Finding A Wife For Isaac
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 23-24 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఆదికాండము 22లో, దేవుడు అబ్రాహామును తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పి పరిశోధించాడు. మనము ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఈ సంతానము యొక్క కొనసాగింపును మనము చూస్తాము. శారా 127 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ఆదికాండము 23 వెల్లడించింది. 4-6 వచనాలలో, శారాకు ప్రత్యేకమైన శ్మశానభూమిని ఇవ్వడం జరిగింది. 11-20 వచనాలలో, అబ్రాహము హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద 400 తులాల వెండికి, పొలాన్ని మరియు మక్పేలా గుహను కొనుగోలు చేసి, అక్కడ అతను శారాను పాతిపెట్టెను.
భోదన
ఆదికాండము 24:1: “అన్ని విషయములలో” దేవుడు అబ్రాహమును ఆశీర్వదించెను. ఆదికాండము 12 మరియు ఆదికాండము 15 నుండి దేవుని వాగ్దానాలు ఫలించడం ప్రారంభించాయి. పాత నిబంధనలో దేవుడు తన వాగ్దానాలతో పూర్తి చేయలేదు. ఇప్పుడు ఇస్సాకు సంతానాన్ని కొనసాగించాలి. ఒక వేళ సంతానము ఉంటే మరియు ఆ సంతానాన్ని మోసే భార్య ఉండాలి. ఆదికాండము 24లో దేవుడు సంతానాన్ని మోసేవారని ఇస్సాకుకు ఇచ్చాడు. అది కేవలము పురుషుడి నుండి మాత్రమే కాదు, గాని స్త్రీ ద్వారా కూడా, ఆ సంతానము కొనసాగుతుంది.
ఆదికాండము 24:2: అబ్రాహము తన సేవకుడితో నీవు నా స్వదేశమునకు మరియు నాబందువుల యొద్దకు పోయి ఇస్సాకుకు భార్యాను కనుగొనుము అని ప్రమాణము చేయించెను. ఆదికాండము 15:2-3లను తిరిగి చూసినప్పుడు, సేవకుడు ఎవరో మనకు కచ్చితముగా తెలియదు కాని బహుశా ఎలియాజరు అయిఉండవచ్చు. “నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము” అనే పదబంధాన్ని అక్షరాలా నా నడుము/జననాంగాలుగా అనువదించవచ్చు. ఎందుకు? అది స్వలింగ ప్రక్రియ కాదు. ఇది జీవిత మూలాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 24:3-6: ఆదికాండము 24:3-6: సంతానము కొనసాగించడానికి ఇది అత్యంత కీలకమైన పని. అబ్రాహాము తన సేవకుడు అనుసరించడానికి మూడు షరతులను పెట్టాడు:
- కనానీయుల నుండి భార్యను ఎన్నుకోవద్దు. ఎందుకు? కనానీయులు హాము సంతతివారు, వారు షేము మరియు యాపెతుకు దాసులు అవుతారు కాబట్టి. వారు బయలు మరియు అషేరు దేవతలను ఆరాధించువారు (ద్వితీయోపదేశకాండము 7-1-6). సంతానాన్ని మోసేవారు అబద్ద దేవతలను నమ్మేవారు కాకూడదు.
- అబ్రాహము కుటుంబం నుండి ఆమెను ఎన్నుకోవాలి.
- ఇస్సాకును తిరిగి అబ్రాహము పూర్వికుల ఇంటికి తీసుకువెళ్ళకూడదు.
ఆదికాండము 24:7: నీ కొరకు మార్గమును సిద్దపరచడానికి దేవుడు నీకంటే ముందుగా వెళ్ళును అని తన సేవకునికి చెప్పెను. దేవుడు ఎప్పుడు ముందుగానే ఉంటాడు. ఆదాము హవ్వలు పాపము చేసినప్పటికీ, దేవుడు అప్పటికే అక్కడికి వెళ్ళడానికి ప్రణాళికను కలిగియున్నాడు. హాము ద్వారా ఏమి జరుగుతుందో దేవునికి తెలుసు, మరియు సంతానము అయిన క్రీస్తు షేము ద్వారా వస్తారు అని ఆయనకు తెలుసు. దేవుడు ఎప్పుడూ మన లోపాలను తుంగలో తొక్కుతూ, అధిగమిస్తూనే ఉంటాడు.
ఆదికాండము 24:8: అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు, అయినప్పటికీ అతను నివేదికను ఇవ్వాలి. రోమ పత్రిక 14:12 “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను”. భార్యకు మార్గాన్ని సిద్ధం చేయాలన్నా, క్రీస్తుకు మార్గాన్ని సిద్ధం చేయాలన్నా, మనకి నివేదిక ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది. దేవుడు చెప్పిన షరతులకు మనం విధేయత చూపుతున్నామా? మనందరికీ పూర్తి చేయడానికి భాద్యతలు ఉన్నాయి. మొదటి యోహాను 2:28లో ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి అని చెప్పబడింది. దేవుని సేవకులుగా, మనం ఫలితాన్ని అందించలేము, కానీ ఆయన మనలను ఏమి చేయమని అడుగుతున్నాడో దానికి విధేయత చూపాలని ఆయన ఆశిస్తున్నాడు.
ఆదికాండము 24:9-11: అబ్రాహము సేవకుడు తనకు ఇవ్వబడిన భాద్యతకు కట్టుబడి ఉన్నాడు. తనకు ఇవ్వబడిన షరతులను పాటించడానికి ఒప్పుకున్నాడు. ఒంటెల మీదా ప్రయాణం చేయడం చాల అసౌకర్యంగా ఉంటుంది, కాని అవి సంపదకు చిహ్నంగా ఉన్నాయి. పది ఒంటెలు చాల ఎక్కువ. అబ్రాహాము సేవకుడు ఒంటెలను ఊరి బయట ఉన్న బావి పక్కన మోకరిల్లేలా చేశాడు. అది స్త్రీలు నీళ్లు తోడుకోవడానికి వెళ్లే సమయం. ఒక ఒంటె 25 గ్యాలన్లు నీళ్ళు త్రాగాగలదు! పది ఒంటెలకు, వారికి 250 గ్యాలన్ల నీళ్ళు అవసరం.
ఆదికాండము 24:12-17: ఇది నిర్దిష్ట మార్గదర్శకత్వం కోసం లేఖనంలోని మొదటి ప్రార్థన. “నాపని సఫలము” చేయమని సేవకుడు ప్రార్ధన చేశాడు. విజయాన్ని దేవుడు చూపించినట్లు నిర్వచించవచ్చు. హెస్డ్ అనే హెబ్రీ పదాన్ని సాధారణంగా “ప్రేమపూర్వక దయ,” “దయ,” లేదా “ప్రేమ” అని అనువదిస్తారు. అబ్రాహంతో తనకు ఉన్న సంబంధానికి దేవుడు తన విధేయతను కొనసాగించాలని సేవకుడు ప్రార్థన చేశాడు. సేవకుడు ప్రార్ధన చేస్తుండగా ఆ స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి బయటికి వచ్చింది. ఆ ప్రార్ధన సేవకుడి గురించి కాదు. ఇది అందరితో సంబంధం కలిగి ఉంది. దేవుడు ఇక్కడ ఏమి చేస్తున్నాడో సేవకుడికి అర్థం అయింది. బోయజుతో రూతుకి సరిగ్గా ఇదే జరిగింది. మీ హృదయం ప్రభువుతో సరైనదిగా ఉన్నప్పుడు దేవుడు కలుగ చేసుకుంటాడు. వారెన్ వైర్స్బే ఈ సేవకుని జీవితాన్ని వివరించాడు: అతను ప్రార్ధించాడు, అతను సహాయం కోసం అడిగాడు, అతను తన కళ్ళు తెరిచి ఉంచాడు, మరియు అతను ప్రార్ధించినప్పుడు, దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు.1 “వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను అలంకిచెదను.” అని యెషయా 65:24లో వ్రాయబడి ఉంది. మనం నిరీక్షణతో ప్రార్థించినప్పుడు దేవుడు జవాబులు ఇస్తాడు. "అతను మాట్లాడటం పూర్తికాకముందే, అక్కడ రిబ్కా ఉంది." సేవకుడు ఆమెను కలవడానికి పరిగెత్తాడు. సేవకుడికి తన హృదయంలో తాను ప్రార్థన చేసిన స్త్రీ ఆమెనే అని గ్రహించాడు. కొన్నిసార్లు ప్రభువు మీలో హృదయ సంబంధాన్ని నిక్షిప్తం చేస్తాడు. కొన్నిసార్లు, అది మీకు తెలుస్తుంది.
ఆదికాండము 24:18-21: రిబ్కా నీళ్ళు సేవకునికి మాత్రమే కాక, తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పింది. రెండు 5-గాలన్ బకెట్లను 25 సార్లు తీసుకువెళుతున్నట్లు ఊహించుకోండి. వైర్స్బే ఇలా పేర్కొన్నాడు, "ప్రతి సందర్భాన్ని ఒక గొప్ప సందర్భంగా మార్చుకోండి, ఎందుకంటే ఎవరైనా పెద్ద స్థలం కోసం మీ కొలతను ఎప్పుడు తీసుకుంటారో మీరు ఎప్పటికీ చెప్పలేరు."2 మరో మాటలో చెప్పాలంటే, మీరు ఏదైనా చిన్న పని చేస్తున్నప్పుడు, ఎవరైనా చూస్తున్నారో మరియు మిమ్మల్ని ఉన్నత స్థానానికి ఎదగడానికి సిద్ధంగా ఉన్నారని మీరు ఎప్పటికీ చెప్పలేరు. దేవుడు రిబ్కాను క్రీస్తు వంశంలో సంతానాన్ని కలిగి ఉండేలా గౌరవించాడు. మనం జీవితంలోని చిన్న చిన్న వివరాలతో బయటకు వెళ్లినప్పుడు, మనం క్రీస్తును గౌరవిస్తున్నాము. మరియు కొన్నిసార్లు దేవుడు ఆ చిన్నదానిని తీసుకొని మీకు ఎక్కువ ఇస్తాడు (లూకా 16:10). రిబ్కా పనిని పూర్తి చేయగలదా, తను చెప్పిన ఆమె గౌరవిస్తుందా అని సేవకుడు నిశ్శబ్దంగా చూస్తున్నాడు.
ఆదికాండము 24:22-27: రిబ్కాకు, సేవకుడు సమృద్ధిగా బహుమతులను ఇచ్చాడు. బెతూయేలు ఇస్సాకుకు బంధువు. అకస్మాత్తుగా, మరొక అర్హత నెరవేరవేర్చబడింది. రిబ్కా, అబ్రాహము యొక్క కుటుంబానికి చెందినది. రిబ్కా సేవకుడిని ఊదేసిందని నేను అనుకుంటున్నాను. మనం విశ్వాసంతో నడుచుకున్నప్పుడు, అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కాని మనం విశ్వాసంతో నడవాలి అని నేను ఆలోచించినప్పుడు, దేవుడు ఎల్లప్పుడు మనము ఉహించినదానికంటే అధికముగా చేస్తాడు. (ఎఫెసీయులకు 3:20). రిబ్కా తాను ఊహించిన దానికంటే గొప్పది కాబట్టి సేవకుడు సాగిలపడి ప్రభువును ఆరాధించాడు. ఏదైతే ప్రార్ధనతో ప్రారంభమైనదో, అది ప్రార్ధనతో ముగించ బడింది! దేవుడు తన ప్రార్ధనలకు జవాబును ఇచ్చాడు. ఈ కధలోని చక్కటి విషయం ఏమిటంటే సమస్తమును బయలుపరచటం, అన్ని సమకూర్చబడినవి, దానికి కారణం రిబ్కా.
ఆదికాండము 24:60: రిబ్కాకు ఏమి జరిగిందో ఇక్కడ ఉంది. ఇస్సాకుకు భార్యనుగా సేవకునితో రిబ్కాను పంపినప్పుడు కుటుంబము ఆమెను దీవించెను: “మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవించెను”. రిబ్కా సిద్దంగా ఉన్నందునా సంతానము కొనసాగించబడింది. క్రీస్తు తిరిగి రాబోతున్నాడు. మీరు ప్రజలు సిద్ధంగా ఉండటానికి సహాయపడే సేవకుడిగా ఉంటారా?
ముగింపు
తిరిగి ప్రార్థన యొక్క శక్తికి వెళ్దాం. అది మనకు ఎలా సరిపోతుందో మరియు వాగ్దానం చేయడానికి దీనికి ఏదో ఉందని నేను భావిస్తున్నాను. మనము విశ్వసించుట ప్రారంభించి సమాధానము పొందిన ప్రార్థనలలో నడుచుకోవాలి. మార్కూ 11:24లో యేసు చెప్పెను, “అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను”. యోహాను 15:7లో, యేసు చెప్పెను “నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును”. 1 యోహాను 5:14-15 యోహాను ఇలా వ్రాసాడు “ఆయన ఎదుట మనకు ఉన్న నమ్మకం: “మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.” కీర్తనలు 66:9 “జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనియ్యడు” అని చెబుతుంది.
మనం ప్రభువు వద్ద నుండి మరి ఎక్కువగా పొందుకోవడానికి ప్రార్ధన ప్రారంభించాలి! 1 సమూయేలు 1:27లో హన్నా కుమారుని కొరకు ప్రార్ధన చేసి పొందుకుంది. కీర్తనలు 118:21లో “నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని కీర్తన కారుడు ప్రకటించాడు. కీర్తనలు 5:3లో దావీదు ఇలాగు చెప్పెను “ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును”. ఇక్కడ అబ్రాహము సేవకునికి ఇదే జరగలేదా? ఆయన ప్రార్ధన చేసి ఎదురుచుసాడు, మరియు దేవుడు జవబునిచ్చాడు. వేచి ఉన్న తన కొడుకు కోసం వధువును సిద్ధపరుస్తున్న తండ్రి యొక్క అద్భుతమైన చిత్రాన్ని ఇది అందిస్తుంది. ఇది రెండవ రాకడకు వేచి ఉన్న క్రీస్తు కోసం తన వధువును -సంఘమును- సిద్దం చేస్తున్న దేవుని చిత్రం.
వారెన్ వైర్స్బే ఆదికాండము 24వ అధ్యాయాన్ని నాలుగు విభాగాలుగా విభజించాడు: “తండ్రి యొక్క చిత్తము” దీన్ని కోరుకోవడం, “సేవకుని యొక్క సాక్ష్యము” ఇది చేయడానికి, “వధువు యొక్క సుముఖత” మరియు “పెళ్లి కొడుకు యొక్క స్వాగతం”.3 ఇది ఇస్సాకు మరియు రిబ్కా మాత్రమే కాకుండా సంఘము మరియు క్రీస్తు యొక్క వివాహానికి సంబంధించిన అందమైన చిత్రం. మీరు మార్గాన్ని సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సేవకులా? మీరు క్రీస్తు రెండవ రాకడకు సిద్ధమవుతున్న వధువులా?
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, కో: డేవిడ్ C. కుక్, 2001), p. 108..
వైర్స్బే, p. 108.
వైర్స్బే, పేజీలు. 107–110.
ప్రశ్నలు
-
అబ్రాహాము తన వంశస్థులకు దేవుడు వాగ్దానం చేసిన దేశంలో నివసించాడు. అయినప్పటికీ ఆదికాండము 23:4 ప్రకారం, అక్కడ నివసించే విషయంలో ఆయన తనను తాను ఎలా దృష్టించుకున్నాడు? (హెబ్రీయులు 11:9)
దినవాక్యం
Laura Martin Genesis 24:12
“‘LORD, God of my master Abraham,’ he prayed, ‘give me success today, and show kindness to my master Abraham.’”
ఇస్సాకుకు భార్యను వెతకమని అబ్రాహాము నుండి ఆజ్ఞలు అందుకున్న తరువాత అబ్రాహాము సేవకుడు ప్రభువును వెదకాడు. సంతానాన్ని మోసే వ్యక్తిని కనుగొనే ఈ కీలకమైన పనిని ప్రారంభించే ముందు సేవకుడు వెంటనే ప్రార్థనలో ప్రభువును వేడుకున్నాడు.
అదే విధంగా, మీరు ఆయన వద్దకు రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన మీకు సమాధానం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు అడిగినప్పుడు, ఆయన అనుగ్రహిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయినను, విశ్వాసులు తమ స్వంత బలముతో నడుస్తూ, విధేయతలో చివరి దశగా ప్రభువు వైపు ఎందుకు తిరుగుతారు? ఈరోజు, ఆగి, ప్రభువును సహాయం కోసం అడగండి-మీరు వెళ్లి, ప్రభువు మీ కోసం చేసిన పనులను చేయండి.
“నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము.”
- ఆదికాండము 24:12
తదుపరి వాఖ్యభాగము
యిర్మీయ 33:3 – “నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.”
కీర్తనలు 91:15 _ “అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెను”
మత్తయి 7:7 – “అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.