The Word Became Flesh
యేసును ఇలా కనుగొనండి: Son of God John 1 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మనము యోహాను గురించి మన అధ్యయనాన్ని ప్రారంభించినప్పుడు మీరు తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, 98 శాతం విషయాలు యోహానుకు ప్రత్యేకమైనది. మన అధ్యయనంలో మనం చూడబోయేవి నూతనమైనవి మరియు తాజావి. మీరు ఇప్పటికే మత్తయి, మార్కు లేదా లూకాలో చూసిన విషయాలను యోహానులో చాలా అరుదుగా చూస్తారు. వైర్స్బే ఇలా అంటాడు, "క్రీస్తు జీవితంలో వివరించబడిన సంఘటనలపై మొదటి మూడు సువార్తలు ప్రధానమైనవి అయితే, యోహాను ఈ సంఘటనల అర్థాన్ని నొక్కి చెప్పాడు.”1 ఈ సువార్త రచయిత యోహాను తనను తాను "యేసు ప్రేమించిన శిష్యుడు" అని వర్ణించాడు. యోహను సహోదరుడు యాకోబు; వీరిరువురు ఉరుమెడి వాని కుమారులుగా తెలియబడ్డారు, వీరు జెబెదయ కుమారులు (మార్కు 3:17). యోహాను కూడా అపొస్తలుడే. పేతురు, యాకోబు మరియు యోహానులు యేసు యొక్క అంతరంగిక శిష్యులుగా మనకు మత్తయి సువార్తలో కనిపిస్తారు.
యోహాను పేతురు యొక్క సన్నిహిత సహచరుడు మరియు తరచుగా ప్రత్యక్ష సాక్షిగా సూచించబడతాడు. అతను మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను మరియు ప్రకటన గ్రంధమును వ్రాసెను (1 యోహాను 1:1-4). యోహాను పరిశుద్ధ గ్రంధములో ఐదు పుస్తకాలు వ్రాసాడు; ఇవి యోహాను చేత వ్రాయబడిన ప్రత్యక్ష సమాచారం. “యోహాను, యేసు యొక్క భూసంబంధమైన పరిచర్యను చూసిన యాభై సంవత్సరాల తర్వాత” ఈ సువార్తను బహుశా క్రీ. శ. 80-90 మధ్య కాలములో వ్రాయబడి ఉండవచ్చు.2 ఈ సువార్తలో పెద్ద మొత్తంలో ప్రత్యేకమైన విషయాలు ఉన్నందున, యోహాను ఇతర సువార్తలకు మద్దతునిచ్చాడు.3 నాలుగు సువార్తలలో, యోహాను సువార్త అత్యంత వేదాంతమైనది మరియు యేసు దేవుడు అని ఈ సువార్త నొక్కి చెబుతుంది.
ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యం యోహాను 20:30-31లో కనుగొనబడింది: “అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసాను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు, కాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు వ్రాయబడెను.” మాక్ఆర్థర్ పుస్తకం కోసం రెండు అంశాలను ఎత్తి చూపాడు: సువార్త (పుస్తకంలో 100 సార్లు "విశ్వాసం" అని ప్రస్తావించబడింది) మరియు క్షమాపణ (యేసు గుర్తింపును దేవుని యొక్క అవతారమని పాఠకులకు చూపించడానికి). మాక్ఆర్థర్ యోహను 1:1–18ని ఆరు విభాగాలుగా వివరించాడు4 అవి క్రింద ఉపయోగించబడతాయి.
పాఠ ము
యోహాను 1:1-3: నిత్యుడైన క్రీస్తు. “ఆదియందు” (వ. 1) ఆదికాండము 1:1కి సంబంధించినది. ఆదియందు వాక్యముండెను మరియు వాక్యము దేవుని యెద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను. "వాక్యమునకు దైవత్వము యొక్క అన్ని సారాంశాలు లేదా గుణ లక్షణాలు ఉన్నాయని గ్రీకు నిర్మాణం నొక్కిచెపుతుంది, అనగా, మెస్సీయా అయిన యేసు సంపూర్ణముగా దేవుడు.”5 యోహాను సువార్తలో వంశావళి లేదు, ఎందుకంటే అది ఆయనకు అవసరం లేదు. యేసు ఆదియందు ఉండెను, మరియు సమస్తమును ఆయన ద్వారా సృష్టించబడెను నిత్యత్వము అంటే, యేసు ఆదియందు కంటే ముందే ఇక్కడ ఉన్నాడని అర్థం.
కొలస్సియులకు 2:9: “సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది”
యోహాను 17:5: “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను
ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము
ఎఫేసీ 3:9: “పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,
హెబ్రీ 1:2: “ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.”
యోహాను 1:4-5: అవతార మూర్తియైన క్రీస్తు. యోహాను 5:26: “తండ్రి యేలగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడు తనంతట తానే జీవముగలవాడై ఉన్నాడు.” కాబట్టి దేవునిలో జీవం ఉంది. మీరు దేవునితో ఏ భాషను వింటారో అదే భాషను క్రీస్తుతో కూడా వింటారు. యోహాను 10:28 ఇలా చెబుతోంది, “నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు.” “4-5 వచనాలలో వెలుగు మరియు చీకటి యొక్క పోలికను అందిస్తాయి. వెలుగు పరిశుద్ధగ్రంద సత్యము; చీకటి అబద్ధము. వెలుగు పవిత్రత మరియు స్వచ్ఛత; చీకటి పాపం మరియు తప్పు చేయటం. ఈ పోలిక సత్యానికి దారి తీస్తుంది: "సిలువపై మరణం ద్వారా మరియు కుమారుని పని ద్వారా చీకటి శక్తులు అధిగమించబడతాయి."6
యోహాను 1:6-8: క్రీస్తుకు ముందుగాపోవువాడు. బాప్తీస్మము ఇచ్చు యోహాను 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత లోకములోనికి వస్తున్న వెలుగు గురించి సాక్ష్యమిచ్చేందుకు వచ్చాడు. ఇది యేసు రాకడ యొక్క సువార్త స్వభావాన్ని సూచిస్తుంది: "ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది." (వ. 9). యోహాను వెలుగు రావడానికి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. 8వ వచనం యోహాను వెలుగు కాదు కానీ వెలుగును గురించి సాక్ష్యమివ్వడానికి వచ్చాడు.
యోహాను 1:9-11: గుర్తించబడని క్రీస్తు. యేసు “లోకంలోకి” వస్తున్నాడని యోహాను వ్రాశాడు. మాక్ఆర్థర్ ఇలా వివరించాడు, “యోహాను దీనికి అనేక అర్థాలను ఇచ్చాడు: (1) భౌతికంగా సృష్టించబడిన లోకము; (2) సాధారణ మానవత్వం; మరియు (3) సాతాను ఆధిపత్యం చెలాయించే అదృశ్య ఆధ్యాత్మిక వ్యవస్థ మరియు అది దేవునికి, ఆయన వాక్యానికి మరియు ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఉండేది.”7 యేసు తాను సృష్టించిన లోకములోని ఈ వాతావరణాలలోకి వస్తున్నాడు ఆయన నిత్యుడైన క్రీస్తు. కానీ ఆయన సృష్టించిన లోకము ఆయనను గుర్తించలేదు. యోహాను యేసు తన స్వంత జనులైన యూదుల వద్దకు వచ్చాడని పేర్కొన్నాడు, కాని వారు ఆయనను స్వీకరించలేదు (వ. 11). యూదుల నుండి యేసు పదే పదే తిరస్కరణ ఎదుర్కొన్నారు.
యోహాను 10:25: “అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.”
యోహాను 1:12–13: సర్వశక్తిమంతుడైన క్రీస్తు. యూదు ప్రజలు క్రీస్తును తిరస్కరించినప్పటికీ, ఆయనను అంగీకరించే శేషం ఉందని యోహాను నొక్కిచెప్పాడు.
యోహాను 1:14-18: మహిమ కలిగిన క్రీస్తు. వాక్యము వాస్తవానికి క్రీస్తు అని మనకు ఎలా తెలుసు? ఎందుకంటే వాక్యము శరీరదారి ఆయేను (వ. 14). పౌలు తిమోతికి ఆ వాస్తవాన్ని ధృవపరిచాడు: “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను” (1 తిమోతి 3:16). గ్రీకు భాషలో “వాక్యము శరీరధారియై నివసించెను” అనే ప్రకటనకు “ప్రత్యేక్ష గుడారము వేయుట” అని అర్థము. యేసు ప్రత్యక్ష గుడారంలో నివసించాడని అర్థం. పాత నిబంధనలో, “స్థలమంతయు దేవుని షకీనా మహిమతో నిండెను. వాక్యము శరీరముగా మారినప్పుడు, దైవత్వము యొక్క మహిమ ఆయనలో మూర్తీభవించబడింది.”8 ఇది విన్న యూదులు స్వయంచాలకంగా నిర్గమకాండము 25:8 గురించి ఆలోచించి ఉంటారు, అక్కడ దేవుడు ఇశ్రాయేలియులను ప్రత్యేక్ష గుడారములో కలుసుకున్నారు; నిర్గమకాండము 33:11, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు; మరియు నిర్గమకాండము 40:34, దేవుని సన్నిధి గుడారాన్ని నింపినప్పుడు. ప్రవచనాత్మకంగా, నిర్గమకాండములోని ఈ వచనాలు యోహాను 1:14ను సూచిస్తాయి.
ముగింపు
చివరికి దేవుని మహిమ అవిధేయులైన ఇశ్రాయేలీయుల నుండి వెళ్ళిపోయింది (యెహెజ్కేలు 9:3; 10:4, 18; 11:22-23). సంవత్సరాల తరువాత, వాక్యము శరీరదారి ఆయెను "మరియు మేము ఆయన మహిమను గమనించాము" (యోహాను 1:14) – తండ్రి నుండి వచ్చిన వాని మహిమ సంపూర్ణ సత్యమును మరియు మహిమయు గలది. సమస్తమును యేసే సమాధానమని సూచిస్తున్నవి.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జాన్ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 1989), p. 284.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే, TN: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 1339.
మాక్ఆర్థర్, పే. 1339.
మాక్ఆర్థర్, పేజీలు. 1343–1346.
మాక్ఆర్థర్, పే. 1343.
మాక్ఆర్థర్, పే. 1344.
మాక్ఆర్థర్, పే. 1345.
మాక్ఆర్థర్, పే, 1346.
ప్రశ్నలు
-
యోహాను 1 అధ్యాయములోని మొదటి ఐదు వచనాలలో యోహాను వెంటనే యేసును ఎలా చిత్రీకరించాడు?
దినవాక్యం
Laura Martin John 1:4–5
“In Him was life, and the life was the Light of men. The Light shines in the darkness and the darkness did not comprehend it.”
యోహాను తన సువార్తను యేసే జీవము మరియు ఈ జీవమే మనుష్యులకు వెలుగై ఉండెను అనే సందేశముతో ప్రారంభించాడు. యేసు వెలుగుగా చీకటిలో ప్రకాశించుచున్నాడు. మీరు రోజంతా ఈ సత్య పదబంధాలను చెబితే: “యేసే నాకు జీవమునై ఉన్నాడు. యేసే నాకు వెలుగై ఉన్నాడు.”?
మీ జీవితంగా యేసు యొద్దకు దారితీసే కొన్ని విషయాలు ఏమిటి? పని నీ జీవితమా? షాపింగ్ మీ జీవితమా? మీ ప్రియమైన వారు మీ జీవితమా? నేడు, యేసును మీ జీవితముగా చేసుకోండి. మీ ప్రేమాభిమానాలన్నింటినీ ఆయనకు ఇవ్వండి మరియు ఆయనలో మాత్రమే లభించే సమృద్ధిగల జీవితాన్ని పొందండి. యేసు కూడా వెలుగైఉన్నడు. చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. యేసులో ఖచ్చితంగా చీకటి లేదు. మీ జీవితంలో క్రీస్తు వెలుగు మసకబారిపోయి మీ చుట్టూ చీకటి పెరిగిపోతుంటే, యేసుతో గడపండి. ఆయనతో నడవండి మరియు ఆయన సత్యాన్ని పాటించండి. ఆయన వెలుగు మీలో వృద్ధి చెంది మిమ్మల్ని విడిపిస్తుంది.
“ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను”.
—యోహాను 1:4–5
తదుపరి వాక్యభాగము
- యోహాను 14:6- “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”
- రోమా 8:2- “క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.”
- 1 యోహాను 1:5–7 — మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడు సత్యమును జరిగింపకుందుము.అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.