The Pentateuch Deuteronomy

Firstfruits, Tithe & Covenant Summary

యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 25-26 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 105వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

ఇక్కడ మనం పంచగ్రంథముల యొక్క చివరి పుస్తకంలో ఉన్నాము మరియు దాదాపుగా కొత్త నిబంధనకు మారుతున్నాము. మనము పంచగ్రంథముల నుండి సువార్తలకు, ఆపై పాత నిబంధనలోని చారిత్రక పుస్తకాలకు వెళ్లబోతున్నాము.

పాఠము

ద్వితీయోపదేశకాండము 25: ఈ క్రింది వాటిని కలిగి ఉన్న నిబంధనల యొక్క మరిన్ని జాబితాలను మనము కలిగి ఉన్నాము: మనుష్యుల మధ్య వివాదం కలిగి ఉన్నప్పుడు, వారిని నలువది దెబ్బలు కొట్టించవచ్చు; సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల ఆ సహోదరుని పేరు ఎలా కాపాడుకోవాలి; ధర్మశాస్త్ర బద్దమైన బరువులు మరియు ప్రమాణాలు; మరియు అమాలేకీయులపై ప్రతీకారం.

ద్వితీయోపదేశకాండము 26:1-4: వారు వచ్చి వాగ్దాన దేశమును స్వాధీనపరచుకుని, భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, వారి దేవుడైన యెహోవా నివసించు స్థలమునకు వాటిని తెచ్చి అర్పించవలెను. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం, ఇశ్రాయేలీయులు దేవునికి ప్రధమ ఫలాలను ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడని, మిగిలిన పంట పండుతుందా లేదా కోయబడుతుందా వారు ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ, దేవుడే వారికి అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని వారు కలిగి యుండాలి.1 “ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయి యెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను..” యాజకుడు ఈ నైవేద్యాలను స్వీకరించి దేవుని కోసం ప్రత్యేక్ష గుడరములో ఉంచవలెను. వైర్స్‌బే దీనిని "దేవుని మంచితనాన్ని ఒప్పుకోవడం" అని పేర్కొన్నాడు.2

ద్వితీయోపదేశకాండము 8:11-19: “నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని, మంచి యిండ్లు కట్టించుకొని వాటితో నివసింపగా, నీ పశువులు నీ గొఱ్ఱె మేకలను వృద్ధియైన నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్థిల్లినపుడు నీ మనస్సు మదించి, దాసులగృహమునుండి నీ మనస్సును మదించి, దాసులగృహమును పొందితిని. తాపకరమైన పాములు తేళ్లును కలిగి యెడారియై నీళ్లులేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతిబండనుండి నీకు నీళ్లు తెప్పించెను, తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరుమా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి యితరదేవతల ననుసరించి పూజించి నమస్కరించిన యెడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను.”

ద్వితీయోపదేశకాండము 26:5-10: యాకోబు సంచరించే ఒక అరామీదేశస్థుడు మరియు 12 గోత్రములకు తండ్రి. కరువు కారణంగా అతను ఐగుప్తునకు వెళ్ళాడు. వారు కుటుంబంగా వారి సంపాదన యావత్తును తీసుకువెళ్లారు (ఆదికాండము 46:3-7). మొత్తం 70 మందితో వెళ్లాడు. నిర్గమకాండము 1:7 ఇలా నమోదు చేయబడింది: “ ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యదికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను”. 70 మంది ఇరవై లక్షలమంది ప్రజలుగా అభివృద్ధి చెంది గొప్ప దేశంగా మారారని అంచనా. ఐగుప్తులో వారిని బాదించిన మరియు హింసించిన కొలది వారి జానంగము విస్తరించెను (నిర్గమకాండము 2:23-25). కొత్త నిబంధనలో కూడా ఇదే వర్తిస్తుంది. సంఘము హింసించబడిన మరియు చెల్లాచెదురుగా ఉన్న ప్రతిసారీ, అది సంఖ్యలో అభివృద్ధి చెందింది. దేవుడు ఇశ్రాయేలీయుల మూలుగులు మరియు నిట్టూర్పులు వినెను. అతను బలమైన బాహువుతో మరియు సూచనలతో మరియు అద్భుతాలతో ఐగుప్తు నుండి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువచ్చాడు. వాగ్దాన దేశం నుండి ప్రధమ ఫలాలు దేవునికి అర్పించారు మరియు ఇశ్రాయేలీయులు తమ కోసం దేవుడు చేసినదంతా జ్ఞాపకము చేసుకున్నారు. వారు యెహోవాను ఆరాధించి నమస్కరించారు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం వివరిస్తూ, “ఆరాధనకు సంబంధించిన అత్యంత సాధారణ హీబ్రూ పదానికి అక్షరార్థంగా ‘సాష్టాంగ నమస్కారం చేయడం’ అని అర్థం.3 సాష్టాంగ నమస్కారం అనగా ఆరాధనకు సూచన.

ద్వితీయోపదేశకాండము 26:12-15: వైర్స్బే ఈ వచనాలను "నిజాయితీ మరియు ఔదార్యం యొక్క ఒప్పుకోలు"గా గుర్తిస్తుంది.4 ఇశ్రాయేలీయులు మూడవ సంవత్సరమున వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవ రాండ్రకును ఇయ్యవలెను. అవి చాలా అవసరమైనవి (వ. 12). అప్పుడు, వారు యెహోవా సన్నిధిలో దీనిని చేశారని చెప్పవలసి ఉంది (వ. 13). కనానీయులవలె వారు దానిలో ఏదీ తినలేదు లేదా మ్రుతులైనవాటికి వాటిని సమర్పించలేదు. కానిస్టేబుల్ దీని అర్థం ఇలా సూచించాడు "దేవుని ప్రజలు వాగ్దానం చేసిన ఆశీర్వాదాల నెరవేర్పు కోసం ఆయనను విశ్వసిస్తూనే ఉండాలి".5

ద్వితీయోపదేశకాండము 26:16-19: వైర్స్బే ఈ వచనాలను "విధేయత యొక్క ఒప్పుకోలు"గా గుర్తిస్తారు.6 ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞలను తమ పూర్ణ హృదయంతో మరియు పూర్ణ ఆత్మతో పాటించాలి (ద్వితీయోపదేశకాండము 6:5-దీనిని షెమా అని పిలుస్తారు). మత్తయి 22:34-39 (యిర్మీయా 31:33; యెహెజ్కేలు 11:19; 36:26)లో కూడా ఇదే యేసు యొక్క భాష. మొదటి రెండు ఒప్పుకోలు దేశము కోసం ఎదురు చూస్తున్నాయని వైర్స్బే పేర్కొన్నాడు (v. 17).7 యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, ఆయన మాట విందుననియు, “నేడు” నీతో చెప్పి నట్లు నీవే తనకు స్వకీయ జనమైయుందురు (v. 18) (నిర్గమకాండము 19:5; మలాకీ 3:17). తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహో వాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. (వ. 19; కీర్తన 81:11-14, 16).

ముగింపు

నేను ఇశ్రాయేలు దేశమునకు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నాను. ఇది దేవున్ని ప్రేమించడం మరియు ఇతరులను ప్రేమించడం అనే హృదయ స్థితిపై ఆధారపడి ఉంటుంది.

ద్వితీయోపదేశకాండము 25 మరిన్ని నియమ నిబంధనలు గురించి వివరిస్తుంది. ద్వితీయోపదేశకాండము 26 ప్రధానంగా ప్రథమ ఫలాన్ని ఇవ్వడం మరియు మొదటి మూడు సంవత్సరాలు దశమ భాగం/ పదియవ వంతు ఇవ్వడం, తరువాత మూడవ సంవత్సరం పేదలకు ఇవ్వడం. మనుషులను దేవుడు ఎలా చూస్తున్నాడో అలానే మనుషులు యొక్క హృదయాలు ఉండాలి అనే నియమాలు ఇవి. ఈ విధముగా మన హృదయం ఉన్నట్లయితే, వాటిని చేయడంలో మనకు ఎలాంటి సమస్య ఉండదు.

  1. ఎర్ల్ రాడ్‌మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషింగ్, 1999), p. 259.

  2. వారెన్ వైర్స్‌బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 2001), p. 422.

  3. రాడ్‌మాచెర్, అలెన్ మరియు హౌస్, eds., p. 260.

  4. వైర్స్బే, p. 423.

  5. థామస్ కానిస్టేబుల్, డా. కానిస్టేబుల్స్ ఎక్స్‌పోజిటరీ (అధ్యయనం) గమనికలు: డ్యూటెరోనమీ, పే. 152; https://planobiblechapel.org/tcon/notes/pdf/deuteronomy.pdfలో అందుబాటులో ఉంది.

  6. వైర్స్బే, p. 424..

  7. వైర్స్బే, పే. 424.

ప్రశ్నలు

  1. ద్వితీయోపదేశకాండము 25:4లో, నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు ధర్మశాస్త్ర విరుద్ధం. 1 కొరింథీయులు 9:9-11 ప్రకారం, ఈ ధర్మశాస్త్ర యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటి? (1 తిమోతి 5:18)

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Deuteronomy 26:16

“The LORD your God is commanding you this day to follow these statutes and ordinances. You must be careful to follow them with all your heart and all your soul.”

మోషే ఈ రెండవ తరమైన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు, ప్రతిమలను మరియు శాసనాలను పునరుద్ఘాటించాడు. దేవుని యొక్క విశ్వసనీయతను మరియు విమోచనను వారు తిరిగి జ్ఞాపకం చేసుకున్నారు. ధర్మశాస్త్రములోని అన్ని వివరాలను వారు సమీక్షించారు. ఆపై వారు తమ దేవుడైన యెహోవాను తమ పూర్ణ హృదయాలతో మరియు వారి పూర్ణ ఆత్మతో అనుసరించాలని మోషే ఇశ్రాయేలీయులకు మరోసారి ధృవీకరించాడు.

మీరు ఇశ్రాయేలీయుల సంఘంలో భాగం కాకపోవచ్చు, కానీ అదే సత్యం యేసుతో మీ సంబంధానికి వర్తిస్తుంది. మీరు ఆగి హృదయాన్ని శోదించి తెలుసుకోనుడి. మీ హృదయం ప్రభువును పూర్తిగా ప్రేమించకపోతే, ఆయనను అనుసరించడం కష్టంగా మరియు భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజే మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి మరియు “నేను ప్రభువును నా హృదయపూర్వకముగా ప్రేమిస్తున్నానా?” అని ఆగి వినండి. హృదయం మీ క్రియలను నడిపిస్తుంది. మీరు మీ హృదయాన్ని ప్రభువుతో అనుసంధానించినప్పుడు, జీవితంలో మిగతావన్నీ స్వేచ్ఛగా ప్రవహిస్తాయి.

“ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటి ననుసరించి నడుచుకొనవలెను.”

-ద్వితీయోపదేశకాండము26:16

తదుపరి లేఖన భాగములు :

  • యిర్మీయా 31:33:- ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
  • సామెతలు 4:23:- నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
  • మత్తయి 22:37–38:- అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్య విషయంయు మొదటిదియునైన ఆజ్ఞ.