Deuteronomy 27
యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 27 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ద్వితీయోపదేశకాండము 26లో, మనము ప్రధమ ఫలాలను సమర్పించటం గురించి, ప్రతి మూడవ సంవత్సరం పంటలో పదియవ శాతం పేదలకు ఇవ్వడం గురించి మరియు నిబంధనా సారాంశం గురించి మాట్లాడుకున్నాము. మోషే యౌనస్తులైన ఇశ్రాయేలీయులతో కలిసి మోయాబు మైదానాలను చూస్తూ, వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు. ద్వితీయోపదేశకాండము 27 భవిష్యత్తులో దేవుని విశ్వసనీయతపై దృష్టి పెట్టింది. ద్వితీయోపదేశకాండము 27-30లో, భవిష్యత్తులో దేవుని విశ్వసనీయత నుండి ఏమి ఆశించవచ్చో మోషే వివరించాడు.
పాఠము
ద్వితీయోపదేశకాండము 27:1-4: ఇది ఒక వేడుకకు సమయం. మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న “ధర్మమును” మీరాచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటిన దినమున మీరు పెద్దరాళ్లను నిలువ బెట్టి వాటిమీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.1 కాబట్టి వారు ఇశ్రాయేలులోకి ప్రవేశించిన వెంటనే "ఈ ధర్మశాస్త్రముయొక్క పదములు వ్రాయవలెను" (ద్వితీయోపదేశకాండము లేదా అన్ని పంచ గ్రంధాలు) యొక్క అన్ని పదాలను వ్రాయవలసి ఉంటుంది. వారు దీన్ని ఆలస్యము చేయక వెంటనే చేయవలసి ఉంది.
ఇశ్రాయేలీయులు ప్రవేశించిన వాగ్దాన భూమి మధ్యలో ఉన్న షెకెముకు ఉత్తరాన ఉన్న ఏబాలు పర్వతం. ప్రభువు అబ్రాహాముతో మొదటిగా ఒడంబడిక చేసిన ప్రదేశం ఇది మరియు అబ్రాహము మొదట ప్రభువుకు బలిపీఠాన్ని నిర్మించిన స్థలము (ఆదికాండము 12:6-7). ద్వితీయోపదేశకాండములో, ఇశ్రాయేలీయులకు ఒక బలిపీఠమును కట్టమని మరల చెప్పబడెను. ఆదికాండము మరియు ద్వితీయోపదేశకాండములలో దేవుడు చేసిన దానిని మేము ముగిస్తున్నాము.
ద్వితీయోపదేశకాండము 27:5-8: చెక్కని రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించమని మోషే వారికి సూచించాడు మరియు వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు. బలిపీఠము దహనబలుల మరియు అత్యుత్తమమైన వాటిని దహన బలిగా అర్పించడానికి. దేవుని పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో ప్రశస్థమైనవాటిని అర్పించినప్పుడు దేవుడు వాటిని స్వీకరిస్తాడు. పెద్ద రాళ్లతో దేవునికి బలిపీఠము నిర్మించి ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొని ఆయనను ఆరాధించిరి. మన గత జీవితములో దేవుడు మన పట్ల ఏమి చేశాడో జ్ఞాపకము చేసుకోవచ్చు. బలిపీఠం మీద మన దహనబలులను దేవునికి అర్పించే సమయం ఆసన్నమైనది. ఎందుకు? తద్వారా మన పితరుల కాలములో ఎలా కార్యాలు చేసాడో మనము తెసుసుకోనవచ్చు. దేవుడు తమ పూర్వీకుల కోసం ఏమి చేశాడో చూసిన యువ తరానికి మోషే ఇస్తున్న మనస్తత్వం ఇది.
ద్వితీయోపదేశకాండము 27:7-10: “అక్కడ నీవు సమాధానబలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.” మనము దేవునికి సమర్పించుకోవడం కొనసాగిస్తున్నప్పుడు, "నేను క్రైస్తవుడిని అని చెప్పుకొనుచు మన జీవితం దుర్వాసనతో కూడుకున్నది అయితే ఆ విశ్వాసాన్ని ఎవరు అనుసరించాలనుకుంటున్నారు? మోషే ప్రజలతో ఇలా అన్నాడు: “ప్రభువులో మీకున్న ఈ ఆనందమును జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీకు జీవితం కావాలని నేను కోరుకుంటున్నాను.” 8వ వచనములో ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెనని మోషే వివరించి చెప్పాడు. ఇశ్రాయేలీయులు విషయాలను వ్రాసి, దేవునిపట్ల తమ భక్తికి రుజువుగా పండుగ చేసుకుంటూ ఆనందించారు.
9వ వచనంలో, మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి. ఇది ద్వితీయోపదేశకాండములో మోషే యొక్క మూడవ ప్రసంగము, ఇది రూపాంతర సమయంలో మరియు అతని నాయకత్వ ముగింపు దశకు చేరుకున్న సమయములో చెప్పబడింది. ఆయన వారితో, “నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి”. దేవుడు వారి కోసం ఉద్దేశించిన దానిని వారు ఇప్పుడు పొందుకుంటున్నారు, అది వారికి అందజేయబడుతోంది. 10వ వచనంలో, మోషే వారితో ఇలా చెప్పాడు: “గనుక మీ దేవుడైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.” 11-12 వచనాలలో, మోషే ప్రజలను పాటించమని ఆజ్ఞాపించాడు మరియు తరువాత ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.
13వ వచనంలో, రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను. గెరిజీము పర్వతము అన్ని వృక్షసంపదను కలిగి ఉంది, అయితే ఏబాలు పర్వతము బంజరుగా ఉంది. దీని అర్ధం ఏబాలు పర్వతమును శాపమును పలికి, గెరిజీము పర్వతమును అశీర్వాదీస్తారు. ఈ రెండు సమాజముల వారు 14వ వచనంలో ఆశీర్వాదాలు లేదా శాపాలు పలుకుతున్నప్పుడు , లేవీయులు ప్రతి ఇశ్రాయేలీయునికి 12 శాపాలను విడుదల చేయాలి.
మాక్ఆర్థర్ దీనిని విభిన్నంగా వివరించాడు, ప్రజల స్వరం అయిన లేవీయ యాజకులు నిబంధన మందసము పక్కన నిలబడి, ఆశీర్వాదాలు మరియు శాపాలు రెండింటినీ చదువుతున్నారని వివరిస్తూ, ఆరు గోత్రములు గెరిజీము పర్వతాన్ని మరియు ఇతర ఆరు గోత్రములు ఏబాలు పర్వతముల వైపు తిరిగియున్నారు, బహుశా ఏబాలు పర్వతాలపై ఏ సమూహం లేకుండానే ఉండవచ్చు.2 "ప్రతి ఇశ్రాయేలీయులు" అనే పదబంధం 12 గోత్రముల ప్రతినిధులు కూడా హాజరవుతారని సూచిస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమి జరుగుతుందో వినవలసి ఉంటుంది. ఈ శాపాలు ఇవ్వబడినందున, ఇశ్రాయేలీయులు షరతులకు "అలానే ఉండండి"3 అని కేకలు వేయాలి. వారు దానికి అంగీకరించారు.
శాపలలో ఒకటి (వ. 15) విగ్రహాలకు ఆరాధించే వారికి వ్యతిరేకంగా ఉంది. శపించబడడం అంటే ఏమిటి? శాపానికి (ఆశీర్వాదానికి వ్యతిరేకం) కట్టుబడి ఉండటం అంటే ఒక వ్యక్తికి అనారోగ్యం మరియు గాయం కలగటం అని మాక్ఆర్థర్ వివరించాడు.4 వైర్స్బె ఇలా చెప్పాడు శాపాలు “ఏమి జరుగుతుందో ఊహించలేదు . . . అయితే ఆయన ప్రజలు ఆయనకు దూరముగా మరిలినట్లయితే వారిపై శాపాలు పంపమని వారు కోరుకున్నారు.”5 మరొక శాపం (వ. 16) తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు వీటిలో చాలా వరకు పది ఆజ్ఞలతో ముడిపడి ఉన్నాయి. ఇతర శాపాలు తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పుచున్నాయి, ఇది దొంగిలించటం యొక్క మరో రూపం (వ. 17); గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు (వ. 18); పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికే గాని న్యాయము తప్పిన తీర్పు తీర్చువాడు (వ. 19); తన తండ్రి భార్యతో శయనించువాడు లేదా లైంగిక అనైతికత (మృగత్వం, వ్యభిచారం)లో పాల్గొనేవారు (వ. 20-23); మరియు నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు (వ. 24-25). మనం దేవుడిని ప్రేమించమని ఆలాగుననే మన పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞాపించబడినాము , కాబట్టి పొరుగువారిని చంపడం దేవుడు మనకు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటుంది.
ఈ ప్రతి శాపం తర్వాత, ప్రజలు అవిధేయులని తేలితే శాపాన్ని అంగీకరించినట్లు చూపించడానికి "ఆమేన్" అని సమాధానం ఇస్తారు. 26వ వచనంలో, ఈ ఆజ్ఞలకు అవిధేయులైన వారు శపించబడ్డారు. ఈ చివరి శాపం ఎందుకు చాలా ముఖ్యమైనది? ఎందుకంటే వారు ఈ ఆజ్ఞలను (ద్వితీయోపదేశకాండము అంతా, పంచ గ్రంధాల అంతాట) పాటించకపోతే, వారు శాపగ్రస్తులు అవుతారు. మోషే ఈ సందేశాన్ని మొదట ప్రారంభించినప్పుడు, తాను చేయమని చెప్పే ప్రతిదాన్ని వ్రాయమని వారికి ఆజ్ఞాపించాడు అని జ్ఞాపకము చేసుకోనుడి. ఇశ్రాయేలీయులు అన్ని నియమాలను పాటించలేకపోయారు. మరియు ఆ సమయములోనే ఇశ్రాయేలియులు సీనాయి పర్వతంపై దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అంగీకరించారు మరియు ఆ వెంటనే వారు బంగారు దూడను నిర్మించి పూజించారు. వారు ఆజ్ఞలను పాటిస్థాము అని వారు దానిని చేయలేకపోయారు. దేవుని బిడ్డగా ఉండాలంటే “మతపరమైన పదజాలం మరియు [జ్ఞాపకం] పరిశుద్ద గ్రంథములోని వచనాలను మరియు మతపరమైన పాటలు” నేర్చుకోవడం కంటే ఎక్కువ అవసరమని వారెన్ వైర్స్బే నొక్కిచెప్పాడు.6 (మత్తయి 7:21-23)
ధర్మశాస్త్రాన్ని పాటించలేని వ్యక్తులతో యేసు మాట్లాడుతున్నాడు. మనం పెదవులతో అన్ని వేళలా ఆమెన్ చెబుతూ సేవించే విశ్వాసులుగా మారకుండా జాగ్రత్తపడాలి. యేసు దీనిని జాగ్రత్తగా చూసుకున్నందుకు ప్రభువును స్తుతించండి (గలతీయులకు 3:10-12). మోషే చెబుతున్నది సరిగ్గా ఇదే. యాకోబు 2:10 చదవండి. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును;
ముగింపు
అందరును పాపముచేసి . . . ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ. . . నిత్య శాపానికి దారి తీస్తుంది. (రోమా 3:23; 6:23, గలతీయులు 3:13) క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను. మనం ధర్మ శాస్త్రమును పాటించలేమని యేసుకు తెలుసు, కాబట్టి ఆయన మన కోసం ఆ శాపాన్ని మోసాడు. మీరు ఇప్పటికీ ఆ శాపాన్ని పట్టుకొని ఉన్నారా, లేదా మీరు అన్నింటినీ యేసుకు సమర్పించారా? మీరు ఈ నియమాలకు అనుగుణంగా జీవించలేకపోతే, మీరు శపించబదినవారు అని ద్వితీయోపదేశకాండము 27 చెబుతోంది. నేను యేసు గురించి తెలుసుకున్నది ఏమిటంటే, "నా యొద్దకు రండి నేను మీ శాప బారాన్ని మోస్తాను” అని చెప్పిన మాట నాకు చాల ఇష్టమైన మాట."
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005), పేజి 229.
మాక్ఆర్థర్, పేజి. 229.
మాక్ఆర్థర్, పేజి. 230.
మాక్ఆర్థర్, పేజి. 230.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), పేజి.441.
వైర్స్బే, పేజి. 442.
ప్రశ్నలు
-
ద్వితీయోపదేశకాండము 27:5లో, ఇశ్రాయేలీయులు చెక్కని రాళ్లతో ఒక బలిపీఠాన్ని నిర్మించమని చెప్పబడింది. ఏ ఇనుప పనిముట్టు రాళ్లను తాకరాదని వారికి ఎందుకు చెప్పబడిందని మీరు అనుకుంటున్నారు? వారు ఎక్కడ ఏర్పాటు చేశారు? బలిపీఠం క్రీస్తును సూచిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు లేదా ఎందుకు కాదు?
దినవాక్యం
Laura Martin Deuteronomy 27:3
And you shall write on them all the words of this law, when you cross over to enter the land that the LORD your God is giving you, a land flowing with milk and honey, as the LORD, the God of your fathers, has promised you.
ఇశ్రాయేలీయులు దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి ప్రవేశించిన తర్వాత సున్నముతో కప్పబడిన రాళ్లపై ధర్మశాస్త్రంలోని పదాలను వ్రాయమని మోషే వారికి సూచించాడు. ప్రజలు యెహోవా ఆజ్ఞలను మరచిపోవాలని మోషే కోరుకోలేదు. నేటి ప్రపంచంలో, మీరు సున్నముతో కప్పబడిన రాళ్లపై ప్రభువు వాక్యాన్ని వ్రాయవలసిన అవసరం లేదు, అయినప్పటికీ పరిశుద్ద గ్రంధ పద్యాలను వ్రాయడం అనేది ఇప్పటికీ తెలివైన క్రమశిక్షణ.
మీకు ఇష్టమైన మాస పత్రిక, అలంకార పుస్తకాలు, మీ ఇంటిలో చాక్ బోర్డు లేదా పనిచేసే స్థలములో వైట్‌బోర్డ్ ఉందా? ఈ సాధనాలన్నీ ప్రభువు వాక్యాన్ని వ్రాయడానికి మరియు మీరు మీ రోజు గడిచేకొద్దీ దేవుని సత్యాన్ని సూచించడానికి ఉపయోగించవచ్చు. పుస్తకాలపై పరిశుద్ధ వాఖ్యాన్ని వ్రాసి, దానిని మీ కంప్యూటర్లో, కారులో స్టీరింగ్ వీల్‌కు దగ్గరగా లేదా మీ బాత్రూమ్ అద్దంపై ఉంచండి. మీకు అర్థాన్నిచ్చే పరిశుద్ద గ్రంధ వచనాన్ని వ్రాయడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు రోజంతా వాఖ్యాన్ని చదువుతున్నప్పుడు, మీ జీవితంలో ఆయన సత్యం కోసం ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి.
“నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.”
ద్వితీయోపదేశకాండము 27:3
తదుపరి లేఖన భాగములు :
- ద్వితీయోపదేశకాండము 6:9:- నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
- కీర్తన 119:105:- నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
- హబక్కూకు 2:2:- యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.