Lists to Live By
యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 23-24 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఇవి ఇశ్రాయేలీయుల కోసం కాపలాగా సృష్టించబడిన విభిన్న విషయాల యొక్క అనేక జాబితాలను కలిగి ఉన్నాయి. మనం బురదలో తొక్కుతున్నట్లు అనిపిస్తుంది. మనము చేర్చడం మరియు మినహాయించడం, శిబిరం యొక్క పరిశుభ్రత, పొరుగువారి పంటలు మరియు వివాహం గురించి మాట్లాడబోతున్నాము – మరియు ఇది చట్టబద్ధత వలె అనిపిస్తుంది. కానీ మన హృదయ పరిస్థితి ఏమైయున్నది .
పాఠము
ద్వితీయోపదేశకాండము 23: ఈ అధ్యాయం సమాజములో సభ్యులను చేర్చడం మరియు మినహాయించడం, శిబిరం యొక్క పరిశుభ్రత, పారిపోయిన బానిసలతో ఎలా వ్యవహరించాలి, వ్యభిచారాన్ని ఆరాధనగా చేయడాన్ని నివారించవలసిన అవసరం, రుణాలపై వడ్డీ, ప్రమాణాలు పాటించడం యొక్క ప్రాముఖ్యత మరియు పొరుగువారి పంటలతో ఎలా ప్రవర్తించాలనే నియమాలు.
ద్వితీయోపదేశకాండము 24:1: విడాకుల గురించి బోధించడం అంత సులభం కాదు, మరియు ఈ నియమాలను అంగీకరించడం అంత సులభం కాదు. మొదట, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను. మత్తయి 19:3లో, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా. కొత్త నిబంధనలో విడాకులకు రెండు కారణాలు మాత్రమే ఉన్నాయి: భర్త చనిపోయినయెడల (రోమా7:1–3), మరియు వ్యభిచార కారణముగా (ద్వితీయోపదేశకాండము 22:22). విడాకులు తీసుకోవడం ఒక్కటే మార్గము కాదు. భార్యాభర్తలు వారు చేసిన తప్పిదముమీద పని చేయడం మరియు వ్యభిచారం తర్వాత వారి వివాహాన్ని పునరుద్ధరించడం గురించి కొన్ని ఉత్తమ కథనాలు వచ్చాయి.
ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనిన తరువాత ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడల నేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు (వ. 2-4). వివాహాన్ని రెండు చెక్క ముక్కలు అతుక్కొని ఉన్నదిగా చూడవచ్చు. ముక్కలు విడిగా విభజించబడితే, శుభ్రమైన విభజనకు మార్గం లేదు, ఎందుకంటే చెక్కలో కొంత భాగం ఎల్లప్పుడూ మరొకదానిపై మిగిలి ఉంటుంది. అంటే మీరు లైంగిక సంబంధాలు కలిగి ఉన్న ప్రతి వ్యక్తితో మీలో కొంత భాగం ఇప్పటికీ ఉంది.
ద్వితీయోపదేశకాండము 24:5: ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.
ద్వితీయోపదేశకాండము 24:6–9: కుటుంబాల జీవనోపాధికి భద్రత కల్పించేందుకు, ఇశ్రాయేలీయులు తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే అని సూచించబడింది (వ. 6). ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు చావవలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు. (వ. 7). ఎవరికైనా అంటువ్యాధి వంటి కుష్ఠరోగము ఉన్నట్లయితే, యాజకులైన లేవీయులు సూచించిన ప్రతిదానిని జాగ్రత్తగా చేయమని ఇశ్రాయేలీయులకు సూచించబడింది (వ. 8). ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి, ఆమె కుష్టు వ్యాధితో బాధపడింది (వ. 9).
ద్వితీయోపదేశకాండము 24:10–13: రుణాలు పొందిన వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవడమే తదుపరి సూచనల సమితి: (1) నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టువస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు (వ. 10). (2) నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీయొద్దకు తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును. (వ. 11); (3) ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను. (వ. 12); మరియు (4) అప్పు తీసుకొను వాడు బహు పేదవాడై తాకట్టు పెట్టుటకు అతని వస్త్రము మాత్రమే కలిగి యుంటే దానిని నీవు తీసుకోన కూడదు (v. 13).
ద్వితీయోపదేశకాండము 24:14-18: పేదలుగా ఉన్న కూలీలకు ఏనాటి కూలి ఆనాటికి చెల్లించాలి (వ. 14-15).
కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. (వ. 16). బదులుగా, ఎవనిపాపము నిమిత్తమువాడే భాద్యత వహించవలెను. (జాషువా 7:24-25; నిర్గమకాండము 20:5). పాపము మరణానికి దారి తీస్తుంది, కానీ, దేవుని ప్రేమ మనలోనికి ప్రవేశించి మరియు మరణాన్ని జయిస్తుంది దేవునికి స్తోత్రం. పరదేశికేగాని తండ్రిలేనివానికే గాని మరియు విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. (వ. 17). ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించెనని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను. (వ. 18).
ద్వితీయోపదేశకాండము 24:19-22: పరిగెను/ కొన్ని పనలను పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరండ్రకును విడిచి పెట్టవలెను అని ఇశ్రాయేలీయులకు సూచించబడింది (వ. 19). మరియు నీ ఒలీవపండ్లను మరియు నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికి విధవరండ్రకును ఉండవలెను. (వ. 20-21), పరదేశులకును తండ్రిలేని వారికి విధవరండ్ర పట్ల దేవునికి ఉన్న శ్రద్ధను చూపుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒకప్పుడు నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటివని ఆయన ద్వారా మాత్రమే విమోచించబడ్డారని అని వారికి జ్ఞాపకముచేసేను. కావున, వారు ఆయన ఆజ్ఞాపించినట్లు చేయవలెను (వ. 22).
ఈ సూచనలన్నీ ఇశ్రాయేలీయులు ఒకరినొకరు న్యాయముగా ఎలా ప్రవర్తించాలనే హృదయ స్థితికి సంబంధించినవి. యేసు ఈ సూచనలకు కొత్త దృక్పథాన్ని తీసుకువచ్చారు. మత్తయి 5:17-20 ఇలా సెలవిస్తుంది, “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితిని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయు బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.”
మత్తయి 5:21-48: యేసు నరహత్యకు కోపానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు జోడించి దేవుని ధర్మశాస్త్రమును విస్తరించారు. అదేవిధంగా, ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని యేసు వివరించెను, విడాకులపై కఠినమైన మార్గదర్శకాలను ఉంచాడు మరియు ప్రతీకారాన్ని నిరోధించాడు (వ. 21-42). అప్పుడు యేసు మన పొరుగువారిని ప్రేమించు అలాగుననే, మీ శత్రువులను ప్రేమించుడి (vv. 43-48) దేవుడు ధర్మశాస్త్రన్ని విస్తరించాడు. చట్టబద్ధతపై ఆధారపడని హృదయ మార్పును కలిగి ఉంటేనే మనం ఈ పరిస్థితులను అధిగమించగల ఏకైక మార్గం.
మత్తయి 23:27లో యేసు ఇలాగు సెలవిచ్చెను , “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.
రోమా పత్రిక 8:10లో, పౌలు ఇలా వ్రాశాడు, “క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.” మీరు ధర్మశాస్త్ర విషయములో అత్మలేనివారుగా నడువలేరు. మీరు లోపల ఉన్న ప్రతిదానిపై పని చేయాలని యేసు కోరుకుంటున్నాడు. నీతి బయటపడే ఏకైక మార్గం ఏమిటంటే, మనము మనపై కాకుండా క్రీస్తుపై నమ్మకం ఉంచడం.
ముగింపు
మరల, మనము చాలా నియమాలతో వ్యవహరిస్తున్నాము. ద్వితీయోపదేశకాండము 23 సమాజములో ఎవరు ప్రవేశించవచ్చో, శిబిరం యొక్క పరిశుభ్రత, పారిపోయిన బానిసలు, వ్యభిచారం, రుణాలు, ప్రమాణాలు పాటించడం మరియు పంటలు పండించడం గురించి వివరించింది. ఆ తర్వాత, ద్వితీయోపదేశకాండము 24లో మనము వివాహం, ఋణము, అపహరణ మరియు కుష్టువ్యాధులను గూర్చి వివరించాము. ఇశ్రాయేలీయులు తమ జీవితాల్లో ఇప్పటికే దేవుని సంరక్షణను పొందారు కాబట్టి, ప్రజల అవసరాలను, ప్రత్యేకించి విదేశీయులు, పరదేశులకును తండ్రిలేని వారికి విధవరండ్ర అవసరాలను తీర్చాలని మోషే నొక్కిచెప్పాడు.
ప్రశ్నలు
-
ద్వితీయోపదేశకాండము 23:19–20 ఇశ్రాయేలీయులకు తమ దేశస్థుల యోద్ధ వడ్డీ వసూలు చేయవద్దని సూచించింది. వారు ఎవరి యొద్ధ వడ్డీ వసూలు చేయవచ్చు? ఎందుకు ఈ భేదం? పాటించడం వల్ల ఫలితం ఏమిటి?
దినవాక్యం
Laura Martin Deuteronomy 24:19
“When you reap the harvest in your field, and you forget a sheaf in the field, do not go back to get it. It is to be left for the foreigner, the fatherless, and the widow, so that the LORD your God may bless you in all the work of your hands.”
ఇశ్రాయేలీయుల సమాజములోవారి అవసరాలను తీర్చడానికి ప్రభువు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. వారు పొలములో నుండి ధాన్యాన్ని, ఒలీవ చెట్ల నుండి పండ్లను లేదా ద్రాక్షతోటలోని ద్రాక్షలను పండించినప్పుడు, వారు కొంత పంటను సేకరించడం మరచిపోతే, దానిని వదిలివేయమని వారికి చెప్పబడింది. ఈ "మిగిలినవి" పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను. ప్రభువు ప్రత్యేకంగా సమాజంలోని ఈ దీన దరిద్రులను గూర్చి ఎక్కువగా తెలియపరిచి, వారి సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చాడు.
మీ చుట్టూ ఉన్న పరదేశులను తండ్రి లేనివారిని విధవరాండ్రలను చూడటానికి కళ్ళు తెరవండి. మీరు శ్రద్ధ వహించడానికి మరియు సహాయం చేయడానికి ప్రభువు మీపరిదిలో ఎవరిని ఉంచాడు? క్రీస్తు మిమ్ములను ఎలాగు ప్రేమించేనో ఆలగుననే మీరును ఇతరులను ప్రేమించాలి. ఈరోజు, మీ చుట్టూ ఉన్న పరదేశులను తండ్రి లేనివారిని విధవరాండ్రలను ప్రేమించడానికి మరియు శ్రద్ధ వహించడానికి ఒక ప్రణాళిక కోసం ప్రభువును అడగండి.
“నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొను టకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరండ్రకును ఉండ వలెను.”
-ద్వితీయోపదేశకాండము 24:19
తదుపరి లేఖన భాగములు :
- కీర్తనలు 82:3:- “పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.”
- యోహాను 13:34:- “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరు ఒకరి నొకరు ప్రేమించవలెను.”
- యాకోబు 1:27:- “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.