The Pentateuch Genesis

God's Promises To Abram

యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 10-12 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 4వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పునః సమీక్ష

ఆదాము అవ్వలు పండుతిన్నప్పుడు పాపము లోకములోనికి ప్రవేశించింది. ఆదికాండము 3:15లో సంతానము, క్రీస్తు వాగ్థానము చేయబడ్డాడు. యేసు వచ్చి సాతానును చితుకగొడతాడనే నిరీక్షణ మనము కలిగియున్నామని దీని అర్థము. ఆదికాండము 4–6 లో, కయీను మరియు హేబేలు కథ ద్వారా, స్త్రీసంతానము మరియు సర్పసంతానము యుద్ధము కొనసాగుతుంది. ఆదికాండము 7–9 లో, జలప్రళయములో జీవించుటకు దేవుడు నోవహు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ తరువాత, ఫలించి విస్తరించమని దేవుడు వారితో చెప్పాడు. కాని కనానుకు తండ్రియైన హాము తప్పుగా వెళ్ళి కుటుంబములో విభజన సృష్టించాడు. నోవహు హామును శపించాడు కాని అబ్రాము వంశావళిలోనున్న షేమును ఆశీర్వాదించాడు.

పాఠము :

ఆదికాండము11:27–29: అబ్రాము, నాహోరు, మరియు హారానులకు తండ్రి తెరహు. కాబట్టి వ్రాయబడిన షేము వంశావళి ప్రకారం (10 వ) తెరహు యొక్క ముగ్గురు కుమారులలో అబ్రాము ఒకడు. తన తండ్రియైన తెరహు జీవించియుండగానే హారాను తన స్వదేశములో మరణించాడు. అబ్రాము యొక్క భార్య శారయి. నాహోరు యొక్క భార్య మిల్కా (నాహోరు తన మేనకోడలిని వివాహం చేసుకున్నాడు). తన మరణానికి ముందు, హారానుకు ముగ్గురు పిల్లలు: మిల్కా, ఇస్కా, మరియు లోతు. 29వవచనములో అబ్రాము తన సవతి సహోదరి తెరహు యొక్క రెండవ భార్యా యొక్క కుమార్తెయైన శారాయిని పెండ్లిచేసుకున్నాడు.

ఆదికాండము 11:30 : శారాయి గొడ్రాలు. ఇప్పుడు ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఆ సంతానం ఆదాము నుండి షేతు నుండి నోవహు నుండి షేను నుండి తెరహు వరకు బదిలీ చేయబడింది (లూకా 3:23-38). ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ కుటుంబం మొత్తం చంద్ర దేవుడిని పూజించింది. తెరహ్ అనే పేరుకు అక్షరార్థంగా "చంద్రుడు" అని అర్ధం. ఈ ప్రజలకు ప్రభువులో నేపథ్యం లేదు.

ఆదికాండము 11:31: తెరహు లోతు, అబ్రాము, శారాయిలను తీసుకొని కనాను దేశానికి వెళ్లాడు. కానీ దారిలో, వారు కనానుకు బదులుగా హారానులో స్థిరపడ్డారు. వారు తమ లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పిలువబడి అక్కడకు రాకముందే ఆగిపోయారా? సంఘము పరిశుద్ధాత్మ నుండి నిరంతరం వింటుందని నేను అనుకుంటున్నాను, కానీ మనం ఏదైనా చేయమని అడుగబడినప్పుడు, మేము మా "హారాను" లో ఆపేస్తాము ఎందుకంటే అది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దేనికైనా పునాది వేయడం కంటే హరానులో సుఖంగా ఉండటమే సరైనదనిపిస్తుంది. కానీ అబ్రాము అనేయువకుడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని దేవునికి తెలుసు, అతని కుటుంబం చంద్రుడిని ఆరాధించేది. కొన్ని కారణాలవల్ల, దేవుడు అబ్రామును అతని జీవితంలో ఒక ప్రత్యేక పిలుపు కోసం ఎన్నుకున్నాడు. మీ భవిష్యత్తుకోసం దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది! ఆయన దీనిని చేయడానికి మిమ్మల్ని ఎంచుకున్నాడనే నిజముతో మీరు ఏకీభవించాలి. అది సంతానములో ఒక భాగం.

ఆదికాండము3:15లో ప్రారంభమైన సంతానమును ముందుకు తీసుకువెళ్ళుటకు దేవుడు అబ్రామును ఎన్నుకున్నాడు. అబ్రాము విశ్వాసముగల వ్యక్తి అని దేవునికి తెలుసు. హెబ్రీ 11వ అధ్యాయము విశ్వాస నాయకుల అధ్యాయమని తెలుసు. ఈ అధ్యాయములో, చాలా మంది నాయకులగూర్చి ఒక వచనం వ్రాయబడింది. మోషేను గూర్చి ఆరు వచనములు వ్రాయబడ్డాయి. కాని అబ్రాము గూర్చి 12వచనములు వ్రాయబడ్డాయి. ఆయన నిజముగా విశ్వాసులకు తండ్రి. అబ్రాము మూడు మతములకు తండ్రి అయ్యాడు. యూదామతం, ముస్లిం మతం, క్రైస్తవమతం.

ఆదికాండము 12: ఈ అధ్యాయంలో, మనం విశ్వాసం గురించి మరియు మనలో లోపాలు ఉన్నప్పటికీ, దేవుడు మనలను ఉపయోగించగలడని తెలుసుకోబోతున్నాం. వాస్తవానికి, అబ్రాము కొన్ని సమయాల్లో గందరగోళానికి గురికావడం మనం చూడబోతున్నాం. 2తిమోతి 2:13 "మనము నమ్మదగనివారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగ ఏదియు చేయలేడు." అనుటకు ఇది జ్ఞాపికగా ఉంది, మనం విశ్వాసం లేనివారమైనప్పటికీ దేవుడుతన ప్రణాళికను ఫలవంతంచేస్తాడు.

ఆదికాండము 12:1-3: ఆదికాండము 12:1-3లోనున్న ఈ చిన్న ధన నిధి మెస్సీయా యొక్క చిత్రపటమును ఎలా చిత్రీకరిస్తుంది? అబ్రాము యొక్క తండ్రి తెరహు చనిపోయిన తరువాత, తన తండ్రి యింటిని విడిచిపెట్టి తాను చూపింపబోవు దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రాముతో చెప్పాడు. ఆదికాండము 11లో, వాస్తవానికి తెరహు కనాను దేశానికి వెళ్ళాడు; అది అబ్రాము యొక్క పిలుపులో అది ఒక భాగము కావచ్చు. కాని వారి కొద్దిదూరములోనే ఆగిపోయారు. తెరహు చనిపోయినపుడు, అబ్రాము విడుదలచేయబడ్డాడు, దేవుడు ఆయనను వెళ్ళమని చెప్పాడు. 2వ వచనములో అబ్రాము యొక్క పేరును గొప్పచేస్తానని దేవునివాగ్థానము 2వ వచనములో నమోదుచేయబడినది. చంద్రదేవునిని ఆరాధిస్తూ పెరిగిన అబ్రాము అకస్మాత్తుగా దేవుని మాటను విన్నాడు! 3వ వచనములో, అబ్రాము ద్వారా భూమి మీదనున్న ప్రజలు ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్థానము చేశాడు. సంతానమును జ్నాపకము పెట్టుకొనండి? ఆ సంతానము షేమునుండి తెరహుకు వెళ్ళింది, మరియు అది అబ్రాము వరకు కొనసాగింది.

ఒకవ్యక్తి, అబ్రాము అనబడిన ఒక వ్యక్తి ఏడు విషయాలు సమూలముగా జీవించడాన్నిచూస్తాడు – అది తన జీవితకాలములో లేక తరువాత కావచ్చు. ఆయనకు వాగ్థానము చేయబడినవి:

  1. నీకు భూమి ఇవ్వబడుతుంది: ఆదికాండము 12:7లో “నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదను” అని దేవుడు అబ్రాముకు వాగ్థానం చేశాడు: శపించబడిన కుమారుడైన హాము వంశస్థులు అక్కడ నివసించారు. ఈ దేశములోనికి అబ్రాము వెళ్ళినప్పుడు శత్రుత్వం ఉంటుంది(హెబ్రీ 11:8-10; ఆదికాండము 12:1-3).

ఆదికాండము (7వ) తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రాము అక్కడ ఒక బలిపీఠము కట్టాడు. బెత్లేహేములో ప్రభువైన యేసు క్రీస్తు జన్మింపకమునుపు అబ్రాముకు ప్రత్యక్షమైన ఆయన పూర్వఅవతారము.

క్రీస్తు యొక్క పూర్వఅవతారమిదేయని మనకెలా తెలుసు?అది వందశాతము నిరూపించబడలేదు, కానిఆ దికాండము 17లో మరియు 18లో, యేసు అబ్రాహాముకు చూపించాడు. అబ్రాము ఆయనను ఎదుర్కొన్న ప్రతిసారి అబ్రాహాముకు యేసుచూపించాడు, సంబంధము పెరిగింది.

నిర్గమకాండము 33:20 ఇలాచెబుతోంది, "  ఆయన నీవు నాముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను." ఈ వచనము తండ్రి అయిన దేవుడిని సూచిస్తుంది (నిర్గమకాండము 33:12-23; యోహాను 1:18) పాతనిబంధనలో, దేవుని కుమారుడే కనిపించాడని నేను నమ్ముతున్నాను. మేము దానిని ఖచ్చితంగా నిరూపించలేము, కానీ యోహాను 8:56లో, యేసు ఇలా అన్నాడు, “ మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.”

నీవు ఒకగొప్ప జాతిగా మారుదువు. అబ్రాము భార్యగొడ్రాలు, కాని అతనిని గొప్పదేశంగా చేస్తానని దేవుడు వాగ్థానం చేశాడు. హెబ్రీ 11:2 ఇలా వివరిస్తుంది. “అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి, సంఖ్యకు ఆకాశ నక్షత్రములవలెను, సముద్ర తీరమందలి లెక్కింపశక్యము కాని యిసుకవలెను సంతానము కలిగెను.”

నీ పేరు గొప్పదగును: ఆదికాండము 23:6 చూడండి. చివరికి ఏం జరిగిందో తెలుసా? అబ్రాము రాజుల మధ్య సమాధిచేయబడ్డాడు.

నీవు ఆశీర్వదింపబడతావు. తన అనుగ్రహాము అబ్రాముకు జీవితాంతం ఉంటుందని దేవుడు వాగ్థానం చేశాడు. కీర్తన30:5 “ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును.” అబ్రాము దేవునికి స్నేహితుడు. మూడు వేర్వేరుసార్లు అబ్రాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు(2 దినవృత్తాంతములు 20:7; యెషయా 41:8; యాకోబు 2:23). మీలో క్రీస్తు అనబడిన సంతానము కలిగియున్న ప్రతియొక్కరు దేవుని స్నేహితులే! అబ్రాము విధేయత చూపినాడు గనుక ఆశీర్వాదము వచ్చింది. ఆదికాండము 22:17–18 “నీవు నా మాట వినినందున భూలోకములో నిజనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును.” ఈరోజున సంఘములో సవాలు అదే! నీవు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? విధేయత కలిగి యుండుము.

నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రజలు అబ్రాహాముతో సంభాషించారు అందునుబట్టి వారుఆశీర్వదించబడ్డారు. 1:3 కీర్తనలు ఇలాచెపుతుంది: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకువాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.” ఇది అబ్రాము యొక్క చిత్రపటమని నేను అనుకుంటున్నాను. అబ్రామునుండి వచ్చిన ఫలము ఇతరులకు ఆశీర్వాదమైనది. మన ఫలము ఇతరులకు ఆశీర్వాదము.

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను. ఫరో శారాయిని తన భార్యగా తన యింటచేర్చుకొన్నాడు తద్వారా తన యిల్లంతా శపించబడినది. అబీమెలెకు శారాయిని తన భార్యగా తనయింటచేర్చుకొన్నాడు, అతనికి కూడాఅదే సంభవించింది (ఆదికాండము 20). అబ్రాముతో మరియు అతని ప్రజలతో గొడవపడవద్దు.

ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా అమెరికా ప్రెసిడెన్సీనిర్ణయం తీసుకున్న ప్రతిసారీ, అమెరికాకు ఏదోచెడు జరిగింది. ఉదాహరణకు, ది ఫర్ఫెక్ట్ ఆర్మీ చిత్రములో చిత్రీకరించినట్లుగా, అధ్యక్షుడు బుష్ ఇశ్రాయేలుతో మరియు భూమిలోనిస్థావరాలతో ఎలాపనిచేయాలనే దాని గురించి నిర్ణయంతీసుకున్న వెంటనే, ఖచ్చితమైన తుఫాను వచ్చింది మరియు వాస్తవానికి మైనేలోనికెన్నె బంక్‌పోర్ట్లో ఉన్న తన వెకేషన్ గృహమును తుడిచిపెట్టింది. మేము ఇశ్రాయేలు నుండి భూమినితీ సివేయాలని నిర్ణయించుకున్న ప్రతిసారీ లేదా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడల్లా, అమెరికా మరియు/లేదా దాని నాయకులకు ఏదో చెడు జరిగింది. ఆదికాండము 12:3 నేటికి కూడా సంబంధించినది! దయచేసి భూమి మరియు ఇశ్రాయేలు ప్రజలతో రాజీపడకండి!

ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. అబ్రాము సంతానాన్ని పొందుకున్నాడు. షేమునుండి ఆ సంతానము వెళ్ళింది. అది తెరహుకు ఆతరువాత అబ్రాముకు వెళ్ళింది. జ్నాపకము పెట్టుకొనండి. యోఫ్తా ప్రజలు షేము ద్వారా ఆశీర్వదించబడ్డారు మరియు “వారు షేముగుడారాలలో నివసించారు (ఆది 9:27). అబ్రాము ద్వారా వారు అంటుకట్టబడి మరియుఆ శీర్వదించబడ్డారు. అంతిమంగా, ఈ ఆశీర్వాదము ఒకవ్యక్తి ద్వారా వచ్చింది: మెస్సీయా ద్వారా భూమిమీదనున్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు (గలతీ 3:16–19a).

ముగింపు

ఆదికాండము 12:1-3లోని వాగ్దానం చివరికి క్రీస్తును సూచిస్తుంది...అబ్రాము విశ్వాసం కారణంగా, అతనిలో లోపాలు ఉన్నప్పటికీ, మన మెస్సీయ భూమిపైకి వచ్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఆసంతానం, బహు శాక్రీస్తే స్వయంగావచ్చి, అబ్రాముకు ఆవాగ్దానాన్నే చెప్పాడు! అబ్రాము తనభయాన్ని పోగొట్టుకొని విశ్వాసంతో వెళ్ళాడు కాబట్టి ఇదిజరిగింది. సి. యస్. లూయిస్ ఇలా అన్నాడు, "ఈ ప్రపంచంలో ఏ అనుభవం తీర్చలేని కోరికను నాలోనేను కనుగొంటే, నేను మరొక ప్రపంచంకోసం సృష్టించబడ్డాను అని అత్యంత సంభావ్య వివరణ."1

దేవుడు తనను ఎక్కడికి పిలిచాడో అక్కడికి వెళ్ళటం అబ్రాము ఆపలేదు, మరియు దేవుడు తన వాగ్థానాలను ఇస్తూనే ఉన్నాడు. తను వేరొక స్థలమునకు వెళ్ళాలని అబ్రాము వందశాతం విశ్వాసించాడు. హెబ్రీలో లేఖనము ఇదే చెబుతుంది. దానిని బట్టి మనమందరము – యూదులు మరియు అన్యులు – యేసుక్రీస్తు అనబడిన మెస్సీయా ద్వారా ఆశీర్వదించబడే అవకాశం కలిగియున్నాము.

ప్రశ్నలు

  1. తెరహు, అబ్రాము, శారాయి మరియు హారానులు కనానుకు బయలుదేరారు, కాని హారానులోనే వారు స్థిరపడి ఆగిపోయారు. కనానుకు వెళ్ళకుండా హారానులో వారు ఎందుకు ఆగిపోయారని నీవు అనుకుంటున్నావు? మరల వారు బయలుదేరుటకు కారణమేమిటి? (ఆదికాండము 11:31; 12:4–5).

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Genesis 12:2

“I will make you into a great nation, I will bless you, I will make your name great, and you will be a blessing.”

అబ్రాము క్రీస్తు సంతానాన్ని మోసుకెళ్ళమని ప్రభువు ఆశీర్వదించాడు, ఆ సమయంలో అతని భార్యశారాయి గొడ్రాలుకాబట్టి అది అర్ధం కానప్పటికీ. అబ్రామును గొప్ప దేశంగా చేస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు మరియు అబ్రాము విశ్వాసంతో దేవుని వాగ్దానాన్నినెరవేర్చాడు.

మీరు మిమ్మల్నిమీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు, "నా పిలుపులో నేను ఎలా నడువబొతున్నాను?" భయపడకుము అని ప్రభువు వాక్యము చెప్పుచున్నది, నీవు పేరుపెట్టి పిలువబడ్డవు. మీరు ఏ దిదాటినా, ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. ప్రభువు మీకు తోడుగా ఉన్నాడని నిశ్చయతతో తెలుసుకొని, నీ పిలుపును విరమించుకో!

“నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమునుగొప్ప  చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.”

— ఆదికాండము 12:2

తదుపరిలేఖనభాగములు

  • యెషయా 43:1–2 — “అయితేయాకోబూ, నిన్నుసృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలూ, నిన్నునిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. – నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్నుపిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడివెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచుప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్నుకాల్చవు”
  • హెబ్రీ 11:8 — “అబ్రాహాము పిలువబడినప్పుడు అతడును, అతనితో ఆ వాగ్థానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్థాత్త దేశములో పరవాసులైరి.”
  • యెషయా 41:10 — “భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను, దిగులుపడకుము నేను నిన్ను బలపరతును, నీకు సహాయముచేయువాడను నేనే, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”