Faith In Christ
యేసును ఇలా కనుగొనండి: Liberator Galatians 3 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
గలతీయులకు రాసిన పత్రిక అంతా ఏమి మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి పూర్తిగా అధ్యయనం చేయాల్సిన పుస్తకం. పుస్తక అధ్యయనం పూర్తి చేసిన తర్వాత, మీరు 1వ అధ్యాయానికి తిరిగి వెళ్లి మరల చదవాలి. మనం అధ్యయనాన్ని ప్రారంభించే ముందు, 3వ అధ్యాయం “శరీరం” మరియు “ఆత్మ” గురించి చర్చగా మారే పరివర్తనకు సిద్ధం కావడానికి కొంత నేపథ్యాన్ని అందించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు, శరీరానికి గుర్తుగా సున్నతి గురించి మరియు హృదయానికి గుర్తుగా కొత్త సున్నతి గురించి మనం మాట్లాడుకున్నాము. దేవుడు మరియు క్రీస్తు గురించి మనకు అర్థం కాని విషయాలు ఉన్న సమయాల్లో మనమందరం మూర్ఖులమైన గలతీయులమే.
పాఠము
గలతీయులకు 3:1-5: “భ్రమకు గురయ్యారు” (1 వ) అనే పదాన్ని “మీ కళ్ళను మరొకరి వైపుకు తిప్పారు” అని అర్థం చేసుకోవచ్చు. 2వ అధ్యాయం లేఖలోని బలమైన పదాలతో కూడినది, ఇది పౌలు సంబంధాలను కోల్పోవడానికి కారణమైన విభజనాత్మక విభాగం. అతను 3వ అధ్యాయంలో బలమైన పదాలను కొనసాగించాడు. పౌలు తన ఇతర లేఖలలో కొన్నింటిలో ధర్మశాస్త్ర అక్షరాన్ని తగ్గించాడు. అతని ఉద్దేశ్యం ఏమిటంటే విశ్వాసం అనేది ధర్మశాస్త్రానికి విధేయత చూపడం కాదు, ఆత్మ నుండి వచ్చినది.
నా పరిచర్య ద్వారా మరియు నేను కలిసి నడిచిన వ్యక్తుల ద్వారా, నేను గలతీయులను అర్థం చేసుకున్నాను. సత్యం యొక్క బోధను తాము సత్యం అని భావించే వ్యక్తులు తీసుకువచ్చినట్లయితే, మీ మనస్సాక్షిని వారి సత్యానికి అనుగుణంగా మార్చుకోవడం సులభం. లియోనార్డ్ రావెన్హిల్ ఇలా అన్నాడు, "మీకు సౌకర్యవంతమైన సంఘము దొరికితే, పారిపోండి!" సువార్త సౌకర్యవంతంగా ఉండటానికి ఉద్దేశించబడలేదు. సౌకర్యముపై దృష్టి పెట్టడం అంటే సంఘ సౌకర్యవంతమైన సువార్తను ప్రకటిస్తోంది, ప్రపంచానికి దాని లక్ష్యం అది కాదు, అసలైన లక్ష్యమేమనగా యేసు మాటలు ప్రపంచమంతా వ్యాపింపచేసి మార్పును తీసుకురావడానికి సహాయపడటం.
మనము విశ్వసించేది సత్యమని మరియు అదే సత్యముగా ఉండనిమ్మని మనమందరమూ వినవచ్చు. కానీ మనం ఆ సత్యాన్ని పరిశోధించామా, కాబట్టి అది రక్షకుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తే సత్యమని మనకు తెలుసా? పౌలు మూడవ అకాశములో తన అనుభవాల గురించి మాట్లాడాడు. మూడవ అకాశములో ఉన్నప్పుడు అతనికి కొత్త నిబంధన సత్యం కోసం ప్రత్యక్షత పరిచర్య ఇవ్వబడింది. అందువల్ల, ప్రజలతో కలిసి ఉండటంతో సహా ఏ కారణం చేతనైనా పౌలు తనకు ఇవ్వబడిన దేనినీ రాజీ పడటానికి ఇష్టపడలేదు. ఆయన సంఘములోని ప్రజలను కలిశాడు, కానీ సంఘము ఎలా ఉంటుందో వారికి ఇంకా వెల్లడి కాలేదు. పౌలు అన్యులకు పరిచర్య చేయడానికి మరియు ప్రపంచాన్నంతటిని దేవుని రాజ్యంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. గలతీయులు ఆ సున్నతి చర్యపైనున్న ప్రత్యక్షతను స్వీకరించకుండా మరియు దానిపై దృష్టి పెట్టకుండా ఉండేందుకు పౌలు అనుమతించలేకపోయాడు. కైల్ నిన్న బోధించినట్లుగా: "వంచన అనేది ప్రజలను సువార్త సత్యం నుండి దూరంగా ఉంచుతుంది."
మీ సత్యానికి ధర్మశాస్త్రము (నియమాలు, మతపరమైన సిద్ధాంతం, బిషప్ లేదా అది ఎల్లప్పుడూ ఉన్న విధంగా) సరిహద్దుగా ఉంటే, మీకు ఆత్మ యొక్క ప్రత్యక్షత లేకపోతే, మీరు మీ మనస్సు మరియు మనస్సాక్షి యొక్క తర్కంలో యేసు నుండి కూడా వెనక్కి తగ్గుతారు. మీరు నిజమైన ప్రత్యక్షతలోకి నడవబోతున్నట్లయితే, మీరు వాక్యాన్ని మీ దిక్సూచిగా చేసుకుంటారు. వాదమును కాకుండా విశ్వాసాన్ని స్వీకరించండి.
గలతీయులు 3:6–9: దేవుడు ఆయనతో మాట్లాడటం (పదాలను ఉపయోగించి) విన్నందున "అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు" (6 వ). ప్రభువు మాట వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. అంటే అన్ని దేశాలు దానిని వినాలి. దేవుని నుండి వచ్చే ఆ "వాక్యం" రామ అనే పదం నుండి వచ్చింది, దీని అర్థం అక్షరాలా "దేవుడు మాట్లాడుతాడు". విశ్వాసం అంటే ఆత్మ ద్వారా దేవుని వాక్కును స్వీకరించడం మరియు దేవుని వాక్కును బోధించినట్లుగా పాటించడం. విశ్వాసం అంటే తెలియని దానిలోకి అడుగుపెట్టడం కాదు, కానీ అది దేవుని నుండి వచ్చే వాక్కుకు విధేయత చూపడం. ఆ విశ్వాసం ద్వారా "అన్ని దేశాలు" ఆశీర్వదించబడతాయి (8 వ) (ఆదికాండము 12:3). అబ్రాహాముకు ఆత్మీయ కుమారులను తీసుకువచ్చే ఆధ్యాత్మిక విత్తనాన్ని తండ్రియైన అబ్రాహాము అందించాడు (9 వ).
గలతీయులు 3:10–12: ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఎంచుకుంటే, అతను ధర్మశాస్త్రమంతటినీ (మొత్తం 613 వ్యక్తిగత నియమములు) పాటించాలని పౌలు ద్వితీయోపదేశకాండము 27:26 నుండి ఉటంకించాడు - ఇది పాటించుట ఎవరికైనా అసాధ్యమే (వ 10). కానీ వ్యక్తి అన్ని నియమములను పాటించగలిగినప్పటికీ, అతను తన క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు (11 వ). బదులుగా, ఒక వ్యక్తి క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడతాడు మరియు ధర్మశాస్త్రమును అనుసరించడం విశ్వాసంపై ఆధారపడి ఉండదు (వచనం 12) (రోమా 3:27–31; 4:13–14). ప్రజలు దానిని స్వీకరించిన సమయంలోనే వారికి విశ్వాసంలో భాగంగా ధర్మశాస్త్రం ఇవ్వబడిందని గమనించండి, ఎందుకంటే వారికి ఇంకా ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడలేదు. పాపం మరియు మరణం ద్వారా నియంత్రించబడిన లోకంలోకి, యేసు తన సిలువ మరణం ద్వారా జీవ నియమాన్ని తీసుకువచ్చాడు.
గలతీయులు 3:13–22: అన్యులమైన మనం దేవుని పిల్లలుగా మారడానికి యేసు శపించబడటానికి ఇష్టపడ్డాడు (13 వ) (ద్వితీయోపదేశకాండము 21:23). 14వ వచనం మొత్తం సువార్త సందేశాన్ని ఒకే వాక్యంలో చెబుతుంది: "అబ్రాహాము యొక్క ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగుతుంది, తద్వారా మనం విశ్వాసం ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మను పొందగలము." యేసు మన హృదయాలను పట్టుకుని ఆకర్షించడానికి ఉద్దేశించిన ఒక కొత్త నియమమును తీసుకువచ్చాడు. మనలో ఉన్న ఆయన ఆత్మ కారణంగా, పాపం మన జీవితాలపై కలిగి ఉన్న పట్టును మనం అధిగమించగలుగుతున్నాము.
16వ వచనం రాజ్య సంస్కృతికి సంబంధించిన దేవుని ప్రణాళికను వివరిస్తుంది. మానవాళిని తన వద్దకు తీసుకురావాలనే ప్రణాళిక దేవునికి ప్రారంభం నుండే ఉంది. దేవుడు పాప సంస్కృతి ద్వారా (నోవహు ఓడ ద్వారా), ఎంపిక చేసుకున్న ప్రజల ద్వారా (అబ్రహం ద్వారా), వారి విమోచన ద్వారా (మోషే ద్వారా) భూమిపై ఎవరూ లేని కొత్త నియమములను వారు పొందగలిగే ప్రదేశానికి మనలను తీసుకువచ్చాడు. యేసు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు, ఆయన అందించాల్సిన కొత్త సూత్రాలను మనం అర్థం చేసుకుని అంగీకరించగలిగేలా దేవుడు ఇవన్నీ చేశాడు. దేవుని వాక్యం ద్వారా మనకు వివరించడానికి చరిత్ర పాఠాలు ఉన్నందున మనం ఇవన్నీ అర్థం చేసుకుంటాము. విశ్వాసం అంతా విధేయత గురించి మరియు మన నుండి ఏదో ఒకటి కోరుతుంది (16–17 వ). మన విముక్తిలో మనం క్రీస్తును సేవించగలము; దేవుని ప్రేమ ద్వారా మనం యేసుక్రీస్తుకు బానిసలమయ్యాము.
ముగింపు
మానవజాతియైన మనము మనంతటికి మనము నీతిగా జీవించలేమని తేల్చడానికి ధర్మశాస్త్రము అవసరం. ఈ ధర్మశాస్త్రము పాప క్షమాపణ ద్వారా కొత్త నిబంధనను తప్పనిసరి చేసింది.
మన జీవితాల్లో మనం చేయగలిగే గొప్ప పని (మరియు మనం దానిని రివైవ స్కూలులో చేస్తున్నాము) ఏమిటంటే, బైబిల్‌ను కొన్ని విభాగాల ద్వారా కాలక్రమానుసారంగా అధ్యయనం చేయడం, ఆపై పాత నిబంధన మరియు కొత్త నిబంధన మధ్య ముందుకు వెనుకకు వెళ్లి, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మరియు దేవుడు మన జీవితాల్లో ఏమి చేయాలనుకుంటున్నాడో స్వీకరించడం. మీరు మీ జీవితంలో ప్రత్యక్షతను కోరుకుంటే, మరొక సమావేశానికి హాజరు కావద్దు; ఒంటరిగా దేవుని వాక్యమును ధ్యానించండి.
ప్రశ్నలు
-
పౌలు గలతీయులను ఏమని పిలిచాడు? వారిని అలా పిలవడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటి (లూకా 24:25; 1 తిమోతి 6:9; తీతు 3:3)?
దినవాక్యం
Laura Martin Galatians 3:27–29
“For as many of you as have been baptized into Christ have put on Christ like a garment. There is no Jew or Greek, slave or free, male or female; for you are all one in Christ Jesus. And if you belong to Christ, then you are Abraham’s seed, heirs according to the promise.”
విశ్వాసులు విశ్వాసం ద్వారానే రక్షింపబడతారని మరియు నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవిస్తారని పౌలు గలతీ పత్రికలో నొక్కి చెప్పడం కొనసాగించాడు. ఈ విశ్వాసం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా వస్తుంది. పాపం మరియు మరణం యొక్క నియమము ఇకపై అవసరం లేదు. యూదుడు మరియు గ్రీకు, దాసుడు మరియు స్వతంత్రుడు, పురుషుడు మరియు స్త్రీ అనే తేడా ఇకపై లేదు. ఆత్మ యొక్క నియమము క్రీస్తులో కనిపిస్తుంది. మీరు క్రీస్తుకు చెందినవారు. కాబట్టి ప్రతిరోజూ యేసును వస్త్రంలా ధరించి ఆయన ఆత్మలో నడవండి. మీ జీవితంలో అద్భుతాలు చేసేది ఆత్మ.
లేఖనాలలో సమయం గడపండి ఎందుకంటే విశ్వాసం దేవుని వాక్యాన్ని వినడం ద్వారా వస్తుంది. దేవుని శక్తి మీలో గొప్పగా మారుతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని యేసు వద్దకు నడిపిస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని ఆత్మ వైపుకు నడిపిస్తుంది. గుర్తుంచుకోండి, క్రీస్తుపై మీ విశ్వాసం ద్వారా, మీరు సర్వోన్నతుడైన రాజు కుమారుడు లేదా కుమార్తె. మీరు క్రీస్తుకు చెందినవారు, మీకు క్రీస్తులో స్వేచ్ఛ ఉంది మరియు మీరు క్రీస్తులో ఒకరు.
“క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.”
- గలతీయులకు 3:27–29
తదుపరి లేఖన భాగములు
రోమా 10:17— “కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.”
గలతీయులు 3:11— “ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.”
గలతీయులు 3:26— “యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.