The Birth of Jacob And Esau
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 25-26 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
చాలా మంది పాపం మరియు పతనం వైపు చూస్తారు, కానీ క్రీస్తు ద్వారా చాలా అంతకన్నా ఎక్కువ ఉందని మనకు తెలుసు.
భోధన
ఆదికాండము 25:7-9: అబ్రాహము 175 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మృతిపొందెను అని 7-9 వచనాలలో తెలియపరచబడింది, మరియు మక్పేలా గుహలో శారా పాతిపెట్టిన చోటనే ఆయన కూడా పాతిపెట్టబడెను. 12-18 వచనాలలో ఇష్మాయేలు కుమారుల గురించి తెలియపరచబడింది, మరియు 19-26 వచనాలలో ఇస్సాకు కుమారుల గురించి తెలియపరచబడింది. సర్ప సంతానము మరియు స్త్రీ సంతానమైన క్రీస్తు మధ్య సంఘర్షణ కారణంగా, ఈ స్థిరమైన ఉద్రిక్తత ఉంది, ఈ రోజు మనం దానిని తెలుసుకోనబోవుచున్నాము.
ఆదికాండము 25:21: “ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె గురించి యెహోవాను వేడుకొనెను.” అబ్రాహము మాదిరి ప్రార్ధన, తన సేవకుని మాదిరి ప్రార్దన, మరియు ఇప్పుడు రిబ్కా గొడ్రాలు కాబట్టి ఇస్సాకు ప్రార్ధన చేశాడు. ఆయన ఎందుకు ప్రార్ధన చేశాడు? ఆయన సంతానాన్ని కొనసాగిస్తున్నాడు, ఒక వేళ రిబ్కా గొడ్రాలిగా ఉంటే వారసత్వము అనేది ఉండదు. ప్రభువు అతని ప్రార్ధనను విన్నాడు. ప్రార్ధన అర్ధం విజ్ఞాపన చేయడం; తన భార్య పక్షమున ఇస్సాకు పోరాటం చేసాడు. వివాహమైన తరువాత రిబ్కా దాదాపుగా 20 సంవత్సరాలు గొడ్రాలుగా ఉండెను. కానిస్టేబుల్ ఇలా అన్నాడు “ఆ సమయానికి దేవుడు ఆమె గర్భమును మూసివేసెను, ఏర్పరచబడిన కుటుంబం కేవలము దేవుని దయ వలనే సంతానం వీరికి కలిగారు తప్ప సాదారణ ప్రకృతి పరంగా కాదు అని వారు గుర్తుంచుకోవాలి”1. ఒకవేళ దేవుడు మహిమను చూడడానికి ఎదురు చూసి ఉండవచ్చు, కాబట్టి ఆయన యొక్క ప్రమేయాన్ని అందరు చూడవచ్చు. బ్రూస్ వాల్ట్కే ఇలా అన్నాడు, "వారిది సహజమైనది కాదు, మానవాతీత సంతానం."2
ఆదికాండము 25:22: రిబ్కా కనీసం ఇద్దరి పిల్లలతో గర్భవతిగా ఉంది. ఆమె ప్రభువును అడిగింది. ఆమె యొక్క పిల్లలు గర్బములో పెనుగులాడిరి అది ఆమెకు బాదకరమైనది, అది ఆదికాండము 3:15-16 “నీ గర్భావేదనను మిక్కిలి హెచ్చించెదను” అని సూచించబడింది. రిబ్కా ఆదాము మరియు హవ్వాల శారీరక బాధను అనుభావిస్తుంది. ఆమె సంతానాన్ని మోస్తుంది కాని అది సులభమైనది కాదు. ఆ బాధ తన జీవితాంతం కొనసాగించబడింది, అది ఇస్సాకుకు రిబ్కా చెప్పినప్పుడు మనకు తెలుస్తుంది, మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలన నా ప్రాణము విసికినది. “ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను?.” (ఆదికాండము 27:46). రిబ్కా యొక్క జీవిత ఉద్దేశం అంతా సంతానాన్ని కలిగి ఉండటమే. ఆమె ఈ వత్తిడిని ప్రారంభములోను (ఆదికాండము 25:22) మరియు ముగిపులోను (ఆదికాండము 27:46) అనుభవించింది. కాని అబ్రాహము ఎలాగైతే విశ్వాసముతో నడిచాడో రిబ్కా కూడా అలానే నడవాలి. మనమందరము కూడా మనకున్న వత్తిడి పరిస్థితుల గుండా వెళ్ళవలసిందే. ఆమె విషయంలో తన ఇద్దరు కుమారులు ఎప్పుడు పెనుగులాడుకునేవారు. రిబ్కా, యాకోబును మరియు ఏశావును తన పిలుపులో భాగంగా భాదను భరించి వారిని మోసింది.
ఆదికాండము 25:23-26: దేవుడు రిబ్కాకు ఆమె ఉద్దేశ్యాన్ని గుర్తు చేశాడు: ఆమె గర్భం నుండి రెండు జనంగాలు వస్తాయి. ప్రవచనాత్మకంగా, చిన్నవాడు నాయకత్వం వహిస్తాడు. రిబ్కాకు, తన గర్భములో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని తెలుసు. ఏశావు అంటే రోమములు కగలవాడు. అతను ఎదోము అని కూడా పిలువబడ్డాడు, దీని అర్థం "ఎరుపు" (వ. 30). యాకోబు ఏశావు మడమ పట్టుకుని బయటకు వచ్చాడు. యాకోబు అంటే మడమ పట్టేవాడు. వారు జన్మించినప్పుడు ఇస్సాకుకు వయస్సు 60 సంవత్సరాలు.
ఆదికాండము 25:27–28: ఏశావు ఒక నిపుణత కలిగిన వేటగాడు, అరణ్యవాసి అయినాడు. యాకోబు మౌనముగా ఉండే ఒక సాధారణమైన వ్యక్తి, అతను ఇంట్లోనే ఉండేవాడు. ఈ కవలలు దాదాపు 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అబ్రాహము మరణించాడు, కాబట్టి వారు తమ తాత నుండి నేర్చుకోవడానికి మరియు తాత యొక్క కథలను వినడానికి సమయాన్ని వెచ్చించి ఉంటారు. అబ్రాహాము, ఖచ్చితంగా దేశము మరియు ఆశీర్వాదం గురించి మాటలాడి ఉంటాడు. ఏశావు వేటాడిన ఆహారాన్ని ఇస్సాకు ఇష్టపడేవాడు కాబట్టి ఇస్సాకు పట్ల ప్రేమకలిగి ఉండేవాడు, ఎందుకంటే ఏశావు వేటాడిన దాని రుచిని ఇస్సాకు ఇష్ట పడేవాడు, ఈ చర్య వలన అప్పటికి ఇస్సాకు తప్పు మార్గమున వెళుతున్నాడు. ఇస్సాకు శరీర సంబంధమైన వాటి కోసం చూసాడు, అడవి వేటను ఇష్టపడ్డాడు. . . రిబ్కా యాకోబును ప్రేమించింది. తల్లిదండ్రుల అభిమానం ఎల్లప్పుడూ కుటుంబమును విభజిస్తుంది. బ్రూస్ వాల్ట్కే ఇలా అన్నాడు: “భర్త, వినే స్వరం కంటే నోటి రుచికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు స్వర్గంలో జరిగిన వివాహం అస్తవ్యస్తంగా ముగుస్తుంది.”3 ఇస్సాకుకు ఆహారం పట్ల ఉన్న అభిరుచి సంతానము యొక్క దృక్పథాన్ని దెబ్బతీసింది. దేవుడు అసంపూర్ణ వ్యక్తులను ఉపయోగిస్తున్నాడు మరియు కాలక్రమేణా, వారి దృక్కోణాలు వక్రీకరించబడ్డాయి. నేను సమయం రావడం రిబ్కా చూసింది అనుకుంటున్నాను. కానిస్టేబుల్ ఇలా అన్నాడు: "ఆదాము తినడంలో, నోవాహు తాగడంలో, మరియు ఇస్సాకు రుచి చూడటంలో విఫలమయ్యారు."4 రిబ్కా లేకపోతె ఇది ఎలా ముగిసేదో ఎవరికి తెలుసు. సంతానన్ని నిలబెట్టడానికి దేవుడు ఒక స్త్రీని ఉపయోగించాడు. మనము పితరులైన –అబ్రాహము, ఇస్సాకు మరియు యాకోబులను గురించి మాత్రమే ఆలోచిస్తాము-కాని అదే లేకపోతె, ఇస్సాకు సమస్యలలో పడి ఉండేవాడు.
దేవుని ప్రణాళికలో, ఎప్పటికీ మీరు అందరికీ తెలిసిన పేరుగలవారు కాకపోవచ్చు, కానీ దానిని కొనసాగించడంలో మీరు చాలా ముఖ్యమైన పాత్రను పోషించవచ్చు. తప్పిపోయిన కుమారుడు మరియు తండ్రి హృదయంతో మనం ఇక్కడ ఒక సమాంతరాన్ని చూడగలం –అన్నయైన ఏశావు మరియు బహిష్కరించబడిన యాకోబు. యాకోబు సాదాసీదాగా ఉన్నాడు; అతను నాగరికత తెలిసినవాడు, గృహములో పెరిగినవాడు. ఎన్ ఇ టి బైబిల్‌లో, డేవిడ్ షార్ప్ మాట్లాడుతూ, యాకోబు పేరు ప్రశాంతంగా మరియు నిరాడంబరంగా ఉంటాడని సూచిస్తుంది.5 అదే భాష "నిందలేనిది" అని కూడా సూచిస్తుంది.6 సామెతలు 29:10లో, అదే పదాన్ని "నిర్దోషి"గా అనువదించారు. ఇది ఈ యథార్థ వ్యక్తి యాకోబు మనస్తత్వాన్ని సూచిస్తుంది.
ఆదికాండము 25:29–32: యాకోబు ఒక సాదాసీదా వ్యక్తి, ఇంటిదగ్గరే ఉంటాడు కాబట్టి కలగూర వంట వండాడు. ఆరుబయట పొలం నుండి రోమములు కలిగిన ఏశావు వచ్చాడు. ఏశావు అలసిపోయి ఆకలితో ఉన్నాడు కాబట్టి అతనికి ఆహారం అవసరం. ఇది యాకోబు పక్షమున ముందస్తుగా జరిగింది. ఇది తీవ్రమైన చర్య. ఈ సంస్కృతిలో జన్మహక్కు తప్పనిసరి. అండర్‌స్టాండింగ్ ది జెనెసిస్‌లో (ఆదికాండమును అర్ధం చేసుకోవడం), సర్నా జన్మహక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించాడు, ఇందులో గోత్రము లేదా కుటుంబానికి ముఖ్యుడిగా ఉండే వానికి ప్రత్యేకాధికారం ఉంటుంది. జన్మహక్కు కలిగినవాడు యెహోవా వాగ్దానాల దీవెనలను మోసేవాడు. అతను భూమిని హక్కుగా పొందుకున్నాడు. దేవుడు మొదటి సంతానం కోసం ఉద్దేశించిన నిబంధనా సహవాసాన్ని అతను కలిగి ఉన్నాడు. అతను వారసత్వం రెట్టింపు భాగాన్ని పొందాడు. మరియు అతను కుటుంబానికి ఆధ్యాత్మిక నాయకుడు.7
ఆదికాండము 25:33: యాకోబు తెలివైనవాడు; ఏశావుతో ప్రమాణము చేయించెను. ఏశావు శరీరాన్ని చూచాడు కాబట్టి తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. మీ దృష్టి లోకము వైపు మళ్ళినప్పుడు, మీరు స్త్రీ సంతానంలో కాకుండా సర్పము యొక్క సంతానంలో పనిచేయడం ప్రారంభిస్తారు. మీకు ఆధ్యాత్మిక దృక్పథం ఉండాలి. దేవుడు మీకు అప్పగించిన దానిని వదులుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు దానిని సరిగా ఉపయోగించకపొతే దేవుడు దానిని మరొకరికి ఇస్తాడు.
జ్వేష్ట సంతానం ముఖ్యమైనది. గర్భంలోని మొదటి సంతానం ఎల్లప్పుడూ ప్రభువుకు అంకితం చేయబడింది. నిర్గమకాండము 13:12లో, మోషే దేవుని ఆజ్ఞను తెలియజేసాడు: “ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును”. ద్వితీయోపదేశకాండము 18:4 ఇంకా స్పష్టముగా తెలియజేయబడింది, “నీ ధాన్యములోను నీ ద్రాక్షరసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను”. కానీ ఏశావు ప్రభావవంతంగా, “నేను పట్టించుకోను.” అది సర్పము యొక్క సంతానములో పనిచేయడం, దేహముతో పనిచేయడం. దేవునికి, ఏశావు ఏమీ సమర్పించలేదు; అతను తన కోసం ఏమి కలిగి ఉంటాడో తెలుసుకోవాలనుకున్నాడు. 1 కొరింథీయులకు 15:20-23లో, క్రీస్తు "నిద్రించిన వారిలో ప్రథమ ఫలము"గా గుర్తించబడ్డాడు. యాకోబు మరియు రిబ్కా ఆశీర్వాదం పొందడానికి దేవుని చేతిని బలవంతం చేశారా? లేదా ఏదో సరిగ్గా లేదని వారు తెలుసుకొని అది వచ్చినప్పుడు వారు అవకాశాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
ఆదికాండము 25:34: ఏశావు తన జ్యేష్ఠత్వమును వదులుకున్నాడు కాబట్టి దానిని తృణీకరించాడు. మరియు ఏశావు దానిని విడిచిపెట్టినప్పుడు, యాకోబు దానిని పొందాడు. యాకోబు తప్పు చేశాడా? తగినంత పాపం చేయని అమోరీయులను జ్ఞాపకము చేసుకోనుడి (ఆదికాండము 15:16)? బహుశా ఇది దేవుని వాగ్దానాన్ని కొనసాగించడానికి ఒక మార్గం. మేము దానితో ఏకీభవించాల్సిన అవసరం లేదు లేదా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. ఇది రిబ్కాతో దేవుడు మాట్లాడిన ప్రవచనాత్మక మాట. కానిస్టేబుల్ "జ్యేష్ఠత్వపు హక్కును మరియు ఆశీర్వాదాన్ని పొందేందుకు యాకోబు పన్నాగం చేయడం అనవసరం, ఎందుకంటే అతను ఆధిపత్యం చెలాయిస్తానని దేవుడు ఇప్పటికే వాగ్దానం చేశాడు."8 అది జరిగేలా యాకోబు పథకం వేయాల్సిన అవసరం ఉందా? డాక్టర్ కానిస్టేబుల్ ‘కాదు’ అంటాడు. యాకోబు పన్నాగం తప్పు అయినప్పటికీ, అది జరగబోతోందని ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు దానిని ప్రవచించాడు. మీ అభిప్రాయం ఏమైనప్పటికీ, దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మన దృష్టిలో అందంగా ఉండవలసిన అవసరం లేదని ఈ సంఘటన చూపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో మీరు చూడలేరు.
ముగింపు
ఇది రమ్యముగా కనిపించకపోవచ్చు, కానీ దేవుడు సంతానాన్ని కొనసాగడానికి ఏర్పాటు చేస్తున్నాడు. మరియు ఈ సందర్భంలో, రిబ్కా మరియు యాకోబుల ద్వారా ఇది జరగబోతుంది.
థామస్ కానిస్టేబుల్, ఎక్స్‌పోజిటరీ నోట్స్ ఆఫ్ థామస్ కానిస్టేబుల్: జెనెసిస్, పే. 317; https://planobiblechapel.org/tcon/notes/pdf/genesis.pdfలో అందుబాటులో ఉంది.
బ్రూస్ వాల్ట్కే, జెనెసిస్: ఎ కామెంటరీ (గ్రాండ్ రాపిడ్స్: జోండర్వాన్, 2001), పే. 357.
వాల్ట్కే, పి. 363.
కానిస్టేబుల్, పి. 320.
ఎన్ ఇ టి బైబిల్, https://net.bible.org/#!bible/ జేనేసిస్ +25లో అందుబాటులో ఉంది, జెన్. 25:43 కోసం ఫుట్‌నోట్.
ఎన్ ఇ టి బైబిల్, https://net.bible.org/#!bible/ జేనేసిస్ +25లో అందుబాటులో ఉంది, జెన్. 25:43 కోసం ఫుట్‌నోట్.
నహుమ్ M. సర్నా, అండర్‌స్టాండింగ్ జెనెసిస్ (స్కోకీ, IL: వర్దా బుక్స్, 1966), p. 185; కానిస్టేబుల్‌లో కోట్ చేయబడింది, p. 213.
కానిస్టేబుల్, పి. 318.
ప్రశ్నలు
-
ఆదికాండము 25:23 ఎందుకు ముఖ్యమైనది? ఇస్సాకు కుమారుల్లో ఎవరు “పెద్దవాడు” మరియు ఎవరు “చిన్నవాడు”? (రోమా 9:12; ఆదికాండము 25:25-26)
దినవాక్యం
Laura Martin Genesis 25:23
“And the Lord said to her: ‘Two nations are in your womb; two people will come from you and be separated. One people will be stronger than the other, and the older will serve the younger.’”
యాకోబు మరియు ఏశావుల కథ పాపం లేకుండా లేదు, అంత మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క సంతానం కొనసాగడానికి ప్రభువు వేదికను ఏర్పాటు చేసి వారిని మరియు వారి తల్లి రెబ్కాను ఉపయోగించాడు.
ప్రజలు క్లిష్టమైన పరిస్థితులలో పడిపోయినప్పుడు, కూడా, మనము నమ్మినప్పుడు దేవుడు మన జీవితములో తప్పక పని చేయలగలడు. నిలబడి ఉండటమే కీలకం. నమ్మకం ఉంచు. మనము క్రీస్తుపై మన విశ్వాసముతో నడిచినప్పుడు, ఆయన ప్రణాళిక ప్రబలంగా ఉందని తెలుసుకుని, క్రీస్తుపై ఉన్న నిరీక్షణను మనం పట్టుకోగలము. దేవుడికి స్తోత్రములు!
“రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. అని ప్రభువు ఆమెతో చెప్పెను”
- ఆదికాండము 25:23
తదుపరి లేఖనభాగములు:
సామెతలు 19:21- “నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.”
రోమా 8:28 – “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.”
కీర్తనలు 130:5-8– “యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టు కొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్‌లోడ్‌లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.