The Pentateuch Genesis

God's Command To Sacrifice Isaac

యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 22 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 10వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

ఆదికాండ గ్రంథము కొరకు మనకున్న లక్ష్యం సంతానము అనే పదమును నొక్కి చెప్పడం. ఆదికాండమంతా సర్పసంతానమునకు మరియు స్త్రీ సంతానమైన –మెస్సీయాకును- వైరము ఉన్నది. ఆదికాండము 21:34లో అబ్రాహాము పరదేశిగా జీవించెను. అతనికి నివాసము లేదు విశ్వాసముతో ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశముకు సంచరిస్తూ ఉండేవాడు.

పాఠము

ఆదికాండము22:1: దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తరువాత, అబ్రాహాము దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన సమయములో వెంటనే చిత్తము ప్రభువా “నేను ఉన్నాను” అనెను. సమూయేలు మరియు ఏలి మాదిరిగా కాక, దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు అని తనకి తెలుసు. పరిశోధించుట శోధించుట కాదు. ఆదాము మరియు హవ్వలను సాతానుడు శోధించాడు. దేవుడు మనలను పాపము చేత శోధిస్తాడా? లేదు. శోధన అనేది లోపల ఉన్న కోరికను బట్టి వస్తుంది. ఒక ప్రత్యేకమైన/ నిర్దిష్టమైన ఉద్దేశ్యన్నినెరవేర్చుటకు పరీక్ష లేదా విచారణ ప్రభువు యొద్ద నుండి వచ్చును. దేవుడు మనలను శుద్దిచేయాలి అనుకుంటున్నాడు. ఈ సమయంలో అబ్రాహాము అందరికంటే ఎక్కువగా వదులుకున్నాడు. డాక్టర్ టామ్ కానిస్టేబుల్ అబ్రహాము పరిశోధించబడి మరియు విడిచిపెట్టిన ఆరు సందర్భాలను మరియు అప్పుడు దేవుడు అతనికి ప్రతిఫలంగా మరింత ఎక్కువ ఇచ్చాడు.1 అని చెప్పాడు.

  • అబ్రాహాము తన దేశము విడిచిపెట్టెను, కాని దేవుడు నూతనమైనది ఇచ్చెను.
  • అబ్రాహాము తన బంధువులను విడిచిపెట్టెను, మరియు దేవుడు మరి ఎక్కువమందిని ఇచ్చెను.
  • అబ్రాహాము లోతుకు ఉత్తమమైన భూమిని ఇచ్చెను, కాని దేవుడు మరింత ఉత్తమమైనది ఇచ్చెను.
  • ఈలోక రాజులు ఇచ్చే బహుమతులను అబ్రహాము తిరస్కరించెను, ఆపై దేవుడు అతనికి గొప్ప సంపదను ఇచ్చాడు.
  • అబ్రాహాము ఇష్మాయేలును పంపి వేసెను, కాని దేవుడు ఇష్మాయేలును ఆశీర్వదించి జనములకు తండ్రినిగా చేసెను.
  • మరియు అబ్రాహము తన కుమారుడైన ఇస్సాకును ఇవ్వడానికి సిద్దపడెను గనుక, దేవుడు ఇస్సాకును తప్పించి అబ్రాహముకు జనములను ఇవ్వడానికి ఉపయోగించెను.

చాల మందికి ఫలితం మాత్రమే కావాలి, కాని పరీక్షించబడటం ఇష్టపడరు. మీరు ఒక దహనబలి లేదా పరిశోధన పరిస్థితులమద్య ఉన్నప్పుడు, అది ఎల్లప్పుడు ప్రభువుకు మరింత చేరువ చేస్తుంది అని కానిస్టేబుల్ చెబుతున్నాడు.2

ఆదికాండము 22:2 : “మోరీయా” అంటే ప్రభువు సమకూర్చే లేదా ప్రభువు కనిపించుట అని అర్థము. ఇదే స్థలములో దావీదు బలిపీఠము కట్టించెను, అక్కడే సోలోమోను తన దేవాలయము నిర్మించెన, మరియు బహుశా క్రీస్తు మరణించిన స్థలము. దేవుడు ప్రత్యక్షపరచుకున్న మరియు దావీదుకు, సోలోమోనుకు, మరియు క్రీస్తుకు దేవుడు పదే పదే .....సమకూర్చిన/ అందించిన స్థలము ఈ మోరీయా ప్రదేశము ప్రశ్న ఏమిటంటే, ఆ స్థితికి చేరుకోవడానికి మనం విశ్వాసంతో నడుస్తామా?

ఆదికాండము 22:3: ఒక రోజు అబ్రాహముతో తన ఏకైక కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని దేవుడు చెప్పెను. తరువాత “తెల్లవారినప్పుడు” దేవుడు చెప్పిన చోటకి అబ్రాహాము వెళ్ళెను. అక్కడ ఎటువంటి సంకోచము మరియు ఎటువంటి చర్చ లేదు. హెబ్రీ పత్రిక 11:19లో అబ్రాహము ఎక్కువ విశ్వాసం కలిగినవాడు అని తెలియజేస్తుంది. అంత బాగుగానే ఉంటుంది అని అతను నమ్మాడు; దేవుడు మృతులలో నుండి ఇస్సాకును తిరిగి తీసుకు రాగలడని అబ్రాహము విశ్వసించాడు. (అతను ఇంతక ముందు ఇటువంటివి చూడనప్పటికి). వైర్స్‌బే ఇలా అన్నాడు, “ఒక కోణంలో, దేవుడు మనకు ఒక పరీక్షను పెట్టినప్పుడు ఇది మనకు ఒక అభినందన, ఎందుకంటే దేవుడు విశ్వాస పాఠశాలలో మనలను ప్రోత్సహించాలనుకుంటున్నాడు అని తెలియజేస్తుంది”.3

ఆదికాండము 22:4: “మూడవ నాడు అబ్రాహము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి.” మూడు రోజులకు, అబ్రహాము తన కొడుకును చంపబోతున్నాడని తెలుసు. తన గృహమునకు తిరిగి వెళ్ళిపోవడానికి చాల సమయం ఉంది. ఈ కార్యం చేయడానికి నేను నిజముగా పిలువబడ్డాను అని అబ్రాహము అనేక పర్యాయములు ప్రశ్నించుకోవాడానికి చాల సమయం దేవుడు ఇచ్చాడు అని నేను నమ్ముతాను. అబ్రాహము వెనుతియ్యలేదు, తన విశ్వాసాన్ని పట్టుకొని వున్నాడు.

ఆదికాండము 22:5: తన ప్రయాణములో తనతో పాటు ఉన్నవారికి నమ్మకముతో “నేనును ఈ చిన్నవాడును తిరిగి వచ్చెదమని” వారితో చెప్పెను. తను మరియు తన కుమారుడు ఇస్సాకు ఇద్దరము తిరిగి వస్తాము అని అబ్రాహము నమ్మెను. రోమా – యూదా చరిత్రకారుడైన జోసిఫస్, బహుశా ఇస్సాకు 25 వయస్సు గలవాడు అని చెప్పాడు, ఇతర అనేకమంది వేదాంత పండితులు మాత్రం 15-16 వయస్సు ఉండవచ్చు అని చెప్పారు. ఏమైనప్పటికీ ఇస్సాకు ఏమి జరుగుతుందో పూర్తిగా తెలుసుకునేంత వయస్సులో ఉన్నాడు. వైర్స్‌బే ఇలా అన్నాడు, “ అబ్రాహము దేవుడిని విశ్వసించాడు మరియు ఆయనకు విధేయత చూపించాడు  ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక (హెబ్రీ 11:8), ఎప్పుడో తెలియనప్పుడు (హెబ్రీ 11:9-10), అది ఎలా జరుగుతుందో అతనికి తెలియనప్పుడు (హెబ్రీ 11:11), మరియు ఎందుకో అతనికి తెలియనప్పుడు హెబ్రీ 11:17),4 ఎక్కడ, ఎప్పుడు, ఎలా, మరియు ఎందుకు అనే వాటికి సమాధానాలు తెలియకపొవుటయే పరిశోధనలో భాగము.

ఆదికాండము 22:6-9: తన బలి కొరకు కట్టెలను మరియు కత్తిని తీసుకువెళ్లినట్లు (6వ), క్రీస్తు సిలువ మోస్తుండుటను గూర్చి, ఆయనను చంపడానికి ఉపయోగించే ఆయుధం గూర్చి నేను ఆలోచిస్తున్నాను. “దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకోనునని చెప్పెను” (8 వ). మోరీయా అనగా దేవుడు సమకూర్చే స్థలము (7-8). హామిల్టన్ ఇలా చెప్పాడు, “అబ్రాహము విధేయత చూపే విశ్వాసాన్ని ప్రదర్శిస్తే, సహకరించే విశ్వాసాన్ని ఇస్సాకు ప్రదర్శించాడు”. ఇస్సాకు తన బలి కోసం కట్టెలను మోయగలిగేంత బలముకలిగి లేదా పెద్దవాడైయుంటే, బహుశా అతను తన తండ్రిని లొంగదీసుకునేంత బలంగా ఉండి ఉండవచ్చు.”5 ఇస్సాకు ప్రతిఘటించగలిగినప్పటికీ, అతను చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అబ్రాహాము విశ్వాసం అతని కొడుకు ఇస్సాకులో కనిపించడం ప్రారంభించింది. మీరు విశ్వాసంతో నడిచినప్పుడు, మీరు ఇతర వ్యక్తులపై ప్రభావం చూపుతారు.

ఆదికాండము 22:10-11: ఆ దహనబలి వదించుట (10 వ). దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అక్కడ అత్యవసర భావము ఉంది: “అబ్రాహమా అబ్రాహమా!” దేవునికి నమ్మకమైన ఇతర అనుచరులవలె అబ్రాహము “నేను ఉన్నాను” అని ప్రతిస్పందించాడు. ఈ మనుష్యుల విశ్వాసం యొక్క ప్రతి నడకలో దేవుడు కీలకమైన సందర్భాలలో జోక్యం చేసుకున్నాడు. ఆదికాండము 46:1–2లో, “యాకోబు, యాకోబు” అని దేవుడు పిలిచినప్పుడు, “ఇదిగో నేను ఉన్నాను” అని యాకోబు స్పందించాడు. నిర్గమకాండము 3:4లో, "మోషే, మోషే" అని దేవుడు పిలిచినప్పుడు, "నేను ఇక్కడ ఉన్నాను" అని మోషే ప్రతిస్పందించాడు. 1 సమూయేలు 3:10లో సమూయేలు సమూయేలు, అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆల కించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను. అపోస్తు 9:4, సౌలు “సౌలా సౌలా అని పిలవడం విన్నాడు.

ఆదికాండము 22:12: అప్పుడు ఆయన “ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము”; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నదనెను. వాల్ట్ కే అబ్రాహము యొక్క విధేయతను "అత్యంత విలువైన దానిని కూడా రక్షించని విధేయత, భవిష్యత్తును గూర్చి దేవుణ్ణి విశ్వసించేది"6 అని వర్ణించాడు. విధేయత తీవ్రమైనదైతే దేనిని ఎప్పటికి పట్టుకోకుండా ఉండటం. విశ్వాసము అనేది అబ్రాహముకు కేవలము మాట మాత్రమే కాదు; అది పూర్తిగా కార్యరూపకం. యాకోబు 2: 21-22 అబ్రాహము యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచింది: “విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము”. మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారని చెప్పడం ఒక విషయం మరియు దాని బయటకు వెళ్లడం మరొక విషయం.

ఆదికాండము 22:13-14: “అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను”. యెహోవా యీరే అనే పేరు దేవునికి ఇక్కడ ఉపయోగించబడింది మరియు దాని అర్థం "ప్రభువు చూసుకోనును." పదే పదే, యెహోవా పర్వతం, మోరియా పర్వతం, కీర్తనలు (కీర్తనలు 24:3; 48:1; 99:9; 133:3) మరియు యెషయా (యెషయా 2:2-3; 30:29)లో ప్రస్తావించబడింది. ప్రభువు ప్రత్యక్షమైన కొండ! మనము అవసరతలో ఉన్నప్పుడు ఆయన దర్శనమిస్తాడు (హెబ్రీ 4:16).

ఆదికాండము 22:15-18: ‘“నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను”: నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున, నేను నిన్ను ఆశీర్వదించేదను... నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.”’ సొదొమ మరియు గొమొర్రా నాశనమైనప్పుడు అబ్రాహాము తప్పించబడ్డాడని మరియు సొదొమ ద్వారాలలో కూర్చున్న లోతు కూడా అబ్రాహాము కారణంగా తప్పించబడ్డాడని జ్ఞాపకము చెసుకొనుడి. అబ్రాహం యొక్క త్యాగం మరియు విధేయత కారణంగా, దేవుడు దానిని చేస్తానని వాగ్దానం చేశాడు... ఆయన అబ్రాహమును మరి ఎక్కువగా ఆశీర్వాదించనున్నాడు. ఇస్సాకు బలి అర్పించిన క్రీస్తు యొక్క రూపము. యోహాను 1:29లో, బాప్తీస్మము ఇచ్చు యోహాను ఇలా అన్నాడు, "ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల." అబ్రాహాము విధేయుడైనందున, ఆ సంతానం కొనసాగింది మరియు చివరికి యేసు వద్దకు కొనసాగించబడింది.

ముగింపు

సంతానము ఇప్పటికి కొనసాగుతుంది. డాక్టర్ టామ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ నాలుగు రకాల సంతానాలు ఉన్నాయి అని చెప్పాడు7:

సహజ సంతానం – అబ్రాహాము (ఇస్సాకు మరియు ఇష్మాయేలు) భౌతిక వారసులు.

సహజ/ఆధ్యాత్మిక సంతానం - అబ్రాహాము (ఇస్సాకు) భౌతిక వారసులను విశ్వసించడం

ఆధ్యాత్మిక సంతానం - భౌతికం కాని, విశ్వాస వారసులు (అన్యులైన వారసులు)

అంతిమ సంతానం — స్వయంగా క్రీస్తే (గలతీయులు 3:16)

ఈ సంతానమనే అంశమునకు కొన్ని పొరలు ఉన్నయి వాటిని మనము కనుగొంటున్నాము. అబ్రాహము దేవునికి విధేయత చుపించాడానికి సమస్తమును ఒక వెర్రివాని వలే విడిచిపెట్టడానికి సిద్దాపడ్డాడు. మనము ఎక్కడికి వెళ్ళిన పర్వాలేదు.... ఎప్పుడు, ఎలా, ఎందుకు ....మనము కేవలము విశ్వాసముతో మాత్రమే ముందుకు కొనసాగిపోవాలి. మీరు పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, అది దేవుని వాక్యానికి విరుద్ధంగా లేనట్లయితే, ముందుకు కొనసాగిపొండి.. మీ ద్వారా... దేవుడు ఏదో నెరవేర్చాలని అనుకోవచ్చు. . .

  1. టామ్ కానిస్టేబుల్, డా. కానిస్టేబుల్ ఎక్స్‌పోజిటరీ నోట్స్: జెనెసిస్, పే. 297; ఆన్‌లైన్‌లో https://planobiblechapel.org/tcon/notes/pdf/genesis.pdfలో అందుబాటులో ఉంది.

  2. టామ్ కానిస్టేబుల్, పి. 298.

  3. వారెన్ W. వైర్స్‌బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, కో: డేవిడ్ C. కుక్, 2001), p. 104.

  4. వైర్స్బే, p. 105.

  5. విక్టర్ పి. హామిల్టన్, ది బుక్ ఆఫ్ జెనెసిస్: అధ్యాయాలు 18–50 (గ్రాండ్ రాపిడ్స్: విలియం బి. ఎర్డ్‌మాన్స్ పబ్లిషింగ్ కంపెనీ: 1995), పే. 110; కానిస్టేబుల్‌లో కోట్ చేయబడింది, p. 293.

  6. బ్రూస్ వాల్ట్ కే, జెనెసిస్: ఎ కామెంటరీ (గ్రాండ్ రాపిడ్స్: జోండర్వాన్, 2001), పే. 308.

  7. కానిస్టేబుల్, పి. 296.

ప్రశ్నలు

  1. ఆదికాండము 22: 1-12లో క్రీస్తుకు ప్రతిగా ఇస్సాకు ఎలా ఉన్నాడు? (యోహాను 19:17-18, హెబ్రీయులు 11:17, 19)

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Genesis 22:18

“And all the nations of the earth will be blessed by your offspring because you have obeyed My command.”

తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని ప్రభువు అబ్రాహాముకు సూచనలు ఇచ్చాడు. అబ్రాహాముకు ఆ పని ఎంత కష్టమో, అబ్రాహాము తన సంతానాన్ని మోసే వ్యక్తిని చంపడం ఎంత కష్టమో, అయినను “ఇదిగో నేను ఉన్నాను ప్రభువా” అని చెప్పి ప్రభువుకు లోబడ్డాడు. అయితే, అబ్రాహాము పరీక్ష నుండి బయటికి రావడంతో, ఇస్సాకును రక్షించి బలి ఇవ్వడానికి ప్రభువు ఒక పొట్టేలును అందించాడు.

ఈరోజు, ప్రభువు మిమ్ములను మీ దృక్కోణం నుండి అర్థం చేసుకోలేని పరీక్షల కాలములోనికి పిలుస్తూ ఉండవచ్చు. శాశ్వతమైన దృక్పథాన్ని కలిగి ఉండండి, అది మీ విశ్వాసాన్ని లోతుగా బలపరుస్తుంది, మరియు తద్వారా మీకు ఏమీ లోటు ఉండదు మరియు యేసును మరింత ఎక్కువగా ప్రతిబింబించండి! "ఇదిగో నేను ఉన్నాను ప్రభువా" అని లోబడే హృదయాన్ని కొనసాగించండి. మీ ద్వారా ఆయన వాగ్దానాలను అందించడానికి మరియు నెరవేర్చడానికి ప్రభువును విశ్వసించండి.

“మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను”

  • ఆదికాండము 22:18

తదుపరి వాఖ్యభాగము

యాకోబు 1: 2-4 – “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.”

హేబ్రీయులకు 11:17 – “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సా కును బలిగా అర్పించెను.”

కీర్తనలు 84:11 – “దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.”