The Promise Of Offspring
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 13-15 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
సమీక్ష
ఈ విషయాలన్నీ వాగ్దానం చేయబడిన అబ్రాము ద్వారా సంతానముగా, క్రీస్తు పంపబడ్డాడు. దేవుడు అతనితో మాట్లాడారు, కానీ ఇంకా ఏమీ జరగలేదు. అది13 లో, అబ్రాము మరియు లోతు చాలా ఆస్తులను సంపాదించారు, వారు విడిపోయి వేర్వేరు దిశల్లో వెళ్ళవలసి పరిస్థితివచ్చింది. అది14లో, అబ్రాము బంధించబడిన లోతును రక్షించడానికి వచ్చాడు. మెల్కీసెదెకు, "సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు" (ఆదికాండము 14:18), అబ్రామును కలిశారు.యేసు, ఎమ్మాయికు వెళ్లే మార్గంలో, తన గురించి లేఖనాలు చెప్పినవన్నీ శిష్యులకు వివరించాడు (లూకా24:27), మరియు ఆయన మాట్లాడే విషయాలలో ఇది ఒకటి కావచ్చు. మెల్కీసెదెకు క్రీస్తు యొక్క ఒక సాదృశ్యం - క్రీస్తు కాదు కానీ ఆయన చిత్రం. పాత నిబంధనలో మరెక్కడా రాజుగానూ, యాజకుడిగానూ ఉన్న వ్యక్తి లేడు. యేసుక్రీస్తు అంటే సరిగ్గా అదే - ఆయన యాజకుడు మరియు రాజు.
పాఠము
ఆదికాండము 15:1: “ఈ సంఘటనల తర్వాత ...” ఈ పదబంధాన్ని అర్థం చేసుకోవడానికి, ఆదికాండము14లోని సంఘటనలను తిరిగి చూడండి. లోతు ఖైదీగా ఉన్నాడని అబ్రాము విన్నాడు, కాబట్టి అబ్రాము318 మంది శిక్షణ పొందిన పురుషులను సమీకరించాడు. అతను వారిని దానుకు వెంబడించి, దాడి చేసి, దమాస్కసుకుఉత్తరాన ఉన్న హోబా వరకు వారిని వెంబడించాడు (వ. 15). అబ్రాము లోతును, అతని వస్తువులను మరియు అతని కుటుంబాన్ని ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. కదొర్లాయోమెరు మరియు ముగ్గురు రాజులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత (వ. 17), మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించాడు మరియు అబ్రాము మెల్కీసెదెకుకు "అన్నిటిలో పదయవ వంతు" ఇచ్చాడు (వ. 19-20). దశమ భాగం లేదా దేవునికి పది శాతాన్ని ఇవ్వడాన్ని సమర్థించే అంశమును ఇది ఒకటి.
అబ్రాముకు దర్శనంలో యెహోవా వాక్కు వచ్చి. "భయపడవద్దు." మీరు యుద్ధాల ద్వారా వెళ్ళిన తర్వాత, మీరు సాధారణంగా ధృఢనిశ్చయతతో ఉంటారు అని చెప్పింది. కాని అబ్రాము రాజుల ప్రతీకారానికి భయపడే స్థితిలో జీవించాడు. దేవుడు మన హృదయాలను ఎంతగా ఎరిగి మనతో సరిగ్గా మాట్లాడుతున్నాడో ఆశ్చర్యంగా లేదా?. “నేను మీకు తోడై ఉన్నాను” అని ఎరిగి మీరు నడుచుకొనవలెను. దేవుడు మన కవచం మరియు మన గొప్ప బహుమతి. "మీ బహుమానం చాలా గొప్పది" అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఒక వైపుకు తిరిగి ఇప్పుడు అబ్రాముకు చేసిన ఏడు వాగ్దానాలను నెరవేర్చడం ప్రారంభిస్తాడని నేను అనుకుంటున్నాను.
ఆదికాండము15:2: అబ్రాము ఇలా జవాబిచ్చాడు: “ప్రభువా, నాకు పిల్లలు లేనందున నీవు నాకు ఏమి ఇవ్వగలవు?” కొన్ని కారణాల వల్ల, అబ్రాము సందేహంతో స్పందించాడు. ఆ ఏడు విషయాలు నిజమవుతాయని దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రాము ఖచ్చితముగా నమ్మలేదు. బహుశా అతను సైనిక ప్రతీకారం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు మరియు అతనికి వారసుడు లేనందునఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉండవచ్చు, కాని అతని సేవకుడు ఎలియాజరు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ, విశ్వాసం ఉన్న ఈ వ్యక్తి దేవుణ్ణి ఎదుర్కొన్నప్పటికీ ఇంకా సందేహించాడు. అతను ఉప్పొంగుతున్న సముద్రంలా ఉన్నాడు (యాకోబు1:6). మనం ఒకే సమయంలో విశ్వాసం మరియు సందేహంతో పనిచేయలేము. అబ్రాము వాగ్దానం విన్నాడు, కాని క్షణంలో, అతను వారసునిగాని మరియు కొడుకునిగాని చూడలేదు.
ఆదికాండము15:3: అబ్రాము తనకు సంతానం లేనందున, తన దాసుల్లో ఒకడు తన వారసుడు అవుతాడని చెప్పాడు. ఆచరణాత్మకంగా, ఇంట్లో పిల్లలు లేకుంటే, బానిస వారసులవుతారు. అప్పుడు ఆ సంతానం ఎలియేజర్ ద్వారా వచ్చేది.
ఆదికాండము15:4: అయితే అబ్రాము వారసుడు అతని నుండేవస్తాడని దేవుడు ప్రతిస్పందించాడు. సంతానం, భౌతికంగా క్రీస్తు అబ్రామునుండే వచ్చాడు. దేవుడు తన సంతానం కొనసాగించడానికి విశ్వాసం ద్వారా మానవులను ఉపయోగించుకొనడు. ఆదికాండము12:7ని చూడండి. దేవుడు అబ్రాము “సంతానానికి” ఆ దేశాన్ని వాగ్దానం చేశాడు. ఇక్కడ “సంతానం” అంటే “విత్తనం” –– అబ్రాము సొంత పిల్లలు. ఈ విధముగా భయపడుటకు అబ్రాము అనుమతించాడు. ఇది మానవ అవతారమెత్తక ముందు ఉన్న క్రీస్తు అని నేను నమ్ముచున్నాను (ఆదికాండము13:15-16). పదే పదే, ఆదికాండము12, 13, మరియు 15లో, దేవుని సందేశం, “అబ్రామా, నీకు సంతానం కలుగబోతోంది! అని చెప్పబడింది”
ఆదికాండము15:5: “ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.” నాకు ఛాయాచిత్రాలు అంటే చాలా ఇష్టం. దేవుడు చాలా ఆచరణీయుడు. నా జీవితంలో నేను ఎలాంటివారసత్వాన్ని వదిలి వెళుతున్నాను అనే దాని గురించి నేను ప్రార్థిస్తూ ఉంటాను. నేను ఎవరో నా పిల్లలు ఎలా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను? నేను కేవలం సరదా తండ్రిగా ఉండాలనుకోను."మా నాన్న విశ్వాసంతో పనిచేశారు" అని నా పిల్లలు చెప్పే వ్యక్తిగా నేను గుర్తించబడాలనుకుంటున్నాను. మీరు విశ్వాసంతో నడిచి, దేవుడు మీ జీవితంలో చెప్పిన విషయాలను విశ్వసించినప్పుడు, దేవుడు దానిని గౌరవిస్తాడని నేను నమ్ముతున్నాను.
ఆదికాండము 15:6 “ అబ్రాము యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను”. టామ్ కానిస్టేబుల్, ఇతరులలో, ఈ "నీతి" అంటే అబ్రాము ప్రభువును విశ్వసించాడు, ప్రభువులో తనను తాను స్థిరపరచుకున్నాడు. చాలా మంది వ్యాఖ్యాతలు ఈ నీతి దేవునిపై ఆధారపడి ఉందని మరియు అబ్రాము మీదకాదని చెప్పారు. ఈ నీతికి క్రియలతో సంబంధం లేదు.
అది ఎందుకు జరిగిందంటే అబ్రాము దేవుణ్ణి నమ్మాడు గనుక. మనకెలా తెలుసు? లేఖనాలు ధృవీకరించుచున్నవి. హెబ్రీయులు 11:8 ఇలా చెబుతోంది “ అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను”. అబ్రాము దేవునిని నమ్మాడు. రోమ 4:11” అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడును అది ఆయన చేసిన క్రియలను బట్టి కాదు గాని విశ్వాసమును బట్టి. విశ్వాసమును
బట్టి మాత్రమే మనం నీతిమంతులుగా ఎంచబడుచున్నాము. అబ్రహాములో ఎదో విత్తబడింది, మరియు ఈ విత్తనము కొంచెం కొంచెంగా ఎదిగి బలపడింది, తద్వారా అతడు దేవునియందు విశ్వాసముంచుట ప్రారంభించాడు.
ఆదికాండము 15:7 “ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పిను”.
ఆదికాండము 15:8: దేవుని నుండు కొన్ని రుజువులను అబ్రాము అడిగాడు! నేల పొడిగా ఉన్నప్పుడు ఉన్ని తడిగా ఉండాలని మరియు నేల తడిగా ఉన్నప్పుడు పొడిగా ఉండాలని కోరిన గిద్యోను కోరిక వంటిది. “అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియునని” అడిగాడు.
ఆదికాండము 15:9-11: మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని దేవుడు అబ్రాముతో చెప్పాడు. దేవుడు అబ్రాముకు సూచనలు ఇచ్చాడు. అబ్రాము పక్షులు మినహా ఈ జంతువులన్నింటినీ నడుమకు ఖండించాడు.
ఆదికాండము 15:12-15 “ దీనిని అబ్రాము దర్శనము యొక్క రెండవ భాగముగా చూడవచ్చు.అబ్రాములో గొప్ప భయం మరియు చీకటి అలుముకుంది. దేవుడు అబ్రాముతో చెప్పాడు “ ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.” ఆదికాండము 12:1-3లో, దేవుడు అబ్రాముకు ఒక సాధారణ వాగ్దానాన్ని ఇచ్చాడు.ఆదికాండము 15:5-6లో, నిర్దిష్టంగా వాగ్దాన౦. అబ్రాము సంతానం 400 సంవత్సరాల వరకు వాగ్దానభూమిని పొందదని దేవుడు చెప్పాడు.అబ్రహాముకు వాగ్దానము చేయబడిన క్రీస్తు అను సంతానము అనేకులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటాడో మరియు ఆయన ఏ విధంగా మరణించవలసి ఉన్నది అన్న విషయాలు అతనికి తెలియపరచబడును. ఆయన జీవితమును గూర్చిన ప్రవచనములు సాధారణ నుండి ప్రత్యేకమైనవరకు ఉన్నవి.
ఆదికాండము 15:16” అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.” 400 సంవత్సరాలు ఎందుకు? ఇది అంతా సమయానికి సంబంధించినది. అమోరీయులు తమ పాపంలో కొనసాగడానికి దేవుడు సమయం ఇచ్చాడు. మరియు దీనిని మరొక కోణం నుండి చూద్దాం. అమోరీయులకు సమయం కావడమే కాదు, అబ్రాము తన సంతానం పెరగడానికి, ఆకాశంలో నక్షత్రాలుగా, ఇసుక రేణువులులాగా విస్తరించబడుటకు సమయం కావాలి. అబ్రాము పిల్లలు భూమిని స్వాధీన పరచుకొనేంత సంఖ్యాబలం కలిగి లేరు. అబ్రాము సంతానం ఫలవంతం కావడానికి మరియు వృద్ధి చెందడానికి సమయం కావాలి. మన సూక్ష్మ సమాజంలో మనము ప్రతిదీ వెంటనే జరగాలి భూమిని ఇప్పుడే స్వతంత్రించుకోవాలని అనుకుంటాము కానీ దేవుని పెద్ద ప్రణాళికలో విత్తనము ఎల్లప్పుడూ వెంటనే ఫలించదు. భూమిలో విత్తనం నాటడం గురించి చూసినట్లయితే, విత్తనం వెంటనే మొలకెత్తదని తెలియజేయు చున్నాను. ఏ విధంగా విత్తనం మొలకెత్తడానికి సమయం పడుతుందో ఆ విధంగానే అబ్రహాము యొక్క వాగ్దానం మొలకెత్తడానికి కూడా సమయం పడుతుంది
ఆదికాండము15:17: అబ్రాముపై ఆధారపడి ఎటువంటి షరతులు లేకుండా యెహోవా అబ్రాముతో నిబంధన చేసెను. దేవుడు ఈ రోజున దీనిని ఫలవంతం చేసి, మొత్తం భూమిని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడా? అ౦తా కాదు. 1948లో వారికి కొంత భూమి మాత్రమే తిరిగి ఇచ్చాడు. పాత నిబంధన ఇంకా పూర్తి కానందున నేను సంతోషిస్తున్నాను. ఇశ్రాయేలు ఇంకా పూర్తి కాలేదు. అబ్రాముతో దేవుని నిబంధన పూర్తి కాలేదు మరియు పూర్తిగా నెరవేరలేదు.
ముగింపు:
బైబిల్.ఓఅర్ జి. రాసిన బాబ్ డేఫిన్బాగ్. "అయితే ఆలస్యం మరియు కష్టాల మధ్య దేవుణ్ణి నమ్మడం ద్వారా విశ్వాసం చాలా అరుదుగా విజయం ద్వారా బలపడుతుంది." దేవుడు తనకు వాగ్దానం చేసినవాటిని అబ్రాము చూడలేదు, అయినప్పటికీ అతను విశ్వాసంతో నడిచాడు. ఇశ్రాయేలు ప్రజలు బలంగా ఉండడం దేవునికి అవసరం. ఆలస్యం మరియు ఇబ్బందుల్లో మన విశ్వాసం బలపడుతుంది. మరియు నాకు తెలిసినది ఏమిటంటే, దేవుడు ఆదికాండములో వీటన్నింటినీ ప్రారంభించినప్పుడు సంతానముతో ఆయన ప్రారంభించెను. రోమన్లు 8:31-39 మనకు గుర్తుచేస్తుంది, " దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?".
ప్రశ్నలు
-
ఆదికాండము 13:1–18లో, అబ్రాము మరియు లోతు ఎందుకు విడిపోయారు? వారిలో ప్రతి ఒక్కరు ఏ భూమిని ఆక్రమించుకున్నారు మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది? (ఆదికాండము 14:1–12)
దినవాక్యం
Laura Martin Genesis 15:5-6
“He took him outside and said, ‘Look at the sky and count the stars, if you are able to count them.’ Then He said to him, ‘Your offspring will be that numerous.’ Abram believed the LORD, and He credited it to him as righteousness.”
అబ్రాము పిలుపు అతనికి తార్కికంగా అర్థం కాలేదు. అయితే, అబ్రాము స్పష్టత కోసం దేవుని వైపు తిరిగాడు మరియు అబ్రాము పిలుపుపై ప్రభువు ప్రత్యేకతలు ఇచ్చాడు. అబ్రాము దేవుణ్ణి నమ్మాడు మరియు విశ్వాసంతో నడిచాడు.
ప్రభువు నిన్ను నీ స్వంత దారికి పిలిచాడు. విశ్వాసంతో నడుచుకోవడమంటే మనిషి కంటే దేవునికి ఎక్కువగా భయపడడం, ప్రతి సందర్భంలోనూ దేవుణ్ణి నమ్మడం. నేడు, అబ్రాము క్రీస్తు యొక్క సంతానాన్ని మోసుకెళ్ళేటప్పుడు, విశ్వాసంతో నడుచుకోండి. ఒక్కొక్క అడుగు వేయండి, ప్రభువు మీ మార్గాన్ని నిర్దేశిస్తాడు.
“మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.”
— ఆదికాండము 15:5-6
తదుపరి లేఖన భాగములు
హెబ్రీయులకు 11:1 — “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.”
2 కొరింథీ 5: 6 — “ వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము.”
సామెతలు 3:5–6 — “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.