The Gospels John

Son of God

యేసును ఇలా కనుగొనండి: Son of God John 4 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 182వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

లూకా సువార్త ముగింపులో, యేసు ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడే నిమగ్నమయ్యాడు. యేసు అనేక సూచక క్రియలు చేయడం యోహాను చూశాడు, కానీ యోహాను 4వ అధ్యాయములోని ఒకదానితో సహా అతను పొందుపరిచినవి “యేసు దేవుని కుమారుడైన మెస్సీయ అని మీరు నమ్మవచ్చు, (యోహాను 20:31) అని వ్రాయబడింది. యోహాను 4లో సువార్త ప్రచారానికి యేసు నాలుగు పదాల విధానాన్ని రూపొందించాడు: ప్రేమించండి, వినండి , గ్రహించండి మరియు ప్రతిస్పందించండి.

పాఠము

యోహాను 4:1-4: మతపరమైన యూదులు ఎన్నడూ సమరయ గుండా ప్రయాణించరు. యూదయ నుండి సమరయ గుండా గలిలయకు వెళ్లడం సులభతరమైనప్పటికీ, యూదులు సమరయులను చిన్నచూపు చూస్తున్నందున ఆ మార్గాన్ని ప్రయాణించరు. సమరయుల ఆరాధనా పద్ధతులు అపవిత్రమైనవి మరియు అసంపూర్ణమైనవిగా భావించబడుతున్నందున యూదులు సమరయులను చిన్నచూపు చూశారు. కానీ యేసు తాను సమరయ గుండా ప్రయాణించవలసి వచ్చిందని చెప్పాడు, ఎందుకంటే తనకు ప్రజల పట్ల ప్రేమ ఉంది (యోహాను 3:16).

యోహాను 4:5-6: యేసు దాహంతో ఉన్నాడు, కానీ ఆయన తన అవసరాలను పరిచర్య చేయడానికి పక్కన పెట్టాడు.

యోహాను 4:7–8: సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ఆమెను నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఇక్కడ మనం యేసు యొక్క మానవత్వం మరియు ఆధారపడటం చూస్తాము. ఇది సమరయ ప్రాంతములో ఒక రోజులో అత్యంత వేడిగా ఉండే సమయం. యేసు అలిసిపోయాడు మరియు దాహంతో ఉన్నాడు. ఆయనకు నీళ్లు తోడుకొనే మార్గం లేదు, కాబట్టి ఆయన సమరయ స్త్రీని దాహమునకిమ్మని అడిగాడు. సమరయ స్త్రీకి యేసు ముందుకు వస్తున్నట్లు అనిపించి ఉండవచ్చు, మొదట వారు ఒంటరిగా ఉన్నందున మరియు రెండవది ఆయన యూదుడు. కానీ సంస్కృతి, లేదా సంప్రదాయం లేదా మరేదైనా యేసు తాను ఇష్టపడే వ్యక్తులకు పరిచర్య చేయకుండా ఆపలేవు.

యోహాను 4:9–15: సమరయ స్త్రీ యేసుకు ప్రశ్నలతో సమాధానమిస్తుండగా, ఆయన ఆమె చెప్పేది శ్రద్ధగా విన్నాడు. స్టీఫెన్ కోవే ఇలా అన్నాడు, “చాలా మంది ప్రజలు అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో వినరు; వారు సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో వింటారు.”1 అయితే యేసు ఆ సమరయ స్త్రీని అర్థం చేసుకోవడానికి ఆమె మాటలు విన్నాడు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, మీరు వారి మాట వింటారు. యేసు జీవజలమును గూర్చి మాట్లాడాడు, అయితే సమరయ స్త్రీ సహజమైన అవగాహనతో విన్నది (1 కొరింథీయులకు 2:14). 15వ వచనంలో ఆమె ప్రతిస్పందన బహుశా ఇప్పటికీ సహజంగానే ఉంది. యేసు ఇవ్వబోతున్న జీవజలమును గూర్చి సమరయ స్త్రీకి ఇంకా అర్థం కాలేదు. జీవజలము యేసు బోధ యొక్క ఇతివృత్తం. యోహాను 7లో, యేసు సమాజ మందిరంలో లేచి నిలబడి, “దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.! “నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.” (యోహాను 7:37-38).

యోహాను 4:16-20: మీరు ఒక వ్యక్తి యొక్క ప్రశ్నను వింటున్నప్పుడు, మీరు వారి కథను వినవలసి ఉంటుంది. ఆ స్త్రీ యేసును ప్రవక్తగా గుర్తించింది, కాబట్టి ఆమె యూదులకు మరియు సమరయులకు మధ్య ఉన్న అతి పెద్ద తేడాల గురించి ఆయనను అడిగింది.

యోహాను 4:21-22: యేసు సమరయ స్త్రీ మాటలు వినడం ద్వారా ఆమె పట్ల ప్రేమను చూపించడం ప్రారంభించిన తర్వాత, ఆయన స్పష్టంగా చెప్పాడు. పరిశుద్ధాత్మ మనలను అదే పనికి నడిపించడాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది మరొకరి బాధ్యత కాదు. ఇది మనది!

యోహాను 4:23–24: మనం యేసును ఆరాధించడానికి బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, మనం దేవుని వాక్యం (సత్యం) ఆధారంగా రావాలి. అదే సమయంలో, మనం పరిశుద్ధాత్మపై ఆధారపడుతూ బల్ల యొద్దకు రావాలి. మనం కేవలం జ్ఞానంతో వచ్చి ఆత్మను విస్మరించలేము, అలాగే ఆత్మ ద్వారా వచ్చిన సత్యాన్ని విస్మరించలేము.

యోహాను 4:25-26: యేసు సమరయ స్త్రీని ప్రేమించాడు, ఆయన ఆమె మాట విన్నాడు, ఆమె ఏమి చెబుతుందో ఆయన గ్రహించాడు, ఆపై స్పందించాడు. సమరయ స్త్రీ కేవలం జీవమును తప్పించుకుంటుంది మరియు మనం జాగ్రత్తగా ఉండకపోతే, పరిశుద్ధ గ్రంథములోని ఇతరులలాగే మనం కూడా అదే ఉచ్చులో పడవచ్చు:

  • నిర్గమకాండము 14:13: ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు, ఫరో ఇశ్రాయేలియులను తరామలి అని నిర్ణయించుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఫరో సైన్యానికి మరియు ఎర్ర సముద్రానికి మధ్య చిక్కుకున్నారు. దేవుడు తన ప్రత్యక్షతను చూపించాడు.
  • ఆదికాండము 41:14–15: ఫరో కల భావాన్ని చెప్పడానికి యోసేపు తీసుకురాబడడానికి చాలా సంవత్సరాలు చెరసాలలో కూర్చున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

మీరు సమరయ స్త్రీలా ఉండి ఇటువంటి మిమ్మల్ని పరిస్థితుల నుండి మీరు బయటకురావడానికి యేసు అవసరమైతే, ఇలా చేయండి:

వాగ్దానాలను చేత పట్టుకోండి (యెషయా 40:8; మత్తయి 5:17-18).

మీ దృష్టిని యేసుపై ఉంచండి (కీర్తనలు 25:15; హెబ్రీయులు 12:2).

ముగింపు

మీరు యేసును అనుసరిస్తున్నవారైనా లేదా సమరయ స్త్రీ లాంటివారైనా పర్వాలేదు. యోహాను 4:27లో యేసు సమరయులతో సంభాషిస్తున్నాడని ఆశ్చర్యపోయిన శిష్యులలాగా ఉండకండి. మనమందరం సమరయులతో సంభాషించాలి. కథ ముగింపు ఏమిటంటే, సమరయ స్త్రీ యేసుతో పరస్పర చర్య చేయడం ద్వారా పట్టణంలోని ప్రతి ఒక్కరూ యేసు గురించి తెలుసుకున్నారు.

  1. ఫెన్ R. కోవే, ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్: పవర్‌ఫుల్ లెసన్ ఇన్ పర్సనల్ చేంజ్, (న్యూయార్క్: ఫ్రీ ప్రెస్, 2004)), p. 239.

ప్రశ్నలు

  1. 10వ వచనంలో “జీవజలం” యొక్క వారము ఏమిటి? (యెషయా 55:1; యిర్మీయా 2:13; 17:13). మీరు దానిని ఎలా పొందుతారు? (రోమా ​​10:9-10).

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin John 4:6–8 ESV

“Jacob’s well was there; so Jesus, wearied as he was from His journey, was sitting beside the well. It was about the sixth hour. A woman from Samaria came to draw water. Jesus said to her, ‘Give Me a drink.’ (For his disciples had gone away into the city to buy food.)”

యేసు గలిలయకు వెళ్లే మార్గంలో సమరయ గుండా ప్రయాణించాడు. కానీ యేసు ఇతర యూదులు తక్కువగా ప్రయాణించే మార్గాన్ని ఎంచుకున్నాడు మరియు త్రాగడానికి యాకోబు బావి వద్ద ఆగిపోయాడు. ఆయన తన ప్రయాణం నుండి అలిసిపోయాడు. ఆయన తన శిష్యులు లేకుండా ఒంటరిగా ఉన్నాడు, ఇది అతనికి చాలా అరుదు. అప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చింది. అలసిపోయినా, దాహం వేసినా, యేసు తన అవసరాలను పక్కన పెట్టాడు మరియు బావి వద్ద ఉన్న ఈ స్త్రీని ప్రేమించడానికి, వినడానికి, గ్రహించడానికి మరియు ప్రతిస్పందించడానికి సమయాన్ని వెచ్చించాడు. ఆ రోజు, యేసు ఈ స్త్రీ పట్ల ప్రేమను చూపించడానికి సమయం తీసుకున్నందున, ఆమె యేసును దేవుని కుమారునిగా విశ్వసించినందున ఆమె జీవితం శాశ్వతంగా మారిపోయింది. పట్టణం కూడా ప్రభావితమైంది, మరియు చాలా మంది సమరయులు యేసును విశ్వసించడం ప్రారంభించారు.

మీరు ప్రయాణం నుండి అలిసిపోయారా? కూర్చోవడానికి మరియు నీరు త్రాగడానికి మీకు సమయం కావాలని మీకు అనిపిస్తుందా? యేసు కూడా అలాగే భావించాడు. ఇంకా, ఆ అలసిపోయిన క్షణం మధ్యలో, యేసు ప్రేమించడానికి ఎవరో వచ్చారు. మీరు విశ్రాంతి తీసుకుంటూ, కొలను దగ్గర కూర్చున్నప్పుడు లేదా కాఫీ షాప్‌లో పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, యేసులాగా ప్రేమించడానికి ప్రభువు ఎవరికి మార్గాన్ని తీసుకువస్తాడో మీ కళ్ళు తెరిచి ఉంచాలని గుర్తుంచుకోండి. మీరు మీ ఇంట్లో కూడా ఉండవచ్చు మరియు మీరు మీ పాదాలను పైకి లేపి సేదదీరుతూ ఉండవచ్చు, కానీ అదే సమయంలో మీ పిల్లలకు మీరు అవసరం అయి ఉండవచ్చు. అలసిపోయిన ఆ క్షణాలలో, ప్రేమించడానికి మరియు దయ చూపించడానికి శక్తీ కోసం ప్రభువును అడగండి. బలహీనమైన ఈ క్షణాల్లో, యేసు ప్రేమ నీ మార్గంలో ప్రకాశిస్తుంది. ఊహించని మరియు అసౌకర్య సమయాల్లో ఇతరుల జీవితాలను ప్రభావితం చేయడానికి మీలో మరియు మీ ద్వారా అతని ప్రేమపై ఆధారపడటం కొనసాగించండి. యేసు ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు ఎప్పటికీ తెలియదు.

“అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసునాకు “దాహమునకిమ్మని ఆమె నడిగెను.” (ఎందుకంటే అతని శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి.)

— యోహాను 4:6–8

తదుపరి వాక్యభాగము

  • యెషయా 40:8 - “గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”
  • యెషయా 40:31 – “యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.”
  • 2 కొరింథీయులు 2:14 – “మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.”