క్రీస్తు వెల అంతటిని చెల్లించాడు |
ఈ రోజు మనం సహవాస అర్పణ గురించి చర్చించబోతున్నాము మరియు ఇది మళ్ళి తాజాగా ఉంటుంది. అవును, ఒక బలి ఉంది, కానీ ఒక విందు కూడా ఉంది. మనము నిదానించి చూసినప్పుడు, వీటన్నింటిలో క్రీస్తు ఉన్నట్లు మనము చూస్తాము.
పాఠము
లేవియకాండము 7:1–2: పునరుద్ధరణ అర్పణ (లేదా అపరాధ అర్పణ) అనేది పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన దానిని పునరుద్ధరించడం. ఇది దహనబలి పీఠం వద్ద అర్పిస్తారు.
లేవీయకాండము 7:3-10: అర్పించేవాడు (పాపం చేసిన ఇశ్రాయేలీయుడు) కొవ్వును సమర్పించాడు. యాజకుడు దానిని దహిస్తాడు. పాపపరిహారార్థబలి వంటి నైవేద్య మాంసాన్ని యాజకుడు తినవచ్చు. నిజానికి నైవేద్యం మరియు బలిద్రవ్యము యజకిని దగును. ధాన్య నైవేద్యాలు కూడా యజకులకు చెల్లించబడ్డాయి.
లేవీయకాండము 7:11: విశ్వాసులు దేవునితో శాంతి సమాధాన అర్పణలను జరుపుకొనుటయే సమాధాన బలి/ అర్పణ (లేదా శాంతి సమర్పణ). ఇది సానుకూల సమర్పణ. కొన్నిసార్లు మనం చేసిన పాపంపై దృష్టి పెట్టడం చాలా సులభం, కానీ మన జీవితంలో దేవుడు చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి.
లేవీయకాండము 7:12: సహవాస అర్పణ కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించబడినది! నెల్సన్ ఇలా వ్రాశాడు, " కృతజ్ఞతార్పణ అనేది దేవుని దయపై మానవుడు ఆధారపడటం మరియు సజీవుడైన దేవుని స్తుతి చెల్లించడం."1 మనలో చాలా మంది కష్టాలు మరియు బాధలలో మునిగిపోతారు. మనకు ఈ దృక్పథం ఉంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి, “నేను సజీవంగా ఉన్నాను అని దేవుని స్తుతించండి! నేను ప్రాయశ్చిత్తం పొందాను అని దేవుణ్ణి స్తుతించండి! ”
వారు ఒలీవ నూనెతో కలిపిన పులియని రొట్టెలు, నూనెతో పూసిన పులియని రొట్టెలు లేదా నూనెతో కలిపిన మెత్తటి పిండితో బాగా పిండిచేసిన రొట్టెలు సమర్పించడం ద్వారా సహవాస అర్పణలను జరుపుకున్నారు. నెల్సన్ ఇలా వ్రాశాడు, " కృతజ్ఞతార్పణ త్యాగం అనేది దేవుడు ఎవరు మరియు ఆయన ఏమి చేస్తాడు అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం.”2 ఇతర అర్పణలకంటే ఎక్కువగా సహవాస అర్పణను అందించే వ్యక్తిగా నేను గుర్తించబడాలనుకుంటున్నాను. మోషే ఇలా అన్నాడు, "ప్రభువు చేస్తున్న పనికి మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను."
లేవీయకాండము 7:13: రొట్టె మరియు మాంసాన్ని బలిగా అర్పించాలి. ఇశ్రాయేలీయులు దేవునికి సమధానబలి అర్పించారు మరియు దేవునికి బహిరంగ కృతజ్ఞతబలి అర్పించారు. కృతజ్ఞతలు మాట ద్వారా చెప్పడం మాత్రమే కాక, క్రియలరూపకముగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. యాకోబు బలి అర్పించి తన బంధువులను భోజనానికి ఆహ్వానించాడు (ఆదికాండము 31:54). సహవాస అర్పణలో ఒక త్యాగం మరియు సహవాసముగా భోజనం చేయడం ఉన్నాయి. ఆలయాన్ని ప్రతిష్టించడానికి సొలొమోను 22,000 పశువులు మరియు 1,22,000 గొర్రెలను సహవాస అర్పణగా సమర్పించాడు (1 రాజులు 8:62-63). మొదట మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు, తరువాత సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు.
లేవీయకాండము 7:14-15: దేవుడు అర్పణలు ఇచ్చేదాత అని అంగీకరించడానికి భారీ అర్పణలు (ఊపే అర్పణలు కాదు) ప్రభువు ముందు అర్పించారు. కృతజ్ఞతార్పణలో కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. అక్కడ అవి మిగిలిపోలేదు.
లేవీయకాండము 7:16: కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, “మూడు రకాల (సహవాస అర్పణలు) ఉన్నాయి: 1) ఊహించని ఆశీర్వాదం పొందినప్పుడు కృతజ్ఞత అర్పణలు వ్యక్తం చేయడం. 2) ఆశీర్వాదం కోసం అడిగి, ఇస్తాను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు మంజూరు చేయబడిన ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలియచేయడం. 3) స్వేచ్చా అర్పణలు ఏ నిర్దిష్ట ఆశీర్వాదంతో సంబంధం లేకుండా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం.3 అతను ప్రతిజ్ఞ లేదా స్వేచ్చా నైవేద్యాన్ని సమర్పించినట్లయితే మిగిలిపోయినవి ఒక్కరోజు మాత్రమే మిగిలిపోతాయి. ఇశ్రాయేలీయులకు దేవునితో సమాధానాన్ని కలిగి ఉండటానికి మరియు దానిని జరుపుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. మీరు ప్రభువుతో సమాధానంగా ఉన్నారా? మీరు దానిని పొందగల ఏకైక మార్గం క్రీస్తు ద్వారానే!
కొలొస్సయులు 3:15, “క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి”. మనం సమాధానంగా ఉన్నప్పుడు, అది కృతజ్ఞతకు దారి తీస్తుంది. మీకు క్రీస్తుతో సమాధానం లేకుంటే, మనము తిరిగి ఆయన అదీనంలోనికి ఇవ్వాల్సిన సమయం వచ్చింది.
వాక్యము మనకు ఈ క్రింది వాటిని చెబుతుంది:
రోమా 3:23 - మనమందరం పాపం చేశాము
రోమా 6:23 – పాపానికి జీతం మరణం; సమాధానమే లేదు
క్రీస్తులో లభించే సమాధానాన్ని మనం అనుభవించాలని నేను కోరుకుంటున్నాను! మీ చింత యావత్తును అయన మీద వేయండి ! కాబట్టి చింతకు దారితీసే ఈ విషయాలను మనం ఎలా అధిగమించాలి?
రోమా 5:8 – ఆయన ప్రేమ పాప మరణాన్ని తొలగిస్తుంది.
మీ స్వంతం ప్రయత్నాలు చేయడం ఆపండి! ఆయనే చూసుకుంటాడు! లేవియకాండము గురించి నేను ఇష్టపడేది అదే. ఇది క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది,అది మనకు సమాధానాన్ని ఇస్తుంది. అప్పుడే మీరు సమాధాన అర్పణను అనుభవించగలరు.
ఎఫెసీయులకు 2:8-9 – మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; అది వరమే.
రోమా 10: 9-10 - యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే, మీరు రక్షించబడతారు = జీవితం
ముగింపు
మీరు రోమా 10:9-10ని అనుభవించినప్పుడే, మీరు సహవాస అర్పణను మీ జీవితమును మరియు సమాధానమును అనుభవిస్తారు.
ఎర్ల్ D. రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే, TN: థామస్ నెల్సన్, ఇంక్., 1999), p. 161.
రాడ్మాచర్, p.161.
థామస్ కానిస్టేబుల్, డాక్టర్. కానిస్టేబుల్ ఎక్స్పోజిటరీ (బైబిల్ స్టడీ) నోట్స్ (https://planobiblechapel.org/tcon/notes/pdf/leviticus.pdfలో అందుబాటులో ఉన్నాయి), pp.225-226.
ప్రశ్నలు
-
అపరాధ పరిహరార్ధబలి మరియు పాపపరిహరార్ధబలి మద్య వ్యత్యాసము ఏమిటి? (లేవియకాండము 4; 5:14-19) వీటిలో ఏది అతి పరిశుద్దమైనది? (లేవియకాండము 7:1)
దినవాక్యం
Laura Martin Leviticus 7:28-29
“The LORD spoke to Moses: ‘Tell the Israelites: The one who presents a fellowship sacrifice to the LORD must bring an offering to the LORD from his sacrifice.’”
ఇశ్రాయేలియులుల జనాంగము సమాధాన అర్పణలపై సూచనలను అందుకున్నారు, కొన్నిసార్లు దీనిని సహవాస సమర్పణలుగా సూచిస్తారు. సమాధాన అర్పణ పరిపూర్ణమైన లేదా సంపూర్ణతపై దృష్టి పెట్టింది. ఇశ్రాయేలీయులు బలులు అర్పించినప్పుడు దేవునితో పరిపూర్ణతను అనుభవిస్తారు. దేవునితో సంపూర్ణముగానుండుట మనస్సుకు అనందమును మరియు మనశ్శాంతిని ఇస్తుందని భావించవచ్చు, ఇది దేవుడు మీతో సమాధానముగా ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా వస్తుంది. అలాగే, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. అని పౌలు విశ్వాసులను ఆదేశించాడు.
యేసు మీకు సమాధానమునైయున్నాడు మరియు మీ జీవితానికి సంపూర్ణతను తీసుకువస్తాడు. మీరు ప్రతి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించడం మానేసినప్పుడు మరియు దానికి బదులుగా ప్రతి క్షణాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు ఆయన సమాధానము మీమీదికి వస్తుంది. మీరు దేవునికి అర్పణగా సమర్పించుకోవాల్సిన అవసరం ఉండగా మీరు ఇంకా ఏమి నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు? ఈరోజును మీరు సమర్పణ దినముగా చేసుకోండి, దేవునికి సమాధాన అర్పణగా మిమ్మును మీరు అర్పించుకొనండి!
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఎవడు యెహోవాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించునది యెహోవా సన్నిధికి తేవలెను.
- లేవియకాండము 7:28-29
తదుపరి లేఖనభాగములు
కీర్తనలు 29:11- “యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.”
ఎఫెసీ 2:17-18- “మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.”
ఫిలిప్పీ 4:6-7- “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.