Wisdom Books Psalms

God's Purpose For The Israelites

యేసును ఇలా కనుగొనండి: King of Glory Psalms 90 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 436వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

ఈ కీర్తన గూర్చి సంతోషకరమైన చాలా వాస్తవాలు ఉన్నాయి! 90వ కీర్తన అత్యంత పురాతనమైన కీర్తన, ఇది మోషేచే వ్రాయబడింది. నేను చిత్రాన్ని చిత్రించాలనుకుంటున్నాను. నిన్న, మనము దేవుణ్ణి చూడకపోవడం మరియు అదే సమయంలో ఆయనను స్తుతించడం వంటి గందరగోళముతో వ్యవహరించాము. ఈ కీర్తన కూడా అదే అనుభూతిని కలిగి ఉంది. మోషే తన ప్రజల పట్ల దయ కోసం దేవుణ్ణి వేడుకున్నాడు. 90వ కీర్తన యొక్క కీర్తనాకారుడు "దేవుని నిత్యత్వము యొక్క ప్రతిబింబంతో ప్రారంభమై, దేవుని కోపానికి సంబంధించిన జీవితంలోని దుఃఖం మరియు సంక్షిప్తత గురించి తన నిస్సత్తువ ఆలోచనలను వ్యక్తపరుస్తాడు మరియు తన ప్రజలు ప్రాముఖ్యమైన రీతిలో జీవితమును గడిపేలా సహాయము చేయమని దేవునికి విన్నవంచుటతో ముగించాడు"1 అని మాక్‌ఆర్థర్ రాశాడు.

ఇశ్రాయేలీయులు గందరగోళములో ఉన్నప్పటికీ, వారు తమ జీవితాల్లో ఉద్దేశ్యముల కొరకు దేవుణ్ణి అడిగారు. కాదేషు-బర్నియాలో జరిగిన సంఘటన తర్వాత విషయాలు పడిపోయాయి. మోషే సహోదరి మిర్యాము మరియు అతని సహోదరుడు అహరోను ఇద్దరూ మరణించారు (సంఖ్యాకాండము 20:1, 22-29), నీటి కొరకు చూస్తున్నప్పుడు మోషే దేవునికి అవిధేయత చూపి బండను కొట్టాడు.2 ఇది 90వ కీర్తనకు నేపథ్యం. ఇశ్రాయేలీయులు చాలా తప్పులు చేశారు, కానీ ఇప్పటికీ ఉద్దేశ్యము తెలుసుకోవాలనే కోరిక ఉంది. నేడు, చాలా మంది ప్రజలు తాము గందరగోళానికి గురై దేవుడు వారిని పునరుద్ధరించలేడు లేదా విమోచించలేడు అని భావిస్తారు. మన రక్షణ క్రియల మీద ఆధారపడి లేదు కాబట్టి దేవుణ్ణి స్తుతించండి. ఆయనలో మనం నీతిమంతులం. మనం పరిపూర్ణతను సాధించలేమని దేవునికి తెలుసు.

పాఠము

కీర్తన 90:1-2: మోషే తనను తాను "దైవజనుని"గా గుర్తించుకున్నాడు (ద్వితీయోపదేశకాండము 33:1; యెహోషువా 14:6). వైర్స్‌బే ఈ పద్యాలను ఇలా వివరించాడు, "మనము ప్రయాణికులం మరియు దేవుడే మన ఇల్లు."3 దేవుడే మన ఇల్లు, మన నివాస స్థలం వంటి ఈ చిత్రాన్ని నేను ప్రేమిస్తున్నాను. మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, "ఇశ్రాయేలీయుల కాపుదల కొరకు, ఆధారము కొరకు మరియు స్థిరత్వం కొరకు దేవుదే వారి పరిశుద్ధస్థలము."4 మరియు దేవుడు ఆశ్రయమైయునాడనే ఈ ఆలోచన నాకు చాలా ఇష్టమైనది.

వైర్స్బే ఇలా వ్రాశాడు, "ప్రతియొక్కరికి జీవితం అనేది జననము నుండి మరణం వరకు ఒక యాత్ర వంటిది, మరియు విశ్వాసులకు, ఇది భూమి నుండి పరలోకమునకు ప్రయాణం వంటిది, కానీ రహదారి అంత సులభమైనది కాదు."5 దీనికి రుజువుగా, వైర్స్బే యాకోబు యొక్క సుదీర్ఘ యాత్రను ఎత్తి చూపాడు. అది "కొద్ది మరియు కఠినమైనది" (ఆదికాండము 47:9). అప్పుడు మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించాడు, అందులో ఇశ్రాయేలీయులు ఆ 40 సంవత్సరాలలో విడిది చేసిన 42 వేర్వేరు ప్రదేశాలు ఉన్నాయి (సంఖ్యాకాండము 33). వైర్స్బే కూడా ఇలా అంటాడు, “మోషే ఎక్కడ నివసించినా, దేవుడు ఎల్లప్పుడూ అతని నివాసంగా ఉన్నాడు. అతను ‘ప్రభువునందు నివసించాడు.’ ‘ప్రభువునందు నిలిచియుండుట’ మరియు ప్రతిరోజు అవసరాలకు కావలసిన బలం, ఓదార్పు, ప్రోత్సాహం మరియు సహాయాన్ని ఎలా పొందాలో ఆయనకు తెలుసు.”6 ప్రయాణంలో మన దృష్టి ఎక్కడ ఉంది? మోషే ప్రభువుతో విడిది చేశాడు. యాత్రికులుగా కూడా దేవుడే మన ఇల్లు.

2వ వచనంలో, మోషే “నిత్యత్వము నుండి నిత్యత్వము” అనే పదాలతో సమయాన్ని సూచించాడు. మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, "దేవుని స్వభావం ప్రారంభం లేదా అంతం లేకుండా ఉంటుంది, అన్ని కాలాల నుండి స్వతంత్రంగా ఉంటుంది మరియు కాలానికి కారణాన్ని కలిగి ఉంటుంది."7

కీర్తన 90:3-6: వైర్స్‌బే 3-12 వచనాలను ఇలా వివరించాడు, “మనము నేర్చుకునేవాళ్లం, మరియు జీవితమే మన పాఠశాల.”8 3-12 వచనాలలో మోషే మనిషి యొక్క బలహీనత మరియు 1-2 వచనాలలో దేవుని నిత్యత్వం యొక్క చిత్రాన్ని చిత్రించాడు. దేవుడు చాలా పెద్దవాడు, మన జీవితాలు చాలా త్వరగా మరియు వేగంగా ఉంటాయి (ఆదికాండము 3:19; యెషయా 40:6-7).

కీర్తనలు 90:7-9: మోషే ముఖ్యంగా, "మనం గందరగోళంలో ఉన్నామని మనకు తెలుసు" అని చెబుతున్నాడు. రహస్య పాపం లేదు. మాక్‌ఆర్థర్ ఇలా వ్రాశాడు, "బాధలు మరియు ఇబ్బందులతో తన జీవితంలో పోరాడిన తర్వాత, ఒక వ్యక్తి జీవితం బాధ మరియు అలసటతో ముగుస్తుంది."9 మానవత్వానికి స్వాగతం! ఇప్పటివరకు ఇది చాలా ప్రోత్సాహకరంగా లేదు.

కీర్తన 90:10-12: ఈ పద్యం ప్రకారం, సగటు జీవితకాలం 70 సంవత్సరాలు లేదా మీరు బలంగా ఉంటే, 80 సంవత్సరాలు. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. వైర్స్బే ఇలా వ్రాశాడు, “జీవిత పాఠశాలలో మనం రెండు ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాలి: జీవితం క్లుప్తంగా ఉంటుంది మరియు వేగంగా గడిచిపోతుంది, కాబట్టి దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి; మరియు జీవితం కష్టమైనది మరియు కొన్నిసార్లు వ్యర్థమైనదిగా అనిపిస్తుంది.”10

మన జీవితాలు ప్రభువుకు ఫలవంతమైన పరిచర్యగా ఉండాలంటే జీవితంలో దేవుని మార్గదర్శకత్వం మనకు కావాలి. “ఇశ్రాయేలీయులకు వారి దినములను జాగ్రత్తగా లెక్కించుట నేర్పుము” అని మోషే యెహోవాను అడిగాడు. మీ రోజులను లెక్కించడం అంటే ఏమిటి? ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీని అర్థం. దేవుడు ఎల్లప్పుడూ మహిమను పొందే మార్గాల్లో మనం మన రోజులను జాగ్రత్తగా లెక్కించుకుంటున్నామా? ప్రజలు ఇలా చెప్పడం మీరు వింటారు, “నేను తిరిగి వెళ్లి, ప్రతిదీ మళ్లీ చేయగలిగితే . . ." 90వ కీర్తన మనం బలహీనంగా ఉన్నప్పటికీ, మన జీవితాలను వృధా చేసుకోకూడదని చూపిస్తుంది. దేవుడు మీకు వెల్లడించాలనుకుంటున్న రహస్యాలను నేర్చుకోవడం ద్వారా దేవుని కోసం మీ రోజులను లెక్కించడానికి ఉజీవ పాఠశాల ఒక గొప్ప మార్గం.

కీర్తన 90:13-17: వైర్స్‌బే ఈ వచనాలను ఇలా వివరించాడు, “మనము విశ్వాసులం మరియు భవిష్యత్తు మన నేస్తం.”11 దయ మరియు కరుణ కోసం మోషే చేసిన విజ్ఞప్తిని మనం చూస్తాము. మోషే పరము నుండి వచ్చిన మన్నా (మత్తయి 5:6) వంటి దేవుని ప్రేమలో సంతృప్తిని పొందాలని కోరుకున్నాడు. మన సంతృప్తి క్రీస్తు నుండి వస్తుంది, ఆయన స్పష్టంగా జీవాహారము. మనం ప్రతిరోజూ ఆనందం కోసం కేకలువేస్తూ ఉండాలి! మోషే తన జీవితంలోని రోజులన్నింటిలో, కష్టాలలో కూడా సంతోషించాలనుకున్నాడు (రోమా 8:18).

ముగింపు

మనకు విలువ, ప్రాముఖ్యత మరియు అర్థం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అది అసాధ్యమని భావించినప్పుడు కూడా దేవుడు మనలో కురిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు మరియు మద్దతు ఇస్తాడు మరియు మీకు ఇక్కడ పరిహారం పొందకపోతే, మీరు పరలోకములో పొందుకుంటారు (1 పేతురు 5:10). ఈ విధంగా మనం నిరీక్షణ కలిగి ఉండవచ్చు. వీయర్స్ బీ ఇలా వ్రాశాడు:

జీవితం క్లుప్తమైనది, కాబట్టి మోషే, “మాకు బోధించు” అని ప్రార్థించాడు. జీవితం కష్టమైనది, మరియు అతను "మమ్మల్ని సంతృప్తిపరచు" అని ప్రార్థించాడు. కొన్నిసార్లు తన పని నిష్ఫలంగా అనిపించింది, "మా చేతుల పనిని స్థిరపరచు." దేవుడు మోషే కొరకు ఆ ప్రార్థనలకు జవాబిచ్చాడు మరియు మన కొరకు వాటికి జవాబిస్తాడు. యేసు మీ రక్షకుడు మరియు ప్రభువు అయినప్పుడు భవిష్యత్తు మీ నేస్తమవుతుంది12

మనం గందరగోళములో ఉన్నా దేవుడు పెద్ద దేవుడని మోషే చెబుతున్నాడు. జీవితం చిన్నదని మనకు తెలుసు, కానీ ఈ ప్రక్రియలో, మనం ఎప్పటికీ ఆయనతో ఉండే వరకు దేవుడు మనకు ఉద్దేశ్యాన్ని ఇస్తాడు!

  1. జాన్ మాక్‌ఆర్థర్, జాన్ మాక్‌ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 657.

  2. వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: ఓల్డ్ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి. కుక్, 2004), పే. 254.

  3. వైర్స్బే, పే. 254.

  4. మాక్‌ఆర్థర్, పే. 657.

  5. వైర్స్బే, పే. 254.

  6. వైర్స్బే, పే. 254.

  7. మాక్‌ఆర్థర్, పే. 658.

  8. వైర్స్బే, పే. 255.

  9. మాక్‌ఆర్థర్, పే. 658.

  10. వైర్స్బే, పే. 255.

  11. వైర్స్బే, పే. 256.

  12. వైర్స్బే, పే. 256.

ప్రశ్నలు

  1. కీర్తన 90:1–2 చదవండి. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు అనే సత్యంతో మీరు ఎప్పుడైనా పోరాడుతున్నారా? అలా అయితే, ఈ పోరాటంపై మీరు ఎలా స్పందిస్తారు?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Psalm 90:17

“Let the favor of the Lord our God be on us; establish for us the work of our hands—establish the work of our hands

జీవితం కష్టంగా మరియు కష్టతరంగా ఉంటుంది, కానీ మీరు ఆశతో ముందుకు సాగినప్పుడు, బాధ ద్వారా కూడా, ఉదయాన్నే ప్రభువును వెతకడం ప్రారంభించండి. ఆయన మాత్రమే మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు మరియు అయన నమ్మకమైన ప్రేమతో మిమ్మల్ని నింపుతాడు. మీరు మీ ప్రశ్నలను ప్రభువు వద్దకు కూడా తీసుకురావచ్చు: మీరు ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్లాలి, ఈ క్షణిక జీవితంలో మీ సమయాన్ని ఎలా గడపాలి. గుర్తుంచుకోండి, మీరు ఆయనను వెదకినప్పుడు మీ రోజులను ఎలా లెక్కించాలో ప్రభువు మీకు బోధిస్తాడు మరియు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు.

ఈ రోజు, మీరు లక్ష్యం లేకుండా లేదా ఆశ లేకుండా సంచరించాల్సిన అవసరం లేదు. భగవంతుని అనుగ్రహం మీపై ఉండాలని ప్రార్థించండి మరియు అడగండి. మీ చేతుల పనిని స్థాపించమని ప్రభువును అడగండి. దేవుని సమయం ఎల్లప్పుడూ మీ సమయం కాదు, కానీ అది మూసివేసిన తలుపు అని కాదు. కొన్నిసార్లు అతను మీరు వేచి ఉండాలని కోరుకుంటాడు. మీ పరలోకపు తండ్రి మీతో ఇలా చెబుతూ ఉండవచ్చు: “నేను నిన్ను దేనికోసం సిద్ధం చేస్తున్నాను. నా కుమారుడా వేచి ఉండుము! ” ప్రభువు నేడు మీ చేతుల పనిని నిర్ధారించి స్థిరపరచును గాక. అతను మీ కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అన్నింటికంటే మించి, మీరు క్రీస్తులో స్థిరపడ్డారని గుర్తుంచుకోండి. మీరు అతనిలో పాతుకుపోయి, స్థిరపడి ఉన్నారు. మీరు అతనివి, మరియు అతను మీ కోసం కలిగి ఉన్న పనిని ఏర్పాటు చేస్తాడు.

“మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.”

  • కీర్తనలు 90:17

తదుపరి లేఖన భాగములు

కీర్తన 90:12 — “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.”

కొలొస్సయులు 2:6–7 — “కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.”

1 పేతురు 5:10 — “తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బల పరచును.”