God's Judgment And Redemption: The Flood
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 7-9 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము:
ఆదికాండము 1-3, సంతానం, మెస్సియ గురించిన మొదటి ప్రస్తావనను మనము చూశాము, ఆ సంతానమైన క్రీస్తు మీద మనకు నిరీక్షణ ఉంది అని నమ్ముచున్నాము. ఆదికాండము 4-6 అధ్యాయలలో సేద్యపరచువాడైనకయీను గురించి మరియు తన సహోదరుడైన హేబెలు గొర్రెలకాపరి గూర్చి లికించబడినది. తన సహోదరుని చంపుటవలన కయీను మొట్టమొదటిగా నరహత్యచేసినవాడుగా ఎంచబడెను, పాపము మానవాళిని ప్రభావితం చేస్తుంది.
పాఠము:
మనము ఆదికాండము 7-9 చదువుదాం. 7వ అధ్యాయములో పాపము భయంకరమైన పరిస్థితిలోకి మారిపోయింది, లోకమునంతటిని నాశనం చేయడానికి దేవుడు సిద్దపడెను.
ఆదికాండము 7:13: “ఆ దినమందే నోవాహును నోవాహు కూమరులైన షేమును హామును యాపెతును నోవాహు భార్యయు వారితో కూడా అతని మొగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.” ఇది బహుశా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటి. ఎనిదిమంది ఓడలోకి ప్రవేశించారు. ఎనిమిది మంది మాత్రమే జీవించారు మిగిలినవారు అందరు చనిపోయారు. ఆదికాండము 8లో, వరద తగ్గుముఖం పట్టింది మరియు ఆదికాండము 8:16లో దేవుడు నోవహుతో ఇలా మాట్లాడాడు: “ఓడలో నుండి బయటికి రండి”. ఇది ఎంత బాగుంది: సంతానము అయిన క్రీస్తు ఈ ఎందిమిదిమందిలో ఒకరి ద్వారా కొనసాగాడు. అది మనకు ఎలా తెలుసు? ఎలా అంటే ఆదికాండము 3:15లో మనకు ఒక వాగ్ధానము ఇవ్వబడింది వంశము కొనసాగుతుంది, సంతానమైన మేస్సియ సాతాను యొక్క తల చితక ద్రోక్కును అని.
ఆదికాండము 8:21: “అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించిఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను”. మరి ఎన్నటికి ఇటువంటి జలప్రలయమును తెచ్చి అందరిని నాశనం చేయను అని దేవుడు చెప్పెను. ఇది ఒక అందమైన చిత్రం మనము ఓక నిభంధనతో పొందుతాము. ఈ పాఠం యొక్క మిగిలిన భాగం కోసం నేను ప్రత్యేకంగా ఆదికాండము 9:1–29పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను.
ఆదికాండము 9:1; “మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి”. ఇది ఆదికాండములో దేవుని నుండి మనం వినే సాధారణమైన మాట. ఆదికాండము 1:28లో మనము ఇదివరకే విన్నాము. దేవుడు ఆదాము మరియు అవ్వలతో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరచుకోనుడి. ఆదికాండము 8:17నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. ఆదికాండము 9:7లో దేవుడు నోవాహు మరియు అతని కుమారులతో “మీరు ఫలించి అభివృద్ధి నొందుడిమీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను”. ఎనిమిది మంది తప్ప సమస్త మానవాళి నాశనం అయిపోయారు కాబట్టి వారు అభివృద్ధి చెందాలి అని దేవుడు చెప్పాడు.
ఆదికాండము9:2-4: “మీ భయమును మీ బెదురును భూమీ మీదనున్న సమస్త ప్రాణికిని కలుగును” సమస్త జంతువులు మానవుని అదికారము క్రిందకు వచ్చెను ఇది మొదటగా జరిగిన సంఘటన: దేవుడు మానవుడు తినడానికి మాంసమును ఇచ్చెను. “అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు (ఆదికాండము 9:4). ఈ ఆదేశం జీవితం యొక్క పవిత్రత పట్ల గౌరవాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. “రక్తము దేహమునకు ప్రాణము” అని లేవియకాండము 17:11లో వివరించబడినది. ఇది క్రీస్తుకు మరియు రాబోవువానికి సూచన. నేను ఈ చిత్రాన్ని ప్రేమిస్తున్నాను ఎందుకంటే ఇది సిలువపై కొత్త నిబంధనలో క్రీస్తును సూచిస్తుంది. ఆయన రక్తమే మనందరికీ జీవనాధారం రక్తము జీవితానికి ప్రతీక.
ఆదికాండము 9:5 ఈ నియమ నిభందనలు ఎందుకు ఇవ్వబడినవి అనేదానిని ఈ వచనము వివరిస్తుంది. ఆయన ఈ ఎనిమిది మందితితో తిరిగి మల్లి ప్రారంభిస్తున్నాడు. ఇది ఒక ఉరి శిక్షకు ప్రితీకగా ఉంది. మనము జీవితానికి విలువనిచ్చేవారిగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. టామ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ, ఒక వ్యక్తికి ఏడు పొరలు ఉంటాయి కాబట్టి మనం జీవితాన్ని విలువైనదిగా పరిగణించడం ముఖ్యం: (1) ఆధ్యాత్మికం (2) వ్యక్తిగత (3) నైతిక (4) సహవసబద్దమైన (5) హేతుబద్ధమైన (6) భావోద్వేగమరియు (7) సృజనాత్మక. ఈ విషయాలన్నీ జీవితంలో ఇమిడి ఉన్నాయి. ఇవి అన్ని జీవితముతో ముడుపడి ఉన్నాయి. కాబట్టి ఒకరి ప్రాణమును నీవు తీస్తున్నప్పుడు, నీవు దేవుని యొక్క రూపాన్ని నాశనం చేస్తున్నట్లు. రచయిత ఎల్మెర్ గ్రే “అతను లేక ఆమె ఎవరినైనా హత్య చేస్తే దెవును యొక్క ప్రత్యక్షతను ఆపివేసినట్లు అని వ్రాసాడు”. ప్రభుత్వం కోసం దేవుడు ఒక దైవిక నిర్మాణాన్ని స్థాపించడం ఇదే మొదటిసారి. రోమ పత్రిక 13:4లో పభుత్వము మంచిని తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన దేవుని పరిచారకులు అని పౌలు వివరిస్తున్నాడు.
ఆదికాండము 9:6 “దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” అందుకనే ఇది చాల ప్రాముఖ్యమైనది. మనము మాట్లాడుకున్న ఏడు విషయాలను జ్ఞాపకము చేసుకున్నారా? అవి అన్ని దేవుని ప్రితిరూపలే!
ఆదికాండము 9:7:“అయితే మీరు ఫలించి సంమృద్ధిగా విస్తరించుడి” నాన్సీ పియర్సీ ఇలా వివరించారు: “మీరు ఫలించి వృద్ధి చెందుడి దీని యొక్క అర్ధం సామాజిక ప్రపంచాన్ని వృద్ది చేయడం: కుటుంబాలను కట్టడం, సంఘాలను, పాఠశాలలు, నగరాలు, ప్రభుత్వాలు, చట్టాలను నిర్మించడం.... “భూమిని లోపరుచుకోనుడి” అంటే సహజ ప్రపంచాన్ని ఉపయోగించుకోవడం: పంటలు వేయండం, వంతెనలను నిర్మించండం, కంప్యూటర్లను రూపొందించండం, సంగీతం భాగాలుగా (కంపోజ్) చేయండి.…సంస్కృతిని సృష్టించడం, నాగరికతలను నిర్మించడం. సమస్య ఏమిటంటే విత్తనము (సంతానము) అనే క్రీస్తును ఎరుగానివారు సంస్కృతిని నిర్ణయించే విధముగా మనము చేశాము. మనలను దేవుడు సంస్కృతిని బలపరిచేవారిగా దేవుడు చేశాడు కాని మనము సర్ప సంతనమునకు అప్పగించాము.
ఆదికాండము 9:8-11నోహవుకు మరియు అతని సంతానమునకు ఇది నోవాహు నిభందన.దేవుడు సమస్తమును కప్పును... జీవించి ఉన్న సమస్త జీవికి ఇది నిభందన! ధనస్సుకి హెబ్రీ పదము “క్విసేట్” దాని యొక్క అర్ధం “యుద్ధ విల్లు” యుద్ధం ముగిసింది అని దేవుడు చెప్పాడు. దేవుడు జలప్రళయం ద్వారా మరి ఎప్పటికి నాశనం చేయడు. కాని ఏమి జరిగింది అంటే అమెరికాలో కొంతమంది వ్యక్తులు ఈ ధనస్సును దేవుడు మనలను నాశనం చేయకూడదు అని చేసిన వాగ్ధానానికి సంకేతము అని వారు ఇష్టనుసారముగా జీవించడానికి అనుమతి అని దేవుని దయను దుర్వినియోగం చేస్తున్నారు. కానీ ఏమి జరిగిందంటే, అమెరికాలోని కొంతమంది వ్యక్తులు ఈధనస్సును వారు సాకుగా తీసుకొని, మనల్ని నాశనం చేయకూడదని దేవుడు చేసిన వాగ్దానానికి ఇది సంకేతం అని, వారు కోరుకున్నది చేయడానికి అనుమతిగా దేవుని దయను దుర్వినియోగం చేస్తున్నారు.
ఆదికాండము 9:12-17 ధనస్సు మనకు ఆశీర్వాదము. ఈ రోజుకి అది దేవుని వాగ్ధానము అని మనకు జ్ఞాపకము చేస్తుంది.
ఆదికాండము 9:18 హాము చిన్న కమారుడు (ఆదికాండము 9:24లో వ్రాయబడింది). ఈయన కనానుకు తండ్రి. షేము లేదా యాపెతులలో ఏ కొడుకు పెద్దవాడు అనే చర్చ జరుగుతుంది. నోవహు ద్రాక్షతోటను పండించేవాడు. నోవహు తాగి, గుడారంలో ఒంటరిగా, దిగంబరిగా కనిపించాడు. నోవహు ద్రాక్షతోటను సేద్యపరిచేవాడు. నోవహు త్రాగి మత్తుడై తనగుడారంలో ఒంటరిగా వస్త్రహీనుడుగా ఉండెను.
ఆదికాండము 9:22-25 నోవాహు వస్త్రహీనుడుగా ఉండుట హాము చూసి షేము మరియు యాపెతుకు చెప్పెను. అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి, (వారు తమ తండ్రి దిసమొలను చూడలేదు) హాము ఏమి చేశాడో కచ్చితముగా మనకు తెలియదు, కాని 24- 25 వచనాలలో తన తండ్రిని దిగంబరిగా చూడటం కంటే ఎదో ఎక్కువ జరిగింది అని మనకు తెలుస్తుంది. ఏదో ఒక లైంగిక వక్రికరణ జరిగి ఉటుంది అని (పండితుల) అభిప్రాయం.
హాము కనాను యొక్క తండ్రి, తను శపించబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును. మొట్ట మొదటి సారిగా ఒక మానవుడు మరొక మానవుడిని శపించటం. ప్రవచన పరముగా ఇది నెరవేరెను. మొదటి రాజులు 9:20- 21లో హాము వారసులు సోలోమోనుకు దాసులుగా/బలవంతముగా పనిచేశారు. గూఢచారులు అయిన కలేబు మరియు యోహోషువలకు సహాయం చేయటం వలన రాహాబు మినహాయింపు చేయబడెను. ఆదికాండము 10: 6-10 హాము యొక్క నలుగురు కుమారుల యొక్క సంఖ్య ఇవ్వబడింది: కూషు, ఐగుప్తు(మిస్రాయిము), పూతు మరియు కనాను అనువారు. వారు దైవభక్తి లేని మరియు లోకనుసారమైన శక్తిని కలిగిఉన్నారు. కనానీనియులు మంచి మనుషులు కారు, సర్పము యొక్క సంతానము హాము ద్వారా పనిచేయడం మనము చూస్తున్నాం. ఫిలిష్తీయులు, అస్సిరియులు మరియు బబులోను దేశస్తులు కూడా హాము యొక్క వంశం నుండి వచ్చారు (కీర్తన 105:23).
ఆదికాండము 9:26: తరువాత నోవాహు షేముతో ఇలా మాట్లాడాడు: “షేము దేవుడైన యెహోవాను స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును”. షేము ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడు (ఆదికాండము 10:21). నిజానికి “షేము” అనగా “పేరు” అని అర్ధము. ఏబెరు అను పదము హీబ్రూ అను మూల పదము నుండి వచ్చినది. అబ్రహాము మొట్టమొదటి హేబ్రియుడుగా గుర్తించబడ్డాడు దాని షేము మెస్సయ సంతాముగా కొనసాగించాడు.
ఆదికాండము 9:27:షేము మరియు యాపెతులకు కనాను దాసుడు. ఈ వచనములో యాపెతు షేము యొక్క గుడారములలో నివసించును అని చెబుతుంది. యాపెతు మరియు అతని ఏడుగురు కుమారులు. యాపెతు షేము గుడారాలలో నివసించినట్లయితే, దాని అర్థం ఏమైఉంటుంది అని అనుకుంటున్నారు?అవును, వారు కలిసి జీవించారు. జాఫెత్ ఇండో-యూరోపియన్పిల్లను కనెను. దీని అర్థం ఏమిటో మీకు తెలుసా? అన్యజనులు! ఒకవేళ షేము హెబ్రీయులకు (యూదులు, సమరయులు) తండ్రి అయితే, యాపెతు అన్యజనులకు తండ్రి అయితే దాని యొక్క అర్ధం యూదుల గుడారాల్లో అన్యజనులు నివసించేవారని దీని అర్థం. కనానీయులు సర్పము యొక్క సంతానాన్ని మోసేటివారు-వారు ప్రభువుతో నడిచేవారు కాదు.
ఇది పిడివాదం కానప్పటికీ, ఇది ఒక అద్భుతమైన చిత్రం. అపొస్తలులకార్యములు 15:7లో, సువార్త అన్యజనులకు ప్రకటించబడింది. షేము గుడారములో మొదట ఉద్దేశించిన దానిలో భాగం అయ్యే అవకాశం అన్యులకు ఇవ్వబడింది. రోమ పత్రిక 15:16లో పౌలు అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి పిలవబడ్డాను అని సందర్భాలలో ఒకటి మాత్రమే నమోదు చేయబడింది. జలప్రళయం తర్వాత కూడా తాను ఏమి చేస్తున్నాడో దేవునికి తెలుసు. నోవహు తన ముగ్గురు కుమారులను ఆశీర్వదించడంలో కూడా మళ్ళి మళ్ళి అన్యుల కోసం దేవుని ప్రణాళిక స్పష్టంగా కనిపించింది (గలతీయులకు 2:2). పైగా, అన్యజనులకు సువార్త వినడానికి మరియు ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వబడింది. నోవహు యాపెతును ఆశీర్వదించెను. నోవాహు షేమును ఆశీర్వదించెను మరియు హమును శపించాడు.
ముగింపు
లూక సువార్త 3:23-38లో క్రీస్తు నుండి ఆదాము వరకు వంశము వ్రాయబడింది.... ఆదాము నుండి షేతు వరకు ఏది ప్రారంబమైనది...నోవాహు నుండి షేము వరకు... క్రీస్తు వరకు. నోవాహు ఆశీర్వాదముల వలన తన కుమారుడు, సంతానము, క్రీస్తు కొనసాగించబడింది. స్త్రీ సంతానము సర్పము యొక్క సంతానముతో పోరాటము కొనసాగించబడింది. మరియు ఇందులో ఎక్కడో, యాపెతు షేము గుడారంలో అంటుకట్టబడ్డాడు. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారులను ఆశీర్వదించాడు మరియు శపించాడు.
ప్రశ్నలు
-
ఆదికాండము 7:13 ప్రకరము ఎంతమంది జలప్రలయమునుండి తప్పించుకున్నారు, మరియు వాళ్ళు ఎలా తప్పించుకోగలిగారు? "రాబోయే జలప్రళయం"-మనుష్యకుమారుని రాకడ నుండి ఎవరు ఎలా తప్పించుకుంటారో ఇది ఎలా చిత్రికరిస్తుంది? (2 పేతురు 2:5; 3:5–7)
దినవాక్యం
Laura Martin Genesis 6:17-18
“I am bringing a flood—floodwaters on the earth to destroy every creature under heaven with the breath of life in it. Everything on earth will die. But I will establish My covenant with you, and you will enter the ark with your sons, your wife, and your sons’ wives.”
ప్రభువు జలప్రళయంతో భూమినంతటినీ తుడిచిపెట్టిన రోజుల్లో కూడా, ప్రభువు నీ గురించి ఆలోచిస్తున్నాడు మరియు సువార్తతో మిమ్మల్ని చేరుకోవాలని కోరుకున్నాడు. కాబట్టి, సంతానమును కొనసాగేలా ఆయన నోవహును మరియు అతని కుటుంబాన్ని కాపాడాడు.
కొన్నిసార్లు, మీ ప్రస్తుత పరిస్థితికి ప్రయోజనం లేదని మీరు భావించే సందర్భాలు ఉండవచ్చు, కానీ సమయం ప్రారంభానికి ముందే దేవుడు మీకోరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నమ్మండి: క్రీస్తు సంతానం మీ జీవితంలోకి చొచ్చుకుపోవడానికి ఒక ప్రణాళికఅని మీరు తెలుసుకోండి మరియు ఆయన ప్రేమను పొందండి. తనకు మరియు తన ప్రజలకు మధ్య ఉన్న తన శాశ్వతమైన ప్రేమ యొక్క వాగ్దానాన్ని మనకు గుర్తుచేయడానికి ప్రభువు మనకు ధనస్సును కూడా ఇచ్చాడు.
“ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశముక్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును;అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.”
-ఆదికాండము 6: 17-18
తదుపరి వాఖ్యభాగము
- ఆదికాండము 9:16- “ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను”.
- కీర్తనలు 139:13-14- “నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది”.
- యిర్మీయా 29:11- “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు”.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.