The Gift Of The Firstborn
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 4-6 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పునఃసమీక్ష
నిన్న మనము ఆదికాండము1–3అధ్యాయాలలో,యేసుక్రీస్తును ఒక సంతానముగాచూశాము. ఆదికాండము3:15 “మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” మానవుని పతనములో క్రీస్తు మెస్సయ్యా అన్న ప్రవచనముకనుగొనబడినది.
పాఠము
ఆదికాండము పుస్తకం మొత్తం, మనం యేసుపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు, మనం ఆయనను సంతానంగా చూడబోతున్నాం. మనిషి పతనం జరిగినప్పుడు, దేవునివద్ద ఇంకా జవాబు ఉంది. అదేసంతానం.
ఆది 4:1-2: హవ్వ గర్భవతి అయి కయీనునుకనెను. మనలో కొంతమందిని పాపములో చిక్కుకొని, ముందుకు వెళ్ళలేదు. అయితే ఆదాము వరకు నిరీక్షణ ఉందని తెలుసు కనుక వారు ముందుకు వెళ్లి పిల్లలను కనెను. అవ్వ రెండవ కుమారుడైన హేబేలునుకనెను. అతడు గొర్రెల కాపరి ఆయెను. కయీనుభూమినిసేద్యపరిచెను ఆయన వ్యవసాయకుడాయెను. వాక్యములో పేరులో ప్రాముఖ్యము గనుక కయ్యను పేరు యొక్క అర్థం పోగు చేసుకుని వాడు. అచ్చమైన ఇంగ్లీష్ తర్జుమాలోపొందుకొనుటఅని వచ్చును. హేబేలును ఊపిరి అనితర్జుమా చేయవచ్చు దాని అర్థం. కొద్దికాలం జీవించుట.
ఆదికాండం 4: 3 నుండి 4ఆదికాండం3:15లో మనము రెండు రకాల విత్తనాల గురించి చూశాం. ఈ భాగంలో ఈ భాగంలో కూడా రెండు రకాల విత్తనాల గురించి కనబడుచున్నది కైను తాను సేద్యము చేసి పండించిన పంటలో నుండి కొంత దేవునికి తీసుకొని వచ్చెను కానీ కొంత దాచుకొనెను. హేబేలు అయితే తన ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చెను. దేనినిదాచుకొనలేదు. వారి సమర్పణ వెనుక ఉన్న వారి హృదయములను దేవుడు చూశాను. వారి ఉద్దేశములను దేవుడు గ్రహించెను. యెషయా29:13 లోని వచనాలను కయీను తనకు అన్వయించుకొనెను.
కయీను అడిగాను ఇది నీకు ఇవ్వటం వలన నాకు ఏమీ వస్తుంది?. కయ్యనులో సర్పము యొక్క విత్తనమును మనం చూస్తున్నాము ఆయన దేవునికి విరోధమైన ఆత్మను ప్రదర్శించుచున్నాడు. కానీ హేబేలు లో స్త్రీ యొక్క విత్తనమును మెస్సయ్య దేవుని ప్రేమను మనం చూస్తున్నాం.
ఈలాంటి వత్తిడినే మనము ఎల్లప్పుడు ఎదుర్కొంటూ ఉండాలి: క్రీస్తు అనబడిన సంతానము మనము కలిగియున్నామని ఎరిగి స్త్రీసంతానముగా మనము పనిచేద్దామా? లేక ఎల్లప్పుడు దేవునికి వ్యతిరేకముగా వెళ్ళుటకు ప్రయత్నించే సర్పసంతానముగా ప్రవర్తిద్దామా, దానిని బట్టి మనము చేయగలిగినదంతా చేసి దానితో దూరముగా ఉందామా?
లేఖనాలలో ప్రథమ ఫలము చాలా ప్రాముఖ్యము. నిర్గమకాండం 34:19 ప్రకారం “ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ
పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొఱ్ఱె పిల్లయేగాని అది నాదగును". ద్వితీయోపదేశకాండము12:6 లో" అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను. "నీకు కలిగిన దానిలో ఏదో ఒకటి ఇచ్చుట కాదు గాని ఉత్తమమైన దానిని దేవునికి ఇవ్వవలెను.
హేబేలు తన తండ్రికి తన ఈయగలిగినదంతాఇచ్చుటకుఇష్టపూర్వకముగాఉండెను కారణం తాను అర్పించు అర్పణ ప్రభువుకి అని తను ఎరిగి ఉన్నాడు. నీలో క్రీస్తు అను విత్తనమును కలిగి ఉన్న ఎడల నీ జీవితము నీది కాదు. అయినప్పటికీ కొన్ని కారణాల చేత ప్రతిరోజు మనము మనకు ఇష్టమొచ్చిన . మనకు ఇష్టం వచ్చిన విధముగా జీవించవచ్చు లేక ప్రభువు చిత్తానుసారముగాఅని అనుకొనుచున్నాము. వాల్టర్ కైసర్ జూనియర్ ఈ విధంగా చెప్పాను దేవుడు ఎల్లప్పుడూ ఒకని అర్పణను. పరిచర్య లేక ఆరాధనను అంగీకరించక ముందు ఆరాధించు వాని లేక ఇచ్చు అని దేవుడు పరిశీలించును. ఉజీవపాఠశాలలో మనము ఎల్లప్పుడూ శుద్ధమైన ఉద్దేశ్యంతో చేయుదుము. ఈ విధంగా చేసినప్పుడు మనము దేవుణ్ణి మహిమ పరిచెదము.
1 కోరింథి15 20 ".ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.: " హేబేలు తన ప్రథమ ఫలమును దేవునికి అర్పించుట ద్వారా క్రీస్తుకు ముంగుర్తుగా మనకు కనబడుచున్నాడు.
1కోరింథి15 : 21-22లో "మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.”. నీవు ఎప్పుడైతే సర్పము యొక్క విత్తనపు ఆత్మను కలిగి జీవిస్తావో మరణిస్తావు కానీ నీవు క్రీస్తు విత్తనం యొక్క ఆత్మను కలిగి జీవించినప్పుడు జీవిస్తావు.
1కోరింథి15:23-25: "ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. ". ఇది ప్రథమ ఫలముతో ప్రారంభమగుచున్నది.
1కోరింథి15:26-29 : వచనాలు "కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును. ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల? " ది క్రీస్తు విత్తనం చూపించుకో ప్రారంభమవుతుంది. మనము హెబేలు చిత్రమును
చూసినప్పుడు క్రీస్తు అగుపడుచున్నాడు. అది ప్రథమ ఫలము.దేవుడుకయినుమరియుఅతనిఅర్పణగూర్చిసంతోషించలేదు.
ఆదికాండము 4:5–7: దేవుడుకయినుమరియుఅతనిఅర్పణగూర్చిసంతోషించలేదు. కాని దేవుడు ప్రతిభావవంతముగా కయీనుతో ఇలా చెప్పాడు “నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? ” (7 వ). దేవుడు కయీనుకు బయటకుపంపించాడు. మనం చేయాల్సిందల్లా మనల్ని మనం తగ్గించుకోవడం మరియు మనం మనది తప్పు అని ఒప్పుకోవడం.యెషయా 66:2 ప్రకారం “అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.” ఆత్మలో దీనులై లోబడు వారిని దేవుడు అంగీకరిస్తాడు.
కయీనుతనసహోదరునిచంపాడుఎందుకనగాఅతనుసర్పసంతానముతోపనిచేశాడు. సామెతలు 28:13 ఇలాచెప్పుచున్నది: “అతిక్రమములు దాచిపెట్టువాడు వర్థిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును.: రెండవ అవకాశమును బట్టి దేవునికి స్తోత్రములు (యాకోబు 4:8)! ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చును (Acts 3:19). అది ఎలా జరుగుతుందో తెలుసా? ఇది ప్రథమ ఫలాల ద్వారా జరుగుతుంది. దేవుడు యేసుక్రీస్తును మన ప్రథమఫలంగా పంపాడు. మరి ఆయన ప్రథమ ఫలం ఎలా? ఎందుకంటే వీటన్నింటిని అధిగమించడానికి సమాధానంగా మనకు తెలిసిన సంతానం ఆయనే.
ముగింపు
ఇది కయీను ఇచ్చిన దాని గురించి కాదు; అది అతని హృదయపరిస్థితి గురించి. కయీను ఇంకా ఏదో ఇస్తున్నాడు, కానీ అతను తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. యూదా 1:11–13 ఇలాహెచ్చరిస్తుంది. “అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, … వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు… వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు చుక్కలుగాను ఉన్నారు” ఇటువంటివారుచాలాఅపాయకరమైనవారు … వారుఫలహీనులు.
సంఘములోని వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండటం ప్రారంభించాలి. మనం సంస్కృతిని మార్చుకోవాలనుకుంటే, మన గురించి మనం ఉండలేము. మనం ఆయన గురించి ఉండాలి! మేము ఉత్తమమైన వాటిని టేబుల్‌పైకి తీసుకురావాలి. యూదా పుస్తకం మొత్తం అది మెరుగుపడదని ప్రజలను హెచ్చరిస్తుంది. మనం విశ్వాసం కోసం పోరాడాలి. 1 యోహాను 3:11–13 ప్రకారం, మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదామనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు
తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా? సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు అనబడిన సంతానం మీరు కలిగియున్నప్పుడు, మీకు దేవుని పట్ల ప్రేమ మరియు ఇతరుల పట్ల ప్రేమ ఉంటుంది. మీరు కయీను వలె సర్పసంతానము కలిగి ఉన్నప్పుడు, మీరు మీ గురించి ఆలోచిస్తారు.
లోకము మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపోకండి. నేను నిజంగా నమ్ముతున్నది ఏమిటంటే, ప్రభువు వస్తున్నట్లుగా, మీరు నీతిలో పనిచేసి ప్రథమ ఫలాలు ఇస్తే, ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు క్రీస్తు అనే ప్రథమ ఫలాలను టేబుల్‌పైకి తీసుకువస్తే, మీ జీవితం ఏమైనప్పటికీ మీది కాదు కాబట్టి మీరు కోల్పోయేది ఏమీ లేదు.
హేబేలు తన ఉత్తమమైనదాన్ని తీసుకువచ్చాడు. ఇది క్రీస్తు ఉత్తముడనడానికి ఒక సూచన. మిగిలిపోయిన వాటిని తీసుకురావద్దు. ఇది ఆదికాండము 1–6లోని ఆసక్తికరమైన చిత్రం: సంతానం మరియు ప్రథమ ఫలాలు అన్నీ క్రీస్తును సూచిస్తాయి.
1 హార్డ్సేయింగ్స్ఆఫ్దిబైబిల్, డౌనర్స్గ్రోవ్, IL: ఇంటర్వర్సిటీప్రెస్, 1996, p. 101
ప్రశ్నలు
-
ఆదికాండం 4వ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో కయీను హేబేలు ప్రభువుకు అర్పించిన అర్పణలు తేడా ఏంటి?. ప్రభువు హృదయములను ఎరిగిన వాడని తెలుసుకొని యెషయా గ్రంథం 29:13 ప్రకారం నీవు హేబేలు వలె నీ జీవితంలో ఎలాంటి అర్పణను అర్పించుటకు ఇష్టపడుతున్నారు
దినవాక్యం
Laura Martin Genesis 4:4b-5a
“The LORD had regard for Abel and his offering, but He did not have regard for Cain and his offering.”
వారి హృదయాలను పరీక్షించుకోమని ప్రభువు విశ్వాసులను పిలుస్తున్నాడు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, “నేను కయీను సంతానంతో నడుస్తున్నానా, చెడు ఉద్దేశాలను కలిగి ఉన్నానా లేదా నేను ధర్మబద్ధమైన ఉద్దేశాలను కలిగి ఉన్న హేబెల్ సంతానంతో నడుస్తున్నానా?” మీరు స్వచ్ఛమైన హృదయంతో జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అప్పుడు, మీరు ఆయనను చూస్తారు. మీరు ప్రభువు నుండి ఏదీ వెనక్కి తీసుకోకుండా ఉండండి, తద్వారా దేవుడు మీ కోసం కలిగి ఉన్నదంతా మీరు చూడవచ్చు!
“యెహోవా హేబెలునుఅతనియర్పణనులక్ష్యపెట్టెను; కయీనునుఅతనియర్పణనుఆయనలక్ష్యపెట్టలేదు..”
- ఆదికాండము 4:4b-5a
తదుపరి లేఖన భాగములు
కీర్తనలు 51:10 — “దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ జేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము..”
కీర్తనలు26:2 — “యెహోవా, నన్నుపరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నాహృదయమును పరిశోధించుము.”
మత్తయి 5:8 — “హృదయ శుద్ధిగల వారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.