The Meeting
యేసును ఇలా కనుగొనండి: Liberator Galatians 2 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
సువార్తను బలహీనులతో పంచుకోవడానికి పౌలు ఇష్టపడుతున్నాడని తెలుసుకుని యూదా విశ్వాసులకు చాలా కష్టంగా అనిపించింది. అదనంగా, ఈ కొత్తగా మతం మారిన వారిలో చాలామంది యూదులు కానివారు, వారు ధర్మశాస్త్రాన్ని పాటించాలని పౌలు కోరలేదు. చాలా మంది యూదుల కంటే అన్యులు సువార్తను భిన్నంగా స్వీకరించారు. ఇది ఇప్పటికీ విశ్వాసంతో పనిచేస్తున్న మరియు రక్షణను అర్థం చేసుకునే యూదా విశ్వాసులతో కొన్ని సమస్యలను సృష్టించింది.
పాఠము
గలతీయులు 2:1-2: పౌలు "వ్యక్తిగత సంప్రదింపు" అని వర్ణించిన సమావేశముగా వియర్స్బే దీనిని పిలిచాడు.1 పౌలు, బర్నబా మరియు తీతుకు యెరూషలేము నాయకులకు తాము అన్యుల మధ్య ప్రకటించిన సువార్త గురించి తెలియజేయడానికి యెరూషలేముకు వెళ్లారు. ఇది సంఘ నాయకులపట్ల పౌలు గౌరవం చూపడం మరియు వారి నాయకత్వానికి విధేయులవ్వడం వంటిది. తన సువార్త సరైనదే అని యెరూషలేము నాయకులు నిర్ణయించుకునేంత వరకు అతను వెళ్ళాడు (వ. 2).
పౌలు యెరూషలేముకు వెళ్ళాడు (వ. 1) అని చెప్పినప్పుడు, మనం అడగాలి, అతను యెరూషలేముకు ఏ పర్యటనను సూచిస్తున్నాడో. పౌలు కనీసం ఐదుసార్లు యెరూషలేముకు వెళ్ళాడు.2
- యేసుతో దమస్కు రోడ్డు సమావేశం తర్వాత—“అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో సహవాసం చేయడానికి ప్రయత్నించాడు, కానీ వారందరూ అతనికి భయపడ్డారు, ఎందుకంటే అతడు శిష్యుడయ్యాడని వారు నమ్మలేదు” (అపొస్తలుల కార్యములు 9:26-30; గలతీయులు 1:18-20).
- కరువు సందర్శన—“అప్పుడు వారిలో అగబు అనే ఒకడు లేచి, రోమా ప్రపంచమంతటా తీవ్రమైన కరువు వస్తుందని ఆత్మ ద్వారా ప్రవచించాడు. ఇది కౌదియ కాలంలో జరిగింది. కాబట్టి శిష్యులలో ప్రతి ఒక్కరూ, తన సామర్థ్యం ప్రకారం, యూదయలో నివసించే సహోదరులకు సహాయం పంపాలని నిశ్చయించుకున్నారు. వారు బర్నబా మరియు సౌలు ద్వారా పెద్దలకు సహాయం పంపడం ద్వారా ఇలా చేశారు” (అపొస్తలుల కార్యములు 11:28–30; గలతీయులు 2:1-10).
- యెరూషలేము సభ—బహుశా గలతీయులు 2వ అధ్యాయముతో సరిసమానమైన సందర్శన. యెరూషలేము సభలో జరిగిన దానిని గలతీయులు 2వ అధ్యాయము వివరిస్తుంది (అపొస్తలుల కార్యములు 15:1-29).
- పౌలు రెండవ మిషనరీ ప్రయాణం ముగింపు (అపొస్తలుల కార్యములు 18:22).
- అతని జైలు శిక్షకు దారితీసిన అతని చివరి సందర్శన (అపొస్తలుల కార్యములు 21:15—23:35).
యెరూషలేముకు ఈ ప్రయాణంలో బర్నబా మరియు తీతుకు పౌలుతో పాటు వెళ్లారు. బర్నబా అనే పేరుకు "ప్రోత్సాహపు కుమారుడు" అని అర్థం. కరువు సందర్శన సమయంలో మరియు మొదటి మిషనరీ ప్రయాణంలో బర్నబా పౌలుతో ఉన్నాడు, కాబట్టి పౌలు ప్రకటన మరియు పరిచర్యకు హామీ ఇచ్చే ప్రత్యేక స్థానంలో అతను ఉన్నాడు. పౌలు తీతుకును కూడా తీసుకువచ్చాడు, అతను పౌలు పరిచర్య ఫలితంగా అన్యజనులలోనుండి మారిన విశ్వాసి: "మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు " (తీతుకు 1:4).3
వారు ఎవరితో కలిశారు? గలతీయులు 2:9 ప్రత్యేకంగా "యాకోబు, కేఫా [పేతురు] మరియు యోహాను" అని పేర్లు చెప్పబడినవి. పేతురు మరియు యోహానులు యేసు యొక్క శిష్యులు. విశ్వాస ద్వారం తెరవడానికి యేసు పేతురుకు "తాళపుచెవులు" ఇచ్చాడు. యేసు యొక్క ఆంతరంగిక శిష్యులలో ముగ్గురిలో యోహాను ఒకడు. యాకోబు యేసు సహోదరుడు, అతను మొదట్లో యేసును విశ్వసించలేదు కానీ తరువాత యెరూషలేం సంఘములో నాయకుడయ్యాడు.4
గలతీయులు 2:3–5: వియర్స్బే దీనిని "ప్రజా సమావేశం" అని పిలిచాడు.5 అన్యులలోనుండి విశ్వాసిగా మారిన తీతుకు సున్నతి పొందలేదు మరియు "సున్నతి పొందవలసి వస్తుంది" అని భావించలేదు. యూదా ప్రజలు దేవునితో నిబంధన సంబంధంలో ఉన్నారని సున్నతి సూచిస్తుంది. తీతుకు సున్నతి పొందలేదనే ఏదో ఒక విధముగా సమావేశంలోకి ప్రవేశించగలిగిన కొంతమంది "నకిలీ సహోదరులకు" ఒక పెద్ద సమస్యగా మారింది. మరికొందరు యేసు మరియు ఆయన చేసిన కార్యములను బట్టి రక్షణకు మార్గమని అని పట్టుబట్టగా విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ ఉందనే సందేశాన్ని పౌలు ప్రకటిస్తున్నాడు. యేసును విమోచకుడిగా పౌలు అర్థం చేసుకున్నాడు: "ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి. " (గలతీయులు 5:1). అతను "సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.... తద్వారా సువార్త మీ కోసం భద్రపరచబడుతుంది" (5 వ).
గలతీయులు 2:6–10: వియర్స్బే ఈ విభాగాన్ని “వ్యక్తిగత నిర్ధారణ” అని పిలిచాడు.6 పేతురు, యాకోబు మరియు యోహానులు సంఘములో ప్రముఖ స్థానాలను కలిగి ఉన్నప్పటికీ, దేవుడు పక్షపాతం చూపడు అని పౌలుకు తెలుసు - దేవుడు పక్షపాతం చూపడు. చివరికి, పౌలు ఈ నాయకుల ధృవీకరణను కాకుండా దేవుని ధృవీకరణను అనుసరించాడు. పేతురు, యాకోబు మరియు యోహానులు పౌలుకు వేరే లక్ష్యం ఉందని చూశారు. పేతురు సున్నతి పొందిన వారి వద్దకు పంపబడినప్పటికీ, పౌలు సున్నతి పొందని వారికి ఒక ప్రత్యేకమైన పిలుపును కలిగి ఉన్నాడని వారు గుర్తించారు. నెల్సన్ వ్యాఖ్యానం నాయకులు పౌలుకు “సహవాసం యొక్క కుడి చేయిని అందించారు [ఇది] “అంగీకారం మరియు స్నేహమునకు” సాధారణ సంకేతం. ఇది యెరూషలేము సంఘ ప్రతినిధులు పౌలును పూర్తిగా గుర్తించడాన్ని సూచిస్తుంది” అని ఎత్తి చూపింది.7 వారి ఏకైక నిబంధన ఏమిటంటే పౌలు “పేదలను గుర్తుంచుకో” (10 వ), ఇది పౌలు ఇప్పటికే చేసాడు మరియు చేస్తూనే ఉంటాడు.
ఈ సమయంలో, అందరూ ఒకే మాట మీద ఉన్నారు. పౌలు మరియు పేతురు తమ లక్ష్యాలను అర్థం చేసుకున్నారు మరియు ఒకరి బోధ మరియు లక్ష్యాన్ని ఒకరు అర్థం చేసుకున్నారు.
గలతీయులు 2:11–14: పేతురు వేషధారణతో ప్రవర్తించిన అనుభవాన్ని పౌలు పేతురుతో వివరించాడు. పేతురు అంతియొకయకు వచ్చి “యాకోబు నుండి కొంతమంది” వచ్చే వరకు అన్యుజనులతో కలసి భోజనం చేశాడు (12 వ). ఈ పురుషులు ఇప్పటికీ సున్నతి బోధించే యూదా విశ్వాసులై ఉన్నారు. వారు వచ్చిన తర్వాత, పేతురు అన్యుల నుండి మరియు ఇతర యూదా విశ్వాసుల నుండి తనంతటకు తాను ప్రక్కకు తప్పుకున్నాడు; బర్నబా కూడా అతని మాదిరిని అనుసరించాడు (13 వ) “సున్నతి పొందిన వారికి భయపడి” (12 వ). వారి మునుపటి వ్యక్తిగత సంభాషణ కారణంగా పౌలు పేతురును బహిరంగంగా ఎదుర్కొన్నాడు (14 వ).
గలతీయులు 2:15–21: యేసుపై ఉంచిన విశ్వాసం మాత్రమే విశ్వాసులను నీతిమంతులుగా చేస్తుందని పౌలు పునరుద్ఘాటించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల దేవుని ముందు ఒకరు నీతిమంతులుగా తీర్చబడరని అతనికి తెలుసు. ఎవరైనా ధర్మశాస్త్రము ద్వారా దేవుని ముందు నీతిని సంపాదించడం సాధ్యమైతే, ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే. (21 వ).
ముగింపు
విశ్వాస సువార్త మాత్రమే యూదులు మరియు అన్యులు ఇరువురికీ ఉద్దేశించబడింది.
వారెన్ వియర్స్బే, ది వియర్స్బే బైబిల్ కామెంటరీ: న్యూ టెస్టమెంట్, (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి కుక్, 2007), పేజీ 690.
థామస్ కానిస్టేబుల్, డాక్టర్ కానిస్టేబుల్స్ ఎక్స్‌పోజిటరీ బైబిల్ స్టడీ నోట్స్: గలతీయులు, పేజీ 34; https://planobiblechapel.org/tcon/notes/pdf/galatians.pdfలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
జాన్ మాక్‌ఆర్థర్, ది మాక్‌ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజీలు 1660–1661.
మాక్‌ఆర్థర్, పేజీ 1662.
వియర్స్బే, పేజీ 691.
వియర్స్బే, పేజీ 692.
ఎర్ల్ రాడ్‌మాచర్, రోనాల్డ్ బి. అల్లెన్, మరియు హెచ్. వేన్ హౌస్, సం., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), పేజీ. 1520.
ప్రశ్నలు
-
తీతుకు ఎవరు? అతను పౌలుతో ఎలా సంబంధం కలిగి ఉన్నాడు (2 కొరింథీ 2:13; 7:5–6; తీతుకు 1:4–5)
దినవాక్యం
Laura Martin Galatians 2:19–20
“For through the law I have died to the law, so that I might live for God. I have been crucified with Christ and I no longer live, but Christ lives in me. The life I now live in the body, I live by faith in the Son of God, who loved me and gave Himself for me.”
క్రీస్తు మరణించి, దాస్యత్వం నుండి, ధర్మశాస్త్రము నుండి, పనితీరు నుండి మరియు దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీ స్వంత బలంతో కష్టపడటం నుండి మిమ్మల్ని విడిపించాడు. క్రీస్తు మీ కోసం తనను తాను అర్పించుకున్నాడు. క్రీస్తు మరణించినప్పటికీ మీరు నీతి కోసం ధర్మశాస్త్రమును పాటింస్తూ మరియు నియమాలకు కట్టుబడి ఉండవలసివస్తే, అప్పుడు క్రీస్తు మరణించుట నిరర్థకము. బదులుగా, క్రీస్తు మిమ్మల్ని విడిపించడానికి మరణించాడు. మీ నీతి క్రీస్తులో మాత్రమే కనిపిస్తుంది. మీ అహం, నియమాలను పాటించే మీ మార్గాలు మరియు పరిపూర్ణంగా కనిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు క్రీస్తుతో మరణించాయి. మీ జీవితం ఇకపై మీ గురించి కాదు. దేవుని ఆమోదం పొందడానికి పనులు చేయడం ముగిసింది మరియు క్రీస్తుతో చంపబడ్డారు. ఇప్పుడు క్రీస్తు మీలో నివసిస్తున్నాడు మరియు మీరు ఆయనలో నీతిమంతులు.
గుర్తుంచుకోండి, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు మీ కోసం తన జీవితాన్ని ఇవ్వడానికి ఎంచుకున్నాడు కాబట్టి మరణించాడు. మీరు ఆయన ప్రేమించడానికి అర్హులని నమ్మండి. మీరు విఫలమవుతున్నారని మరియు కొనసాగించలేరని మీకు అనిపించినప్పుడు, కష్టపడటం మానేయండి. క్రీస్తు భూమికి వచ్చి చనిపోలేదు కాబట్టి మీరు కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఇది పరిపూర్ణత కోసం ప్రయత్నించడం గురించి కాదు. క్రీస్తులో జీవితం అంటే ఆయనలో మాత్రమే విశ్రాంతి తీసుకోవడం. ఇది యేసు సమృద్ధిగా ఇచ్చే కృపపై విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా నడవడం గురించి. మీరు ధర్మశాస్త్రము నుండి విముక్తి పొందారు. ఆ స్వేచ్ఛలో నడుచుకోండి. ప్రభువును స్తుతించండి!
“నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.”
- గలతీయులకు 2:19–20
తదుపరి లేఖన భాగములు
గలతీయులు 2:21 — “నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.”
ఎఫెసీయులు 3:12— “ఆయనయందలి విశ్వా సముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.”
1 పేతురు 2:16— “స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్‌లోడ్‌లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.