The Gospels John

Jesus Fed the 5,000

యేసును ఇలా కనుగొనండి: Son of God John 6 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 184వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మనం మొదటిగా "నేను" అనే ప్రకటనను చదువుతున్నాము. సువార్తలలో ఏడు "నేనే" అను ప్రకటనలు ఉన్నాయి. యోహాను 6:35లో, “జీవహారము నేనే” అని యేసు పలికినప్పుడు మనం అర్థం చేసుకున్నదాన్ని మనం బయలుపరచబోవుతున్నాము . ఈ రోజు మనం చదువుతున్న పాఠ్యంలో కొన్ని కఠినమైన సత్యాలు ఉన్నాయి, అది ప్రజలు తమ తలలను గోకడం మరియు వారు నిజంగా క్రీస్తు అనుచరులు కాగలరా అని ప్రశ్నించడం. యోహాను 6:1-21 జనసమూహంతో మరియు ఆయన శిష్యులతో యేసు చేయవలసిన సంభాషణకు నేపథ్యాన్ని నిర్దేశిస్తుంది.

పాఠము

యోహాను 6: 22–24: వారెన్ వియర్స్బే ఇలా వ్రాశాడు, “యోహాను 6వ అధ్యాయములో యేసు ప్రభువుపట్ల జనసముహము యొక్క నాలుగు ప్రతిస్పందనలను మనం చూస్తాము: వెదకుట (వ. 22-40), సణుగుట(వ. 41–51), కష్టపడుట (వ. 52- 59), మరియు వెళ్ళుట (వ. 60–70).1 సూపర్ బౌల్ వంటి పెద్ద ఫుట్‌బాల్ గేమ్ తర్వాత లేదా, ఈ సందర్భంలో, ఒక పెద్ద అద్భుతం జరిగిన తర్వాత, ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. జనసమూహం యేసును కనుగొనలేకపోయినప్పుడు, వారు ఆయనను వెతకడానికి తమ పడవలపై వెళ్లారు. హెబ్రీయులు 11:6లో అన్వేషణ అనే ఇతివృత్తం ఉంది. అనుచరులుగా, మనమందరం యేసును వెతుకుతూ ఉండాలి. (యిర్మీయా 29:13). యేసును వెదకుతున్న సమూహం యొక్క ఈ విధానం పరిశుద్ధగ్రంధ సంబంధమైనది (సామెతలు 8:17; మత్తయి 6:33).

యోహాను 6:25-26: జనసమూహము చివరికి యేసును కనుగొన్నారు. వారు ఆయనను కనుగొన్నప్పుడు, వారు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. యేసు యొక్క మొదటి ప్రతిస్పందనలతో, అతను నేరుగా విషయానికి వెళ్ళాడు, “మీరు రొట్టెలు తిని తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. వియర్స్బే ఇలా వ్రాశాడు, “రెండు రకాల ఆహారాలు ఉన్నాయని యేసు ఎత్తి చూపాడు: క్షయమైన ఆహారము, అవసరమైనది కానీ చాలా ముఖ్యమైనది కాదు, మరియు అంతరంగీక మనుష్యునికి అక్షయమైన ఆహారము, ఆత్మ, ఇది అవసరం.”2

యోహాను 6:27: “క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి” అని యేసు చెప్పాడు. మన అధ్యయనంలో, తండ్రి కుమారుని గురించి ఎలా సాక్ష్యమిస్తున్నాడో మనం మరింత ఎక్కువగా చూడటం ప్రారంభించాము. మనం ఈ శాశ్వతమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి (మత్తయి 6:20; 2 కొరింథీయులు 4:18). ఈ పరిస్థితి ఒక ఉత్తమమైనది - తప్పుడు ఉద్దేశాల కోసం యేసును కోరుకునే సమూహము.

యోహాను 6:28-29: జన సమూహము యొక్క మనస్తత్వం ఇది: ఈ శాశ్వతమైన/ నిత్యజీవపు ఆహారాన్ని అనుభవించడానికి మనం ఏమి చేయాలో మాకు చూపండి. వైర్స్బే ఇలా వ్రాశాడు, “ప్రజలు రక్షణ పొందాలి అంటే “కష్టపడటం” అని తప్పుగా అర్ధం చేసుకున్నారు.”3 (ఎఫెసీయులు 2:8-9). యేసు, “ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.” అని జవాబిచ్చాడు. వారు యేసును దేవుని కుమారునిగా విశ్వసించేలా ఈ పనులు జరిగాయి (యోహాను 14:1: అపోస్తుల 16:31).

యోహాను 6:30: జన సముహము ప్రతిస్పందిస్తూ, “కాబట్టి నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు?” ప్రజలు సూచక క్రియల కోసం వెతుకుతున్నారు. (1 కొరింథీయులు 1:22). ఇది నిరంతరం సూచక క్రియల కోసం వెదుకుచున్న యూదుల సాధారణ మనస్తత్వం. వారు కేవలం 5,000 మందికి ఆహారం ఇవ్వడం చూశారు మరియు ఇప్పుడు వారు మరొక సూచక క్రియ జరిగించాలి అని చూస్తున్నారు.

యోహాను 6:31–32: “దేవుడు మన పితరులు అరణ్యములో మన్నాను కురిపించినప్పుడు, మీరు ఎందుకు చేయలేరు?” అని ప్రజలు ప్రశ్నించారు. యేసు కనిపించాలని మరియు మన్నా కూడా అందించాలని వారు సూచిస్తున్నారు (కీర్తన 78:24). వారు కీర్తనాకారుని పఠిస్తున్నారు, ఎందుకంటే వారు దీనిని స్పష్టంగా అనుభవించలేదు మరియు మన్నా తండ్రికి బదులుగా మోషే నుండి వచ్చినదని సూచిస్తున్నారు.

యోహాను 6:33: “పరలోకమునుండి దిగివచ్చినవాడు” అనే ఈ పదబంధం యోహాను సువార్తలో చాలాసార్లు కనిపిస్తుంది. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది (కొలొస్సయులు 2:17). మెస్సీయ ప్రధానాంశము అని యేసు చెప్పాడు.

యోహాను 6:34-36: “యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి.” అని జనసమూహము జవాబిచ్చిరి. యోహాను 4:15లో, ఇదే మనస్తత్వం కనిపిస్తుంది. జన సమూహము ఆలోచిస్తున్నట్లుగా ఉంది, “ఇది చాలా బాగుంది! మేము ఇకపై ఎక్కడికి ఆహార ధాన్యములు కొనడానికి వెళ్లవలసిన అవసరం లేదు. “నేను జీవహరమును” (యోహాను 6:35) అని చెప్పినప్పుడు యేసు లేఖనంలో మొదటి "నేనే" అని పలికాడు. ఇది ఏడు "నేను" అనే ప్రకటనలలో ఒకటి. “నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు” అని యేసు చెప్పాడు.

జనసమూహము యేసు దగ్గరకు రావాలి మరియు ఆయనను విశ్వసించాలి. వైర్స్బే ఇలా వ్రాశాడు, “విశ్వసించడం అనేది కేవలం మేధోపరమైన విషయం కాదు, కొన్ని సిద్ధాంతాలకు మానసిక సమ్మతిని ఇవ్వడం. క్రీస్తునొద్దకు వచ్చి, నిన్ను నీవు ఆయనకు అప్పగించుకొనుట అని దాని అర్థము.”4 యేసు మరల తనను తాను దేవునితో సమానం చేసుకున్నాడు (నిర్గమకాండము 3:14). యేసు అన్నాడు, “మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.” ఇది అత్యంత వెర్రి విషయం కాదా? వారు ఆయనను వెతికిరి, కానీ వారు ఆయనను కనుగొనలేదు.

యోహాను 6:37-40: ఈ వచనాలు వ్యక్తిగత రక్షణ ప్రక్రియ. తండ్రి నాకు అనుగ్రహించు వారందరును యేసు యొద్దకు వత్తురు; మరియు క్రీస్తు యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. దైవిక సార్వభౌమాధికారం మరియు వ్యక్తిగత బాధ్యత యొక్క సమతుల్య విధానం ఉంది. మనము దీనిని 16 వారాల పాటు కొనసాగునట్లు చేయగలము, కానీ మనము దాని చేయడం లేదు! నా ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రజలు క్రీస్తును వెతుకుతున్నప్పుడు, ఆయన జీవహారము అని వారు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు.

యోహాను 6:41-45: జనసముహము ఆయనను గూర్చి ఫిర్యాదు చేయుట ప్రాభించారు. ఇప్పుడు ఇది పాత నిబంధనా యూదుల వలె ఉంది! జనసమూహము ఆశ్చర్యంగా, “ఇతను నజరేతుకు చెందిన మరియ మరియు యోసేపుల కుమారుడు కాడా. అతను జీవహారము కాదు. అతను నా పొరుగువాడు!” వారి హృదయాలు కఠినంగా ఉండడం వల్ల ఆయన ఎవరో గ్రహించలేకపోయారు. అందుకు యేసు మీలో మీరు సణుగు కోనకుడి అని వారితో చెప్పెను. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు. ఆయన యెషయా 54:13ని మరల తెలియచేస్తున్నాడు, ప్రవక్తల లేఖనములలో ఏమి చెబుతున్నారో తిరిగి సూచించడానికి పాత నిబంధన గ్రంథాన్ని ఉపయోగిస్తున్నాడు.

యోహాను 6:46-50: విశ్వసించే ప్రతి వాడు నిత్యజీవముగాలవాడు. వారి పితరులు అరణ్యములో మన్నాను తినినను వారు చనిపోయారని యేసు సూచించాడు. యేసు ఇలా ప్రకటించాడు, “మీ పితరులు భుజించిన మన్నా కంటే నేను గొప్పవాడిని. అయినా సణుగు చేసే ధైర్యం మీకు ఉంది! నా పని దానికంటే గొప్పది.”

యోహాను 6:51-56: మరలా, పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే యేసు ప్రకటించాడు. వైర్స్బే ఇలా వ్రాశాడు, “మన్నా రాత్రిపూట పరలోకము నుండి వచ్చింది, మరియు పాపులు నైతిక మరియు ఆధ్యాత్మిక చీకటిలో ఉన్నప్పుడు యేసు ఈ భూమిపైకి వచ్చాడు. మన్నా చిన్నది (ఆయన వినయం), గుండ్రంగా (ఆయన నిత్యత్వం), మరియు తెలుపు వలె (ఆయన పరిశుద్ధత) ఉన్నది.”5 యేసు పదే పదే, “నేను మీ కొరకు త్యాగము; నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను. నీ ప్రాణం కోసం అన్నీ వదులుకుంటున్నాను.” యోహాను 3:16లో, యేసు లోకము కొరకు మరణించాడు; యోహాను 15:13లో, యేసు తన స్నేహితుల కొరకు మరణించాడు; గలతీయులకు 2:20లో, మనం జీవం పొందేందుకు యేసు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. శరీరమును గూర్చిన ఈ భాష అర్థం చేసుకోవడం కష్టం. యూదులు నిరంతరం యేసును అక్షరార్థంగా తీసుకుంటారు, ఇది ఆయన మాటల యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోకుండా చేసింది (యోహాను 2:19-21).

యోహాను 6:57-62: యేసు అత్యంత కఠినమైన సత్యాన్ని చెప్పాడు మరియు దాని నుండి వెనక్కి తగ్గడం లేదు. ఆయన తండ్రి మరియు కుమారుని మధ్య బంధాన్ని నిరంతరం నొక్కి చెప్పాడు. యేసే సమాధానం. వారు తన మాట వింటారనే ఆశతో ఆయన పదే పదే చెప్పాడు. సత్యం చాలా కఠినమైనది కాబట్టి, ఆయన శిష్యులతో సహా ప్రజలు వెళ్లిపోయారు.

యోహాను 6:63-65: వియర్స్బే ఇలా వ్రాశాడు, “యేసు తన భాష అలంకారికమైనది మరియు ఆత్మీయమైనదని అని వివరించాడు, అక్షరార్థం కాదు. ‘శరీరంలో’ రక్షణ లేదు. నిజానికి, కొత్త నిబంధనలో ‘శరీరం’ (రోమా ​​7:18; ఫిలిప్పీయులు 3:3) గురించి చెప్పడానికి ఏమీ లేదు. మీరు దేహములో విశ్వాసాన్ని కనుగొనలేరు; ఇది దేవుని ఆత్మతో ప్రతిదీ కలిగి ఉంది. నమ్మని వారు మరియు పాల్గొనడానికి ఇష్టపడని వ్యక్తులు కొందరు ఉన్నారు. యేసు మరోసారి దేవుని సార్వభౌమాధికారం మరియు మానవ ప్రతిస్పందన గురించి మాట్లాడాడు.

ముగింపు

జనులు ఆయన వైపుకు తిరగడం యేసుకు అవసరం. క్రీస్తుకు అంకితమైన జీవితాన్ని గడపడం అసౌకర్యవంతమైన జీవనశైలి. తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని వెంబడింపవలెను. మనలో ఎవ్వరూ వెళ్లిపోకూడదని మా ప్రార్థన.

  1. వారెన్ వైర్స్బే. ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: న్యూ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2008), పేజి 249.

  2. వైర్స్బే, పేజి. 249.

  3. వైర్స్బే, పే. 249.

  4. వైర్స్బే, పే. 250.

  5. వైర్స్బే, పే. 251.

ప్రశ్నలు

  1. యోహాను 6:16-21లో, శిష్యులు పడవలో కపెర్నహూముకు బయలుదేరారు, కాని గాలి వీచింది మరియు వారు ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు. యేసు నీటి మీద నడుస్తూ వారి వైపుకు వెళ్లి గాలిని శాంతపరిచాడు. మీ జీవితంలో మీరు పోరాడుతున్న సందర్భాలు ఉన్నాయా, మరియు యేసు మీకు ప్రత్యక్ష పరచ బడ్డాడ మరియు పరిస్థితితులు మారిపోయాయా? మీరు ఒక ఉదాహరణ చెప్పగలరా?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin John 6:35

“‘I am the bread of life,’ Jesus told them. ‘No one who comes to Me will ever be hungry, and no one who believes in Me will ever be thirsty again.’”

యేసు ఐదు వేల మందికి రొట్టెలు మరియు చేపలు తినిపించిన తర్వాత, ఆయన వెళ్లిపోయాడు. మరుసటి రోజు, జనసమూహం యేసు కోసం వెతుకుతున్నప్పుడు సముద్రం అవతలి వైపున ఆయనను కనుగొన్నారు. వారు యేసు ఒక అద్భుతం చేయడం చూశారు మరియు దేవుని నుండి మరిన్ని పనులను చూడాలని ఆకలితో ఉన్నారు. యేసు వారితో, “జీవాహారమును నేనే” అన్నాడు. దేవుని కుమారుడిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నిత్యజీవాన్ని పొందాలని మరియు ఆయనలో తృప్తి చెందాలని యేసు సంకల్పం.

యేసు జీవహారము అయితే, ఈ రోజు మీకు దాని అర్థం ఏమిటి? రొట్టె భౌతికంగా అవసరం. మీరు రొట్టె మరియు నీటితో ఎక్కువ కాలం జీవించవచ్చు. రొట్టెలా, యేసు రోజువారీ జీవనానికి చాలా అవసరం. ప్రతి రోజు మీరు యేసుతో నింపబడాలి. మీరు యేసుతో నింపబడకపోతే, మీరు జీవితంలో సంతృప్తి చెందలేరు. మీరు ఆకలితో ఉంటారు మరియు మీ జీవితాన్ని ఇతర విషయాలతో నింపాలని కోరుకుంటారు. కాబట్టి నేడు, యేసుతో నింపండి. ఆయన వైపు తిరగండి, ఆయనలో మాత్రమే మీ సంతృప్తిని కనుగొనండి మరియు ఆయన వాక్యాన్ని ధ్యానించండి. ఆయన మంచితనం, ఆయన సౌందర్యం మరియు ఆయన ఏర్పాటుల కోసం ఆయనాలి కృతజ్ఞతలు చెప్పండి. మీరు మీ రోజు గడిచేకొద్దీ ఆయన మిమ్మల్ని నింపనివ్వండి, తద్వారా మీరు ముందుకు వచ్చే ప్రతిదాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రభువు నుండి కలిగి ఉంటారు. ఆయన మీకు జీవహరమై యున్నాడు.

“అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,”

—యోహాను 6:35

తదుపరి వాఖ్యాభాగము

  • కీర్తన 107:9 - “ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.”
  • యోహాను 6:40 – “ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.”
  • ప్రకటన 7:16–17 - “వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.”