Witnesses for the Son of God
యేసును ఇలా కనుగొనండి: Son of God John 5 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మనము యోహాను 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. యోహాను సువార్త గురించి నాకు నచ్చిన విషయం ఏమిటంటే అది కొత్తగా మరియు తాజాగా అనిపిస్తుంది. నిన్నటి దినమున మనము యేసు గురించి మరియు బావి వద్ద ఉన్న సమరయ స్త్రీ గురించి మాట్లాడుకున్నాము. యేసు నియమ నిబంధనలన్నింటిని ఉల్లంఘించడం మనం చూశాము. యూదా రబ్బీతో అస్సలు సంభాషించకూడని స్త్రీని పరిచర్య చేయడానికి, ప్రేమించడానికి, వినడానికి మరియు ప్రతిస్పందించడానికి ఆయన తన సంప్రాదయమును నుండి బయటికి వచ్చి పరిచర్య చేసాడు. యేసు తాను ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో మాదిరిని కొనసాగించాడు. యోహాను 5:1-15 అన్నీ సూచక క్రియలకు సంబంధించినవి. యేసు మూడవ సూచక క్రియను చేశాడు. , ఏడు సూచక క్రియలు ఉన్నాయి అని జ్ఞాపకముచేసునుడి. ఇక్కడ యేసు ఒక వ్యాధిగల వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా ఒక అద్భుతకార్యం చేస్తున్నాడు. యోహాను 5:16-23 అంతా తండ్రి మరియు కుమారుడిని గౌరవించడమే. ఈ వచనాలు తండ్రి మరియు కుమారుని నుండి జీవమును మరియు తీర్పుకు పరివర్తనగా పనిచేస్తాయి. జ్ఞాపకముచేసుకోండి, యోహాను పుస్తకానికి సంబంధించిన పదము ‘దేవుని కుమారుడు’.
పాఠము
యోహాను 5:30: ఇది పరివర్తన వచనం. డా. టామ్ కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, "యేసు యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఆయన తన తండ్రి చిత్తం లేకుండా ('నా స్వంత చొరవతో') తనంతట తానుగా ఏమియూ చేయడు, ఎందుకంటే ఆయన తండ్రికి తనను తాను సమర్పించుకొన్నాడు ('నేను నా స్వంత చిత్తాన్ని కోరుకోను'). ఆయనకు కలిగిన 'తీర్పు' ఆయన తండ్రి మాట వినడం యొక్క ప్రతిఫలం. అతని తీర్పు 'న్యాయమైనది' ఎందుకంటే స్వంత కీర్తి కోరిక దానిని కలుషితం చేయదు. కుమారుని ‘సంకల్పం’ పూర్తిగా ముందుకు సాగడం (‘కోరుకోవడం’ మాత్రమే) తండ్రి యొక్క ‘సంకల్పం’.”1 ఇక్కడ మీకు కుమారుని గురించి తండ్రి సాక్ష్యం ఉంది. దేవుడు ఇలా అన్నాడు, “ఈయన నా కుమారుడు! ఈయన యందు నేను గర్విస్తున్నాను!” క్రీస్తు గుర్తింపును ధృవీకరించడానికి ముగ్గురు సాక్షులలో తండ్రి ఒకరు. (ద్వితీయోపదేశకాండము 19:15.) ఏదైనా నిర్ధారణ నిజమని భావించాలంటే, దానిని ధృవీకరించడానికి ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు అవసరం;
యోహాను 5:31-32: యేసు ఇలా అన్నాడు, “నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు”. (వ. 31). ఇది యోహాను 8:14కి విరుద్ధంగా ఉందా? నేను అలా అనుకోను. యోహాను 8:14లో, యేసు తన వ్యక్తిగత జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ యేసు తన తండ్రికి తెలిసిన విషయాలను చర్చిస్తున్నాడు, తన గురించి సాక్ష్యమిచ్చే ‘మరొకడు’ ఉన్నాడు అని యేసు చెప్పుడు, ఆయన తండ్రి గురించి మాట్లాడుతున్నాడు.
యోహాను 5:33-35: మొదటి సాక్షి బప్తిస్మమిచ్చు యోహాను. యేసు యూదా మతాదికారులతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకము చేసుకోనుడి. బప్తిస్మమిచ్చు యోహానుతో మతాదికారులతో జరిపిన సంభాషణను యేసు ప్రస్తావించాడు (యోహాను 1:7,19). యోహాను క్రీస్తు యొక్క గుర్తింపును గూర్చి సత్యము మాట్లాడెను. యేసు సజీవుడైన ప్రభువు.
యేసు తన దగ్గరికి వచ్చుట యోహాను చూసినప్పుడు, యేసు దేవుని కుమారుడని వెంటనే గుర్తించాడు:
యోహాను 1:29: “మరుసటి రోజు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల అని అన్నాడు”
యోహాను 1:33: “నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.”
యోహాను 1:34: “ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.”
ఈ మతాదికారులు కొంతకాలానికి యోహాను యొక్క వెలుగును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారని యేసు సూచించాడు. (కీర్తన 132:17; 2 కొరింథీయులు 4:7.)
యోహాను 5:36: రెండవ సాక్షి యేసు యొక్క క్రియలు. ఆయన ఇలా అన్నాడు, “యోహాను మంచి సాక్ష్యే, కానీ నేను మంచి సాక్షిని కలిగి యున్నాను! నా క్రియలను చూడుడి!" (యెషయా 35:5-6; యెషయా 61; లూకా 4; యోహాను 10:25; యోహాను 14:11). యేసు యొక్క క్రియలు అక్షరాలా ఆయన ద్వారా పనిచేస్తున్న తండ్రిని సూచిస్తున్నాయి. యేసు సాధారణ భాషను ఉపయోగిస్తున్నాడు.
డాక్టర్ కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, “ఈ క్రియలలో యేసు యొక్క అన్ని కార్యకలాపాలు ఉన్నాయి: ఆయన చేసిన అద్భుతాలు, ఆయన పరిపూర్ణ విధేయతతో కూడిన జీవితం మరియు సిలువపై ఆయన చేసిన విమోచన. మోషే, ఏలీయా మరియు ఎలీషా కూడా అద్భుతాలు చేసారు కాబట్టి అద్భుతాలు మాత్రమే యేసు దేవుడని నిరూపించలేదు. యేసు చేసినదంతా కేవలం తండ్రి పని యొక్క కొనసాగింపు మాత్రమే (వ. 19-30)."2 యోహాను 17:4 ఇలా సెలవిస్తుంది, “నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.” మనం చేసే ప్రతి పని క్రీస్తుని సూచించాలి లేదా సాక్ష్యమివ్వాలి!
యోహాను 5:37-38: మూడవ సాక్షి స్వయంగా తండ్రి. డాక్టర్ కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, "బహుశా నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు, వీటితో సహా: పాత నిబంధన ప్రవచనాలు, ప్రవచనాత్మక సంఘటనలు మరియు సంస్థలు-యేసు బాప్స్తిస్మం సమయంలో ఉన్న సాక్షితో సహా.”3 తండ్రికి మరియు వాక్యానికి మధ్య వ్యత్యాసం ఉందని నేను నమ్ముతున్నాను. కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, “ఆయన [యేసు] బహుశా యేసు గురించి దేవుడు ఊహించిన ముందస్తు ప్రత్యక్షతను ఉద్దేశించి ఉండవచ్చు.”4 హెబ్రీయులు 1:1 ఇలా వివరిస్తుంది, “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు” (ఆదికాండము 32:30 -31; నిర్గమకాండము 33).
యోహాను 5:39-47: చివరి సాక్ష్యం లేఖనములు.
యోహాను 3:34: “ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.”
యోహాను 17:7-8: “నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.”
మూడవ మరియు నాల్గవ సాక్షులు ఖచ్చితంగా కలిసి వెళ్ళడం మీరు చూడవచ్చు. క్రీస్తులో కంటే లేఖనాల్లో ఎక్కువ నిరీక్షణ ఉందని ఈ మతాదికారులు విశ్వసించారు.
యూదా నాయకులు లేఖనాల్లోకి వెళ్లారు (1 కొరింథీయులు 8:1). మీరు క్రీస్తు ప్రేమను వ్యక్తపరచకపోతే మీ జ్ఞానము అర్ధం రహితము. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ఇలా చెబుతోంది, "ఈ దినాలలో కూడా లేఖనాలను నిష్ణాతులైన వారు ఉన్నారు, కానీ లేఖనాలను వాటిని ప్రావీణ్యం పొందేందుకు అనుమతించరు."5 యేసు లేఖనాలను చదవడం కంటే ఎక్కువగా పరిశుద్ద గ్రంధం పట్ల శ్రద్దను కోరుకుంటున్నాడు (యాకోబు 1:22-25). మీకు దేవునిపై ప్రేమ లేకపోతే లేఖనాలను ఎందుకు చదవాలి?
“మిమ్ములను నిందించేవాడు మోషే” అని యేసు చెప్పాడు. మోషే ఎల్లప్పుడూ దేవుని కుమారునికి చూపుతూ ఉండేవాడు. ఈ మత పెద్దలు మోషే మాట వినలేదు. వారు మోషేను విశ్వసించినట్లయితే, వారు యేసును విశ్వసించేవారు (లూకా 24). ఈ మనుష్యులు నిజంగా దేవుని వాక్యంలో ఉన్నట్లయితే, ఆయన దేవుని కుమారుడని వారు చూస్తారని యేసు సూచించాడు.
ముగింపు
వారెన్ వైర్స్బే ఇలా అడిగాడు, "పరిశుద్ద గ్రంధము గురించిన మన జ్ఞానం మనకు 'పెద్ద తల' లేదా 'మండే హృదయాన్ని' ఇస్తుందా?"6 పౌలు నొక్కిచెప్పాడు, “మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.” (1 కొరింథీయులు 8:1).
మీకు పెద్ద తల ఉందా లేదా మండుతున్న హృదయం ఉందా? ఇది జ్ఞానం గురించి అయితే, మీరు దానిని కోల్పోయారు. ఇది హృదయము యొక్క మార్పును గూర్చి. ఈ లేఖనాల ఉపరితలంపై అక్షరాలా గీతలు తీయడానికి మాత్రమే మాకు సమయం ఉంది. నేను మిమ్మల్ని వెనక్కి వెళ్లి ఈ వచనాలను తీయమని ప్రోత్సహిస్తున్నాను.
థామస్ L. కానిస్టేబుల్. డాక్టర్ థామస్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్‌పోజిటరీ నోట్స్: యోహాను, p. 163.
కానిస్టేబుల్, పి. 165.
కానిస్టేబుల్, పి. 166.
కానిస్టేబుల్, పి. 166.
ఎర్ల్ రాడ్‌మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లికేషన్స్, 1999), p. 1326.
వారెన్ వైర్స్బే, ది వైర్స్బే బైబిల్ కామెంటరీ: న్యూ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ సి. కుక్, 2007), పేజి. 224.
ప్రశ్నలు
-
మీరు స్వస్థత పడాలి అని కోరుకుంటున్నారా అని యేసు ఆ వ్యక్తిని ఎందుకు అడిగాడు? (మత్తయి 7:7).
దినవాక్యం
Laura Martin John 5:36
“I have testimony weightier than that of John. For the works that the Father has given me to finish—the very works that I am doing—testify that the Father has sent me.”
యోహాను తాను న్యాయస్థానంలో ఉన్నట్లుగా మరియు యేసు విచారణలో ఉన్నట్లుగా వ్రాశాడు, తండ్రి అయిన దేవునికి తన సమానత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. యేసు నలుగురు సాక్షులు అవిశ్వాసులకు తమ ఖాతాలను అందించారు: బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు క్రియలు, ఆయన తండ్రి యొక్క సాక్షి మరియు లేఖనములు. యేసును విశ్వసించడం మధ్య ప్రజలు ఎన్నుకునే ఎంపికను కలిగి ఉన్నారు, సాక్షులు ఆయన నిత్యజీవాన్ని పొందేందుకు లేదా ఆయనను తిరస్కరించడానికి, అవిశ్వాసాన్ని ఎంచుకున్నారని చెప్పారు. చాలా తరచుగా ప్రజలు, యేసు చుట్టూ ఉన్నవారు కూడా అవిశ్వాసాన్ని ఎంచుకున్నారు.
మీరు యేసు సత్యానికి సాక్షులై యున్నారు. మీ జీవితంలో యేసు తన శక్తిని, దయను లేదా దయను మీ జీవితములో ప్రదర్శించడాన్ని మీరు అనుభవించినప్పుడు, దానిని మీ చుట్టూ ఉన్న వారితో పంచుకోండి. పట్టబద్రులు కాబోవుచున్న నీ సీనియర్‌కు నిధులు మంజూరు చేయమని మీరు ప్రభువును అడిగారా మరియు ఆయన అధ్బుత రీతిక కావాల్సిన నిధులను అందించాడా? ఎవరైనా చెప్పండి! మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడంలో జ్ఞానం కోసం ప్రభువును అడిగారా, మరియు ఆయన అందించారా? మీ సహోద్యోగులకు చెప్పండి! ఎవరైనా మీ కోసం స్వస్థత కోసం ప్రార్థించారా, మరియు మీరు స్వస్థత పొందారా? వెళ్లి దాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకొనండి! మీరు చీకటిలో తప్పిపోయి, పాపానికి మరియు ఈ లోకపు మార్గాలకు కట్టుబడి, మీ జీవితంలో యేసు ప్రేమ మరియు వెలుగును పొంది ఇప్పుడు స్వేచ్ఛలో నడుస్తున్నారా? పంచుకొనండి! అలా చేస్తే మీరు దేవునికి మహిమను ఇస్తారు! మీరు వేరొకరు యేసును మరియు ఆయన శక్తిని మరియు ఆయన మహిమను చూడడానికి అనుమతిస్తారు! మీరు దానిని దాచిపెట్టి, దానిని మీ వద్ద ఉంచుకుంటే, మీలో ఉన్న దేవుని శక్తి యొక్క బహుమతిని నిర్వహించడం మీరు కోల్పోతారు. ఈ రోజు, వెళ్లి యేసు మీ కోసం ఏమి చేసాడో వినే ఎవరికైనా ప్రకటించండి! ఆయన మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడో సాక్ష్యమివ్వండి!
“అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమని, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నాకిచ్చియున్నాడో, నేను చేయుచున్నాను ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.”
— యోహాను 5:36
తదుపరి వాక్యాభాగము
- కీర్తన 71:15–16 – “నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింపబడును నీతినిమాత్రమే నేను వర్ణించెదను.”
- మార్కు 5:19 – “ఆయన వానికి సెలవియ్యక నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను.”
- 1 యోహాను 5:11 – “అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్‌లోడ్‌లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.