The Pentateuch Deuteronomy

Unsolved Murders, Captured Women & Rebellious Sons

యేసును ఇలా కనుగొనండి: Prophet Deuteronomy 21-22 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 103వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

నిన్న ద్వితీయోపదేశకాండము 20లో, ఇశ్రాయేలీయుల యుద్ధ సన్నాహాలను గురించి తెలుసుకున్నాము. సంఖ్యాకాండము వరకు సైన్యము ఏర్పడలేదు, కానీ వారికి ముందుగానే సూచనలు ఇవ్వబడినాయి.

పాఠము

ద్వితీయోపదేశకాండము 21:1–9: 21వ అధ్యాయం దేవుడు వారికి ఇచ్చిన దేశంలో హత్యకు గురైన వ్యక్తి కనుగొనబడితే ఏమి చేయాలో వివరిస్తూ మరియు దానిని ఎలా నిర్వహించాలో ఆచరణాత్మక సూచనలతో ప్రారంభమవుతుంది. పాపం "భూమిని అపవిత్రం చేసింది."1 భూమిపై రక్తం ఉంటే, ఎవరైనా దాని కోసం ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంటుంది. ఒక బాధితుడు కనుగొనబడితే, న్యాయమూర్తులు మరియు పెద్దలు సమీపంలోని నగరాలకు ఉన్న దూరాన్ని కొలవాలి, బాధితునికి ఎవరు బాధ్యత వహించాలి (వ. 2). పరిష్కరించబడని సమస్యలు ఆ దేశానికి తీవ్రమైన సమస్యలను తెస్తాయి (ఆదికాండము 4:10-12; 9:5-6; హెబ్రీయులు 12:24; కీర్తన 9:12; మరియు యెషయా 26:21).

ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని (వ. 3) మరియు దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్యమెడను విరుగ తియ్యవలెను. (వ. 4). అప్పుడు యాజకులు దగ్గరకు రావలెను. దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను. (వ. 5). అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరు ఆ యేటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొనవలెను (వ. 6). వారు సమాజముపై ఉన్న అపవిత్రతను తొలగిస్తున్నారని మరియు వారి అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మెడ విరిచి ఈ పెయ్యను సమర్పించాలని వైర్స్బే చెప్పారు.2 పెద్దలు తమను తాము అపవిత్రత నుండి పరిశుద్దపరుచుకున్నారు (లేవీయకాండము 18:24-25). "మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడ లేదు" అని ప్రకటించమని వారికి సూచించబడింది మరియు రక్తపాతానికి సంబంధించిన బాధ్యత నుండి వారు విమోచించబడతారు (వ. 7). పాపం మరణానికి దారి తీస్తుంది. యేసు మనకు చేసినది ఇదే. పెయ్యి ఇక్కడ మరణించినట్లు మన పాపాల కోసం యేసు మరణించాడు (రోమ ​​6:23; 5:12; హెబ్రీయులు 9:13-14; యోహాను 1:29; 1 యోహాను 4:14; ఎఫెసీయులు 5:25-26; యెషయా 53:8) . యేసు ఇశ్రాయేలియుల కొరకు మరణించాడు.

ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన యెహోవా తన ప్రజలకు ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము మరియు వారికి వ్యతిరేకంగా దోషము మోపవద్దు అని చెప్పవలెను (వ. 8). నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషము నుండి తమను తాము ప్రక్షాళన చేసుకోవాలని కూడా వారికి చెప్పబడింది (వ. 9). మనం చేసిన పాపముల నుండి ఇప్పుడు మనల్ని మనం పవిత్రపరచుకోగల ఏకైక మార్గం క్రీస్తు వైపుకు మరియు ఆయన మన కొరకు చిందించిన రక్తం వైపు తిరగడం.

ద్వితీయోపదేశకాండము 21:10-14: 10-14 వచనాలు చెరపట్ట బడిన స్త్రీల పట్ల న్యాయంగా వ్యవహరించడానికి సూచనలను ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఉన్నప్పుడు, వారు శత్రువుల భార్యను చూసి, ఆమెను తమ భార్యగా భావించినట్లయితే, వారు ఆమెను ఇంటికి తీసుకువెళ్లి, ఆమె తల క్షౌరము చేసి, ఆమె గోళ్లను కత్తిరించాలని తెలియచేయబడింది (వ. 10-12). ఆ తర్వాత ఆమె తన చెర బట్టలు తీసివేసి, ఇశ్రాయేలీయుల ఇంట నివసించి, తన తల్లిదండ్రుల కొరకు 30 దినములు ప్రలాపన చేయవలెను. 30 దినములు పూర్తయినప్పుడు, వారు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును. (వ. 13). ఇశ్రాయేలీయుడు ఆమెవలన సంతుష్టి నొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు (వ. 14). వారు వివాహం నుండి బయటపడటానికి ఒక మార్గం కలిగి ఉన్నారు, కానీ అది భార్యను అమ్మడం ద్వారా కాదు.

ద్వితీయోపదేశకాండము 21:15-17: 15-17 వచనాలు మొదటి పుట్టిన పిల్లల హక్కులను వివరిస్తాయి. ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని, ఇద్దరు కుమారులు మరియు ప్రేమించని భార్య కుమారుడు మొదటి సంతానం అయినప్పుడు, అతను రెండవ కుమారునిపై ఎలాంటి అభిమానాన్ని చూపలేడు (వ. 15-16). బదులుగా, మనిషి పుట్టిన క్రమంలో మొదటి బిడ్డను గుర్తించి, అతనికి జేష్టత్వములో రెట్టింపు భాగాన్ని ఇవ్వాలి (వ. 17).

ద్వితీయోపదేశకాండము 21:18–21: కుమారుడు మొండివాడై తిరుగబడి మాట వినకయుండి- సమస్యాత్మక పిల్లవాడు (v. 18). ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయిన యెడల అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడి యున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. (వ. 20-21). అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు. ఒక వ్యక్తి చేసిన పాపం మొత్తం దేశాన్ని ప్రభావితం చేయగలదని వైర్స్బే ఎత్తి చూపారు.3

తప్పిపోయిన కుమారుని కథలో (లూకా 15:11-13), ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను మరియు దుర్వ్యాపారముల జీవితాన్ని గడపడానికి విడిచిపెట్టాడు. కొడుకు తిరిగి వచ్చినప్పుడు, తండ్రి బయటకు వెళ్లి అతనిని కౌగిలించుకున్నాడు (లూకా 15:20). అతను బహుశా రాళ్లతో కొట్టబడి ఉండాలి. యేసు ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు, కుమారుడు ఎదుర్కోవాల్సిన శిక్ష అతని ప్రేక్షకులకు తెలిసి ఉండేది. కానీ తండ్రి ఆలింగనంతో కుమారుడు ఆ శిక్ష నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. తండ్రి మనలను తన చేతులలో పట్టుకొని ఉన్నాడు, కాబట్టి మనకు తగిన మరణం లభించదు.

ద్వితీయోపదేశకాండము 21:22-23: మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ధర్మశాస్త్రానికి అవిధేయత చూపినందుకు ఇశ్రాయేలీయులకు భయాన్ని తీసుకురావడమే దేవుని యొక్క ఉద్దేశ్యం. దేవుడు తమకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమిని అపవిత్రం చేయకూడదనే ప్రకటనతో అధ్యాయం ముగుస్తుంది.

ముగింపు

ఒకే ఒక వ్యక్తి మనకు బదులుగా మన స్థానాన్ని తీసుకున్నాడు. యేసు శాపాన్ని స్వీకరించాడు మరియు ఆయన కోయ్యకు/ మ్రానుకు వ్రేలడతీయబడ్డాడు:

గలతీయులకు 3:13: “‘ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను”.

అపోస్తులలు 5:30: "మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను."

1 పేతురు 2:24: “మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి”

యేసు శాపాన్ని స్వీకరించడం ద్వారా మనకు స్వస్థత కలిగెను. క్రీస్తు మనలను విమోచించెను. ఆయనే మన పాపములను భరించెను. ధర్మశాస్త్రము ఎల్లప్పుడూ మెస్సీయను సూచిస్తుంది.

  1. వారెన్ వైర్స్బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: జెనెసిస్-డ్యూటెరోనమీ (కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ సి. కుక్, 2001), పే. 430.

  2. వైర్స్బే, పే. 420.

  3. వైర్స్బే, పే. 432.

ప్రశ్నలు

  1. ఇశ్రాయేలీయులు తమ సమాజము నుండి నుండి హత్యా నేరాన్ని ఎలా తొలగించాలి? (ద్వితీయోపదేశకాండము 21:1–9)

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Deuteronomy 21:20-21

“They will say to the elders of his city, ‘This son of ours is stubborn and rebellious; he doesn’t obey us. He’s a glutton and a drunkard.’ Then all the men of his city will stone him to death. You must purge the evil from you, and all Israel will hear and be afraid.”

ఇశ్రాయేలీయులకు మోషే సూచనలలో మొండి మరియు తిరుగుబాటు చేసే పిల్లలకు సంబంధించిన చట్టం మరియు శిక్షలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు లేదా తాగుబోతులు మరియు తిండిబోతులుగా ఉన్న సందర్భంలో, తల్లిదండ్రులు తమ పిల్లలను నగరంలోని పెద్దల వద్దకు తీసుకురావాలి. ఒక త్రాగుబోతు అనేది ఒకరి ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయేంత వరకు మద్యపానం ద్వారా ప్రభావితమైన వ్యక్తి. తిండిపోతు అనేది పని లేదా ఆహారం లేదా మధ్యాపానం లేదా వస్తువులపై అయినా ఏదైనా ఒక గొప్ప కోరిక లేదా సామర్థ్యం ఉన్న వ్యక్తి. తాగుబోతు మరియు తిండిపోతు ఇద్దరూ తమ తృప్తి కొరకు దేవుని కాకుండా వేరొక దానిని ఎక్కువగా కోరుకుంటారు.

కొత్త నిబంధన విశ్వాసులు కూడా మొండిగా మరియు తిరుగుబాటుదారులుగా ఉండవచ్చు. తల్లితండ్రుల మాట వినని తిరుగుబాటు చేసే పిల్లల్లాగే మీరు ఇకపై ప్రభువు స్వరాన్ని వినలేనంత వరకు అతిగా తినడం, ఎక్కువ పని చేయడం, అతిగా తాగడం లేదా అతిగా ఖర్చు చేయడం వంటి వాటిని సమర్థించేలా సాతాను మిమ్మల్ని ప్రలోభపెట్టవచ్చు. ప్రతిదినము ఆయనను వెదకమని ప్రభువు చెప్పుచున్నాడు, నీవు నీ హృదయముతో ఆయనను వెదకినప్పుడు నీవు ఆయనను కనుగొంటావు. ఆయన తన కుమారులను మరియు కుమార్తెలను శాశ్వతమైన ప్రేమతో తిరిగి ఆహ్వానించడానికి ప్రభువు చేతులు ఎల్లప్పుడూ చాపి ఉంటాయి. ఈ రోజు, ప్రభువు స్వరాన్ని వినండి మరియు మీ సంతృప్తి కొరకు యేసు వైపు తిరిగి వెళ్లండి.

“మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగ బడి యున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్ప వలెను. అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.”

-ద్వితీయోపదేశకాండము 21:20-21.

తదుపరి లేఖన భాగములు :

  • కీర్తనలు 81: 11-13:- అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు.
  • మత్తయి 5:6:- నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.
  • లూకా 15:20:- వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.