The First Sign
యేసును ఇలా కనుగొనండి: Son of God John 2 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మేము యేసు దేవుని కుమారుడని మాట్లాడటం కొనసాగిస్తాము. లూకాలో, మనం యేసును మనుష్యకుమారునిగా చూశాము. ఇప్పుడు మనం యేసును దేవుని కుమారునిగా గుర్తించాము. ఈ రోజు, మనం లేఖనాన్ని రెండు భాగాలుగా విభజించబోతున్నాం: యేసును అద్భుతములు చేసేవానిగాను మరియు యేసును సర్వాదికారిగాను.
పాఠము
యోహాను 2:1: ఈ అధ్యాయం మొదటి సగం కానాలోని వివాహానికి సంబంధించినది, ఇది యోహాను సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. వివాహం మూడవ రోజున జరిగింది, ఇది యేసు మరియు ఆయన శిష్యులు రెండు రోజులు ప్రయాణిస్తున్నట్లు సూచిస్తుంది.
యోహాను 2:2: యేసును మరియు ఆయన శిష్యులును వివాహామునకు పిలువబడిరి. యేసు తల్లి మరియ మరియు అతని కుటుంబ సభ్యులు కూడా బహుశా వివాహానికి హాజరవుతున్నట్లు ఉంది. ఇది యేసు సహోదరుడైన యాకోబు యొక్క వివాహమా? మనము ఖచ్చితంగా చెప్పలేము, కానీ వివాహంలో మరియకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉందని మనకు తెలుసు. ఇది ఎవరి పెళ్లి అయినా, వారు యేసుతో మాత్రమే కాకుండా, శిష్యులతో కూడా వారు అనుసంధానం అయ్యారు.
యోహాను 2:3-4 మరియ యేసు దగ్గరకు పరిగెత్తి, ద్రాక్షారసము అయిపోయిందని చెప్పెను. యేసుకు తల్లి ఉందని, వారికి ప్రత్యేక సంబంధం ఉందని జ్ఞాపకంచేసుకోవడం ముఖ్యం. యేసు ప్రతిస్పందన నిజంగా అసహజంగా లేదా మృదువుగా, ఉల్లాసభరితంగా ఉందని మీరు అనుకోవచ్చు. ఇది తరువాతది అని నేను అనుకుంటున్నాను మరియు వారికి ప్రత్యేకమైన సంబంధం ఉందని నేను భావిస్తున్నాను. యేసు ఎవరో మరియకు బాగా తెలుసు. తన సమయం ఇంకా రాలేదని యేసు పేర్కొన్నాడు, కానీ అతను తన తల్లి కోరికను ప్రేమతో గౌరవంగా అంగీకరించాడు.
యోహాను 2:5–7: ఇది యేసు మరియు మరియల ఉల్లాసభరితమైన సంబంధాన్ని చూపుతుందని నేను భావిస్తున్నాను. మరియ పరిచారకుల దగ్గరకు వెళ్లి యేసు చెప్పునది చేయుడి అని చెప్పెను. ఈ వివాహములో మరియది కీలక పాత్ర అని స్పష్టం అవుతోంది. ప్రజలు ఆమె మాటలను వినే కొన్ని రకాల సేవకురాలి పాత్రను కలిగి ఉంది. ప్రజలు యేసు చెప్పినట్లు చేశారనేది వాస్తవం, విశ్వాసం యొక్క గొప్ప స్థాయిని చూపిస్తుంది.
వివాహములో, వారు శుద్ధిగల పాత్రలను కలిగి ఉన్నారు. శుద్ధీకరణాచార ప్రకారము శుభ్రమైన ఈ పాత్రలు రాతితో తయారు చేయబడినవి. అవి చాలా పెద్దవిగా ఉండేవి. అతిథులు బానలలో చేతులు కడుక్కోవాలి, తద్వారా వారు తినడానికి ముందు శుభ్రంగా ఉంటారు. ఇది తాగునీరు కాదు.
యోహాను 2:8-10: మరియ మరియు సేవకులు కలిగి ఉన్న గొప్ప విశ్వాసమును వారు ఈ నీటిని విందు ప్రధానియొద్దకు తీసుకువెళ్లడం ద్వారా చూపించారు. అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియదు మరియు బహుశా అది మంచి విషయమే. ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, చివరిగా మంచి ద్రాక్షరసమును ఉంచుకొనినందుకు గట్టిగా చివాట్లుపెట్టాడు. ఇది యేసు ద్వారం నుండి బయటకు రావడం గురించి; ఆయన జీవముగల ద్రాక్షారసమైయున్నాడు. ఇది ప్రవచనాత్మక చర్య.
యోహాను 2:11-12: ఇది యేసు చేసిన మొదటి సూచక క్రియ. అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లిరి. ఈ వివాహం బహుశా కుటుంబ వ్యవహారం అని ఎత్తి చూపుతున్న మరొక విషయం ఇది.
యోహాను 2:13: యేసు యూదుల పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్లాడు. కొన్నిసార్లు, ఇతర మూడు సువార్తలలోనున్న సంఘటనలను క్రమములో ఉంచినప్పుడు యోహాను సువార్త కాలక్రమానుసారంగా గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొంతమంది వేదాంతవేత్తలు యోహాను సువార్త క్రమం తప్పిందని అంగీకరిస్తున్నారు, అయితే అది పొరపాటు. ఒక సిద్ధాంతం ఏమిటంటే, వ్రాత ప్రతులు పడిపోయయి అ ప్రతులు తిరిగి సరియైన క్రమంలో ఉంచబడలేదు. ప్రతి సువార్త రచయిత వేర్వేరు శైలులను కలిగి ఉన్నట్లు ఇతరులు చాలా సంక్లిష్టమైన సిద్ధాంతాలతో ముందుకు వచ్చారు, ఇతర వేదాంతవేత్తలు సమస్యను పూర్తిగా విస్మరించారు. చివరి అంశము ఇది - కథ ఇతర సువార్తలకు అనుగుణంగా ఉంది.
యోహాను 2:14-17: యేసు దేవాలయములో ప్రవేశించినప్పుడు ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచెను. యేసు త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారిని వెళ్ళగొట్టెను (కీర్తన 69:9). యేసుకు ఎందుకు అంత కోపం వచ్చింది? మొదటిది, పస్కా కోసం యెరూషలేమునకు వెళ్ళే యాత్రికులు పశువులను ఎక్కువ దూరం తీసుకువెళ్ళలేరు. ఈ యాత్రికులకు పశువులను విక్రయించే వారు వాటి ధరలతో భక్తులను దోచుకుంటున్నారు. రెండవది, ప్రార్థనా మందిరంగా భావించబడే ఆలయంలో ఈ చర్యలు జరుగుతున్నాయి. మూడవది, కొనుగోలుదారులకు, ఇది చౌకైన దయ వంటిది. ప్రజలకు బలులు అర్పించటం చిన్న పని.
యోహాను 2:18: కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడిగారు.
యోహాను 2:19-21: ప్రతిస్పందనగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను” (వ. 19). కానీ యేసు ఏమి చెబుతున్నాడో ప్రజలకు అర్థం కాలేదు! యేసు తన స్వంత శరీరం గురించి మాట్లాడుతున్నాడు. వారు ఇటుక మరియు సున్నముపై దృష్టి పెట్టారు; వారు అజ్ఞానులు మరియు విస్మరించేవారు. దేవుని కుమారుడు మాత్రమే ఈ సంకేతాన్ని ప్రదర్శించగలడు. యోహాను 11:25లో, “పునరుత్థానమును జీవమును నేనే” అని యేసు చెప్పెను.
యూదులు చెప్పుకుంటున్న ఈ ఆలయం 515 BCలో పూర్తయింది. దీన్ని నిర్మించడానికి 46 సంవత్సరాలు పట్టింది (వ. 20). (1 కొరింథీయులు 6:19 మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం గురించి మాట్లాడుతుంది). “నేను పరిశుద్ధాత్మ ఆలయమని నాకు తెలుసు” అని యేసు చెప్పాడు. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో ఆయన మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు.
యోహాను 2:22–23: రోమా 10:9 ఇలా చెబుతోంది, “అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడవు.” అది అంత ఇదే. అదే సువార్త, మరియు శిష్యులు ఆ సాధారణ నమ్మకంతో ప్రపంచాన్ని మార్చారు.
యోహాను 2:24-25: కొద్ది మందికి మాత్రమే యేసు ప్రతిదానిని వివరించారు. రూపాంతరం కొండపై పేతురు, యోహాను మరియు యాకోబులకు యేసు తనను తాను బయలుపరచుకున్నాడు. ఆయన విశ్వసించగలిగే ఇతరులు ఉన్నారు, కానీ ఇతర శిష్యుల వలె సన్నిహితంగా కాదు. ఈ మతాదికకారులు కోసం, అయితే యేసు తన సంగతులను సన్నిహితముగా వీరికి తెలియజేశాడు మరియు సహేతుకమైనది కూడా. 25వ వచనం యేసు కుమారత్వానికి సంబంధించిన మరొక అతీంద్రియ లక్షణాన్ని వివరిస్తుంది: “గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు.” మనుష్యుల యొక్క హృదయాలను తండ్రి ఆయనకు బయలుపరుస్తాడు - మంచి, చెడు మరియు అందవిహీనమైనవాటిని బయలుపరుస్తాడు.
ముగింపు
కాబట్టి మీగురించి మరియు నా గురించి ఏమిటి? మనం దేవుడు విశ్వసించగల ప్రజలమా? దేవుడు తనను తాను బయలుపరుచుకొనగల ప్రజలమా? అద్భుతాలు మరియు సూచక క్రియలను జరగటం కోసం వెంబడించడానికి మనం ఆయనను అనుసరిస్తున్నామా? ఉచిత ఆహారం కోసం మనం ఆయనను వెంబడిస్తున్నామా? ఒక సూచక క్రియ కోసమా? ఒక స్వస్థత కోసమా?
మత్తయి 16:13-17: “యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారుకొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మీయ అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.”
యోహాను 1:49: “నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను”
యోహాను 6: 66-69: “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.”
ఎవరి దగ్గరకు మనం వెళ్ళగలం? యేసు నిజంగా దేవుని కుమారుడని మనం గుర్తించగలుగుచున్నామా? మనం ఇంకా ఎక్కడికి వెళ్ళగలం? అన్నింటికంటే, ఆయన నిత్యజీవపు మాటలు గలవాడు.
ప్రశ్నలు
-
వివాహ విందులో, మరియ పరిచారకులకు యేసు చెప్పినట్లు చేయమని చెప్పింది (యోహాను 2:5). ఆయన తన సమయం ఇంకా రాలేదు అని ఆమెకు చెప్పిన తర్వాత ఇది జరిగింది. యేసు వద్దు అని చెప్పిన తర్వాత కూడా మరియ ఆ ప్రకటన చేయడానికి దారితీసిందని మీరు అనుకుంటున్నారు?
దినవాక్యం
Laura Martin John 2:5, 7-8
“His mother said to the servants, ‘Whatever He says to you, do it.’ ‘Fill the jars with water,’ Jesus told them. So they filled them to the brim. Then He said to them, ‘Now draw some out and take it to the chief servant.’ And they did.”
గలిలయలోని కానాలో జరిగిన వివాహానికి యేసు, ఆయన తల్లి మరియు ఆయన శిష్యులు అతిథులుగా ఉన్నారు. అతని తల్లి యేసు వైపు తిరిగి, ఆతిధ్యముఇచ్చేవారి దగ్గర ద్రాక్షారసం అయిపోయిందని చెప్పారు. తన కుమారుని శక్తిని అర్థం చేసుకున్న యేసు తల్లి పరిచారకుల వైపు తిరిగి, “యేసు మీతో ఏమి చెప్పునో దానిని చేయుడి” అని చెప్పింది. యేసు తన మొదటి సూచక క్రియ చేసాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. యేసు పరిచారకులకు ఏమి చేయాలో చెప్పాడు, మరియు వారు దానిని చేసారు. వారు ఆయనను ప్రశ్నించలేదు. వారు వాదించలేదు. వారు వెంటనే చేసారు. వారి తక్షణ విధేయత కారణంగా, నీరు మంచి ద్రాక్షరసముగా మారింది. యేసు తన మహిమను బహిరంగంగా ప్రదర్శించాడు మరియు ఆయన శిష్యులు ఆయనను విశ్వసించారు.
మీరు పరిచారకుల వలె యేసు మాట వింటే ఏమి జరుగుతుంది? ఏది చేయమని ఆయన మీకు చెప్పాడో, మీరు దానిని చేసారు. దేవుని వాగ్దానాలు మరియు సత్యం గురించి మీరు దేవుని వాక్యంలో ఏది చదివినా, మీరు వెంటనే విశ్వసించారు. మీరు దానిని ప్రశ్నించవద్దు. మీరు వేరొకరిని వారు ఏమనుకుంటున్నారో అడగవద్దు. బదులుగా, మీరు వెంటనే వినండి మరియు కట్టుబడి ఉండండి. తక్షణ విధేయతతో నడవడం ద్వారా, నీరు ద్రాక్షారసంగా మారడాన్ని పరిచారకులు చూసినట్లుగా, యేసు అద్భుత మార్గాల్లో పని చేయడం మీరు అనుభవించడం ప్రారంభిస్తారు. వారు వేచి ఉంటే, వాదించినట్లయితే, హేతుబద్ధంగా లేదా మరొకరిని చేయమని కోరినట్లయితే, వారు అద్భుతాన్ని చూడటం కోల్పోయేవారు. ఈ రోజు, ప్రభువు స్వరాన్ని విని దానిని చేయండి.
“ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను... యేసు - ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొందని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.”
- యోహాను 2:5,7-8
తదుపరి వాక్యభాగము
• ఆదికాండము 17:23 — “అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మము సున్నతి చేసెను.”
• యెషయా 30:20b-21 “నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు, నీవు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవలో నడువుడి అని నీ వెనుకనుండి యొకశబ్దము నీ చెవులకు వినబడును.”
• యోహాను 2:11 — “గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.