Deuteronomy 28
యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 28 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం:
మనము చివరిసారిగా ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయమును చూశాము, అది ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే వారు ఎదుర్కొనే శాపాలను వివరించింది. మొత్తం 12 శాపాలకు, ఇశ్రాయేలీయులు తమ ఒడంబడికకు “ఆమేన్!” అని బదులిచ్చారు. ద్వితీయోపదేశకాండము 27:26 వారు ఆజ్ఞలలో దేనినైనా ఉల్లంఘించినట్లయితే, వాటన్నింటిని ఉల్లంఘించినట్లే గనుక వారు దోషులుగా భావిస్తారు. ద్వితీయోపదేశకాండము 27-28లో, 27వ అధ్యాయంలోని (రొట్టె యొక్క పై భాగము) శాపాలు, 28వ అధ్యాయం (మాంస భాగం) ప్రారంభంలో విధేయతతో ఉంటె ఆశీర్వాదాలు మరియు ఆ తర్వాత ముగింపులో మరిన్ని శాపాలు ఉన్నాయి(రొట్టె యొక్క దిగువ భాగం). సాధారణంగా మనం ఆశీర్వాదం/శాపం/దీవెన గురించి ఆలోచిస్తాము, కానీ ఇది వ్యతిరేకం. మేము ద్వితీయోపదేశకాండము 28లోని “మాంస విభాగం” నుండి ప్రారంభిస్తున్నాము.
పాఠము
ద్వితీయోపదేశకాండము 28:1: ఇశ్రాయేలీయులు మోషే వారికి ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తే ("ఈ రోజు" అనేది మోషే వారికి ఆజ్ఞలను ఇచ్చిన రోజు అని జ్ఞాపకముచేసుకోనుడి మరియు వాటిని అన్నింటినీ వ్రాయమని చెప్పారు, ద్వితీయోపదేశకాండము 27) దేవునికి లోబడి ఉండటం అనేది వారి యొక్క నిర్ణయం, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును అని 1వ వచనం చెబుతోంది. అప్పుడు, మోషే వారికి ఆ దీవెనల పేర్లు పెట్టడం ప్రారంభించాడు. దేవుడు సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. (ద్వితీయోపదేశకాండము 26:19). కానీ ద్వితీయోపదేశకాండము 8:1లో, ఈ స్థితీకి వారు చేరుకోవాలి అంటే దేవుడు నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను అని సెలవిస్తుంది. ప్రస్తుతం, ఇశ్రాయేలు అదికులుగా ఉన్నంతవరకు, మనము దీనిని స్పష్టంగా చూడలేము, కానీ ఇశ్రాయేలు రాజు ప్రతి ఒక్కరికీ రాజు అవుతాడని మరియు అతని పేరు యేసు రాజు అని మాకు తెలుసు (రోమా 11:25-27). యేసు తిరిగి వచ్చినప్పుడు ఇది జరగబోతోంది. అన్యజనుల సంపూర్ణనముగా ప్రభువు వైపు తిరిగినప్పుడే ఇది జరిగే ఏకైక మార్గం. యూదులు అసూయపడతారు అది మెస్సీయ తిరిగి రావడానికి దారి తీస్తుంది. అప్పుడు ఇశ్రాయేలు దేశము ఇతర దేశాల కంటే ఉన్నతంగా ఎదుగుతుంది.
చివరికి యూదులు అన్యజనులందరికి వెలుగుగా మారబోతున్నారు (యెషయా 49:6). అది చివరికి మెస్సీయ రాజ్యంలోకి ప్రవేశించినప్పుడు వస్తుంది మరియు అది యూదు ప్రజల ద్వారా వస్తుంది. ఆదికాండములోని సంతానము చివరికి దేవుని రక్షణకు దారి తీస్తుంది మరియు యేసు ద్వారా ఇశ్రాయేలు అన్ని ఇతర దేశాల కంటే హెచ్చుగా ఉంటుంది. అందుకే ఇశ్రాయేలు దేశం భూమి మీద నుండి తుడిచిపెట్టబడదు ఎందుకంటే దేవుడు ఆ దేశం ద్వారా మరియు అతని ప్రజల ద్వారా వచ్చే రక్షణ ప్రణాళికను కలిగి ఉన్నాడు.
ద్వితీయోపదేశకాండము 28:2-4: ఈ వచనంలో, మాట వినిన యడల ఈ దీవెనలన్నీయు వచ్చును. రాబోయే ఈ దీవెనలు పాక్షిక నెరవేర్పు ఉందని మనకు తెలుసు. యెహోషువా 21:45 ప్రకారం, “యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.” నేను పాక్షికంగా చెప్పాను ఎందుకంటే వెయ్యేళ్ల పాలన ఇంకా జరగలేదు. వారు ధర్మశాస్త్రానికి లోబడినందున, వారు దీవినచబడ్డారు. 3వ వచన ప్రకారం పాత నిబంధన యొక్క సందేశములు. నీవు పట్టణములో దీవింపబడుదురు; దేశములో దీవింప బడుదురు. 4వ వచనం ప్రకారం గర్భ ఫలము దీవించబడును మరియు వారు తాకిన ప్రతిదీ దీవించబడును.
ద్వితీయోపదేశకాండము 28:6-7: 5వ వచనంలో, "నీ గంపయు పిండి పిసుకు నీ తోట్టేయు దీవించబడును." ద్వితీయోపదేశకాండము 28:17లో, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును అని వ్రాయబడి ఉంది. 16వ వచనంలో వారు పట్టణములో శపింపబడుదువు; పొలములో శపింపబడుదువు అని చెప్పబడినది. ఇది పదే పదే నిజం. 18వ వచనం 4వ వచనానికి అనుగుణంగా ఉంది. ఇక్కడే వీటి మధ్య సారూప్యత ఉత్తమంగా కనిపిస్తుంది మీరు దీవించబడే మార్గము మరియు లేదా మీరు శపించబడే మార్గము ఉంది. 6వ వచనంలో, దీవించ బడటం రోజువారీ జీవితంలో జరుగుతుంది, లేదా, 19వ వచనంలో, నీవు ఎంచుకున్నదాని ఆధారముగా శపించబడుదువు ఇది రోజువారీ జీవితంలో జరుగుతుంది. మన జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని మనం నియంత్రించలేము, కానీ ఆ దృశ్యాలకు మనం ఎలా స్పందిస్తామో మన నిర్ణయాలను నియంత్రించవచ్చు. 7వ వచనంలో, దీవెన పొందిన వ్యక్తిపై దాడి చేసే శత్రువులు యేడు త్రోవల గుండా నీ యెదుటనుండి పారిపోవుదురు.
ద్వితీయోపదేశకాండము 28:8-10: 8వ వచనంలో, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. 9వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును. భూప్రజందరు యెహోవా నామమున నీవు ప్రసిద్ధుచుండుట చూచి వారి పక్షమున దేవుడు ఉన్నాడు అని గ్రహించెదరు (వ.10). ఇశ్రాయేలు అన్ని ఇతర దేశాలకు సాక్షి అవుతుంది. వారు అందరికి వెలుగుగా మారతారు మరియు చివరి రోజుల్లో వారు సాక్ష్యమిచ్చే దేశంగా మారతారు.
ప్రకటన 7: 4-8లో ఈ సంఘటనలు నమోదు చేయబడినవి, “మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని: ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు (144,000) లక్ష నలువది నాలుగు వేలమంది,” ఆపై 9 వ వచనంలో, “అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడిరి. 10వ వచనంలో, “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ ప్రక్రియను ఎవరు ప్రారంభించారో ఊహించండి? అంత్య దినములలో సాక్షిగా పనిచేసిన యూదు ప్రజలు. కాబట్టి, ద్వితీయోపదేశకాండము చివరిలో, ప్రజలు అందరికీ వెలుగుగా మరియు సాక్షిగా ఉండాలని చెప్పబడింది, ఎందుకంటే అది చివరి వరకు కొనసాగుతుంది. . . చివరి రోజుల వరకు. ఇశ్రాయేలీయులు రాజ్యం యొక్క వాస్తవ సమయంలో సాక్షిగా ఉండబోతున్నారని కూడా లేఖనాలు చెబుతున్నాయి (జెకర్యా 8: 1-12). యేరుషలేము నమ్మకమైన నగరంగా పిలువబడుతుంది మరియు దేవుని యొక్క పర్వతం అని పిలువబడుతుంది. పరిశుద్ద పర్వతం (జెకర్యా 8:3). వాస్తవమేమిటంటే, యేరుషలేము కేంద్ర బిందువుగా మారుతుంది, ఇది దేవుని రాజ్యానికి కీలకమైన భాగం, మరియు దేవుడు అక్కడ ఏమి చేయబోతున్నాడో ప్రతి ఒక్కరు చూస్తారు.
ద్వితీయోపదేశకాండము 28:10 దానిని క్లుప్తంగా తెలియజేస్తుంది ప్రభువైన దేవునిచేత మీరు పిలువబడిన వారు అని ప్రజలు తెలుసుకుంటారు మరియు మీరు ఆజ్ఞలను పాటించి నడుచుకుంటే, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు లోబడితే, భూప్రజందరు యెహోవా నామమున నీవు ప్రసిద్ధుచుండుట చూచి నీకు భయపడుదురు. నాకు, ప్రతిదీ ఎల్లప్పుడూ పెద్ద చిత్రాన్ని సూచిస్తుంది. ఇది మన గురించి కాదు; ఇది అంతా ఆయన గురించి మాత్రమే.
ద్వితీయోపదేశకాండము 28:11-14: దీవెనల జాబితా 11వ వచనంలో కొనసాగుతుంది నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. 12వ వచనం యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు. 13వ వచనంలో, నేడు నేను మీక జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, అనుసరించి నడుచుకొనవలెను నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, నీ యెహోవాతో తలగింపబడును. నీవు పైవాడ వుగా ఉండవుగాని క్రింది వాడవుగా ఉండవు. (వ. 14). ఒక వ్యాఖ్యాత ఇలా వ్రాశాడు, “విధేయత అనేది ప్రజలలో దైవిక స్వభావాన్ని పెంచుతుంది.” 1-14 వచనాలు వాస్తవానికి ఇశ్రాయేలు పొందే దీవెనల జాబితా: వ్యవసాయ, కుటుంబ, ఆర్థిక మరియు సైనిక దీవెనలు. వాస్తవానికి, 27 మరియు 28 అధ్యాయాల మధ్య, దీవెనల కంటే నాలుగు రెట్లు ఎక్కువ శాపాలు ఉన్నాయి.
ద్వితీయోపదేశకాండము 28:15-24: 15వ వచనంలో, అవిధేయత శపించబడిందని మనం చూస్తాము. ఎవరైనా దీవెనలకు బదులుగా శాపాలను ఎందుకు ఎంచుకుంటారు? 18వ వచనంలో, అవిధేయత ఉంటె పిల్లలు శపించబడతారు. 20వ వచనంలో, ఇశ్రాయేలీయులు అవిధేయత కారణంగా చేసే ప్రతి పనిలో “శాపాలు, గందరగోళం మరియు గద్దింపులు” పంపబడ్డాయి. మరియు శాపాలు అధ్యాయం అంతటా కొనసాగుతాయి. వీటిలో ఏవైనా నేటికీ వర్తిస్తాయా? కొన్ని అవిధేయత మరియు పాపం మనపై మనం తెచ్చుకునే పరిణామాలకు దారి తీయవచ్చు. మంచి భాగం ఏమిటంటే, యేసు మనల్ని వీటన్నింటి నుండి వేరు చేయగలడు.
ద్వితీయోపదేశకాండము 28:25-68: 25-26 వచనలలో, అవిధేయత యుద్ధంలో ఓటమికి దారితీస్తుందని మరియు నీ కళే బరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును. 28వ వచనములో, అవిధేయత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇవన్నీ పాత నిబంధనలో ఏమి జరుగుతాయి అనేదానికి ఉదాహరణలుగా మారాయి (యిర్మీయా 8:10; జెఫన్యా 1:13; ఆమోసు 5:11). వారు అవిధేయత కలిగిన స్థితిలో ఉన్నప్పుడు, ఏదీ అనుకూలముగా జరగదు. కాబట్టి, ఇశ్రాయేలియులు ప్రపంచంలోని ఇతర దేశాలకు భయానక లేదా వెలుగుగా ఉంటుంది. 64వ వచనములో, దేశము యొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును మరియు అంగీకరించబడని వారిగా వారు ఐగుప్తుకు తీసుకోనిపోబడతారు (వ. 68). కానీ వారికి దేవుని ఆజ్ఞలను పాటించాల లేదా పాటించకపోవడం వంటి అవకాసం ఉంది. అమెరికా సంఘాలలో, మనము దేవుని నుండి దూరంగా వెళ్ళే మార్గం వైపు మరింత ఎక్కువగా వెళ్తున్నాము. ఇది దీవెన లేదా శాపమా?
ముగింపు
లూకా 12:48 విశ్వాసులకు జ్ఞాపకము చేస్తుంది, "ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగబడును." యేసు మనకు జీవితమను బహుమతిగా ఇచ్చి అశీర్వాదించెను. మనం దేవుని పరిశుద్ధ జనాంగమై ఉన్నాము. అన్యజనులమైన మనం కూడా ప్రపంచానికి దేవున్నీ పరిచయం చేస్తాం. మనకు దీవెనలు కావాలా లేక శాపాలు కావాలా? మనం ఆయన దైవసంబంధమైన ధర్మాలను ప్రచారం చేయాలి.
ప్రశ్నలు
-
ద్వితీయోపదేశకాండము 28:1-14 ప్రభువు తన పిల్లలకు ఇచ్చే దీవెనలు ఏమిటి?
దినవాక్యం
Laura Martin Deuteronomy 28:13-14
The LORD will make you the head and not the tail; you will only move upward and never downward if you listen to the LORD your God’s commands I am giving you today and are careful to follow them. Do not turn aside to the right or the left from all the things I am commanding you today, and do not go after other gods to worship them.
ఇశ్రాయేలీయులు తన ఆజ్ఞలను విని, వాటిని జాగ్రత్తగా అనుసరించినట్లయితే, ఆయన వారిని సమస్త జనములకంటే నిన్ను హెచ్చించును అని చెప్పాడు. వారు ఎప్పుడూ తలగానే ఉంటారు, తోకగా ఉండరు అని ఆయన చెప్పాడు. అయితే, ఇది జరగాలంటే, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ కుడికైనను లేదా ఎడమకైనను తిరగకూడదని మరియు ఇతర దేవుళ్లను పూజించవద్దని ఆదేశించబడింది.
జీవితంలో మీ కుడి లేదా ఎడమ వైపు ఉన్న విషయాలు మిమ్మల్ని ఎప్పుడైనా పక్కదారి పట్టిస్తాయా? మీరు ఆయనను వెదకాలని ప్రభువు కోరుకుంటాడు. మీరు అతనితో సంబంధాన్ని కొనసాగించాలని ఆయన కోరుకుంటాడు. మీరు యేసుతో పాటు కొన్ని పక్క దేవుళ్లతో కలిసి జీవించాలని ఆయన కోరుకోవడం లేదు-మీరు కేవలం యేసు మరియు ఆయన దయలో మాత్రమే జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. యేసుతో బంధం ఉంటే చాలు. ఆయన మీ అన్ని అవసరాలను తీరుస్తానని వాగ్దానం చేశాడు మరియు మార్గం వెంట మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.
“నేడు నేను మీక జ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, అనుసరించి నడుచుకొనవలెను నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, నీ యెహోవాతో తలగింపబడును. నీవు పైవాడ వుగా ఉండవుగాని క్రింది వాడవుగా ఉండవు.”
-ద్వితీయోపదేశకాండము 28:13-14
తదుపరి లేఖన భాగములు:
- యెహోషువా 1:7:- అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞా పించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.
- కీర్తనలు 24:5-6:- వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును. ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే.
- సామెతలు 4:25-27:- నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెను భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెను.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.