The Birth Of Isaac
యేసును ఇలా కనుగొనండి: Seed Genesis 20-21 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
ఆదికాండము 1- 19లో మనము సంతానమైన క్రీస్తును గూర్చి ఒక అంశముగా ఆదికాండము మొత్తము తర్కించాము. సంతానము అబ్రహాము ద్వారా జన్మించెను, అబ్రహాము సంతాము ఎలా వ్యాప్తి చెందినది ఆదికాండము 20 మరియు 21లో ఎలా ఈ అంశమును కొనసాగించాడు.
ఆదికాండము 20లో అబ్రహాము నేగేవ్ ప్రాంతమునకు ప్రయాణమైపోయెను అక్కడ అబ్రాహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని అబీమెలెకుతో అబద్ధము చెపాడు. అప్పుడు అబీమెలెకు ఆమెను తన బార్యనుగా ఇంట చేర్చుకొనాడు, తద్వారా అబీమెలెకు చావుకు సిద్దమాయను. అయితే దేవుడు అబీమెలెకు యొద్దకు వచ్చి అతనిని గద్దించినప్పుడు, అతడు శారాను వెండి మరియు అనేక అశీర్వాదములతో పంపివేశాడు. అతడు సమస్తమును నీతిగా చేసేను గనుక దేవుడు అబీమెలెకు యొక్క భార్యను స్వస్థపరిచెను మరియు ఆమె పిల్లలను కనెను. ఇదంతా అబ్రాహాము నుండి వచ్చే ఆశీర్వాదం కారణంగా దేవుడు అబ్రాహామును అబీమెలెకు నుండి రక్షించడం జరిగింది. దేవుడు అబ్రాహామును ఎలా ఆశీర్వదించాడో మరియు మనము ఈ ఆశీర్వాదము యొక్క ఉత్పత్తి అని ఆదికాండము 21లో మరల చెప్పబడింది.
పాఠము
ఆదికాండము 21:1-5: 1 వచనములో “దేవుడు శారాకు ప్రమాణము చేసినట్టుగా జరిగించెను”. జ్నాపకము చేసుకోనుడి దేవుడు ఆదికాండము 17:15-16లో శారా వలన దేశములు మరియు జనముల రాజులు జన్మించును అని చెప్పెను. ఆదికాండము 18:14వ వచనములో, సంవత్సరములో నీకు కుమారుడు కలుగును అని దేవుడు వాగ్ధానము చేశాడు. దేవుడు వాగ్ధానము చేసిన సంవత్సరానికి ఆదికాండము 21:1 మనలను తీసుకొని వస్తుంది. దేవుడు ఏది చేస్తాను అని చెప్పాడో అది ఆయన చేశాడు. దేవుడు చెప్పినదానిని నేరవేరుస్తాడు కాబట్టి మనము ఆయనను నిరంతరం నమ్మవచ్చు. రెండవ వచనములో శారా యొక్క పాత్ర పెంచబడింది. మీరు ఎప్పుడైనా మీ జీవితముపై ఒక ప్రవచనాత్మకమైన మాట మాట్లాడి, కొంతకాలం తర్వాత, అది నెరవేరడం చూశారా? శారా విషయంలో ఇదే జరిగింది. " అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భము ధరించి అతనికి నిర్ణీత సమయానికి దేవుడు కుమారుని అనుగ్రహించాడు" (వ 2.). యేసు నజరేతులో లేచి నిలబడి యెషయా గ్రంథాన్ని చదివి ఇప్పుడు అది నెరవేరిందని చెప్పినట్లుగా ఉంది. "నిర్ణీత సమయంలో"-అదంతా దేవుని సమయానికి సంబంధించినది. హగారుకు మరియు ఇస్మాయేలునకు ఏమి జరిగినదో జ్ఞాపకము చేసుకొనుడి? కాని ఇప్పుడు సమయము వచ్చింది.
ఆదికాండము 12:1-3ని సమీక్షిద్దాం. ఆదికాండము 21 అధ్యాయములో ఏమి జరిగినదో అది ఆదికాండము 12వ అధ్యాయము కారణంగా జరిగింది. ఇది ఆదికాండము 12 అధ్యాయములోని కొంత భాగం యొక్క నెరవేర్పు. ఆదికాండము 17:7లో ఇవ్వబడిన దేవుని వాగ్దానాలను అనుసరించండి; ఆదికాండము 13:15-16; ఆదికాండము 15:4; మరియు ఆదికాండము 17:19. పదే పదే, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు! ఆదికాండము 21:2లో ఏమి జరిగింది? శాశ్వతమైన నిబంధన ! హెబ్రీయులు 11:8-9 ఆదికాండము 12లో ఇవ్వబడిన వాగ్దానానికి ఇస్సాకు సహవారసుడు అని ధృవీకరించబడినది. మరియు ఈ రోజు మనం దానిని తెలుసుకోనబోవుచున్నాము.
3వ వచనంలో, అబ్రాహాము తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఎందుకు? ఎందుకంటే దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు అని పేరు పెట్టమని చెప్పాడు కాబట్టి (ఆదికాండము 17:19). దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఆహ్లాదకరముగా ఉండదా, మనం మాటకు స్పందించి, ఆయన చెప్పేది చేయాలి? ప్రశ్న ఏమిటంటే, మనం ఆయన మాట వింటున్నామా? కానీ మనం చూసినట్లుగా, అబ్రాహాము పరిపూర్ణుడు కాదు. దేవుడు అబ్రాహామును ఉపయోగించుకొనగలిగితే, ఆయన మనలను కూడా ఉపయోగించగలడు. మనం సిద్ధంగా ఉండాలి. 4వ వచనంలో, ఇస్సాకు ఎనిమిది రోజుల వయస్సులో ఉన్నప్పుడు, అబ్రాహాము దేవుని ఆజ్ఞకు లోబడి అతనికి సున్నతి చేశాడు (ఆదికాండము 17:9-12). అబ్రాహాము విధేయత కలిగినవాడు.
“అబ్రహాముకు తన కుమారుడైన ఇస్సాకు జన్మించినప్పుడు 100 సంవత్సరముల వయస్సుగలవాడు” (వ.5). దేవుడు సహనానికి ప్రతిఫలమిస్తాడు. అబ్రహాము హాగరుతో తప్పు చేసిన్నపటికి దేవుడు నమ్మకముగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దాన నేరవేర్పుకు అబ్రహాము మరియు శారాలు 25 సంవత్సరాలు ఎదురుచూశారు. హెబ్రీ 6:12 “ మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెను” మనకు ఆశీర్వాదాలు కావాలి కాని విశ్వాసముతో ఆసక్తిని కనుపరచలేక పోవు చున్నాము. మీ విశ్వాస పరీక్షా సహనాన్ని కలిగిస్తుంది అని యాకోబు 1:3లో వాగ్దానముగా చేప్పబడింది. మనము నమ్మాలి అనుకుంటున్నాను, కాని మనము సహింపగలుగుచున్నామా?
వారెన్ వైర్స్బే ఇలా అన్నాడు,1 "దేవుని వాగ్దానాలను విశ్వసించడం అనేది చివరిగా ఆశీర్వాదాన్ని ఇవ్వడమే కాకుండా, మీరు వేచి ఉన్న సమయానికి కూడా అది మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది." రోమా పత్రిక 4:17 ఇది దేవుని వాగ్దానాన్ని సమూలంగా నెరవేర్చిందని వెల్లడించింది! అబ్రాహాము తనను తాను మృతతుల్యుడిగా కూడా భావించాడు!
ఆదికాండము 21:6-7: “ఇస్సాకు” అనగా నవ్వు అని అర్ధము- వాగ్దానం చేసిన సంతానం2 నెరవేర్పుకు ఇస్సాకు మూలం అయినందున తన తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించాడని కానిస్టేబుల్ చెప్పాడు. ఆదాము మరియు హవ్వ నుండి నోవాహు నుండి అబ్రహాము మరియు శారా నుండి ఇస్సాకు వరకు సజీవ సంబందాలుగా మనం వీటన్నిటిని చూడవచ్చు (7 వ).
పాలు మానుటకు మూడు సంవత్సరాల వయస్సు సాధారణమైనది. ఇస్సాకు మూడు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అబ్రాహాము గొప్ప విందు చేసెను (8 వ). ఇష్మాయేలు, ఇస్సాకును పరిహసించుట శారా చూచెను. వెక్కిరించడం అంటే ఎగతాళి చేయడం, శారా ఇష్మాయేలును, ఇస్సాకుకు ఒక ముప్పుగా చూసింది. ఇదే సన్నివేశాన్ని మనం ఆదికాండము 19:14లో లోతు అల్లుళ్ళు నమ్మకపోయిన సంఘటనను చూడవచ్చు. తర్వాత, న్యాయాధిపతులు 16:25లో, ఫిలిష్తీయులు తమ వినోదం కోసం తమను సంతోష పరచాలి అని సమ్సోనును కోరి, వారు అతనిని అపహాస్యం చేయాలనుకున్నారు. ఇష్మాయేలు సర్పసంతానాన్ని కొనసాగించాడు. ముస్లింలు ఇష్మాయేలు యొక్క వంశస్థులు. కాని స్త్రీ యొక్క సంతానము ఇస్సాకుకు వెళ్ళింది. ఇస్సాకు స్త్రీ యొక్క సంతానమైన క్రీస్తును కొనసాగించాడు. ఇష్మాయేలు, ఇస్సాకుతో వారసుడు కాలేడు (10 వ). “లిపిట్ ఇష్టార్ చట్టాల” ఒక యజమాని బానిస ద్వారా పిల్లలను కలిగి యుండి, ఆ తరువాత ఆ బానిసకు మరియు ఆమె పిల్లలకు తండ్రి స్వతంత్రాన్ని అనుగ్రహిస్తే, బానిస పిల్లలు తమ పూర్వ యజమాని పిల్లలతో ఆస్తిని పంచుకోకూడదు. 33
ఆదికాండము 21: 11-13: “అతని కుమారుని బట్టి అబ్రాహామునకు కష్టము కలిగెను” (11 వ). కష్టము అనగా బాధ, దుఃఖము మరియు వణుకు. ఇష్మాయేలు శరీరము ద్వారా జన్మించాడని, ఇస్సాకు ఆత్మ ద్వారా జన్మించాడని అబ్రాహాముకు తెలుసు. సంతానము బయలుపరచ పడే కొద్ది ఈ సత్యము మరింత ప్రసిద్ది చెందింది. మొదటి సంతానము రెండవ సంతానమునకు అనుకూలంగా తిరస్కరించబడిన ఈ విచిత్రమైన నమూనాను/ మాదిరిని గమనించండి: కయీను మరియు హేబెలు, ఇష్మాయేలు మరియు ఇస్సాకు, ఏశావు మరియు యాకోబు, మనష్షే మరియు ఎఫ్రాయిము.
12 వ వచనము అది దైవ నిర్ణయం అని వివరిస్తుంది. దేవుడు అబ్రహమును మరియు తరువాత ఇస్సాకును ఎన్నుకొనెను/ ఏర్పరచుకొనెను. ఇష్మాయేలు యొక్క తల్లి హాగరు. శారా ఇస్సాకు యొక్క తల్లి. శారా అబ్రహమును వాగ్దానాన్ని స్వయంగా నెరవేర్చమని బలవంతం చేయడం వల్ల హాగరుతో కలిగిన పిల్లవాడు. హాగరుతోనున్న బిడ్డ అబ్రహం మరియు శారా యొక్క బలవంతం వల్ల ఆ వాగ్దానాలను వారి స్వంతంగా నెరవేర్చుకొనడానికి బలవంతం చేసింది. అబ్రహాము మరియు శారాల దగ్గర ఉన్నవాడు స్వేచ్చ గలవాడు మరియు వేచియుండవలసిన వాడు.
13వ వచనములో, ఇష్మాయేలు, తన ప్రణాళికలో భాగము కానప్పటికీ అతనిని కూడా గొప్ప జనముగా చేసెదను అని దేవుడు చెప్పాడు. మనము దేవుని యొక్క మార్గము కొరకు ఎదురు చూడకుండా మన సొంత మార్గాలలో వెళ్ళినప్పుడు సమస్యలు వస్తాయి. అబ్రహాము మరియు హాగరు వేచి ఉండకపోవడం వలన ఈరోజు ఇస్లాం మనకు ఉంది. ఎందుకు అంటే శారా నిజంగా “నేను వేచి ఉండలేను” అని చెప్పింది కాబట్టి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఒత్తిడి ఉంది. వేరొకరి పాపం వలన మనకు ఒత్తిడి ఉంటుంది. దయచేసి మీ పాపము ఎల్లప్పుడూ మరొకరిపై ప్రభావం చూపుతుందని మర్చిపోకండి.
ఆదికాండము 21:14-16: హాగరును ఇష్మాయేలును దూరముగా పంపుటకు ముందు, వారి ప్రయాణము కొరకు ఆహారమును నీళ్ల తిత్తిని ఇచ్చి పంపివేసెను. ఆ నీళ్ళ తిత్తి సుమారుగా మూడు గాలన్ల నీరు లేదా ఇరవై నాలుగు పౌండ్ల నీరు పట్టగలవు. అవి అయిపోయిన తరువాత హాగరు ఇష్మాయేలును పొద క్రింద వదిలిపెట్టింది. బ్రూస్ వాల్ట్కే, హగారు తన కుమారుడిని విడిచి పెట్టింది అని చెప్పాడు.4
ఆదికాండము 21:17-21: దేవుడు వారి మొరలను విన్నాడు (17వ). ఇప్పటికీ ప్రతి ఒక్కరిని విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇష్మాయేలును గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ ప్రజల గుంపును దేవుడు సంరక్షించాడు (18 వ). అయన జీవనోపాదిని వారికి అందించాడు. దేవుడు హాగరు కన్నులు తెరచి నీళ్ల ఊటనిచ్చాడు. వారు తిరస్కరించబడినప్పటికి ఆయన వారిని మరియు వారిని సంరక్షించెను. ఇది నాకు యోహాను సువార్త 4వ అధ్యాయములో నీళ్ళ బావి యొద్ద నున్న స్త్రీని జ్ఞాపకము చేస్తుంది, యేసు సమరయ స్త్రీని నీళ్ళ బావి వద్ద కలిసెను. ఎవ్వరు ఆమెను విలువైనది అని పరిగణించనప్పటికి, అమె విలువైనది అని యేసుకు తెలుసు. అయన జీవజలమును ఇస్తాను అని వాగ్దానము చేశాడు. మీరు ఇంకా సర్పసంతానముగా పనిచేస్తున్నపటికి దేవుడు ఇంకను జీవ జలమును ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. యోహాను 7:37-39, యేసు చెప్పెను: ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.! నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను”.
ముగింపు
ఎవరైతే సంతానమైన క్రీస్తును విశ్వస్తారో, వారు ఆత్మను పొందుకుంటారు. అబ్రాహాము ద్వారా సంతానము అందరికి అందుబాటులో ఉన్నాడు. సంచారులకు, అలిసిపోయినవారికి , దప్పికగల వారికి, గ్రుడ్డివారికి మరియు నీరాశతో జీవితాన్ని విడిచిపెట్టేవారికి హాగరు ఒక రూపముగా ఉంది అని వైర్స్బే చెప్పాడు.5 దేవుడు అందరిని సంరక్షిస్తాడు. హాగరుకు సంబంధించిన వారని మరియు శారాకు సబంధించిన వారిని సంరక్షిస్తాడు. క్రీస్తు అవతరానికి ముందు యేసు ఏమని చెప్పాడు... శారా తల్లి అవుతుంది అని వాగ్దానం చేసాడు మరియు ఇస్సాకు ఎన్నుకోబడ్డాడు. మీరు చూడండి, దేవుని యొక్క హస్తము ఇస్సాకుపై కచ్చితముగా ఉంది అది మీరు చూడాలి అని నా ప్రార్ధన, కాని నిరీక్షణా సందేశము అందరికి అందుబాటులో ఉంది.
వారెన్ వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, కో: డేవిడ్ సి. కుక్, 2001), పే. 99.
టామ్ కానిస్టేబుల్, డా. కానిస్టేబుల్స్ నోట్స్ ఆన్ డ్యూటెరోనమీ, p. 282; ఆన్లైన్లో https://planobiblechapel.org/tcon/notes/pdf/genesis.pdfలో అందుబాటులో ఉంది.
కానిస్టేబుల్, పి. 283.
బ్రూస్ వాల్ట్కే, జెనెసిస్: ఎ కామెంటరీ (గ్రాండ్ రాపిడ్స్: జోండర్వాన్, 2001), n. p.
5 వైర్స్బే, పే. 102.
ప్రశ్నలు
-
ఆదికాండము 20:2లో, అబ్రాహాము తాను ఇదివరకు చెప్పిన అదే అబద్ధాన్ని పునరావృతం చేసాడు (ఆదికాండము 12:11-13). గత పాపంలోకి తిరిగి రాకుండా ఎలా ఉండగలరు?
దినవాక్యం
Laura Martin Genesis 21:12-13
“But God said to Abraham, ‘Do not be concerned about the boy and your slave. Whatever Sarah says to you, listen to her, because your offspring will be traced through Isaac. But I will also make a nation of the slave’s son because he is your offspring.’”
ఈ కథ ఇద్దరు తల్లుల హృదయాల నుండి బయటపడింది: ఇస్సాకు కోసం శారా మరియు ఇష్మాయేలు కోసం హాగరు. శారా ప్రభువును వెదకింది మరియు తన వాగ్దాన కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు ఆనందం మరియు నవ్వుతో నిండిపోయింది. హాగరు నిరాశ చెందింది, ఎందుకంటే ఆమె తన కొడుకును విడిచిపెట్టి, అతని భవిష్యత్తుతో ప్రభువును విశ్వసించవలసి వచ్చింది. అయినప్పటికీ ఆమె నిరాశలో కూడా, సహాయం కోసం ప్రభువును వేడుకుంది.
మీరు మీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నారో ప్రభువు చూస్తాడు. ఈ రోజు మీరు మెస్సయపై ఉన్న నిరీక్షణతో నడుచుకునేటప్పుడు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువునందు ఆనందించండి, ఆయన సమయమును మరియు ఆయన మార్గంను విశ్వసించండి అప్పుడు ఆయన మీ హృదయ వాంచలను తీర్చును.
“అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కొడుకును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పెను.”
— ఆదికాండము 21:12-13
తదుపరి వాఖ్యభాగము
కీర్తనలు 37:3-5 – “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.”
కీర్తనలు 20:4 - నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
అపోస్తులుల 15:8 - “మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్యమిచ్చెను.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.