The Guilt Offering & Continual Fire
యేసును ఇలా కనుగొనండి: Atonement Leviticus 6 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
లేవియకాండములో ఇప్పటివరకు మనము చాల అర్పణలను చుశాము, ఇప్పటివరకు మనము చూసినవి:
లేవియకాండము 1- దహనబలులు
లేవియకాండము 2- దాన్యార్పణములు
లేవియకాండము 3- సహవాస అర్పణలు
లేవియకాండము 4- పాపపరిహరార్ధ అర్పణలు (యాజకులు, సమాజము, నాయకులు, సామాన్య ప్రజలు)
లేవియకాండము 5- అపరాధ లేదా అపరాధ పరిహారార్థ అర్పణలు
ఇశ్రాయేలీయులు ఆయనతో ఎలా ఆరాధనలో పాల్గొనాలో చెప్పడానికి దేవుడు ఈ సూచనలను ఇచ్చాడని జ్ఞాపకము చేసుకోనుడి. మీకు క్షమాపణ అవసరమని గుర్తించండి, కేవలము క్రీస్తు త్యాగం ద్వారా మాత్రమే మనము ప్రాయశ్చిత్తమును పొందగలము.
ఈ సందర్భంలో, ఇశ్రాయేలీయులు, చాలా కాలంగా ఐగుప్తులో ఉండి ఇప్పుడు ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నారు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ఇలా చెబుతోంది, " ఇశ్రాయేలీయులు ఎడారి గుండా ప్రయాణించే శరణార్థ దేశం."1 వారు ఎడారిలో ప్రయాణించినందున వారికి ఎటువంటి గృహాలు మరియు నియమాలు లేవు. కాబట్టి దేవుడు వారికి ఈ నిబంధనలను ఇచ్చాడు మరియు వారిని నడిపించడానికి అర్పణలను అవసరం అని కోరాడు. లేవీయకాండము 5వ అధ్యాయము చివరిలో, ఒక వ్యక్తి తన అపరాధం గురించి తెలుసుకున్నప్పుడు లేదా అపరాథి అని అనుమానించబడినప్పుడు అపరాథం/అపరాథ పరిహారార్థ అర్పణ అర్పించడం జరిగింది.
పాఠము
లేవీయకాండము 6:1-4: దేవుడు మోషేకు అపరాధ పరిహారార్ద అర్పణల కొరకు సూచనలను ఇచ్చాడు. జ్ఞాపకము చేసుకోనుడి, ఇది ఈ ఇశ్రాయేలీయుల శరణార్థులకు సంబంధించిన సూచనలు మరియు మోషేకును దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ. మీరు అరణ్య సంభాషణలను ఊహించగలరా? ఇశ్రాయేలీయులు పొరుగువారిని మోసగించి, వారు దేవుడిని బాధపెట్టారు! నేరస్థుడు తాను తప్పు చేశాడని అంగీకరించాలి మరియు పొరుగువారి నుండి దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక మార్గాన్ని ఇచ్చాడు.
లేవీయకాండము 6:5: ఒక ఇశ్రాయేలీయుడు తన పొరుగువాని నుండి మోసగించినా లేదా దొంగిలించినా, అతడు పూర్తిగా దాని విలువకు ఐదవ వంతు కూడా జోడించాల్సి వచ్చింది-తీసుకున్నదానిపై 20 శాతం తిరిగి చెల్లించవలసి ఉంటుంది! అతను తన నేరాన్ని అంగీకరించిన "రోజున" ఇది చేయాలి! ఇది జక్కయ్యకు జరిగింది (లూకా 19:8). తాను అన్యాయముగా లేదా దొంగిలించిన, వారికి నాలుగు రెట్లు తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు! వారు దోషులని గుర్తించినప్పుడు, వారు దొంగిలించిన దానితో పాటు 20 శాతం తిరిగి ఇవ్వాలి. మనందరికీ తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యోసేపు తనకు చెందని వాటిని తీసుకునే అవకాశం వచ్చినప్పుడు ఎలా స్పందించాడో చూద్దాం, ప్రోత్సహించబడుదాం (ఆదికాండము 39:9; 1 యోహాను 4:20).
లేవీయకాండము 6:6–7: పునఃస్థాపన చేసిన తర్వాత, ఇంకా చాలా చేయాల్సి ఉంది. రూకర్ ఇలా వ్రాశాడు, "ఒకరు, తోటి మనిషితో తిరిగి క్షమాపణ పొందిన తర్వాత మాత్రమే దానిని దేవుని సన్నిదిని వెతకవచ్చు (v.6)"2 అమెరికా సంఘము ఈ ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు! మనం మన సోదరుడికి అన్యాయం చేసినప్పుడు మొదట అతని వద్దకు వెళ్లి దాన్ని సరిదిద్దుకోవాలి. ప్రభువుబల్లలో (1 కొరింథీయులు 11:17-34) పాలుపంచుకునేటప్పుడు దీనిని చేయమని మనలను ఆజ్ఞాపించదా?
"మీరు దాని యొక్క విలువను అంచనా వేసిన ప్రకారము" యాజకుడు ప్రాయశ్చిత్తము చేయువానిగా పనిచేశాడు. వారు చేసిన అపరాధానికి తగినట్లుగా వారు ప్రభువుకు అపరాధ పరిహారార్థబలినిగా నిష్కళంకమైన పొట్టేలు తీసుకురావాలి. వారు (1) వస్తువును తిరిగి ఇవ్వాలి, (2) దాని విలువలో ఐదవ వంతు జోడించాలి మరియు (3) ప్రభువుకు తగిన అపరాధ పరిహారాన్ని సమర్పించాలి. పాపం వలన మనకు ఎల్లప్పుడు ఎక్కువ వేల చెల్లించాలి! త్యాగం వలన మాత్రమే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. బలి అర్పించబడిన రక్తం ద్వారా ఇశ్రాయేలీయులు క్షమించబడతారు. దేవునికి స్తోత్రము కలునుగాక! ఆయన వారికి కొంత నమూనాన్ని ఇచ్చాడు.
లేవీయకాండము 6:8–13: లేవీయకాండము 1వ అధ్యాయములో దహనబలి గురించి మనము మాట్లాడాము. అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు! మనం లేవీయకాండములో కొనసాగుతుండగా ఇది ఒక అంశముగా ఉంటుంది. యాజకులు ఈ పనిని చేయడానికి వారు అభిషేకించబడిన మరియు తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదను తీసికొనిపోవలెను. నేను పునర్జీవాన్ని చిత్రించినప్పుడు, అగ్ని మరియు పరిశుద్దాత్మ గూర్చి నేను ఆలోచిస్తాను.
నేను వాక్యభాగాములోని ఈ అగ్ని యొక్క చిత్రము ద్వారా నడవాలనుకుంటున్నాను:
- లేవీయకాండము 9:24: దేవుని సన్నిదిని ఉన్న అసలైన అగ్ని. అది నిత్య ఆరాధనకు ప్రతీకగా ఉండే నిత్య అగ్ని. మన ప్రాయశ్చిత్తం మరియు నిరంతర సహవాసం కోసం క్రీస్తు అవసరమని ఇది సూచిస్తుంది.
- లూకా 3:16: యేసు పరిశుద్ధాత్మతోను మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు. అపరాధమును మరియు పాపాన్ని అగ్ని కాల్చి వేస్తుంది. చాలా సార్లు అమెరికా సంఘము మన జీవితాల్లోని మంటను కాల్చివేయడానికి ఇష్టపడదు. దేవుని అగ్ని మన జీవితాల్లో మండినప్పుడు స్వేచ్ఛ ఉంటుంది.
- రోమా 12:1-2: మీ శరీరాలను సజీవయగాముగా సమర్పించుడి. మీరు అగ్ని బాప్తిస్మమును ఎప్పటికీ అనుమతించకపోతే, మీరు పాపంతో మునిగిపోతారు. అగ్ని యొక్క బాప్తిస్మము మిమ్మల్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పనిచేయడానికి అనుమతినిస్తుంది.
- యిర్మీయా 20:9: మీరు దేవుని సందేశాన్ని ప్రకటించకపోతే, అది మీ హృదయంలో అగ్నిలాగా మారుతుంది, మీ ఎముకలలో మూసివేయబడుతుంది.
- కీర్తన 39:3: నా గుండె నాలో మండుచుండెను.
8-13 వచనాలలో ఐదుసార్లు, “అగ్ని మండుతూనే ఉండాలి; అది బయటకు వెళ్లకూడదు” అని వ్రాయబడివుంది. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ఇలా వివరించింది, "శాశ్వతమైన అగ్ని ప్రాయశ్చిత్తం మరియు దేవునితో సయోధ్య కోసం నిరంతర అవసరాన్ని సూచిస్తుంది, ఇది సమర్పణ యొక్క ఉద్దేశ్యం."3
లేవీయకాండము 6:14–23: ధాన్య అర్పణ (చిరుధాన్యాలు, ఆహార అర్పణ) వివరించబడింది.
లేవీయకాండము 6:24-30: పాపపరిహారార్థ అర్పణ వివరించబడింది.
ముగింపు
మనం ఏదైనా తప్పు చేసిన తరువాత కలిగే అపరాధాన్ని మనం అంగీకరించినప్పుడు, కొన్నిసార్లు శత్రువును లోపలికి ప్రవేశించడానికి అనుమతిస్తాము మరియు అపరాధాన్ని మనలో ఉంచుకుంటాము. కానీ రక్తము మనలను స్వతంత్రులను చేస్తుంది! స్టీవెన్ కోల్ ఇలా వ్రాశాడు, "సాతాను లోపలికి వచ్చి మనపై నేరాన్ని మోపడానికి ఇష్టపడతాడు, ఆపై మనం పడిపోయిన బాధితుడి స్థానంలో ఉంటాము."
ప్రకటన 12:10లో, సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది. జెకర్యా 3:1లో, సాతాను ప్రధాన యాజకుడైన యెహోషువాపై ఆరోపణలు చేశాడు. మనము ఈ అపరాధ స్థితిలో జీవించలేము! యేసు మనలను స్వతంత్రులనుగా చేసాడు! మనం అపరాధాన్ని పట్టుకునేవుంటే, యేసు యొక్క రక్తము సరిపోదని చెబుతున్నాం.
2 కొరింథీయులు 3:17, " ప్రభువే ఆత్మ ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును." మనం ఆత్మలో మరియు అగ్నిలోబాప్తిస్మము పొందడం గురించి మాట్లాడేటప్పుడు, మనం స్వాతంత్ర్యములో నడవడం గురించి మాట్లాడుతున్నాము. లేవీయకాండము 6లోని ఈ అపరాధ బలులు స్వాతంత్ర్యము తెచ్చాయి. కానీ ఇశ్రాయేలీయులు ప్రతిసారీ అపరాధ బలులు అర్పించవలసి వచ్చింది. మనం ఒక్కసారి మాత్రమే చేయాలి.
ఎర్ల్ D. రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే, TN: థామస్ నెల్సన్, ఇంక్., 1999), p. 158.
మార్క్ F. రూకర్, ది న్యూ అమెరికన్ కామెంటరీ సిరీస్: లెవిటికస్ (నాష్విల్లే: బ్రాడ్‌మాన్ & హోల్మాన్ పబ్లిషర్స్, 2000), p. 126.
రాడ్మాచర్, అలెన్ మరియు హౌస్, eds., p.160.
ప్రశ్నలు
-
లేవీయకాండము 6:2 ఒకడు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల, యెహోవాకు విరోధముగా పాపమూ చేయడం. ఎందుకు అందరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు? (కీర్తన 51:4; లూకా 5:21)
దినవాక్యం
Laura Martin Leviticus 6:7
“In this way, the priest will make atonement on his behalf before the LORD, and he will be forgiven for anything he may have done to incur guilt.”
పాపం చేసిన తర్వాత మీరు అనుభవించే అపరాధ భావన మీకు తెలుసా? మీరు దానిని విస్మరించడానికి ప్రయత్నిస్తారు లేదా దానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు, కానీ అపరాధం అలాగే ఉండిపోతుంది మరియు మరింత ఎక్కువవుతుంది? "ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు" దేవుడు మోషేతో మాట్లాడి అతనికి సూచనలను ఇచ్చాడు. గమనించండి, ఎవరైనా పాపం చేస్తే అని దేవుడు చెప్పలేదు, కానీ పాపం చేసినప్పుడు. తన ప్రజలు పాపం చేస్తారని ప్రభువుకు తెలుసు. అందువల్ల ఆయన అపరాధ పరిహారార్థ బలి గురించి మోషేకు సూచించాడు, తద్వారా ప్రజల పాపాలు క్షమించబడతాయి మరియు వారు ఇకపై అపరాధం మోపబడరు.
అదే విధంగా, యేసు మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. అపరాధం మరియు అవమానం యొక్క భారాన్ని మోయడానికి బదులుగా, మీరు క్షమించబడి స్వేచ్ఛగా నడవగలరని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటాడు! ఆయన వైపు తిరగండి, మీ పాపాలను ఒప్పుకోండి మరియు మీరు క్షమించబడతారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు మీరు మోస్తున్న అపరాధాన్ని మీరు విడిచిపెట్టాలని కోరుకుంటున్నారు. ఈ రోజు ఆయనతో నిజాయితీగా ఉండండి. ఆయన ప్రేమ మీపై తుడిచిపెట్టుకుపోనివ్వండి.
“ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.”
-లేవియకాండము 6:7
తదుపరి లేఖనభాగములు
2 కొరింథీ 3:17:- “ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.”
2 కొరింథీ 7:9-10:- “మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.”
1 యోహాను 1:9:- మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.