Adoration Through Praise
యేసును ఇలా కనుగొనండి: King of Glory Psalms 148-150 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మేము కీర్తనల గ్రంధము యొక్క మా అధ్యయనాన్ని 150వ కీర్తనతో ముగించబోతున్నాము. చివరి ఐదు కీర్తనలలో ప్రతి ఒక్కటి ఇలా ప్రారంభమవుతుంది, “ప్రభువును స్తుతించండి! హల్లెలూయా!” మేము 150వ కీర్తనకు వచ్చే వరకు ప్రతి కీర్తన స్తుతులు మరియు ఆనందాన్ని పెంచుతుంది.
“హల్లెలూయా” అనేది గొప్ప పదం! హెబ్రీలో “హల్లెలు” అనేది ఆంగ్ల పదం “స్తుతి”. హల్లెలూ-యా అంటే “దేవుని స్తుతించుడి!” పాస్టర్ డేవిడ్ గుజిక్ ఇలా వివరించాడు, “ప్రతి కీర్తనల పుస్తకం డాక్సాలజీతో (స్తుతిని ప్రకటించటంతో) ముగుస్తుంది (కీర్తన 41:13; 72:18–19; 89:52; 106:48). ఈ మొత్తం కీర్తనను డాక్సాలజీగా (స్తుతిని ప్రకటించటంగా) చూడవచ్చు, ఇది సేకరించిన కీర్తనల యొక్క ఐదవ మరియు చివరి సంపుటాన్ని ముగించటమే కాకుండా, మొత్తం కీర్తనల పుస్తకాన్ని కూడా ముగిస్తుంది. 150వ కీర్తనలో వాదన లేదు, నిజమైన బోధన లేదు, నిజమైన వివరణ లేదు. ఇది యెహోవాకు సముచితమైన స్తోత్రాన్ని ఇవ్వమని సమస్త సృష్టికి అనర్గళమైన, ఉద్వేగభరితమైన మొర.1
కీర్తి మరియు గౌరవానికి అర్హమైన ఏకైక వ్యక్తి ముందు మనల్ని మనం ఉంచుకోవాలి.
పాఠము
కీర్తన 150:1-2: పాస్టర్ జోయెల్ పాంకోవ్ ఈ వచనాలను "హెల్లెలు-ఎందుకు" అని వర్ణించారు.2 ఇదంతా మెస్సీయను సూచిస్తుంది. "ఆయన పరిశుద్దాలయమునందు" అనేది దేవుడు నివసించిన ఆలయానికి సూచన. యేసు చనిపోయి, తిరిగి లేచాడు కాబట్టి, దేవుడు ఇప్పుడు తన ప్రజలలో “ఆయలముగా” ఉన్నాడు, భవనంలో నివసించకూడదని ఎంచుకున్నాడు. మనము ఆయన దేవాలయము మరియు దానికి అర్థ వంతమైన జీవితాన్ని మనం జీవించాలి.
"ఆయన పరాక్రమకార్యములు" సృష్టిలో ప్రదర్శించబడతాయి. సిలువపై యేసు ద్వారా ఆయన సాధించిన విజయం కారణంగా దేవుడు విజేత అనే ఆలోచనను కూడా ఈ పదబంధం కలిగి ఉంది (కొలస్సీ 1:19-20). మనం దేవుని ముందు పరిశుద్ధముగా నిలబడటం ఒక అద్భుతం, ఇది కేవలము క్రీస్తు మనకు అనుగ్రహించిన క్షమాపణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. "ఆయనకు మించిన గొప్పతనం" మనకు మంచి జ్ఞాపకం. ఆయన ఏమైయున్నడో దానిని బట్టి మనం ఆయనను స్తుతించాలి. దేవునికి మన ఆరాధన అనేది మానసిక స్థితి, లేదా అనుభూతి లేదా పరిస్థితిపై ఆధారపడి ఉండకూడదు.
పరిశుద్ధగ్రంధం యొక్క ప్రతి పేజీలో దేవుణ్ణి ఆరాధించాలనే ఆలోచన ఉంది- మనం ఆయన మహిమను స్తుతించడానికి సృష్టించబడ్డాము మరియు రక్షించబడ్డాము. కానీ నేడు ఆరాధన కోసం వెళ్ళే వాటిలో చాలా వరకు ఇది కోల్పోయాము. ఆరాధన అనేది నా గురించి మరియు దేవుడు నా కోసం ఏమి చేస్తాడు అని కాదు. ఆరాధన అంతా ఆయనకే -నేను ఆయన కోసమేనని గుర్తించడం. నేను ఆయన కోసమే ఊపిరి తీసుకుంటాను. నేను ఆయన కోసమే జీవిస్తున్నాను. నా జీవితాన్ని ఆయన కోసమే వెచ్చిస్తున్నాను. దేవుని సరైన విలువను మరియు స్థానాన్ని ప్రకటించడం.
మార్కు 12:28-30లో, “అన్నిటికంటే ముఖ్యమైనది ఏ ఆజ్ఞ?” అని యేసును అడిగారు. ఆయన, “నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ జ్ఞానముతోను, నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము” అని జవాబిచ్చాడు. ఆరాధన అనేది ఏకాగ్రతకు పిలుపునిస్తుంది-మన ప్రేమను కేంద్రీకరించడం, దేవుని పట్ల ఆశ్చర్యాన్ని నింపడం వంటి తీవ్రమైన మానసిక ఏకాగ్రత కాదు. ఇది మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం -మన జీవిత భాగస్వామిని లేదా తల్లిదండ్రులను సంతోషపెట్టడం కాదు - ఇది ప్రభువైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ-ఆయన ఏమై యున్నాడు మరియు ఆయన చేసిన దాని కోసం స్తుతించడం గురించి.
కీర్తన 150:3-5: పాస్టర్ జోయెల్ పాంకోవ్ ఈ వచనాలను "హెల్లెలు-హౌ" అని వర్ణించారు.3 కీర్తన 150 అద్భుతమైన స్తుతులు బృందాన్ని వివరిస్తుంది. ఇశ్రాయేలీయుల ఆరాధనలో, సంగీతం బిగ్గరగా మరియు సందడిగా ఉండేది. నేను ప్రతి వాయిద్యం మరియు అన్ని రకాలు అల్లికలపై బోధించటం ఇష్టపడతానని మీకు తెలుసు-కాని ఈ రోజు మన ఉద్దేశ్యం అది కాదు. దేవుణ్ణి స్తుతించడానికి మీరు దేనినైనా ఉపయోగించవచ్చు. కీర్తనకారుడు ఉపయోగించడానికి అనేక రకాల సంగీత వాయిద్యాల జాబితాను రూపొందించాడు-బాకాలు, వీణలు, సీతార, తంబురా, వేణువులు-నాట్యం కూడా-మీరు పేరు పెట్టకలిగినవన్ని.
మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకువచ్చినప్పుడు, దావీదు 1 దినవృత్తాంతములు 15:27-28లో ఈ రకమైన స్తుతులను పోలిన దానిని వివరించాడు. ఇతర “ప్రమాణము/ నాణ్యత” పద్యాలతో ఈ వాయిద్య అంశమును కూడా చూడండి (చిన్న జాబితా): నిర్గమకాండము 15:20–21; నెహెమ్యా 12:27; మరియు 1 కొరింథీయులు 15:51–52. విషయమేమిటంటే, దేవుని నామాన్ని స్తుతించడానికి మన ప్రతిభను మరియు సాధనాలను ఉపయోగించడం ద్వారా దేవునిని రకరకాలుగా ఆరాధించడానికి మనం స్వేచ్ఛకలిగి ఉన్నాము.
కీర్తన 150:6: పాస్టర్ జోయెల్ పాంకోవ్ ఈ వచనాలను "హెల్లెలు-హూ" అని వర్ణించారు.4 మన నాసికా రంధ్రాల ద్వారా వచ్చే శ్వాస విడిచిపెట్టి తిరిగి రాని సమయం రాబోతుంది. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి శ్వాస ఇచ్చాడు; ఆయన స్తుతిని ఊపిరి పీల్చుకోవడానికి మనం ఇప్పుడు పిలువబడ్డాము. దేవుడు వాక్చాతుర్యాన్ని పట్టించుకోడు, చిత్తశుద్ధి మరియు విధేయత మాత్రమే ఆయన కోరుచున్నాడు. మీ ఆరాధన హృదయం నుండి వచ్చినంత వరకు ఆమోదయోగ్యమైనది. మీరు దాని కంటే మరే ఇతర అచ్చును కలవవలసిన అవసరం లేదు.
కీర్తనకారుడు మీరు తలుపు వద్ద తనిఖీ చేయబడాలని చెప్పలేదు, “నాకు నీ స్వరం విననివ్వండి. సరే. మీరు రాగాన్ని ముందుకు తీసుకువెళ్ళ గలరని నేను అనుకుంటున్నాను. దేవుణ్ణి స్తుతించడానికి మీరు సీతార, తంబురా లేదా తాళములు ఎలా వాయించాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన, “నీకు ఊపిరి ఉందా అడిగాడు? మీరు జీవించే ఉన్నారా? మీ శరీరం వెచ్చగా ఉందా? అప్పుడు మేము మిమ్మల్ని తీసుకెళ్తాము." మీరు దేవుని వాక్యాన్ని చూసినప్పుడు, మానవులు కాని వాటి నుండి కూడా ఆయన ప్రశంసలను స్వీకరిస్తాడు (కీర్తన 148:7-11; ప్రకటన 5:13).
దేవుణ్ణి స్తుతించాలనే ఆజ్ఞతో ఈ కీర్తన ప్రారంభమై ముగుస్తుంది. మనము ఆయన ప్రతి స్థలమందు స్తుతిస్తాము, ఆయన గోప్పకార్యముల వలన, ఆయన ఏమైయున్నాడో అన్ని విధాలుగా సాధ్యమయ్యే విధముగా స్తుతించటం. అనేక రకాలైన వాయిద్యాలతో మరియు ఆరాధన యొక్క విజయవంతమైన వ్యక్తీకరణలతో మనం ఆయనను స్తుతించాలి. స్తుతి యొక్క ఉత్తమ సాధనం కోసం ఆరాధించే జీవనశైలిని గడపడం అనేది ఆయనకీ పూర్తిగా కట్టుబడి ఉన్న వ్యక్తి.
మొదటి చర్య #1: పరిశీలకుడి పాత్ర నుండి పాల్గొనేవాడుగా ముందుకు సాగాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆరాధన అనేది మనం చూసే లేదా వింటున్నట్లుగా నిష్క్రియంగా ఉండటానికి కాదు. మనము చురుకైన ఆరాధనలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి, మన తల, హృదయం మరియు చేతులను నిమగ్నం చేయడం ద్వారా దేవునికి మన స్తోత్రాన్ని ఎత్తాలి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: నేను కేవలం ఆరాధన-పరిశీలకుడినే అయితే, నన్ను లోపలికి రాకుండా ఆపేది ఏమిటి? సహాయం కోసం ప్రభువు వద్దకు ఈ అడ్డంకిని తీసుకువెళ్ళండి .
రెండవ చర్య #2: మీరు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడం ప్రార్థనలో అలవాటు చేసుకోండి. మీకు సహాయం కావాలంటే, దీన్ని ప్రయత్నించండి: “నా ప్రాణము యొక్క న్మిత్యమైన తండ్రీ, ఈ రోజు నా మొదటి ఆలోచన నీ గురించి ఉండనివ్వండి, నా మొదటి ప్రేరణ నిన్ను ఆరాధించనివ్వండి, నా మొదటి ప్రసంగం నీ పేరుగా ఉండనివ్వండి, నా మొదటి చర్య ప్రార్థనలో మోకరిల్లి ఉండనివ్వండి. . ఆమెన్.”5
ముగింపు
యేసు చెప్పినట్లుగా మనం ఇక్కడ ఉండడానికి కారణం మనుష్యుల ముందు మీ వెలుగును ప్రకాశింపజేయడమే, వారు మీ మంచి పనులను చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు (మత్తయి 5:16). మేము ప్రభువును స్తుతించుటకు ఇక్కడ ఉన్నాము. ఇది నిజంగా కష్టం కాదు. మేము హల్లెలుయాను గ్రహించినప్పుడు-కనికరం మరియు దయగల దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాము-అవన్నీ స్థానంలోకి వస్తాయి. మనం ఎవరయినా లేదా ఎలా చేసినా, క్రీస్తులో ఆయన కనికరం మరియు కరుణ కోసం మనం దేవునికి స్తుతిస్తున్నంత కాలం-మన కాంతి ప్రకాశిస్తుంది మరియు దేవునికి మహిమను ఇస్తుంది.
“మన కోరికలు మరియు మన శ్రేయస్సుపై ఆయన దైవిక స్వయం ప్రభావం గురించి ఆలోచించకుండా, ఆయన తనలో ఉన్న దాని కోసం మనం ఆయనను ఆరాధించే క్షణానికి చేరుకునే వరకు మనం స్వచ్చందంగా ఆయనను ఆరాధించము. అప్పుడు మనం ఆయనను తన కోసమే ప్రేమిస్తాం. అప్పుడు మనం ఏదైనా వ్యక్తిగత ప్రయోజనం ఊహించిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆయనను ఆరాధిస్తాము. అప్పుడు ఆయన మన కోసం ఏమి చేసాడో లేదా ఆయన మన కోసం ఏమి చేయాలని మనం ఆశిస్తున్నామో కాదు, కానీ మనం ఉనికిలో ఉండకముందు ఆయన నిత్యత్వం నుండి ఎలా ఉన్నాడు మరియు ఇప్పుడు మనం ఆయన అవసరం లేకున్నా ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు మరియు ఆయన ఏమి చేస్తాడు. ఆయన నిరంతరం ఉండేవాడు . . . అది మనలను ఆకర్షిస్తుంది మరియు ఆరాధనలో స్వీయ నిస్వార్థ సమర్పణను మన నుండి రేకెత్తిస్తుంది. అది స్వచ్ఛమైన ఆరాధన. ఆయన నామమునకు మించినది ఏది లేదు.”6
డేవిడ్ గుజిక్, “కీర్తన 150–అన్ని విషయాలు ప్రభువును స్తుతించనివ్వండి”; https://enduringword.com/bible-commentary/psalm-150/లో అందుబాటులో ఉంది.
జోయెల్ పాంకో, ది లాస్ట్ కీర్తన “హల్లెలూయా” అంటే ఏమిటో వివరిస్తుంది, https://www.sermoncentral.com/sermons/the-last-psalm-explains-what-hallelujah-is-all-about-joel-pankow- sermon- on-worship-definition-59218?ref=SermonSerps, జూన్ 12, 2003.
జోయెల్ పాంకోవ్.
జోయెల్ పాంకోవ్.
జోయెల్ పాంకోవ్.
ఆల్బర్ట్ E. డే, యాన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ప్రేయర్ (న్యూయార్క్: హార్పర్, 1952).
ప్రశ్నలు
-
148వ కీర్తనలో, పరలోకంలో మరియు భూమిపై ఎవరు స్తుతించబడాలి మరియు ఆయన ఎందుకు ప్రశంసించబడాలి?
దినవాక్యం
Laura Martin Psalm 150:6
“Let everything that breathes praise the LORD. Hallelujah!”
నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను మరియు నీ పూర్ణమనస్సుతోను దేవున్ని ప్రేమించుటయే గొప్ప ఆజ్ఞ అని యేసు చెప్పాడు. ప్రతిదానితో దేవుణ్ణి ప్రేమించండి. మీకు ఉన్న ప్రతిదానితో దేవుణ్ణి స్తుతించడం దేవుని పట్ల మీకున్న ప్రేమను తెలియజేస్తుంది. కొడుకు లేదా కూతురి పట్ల మీ ప్రేమను ప్రదర్శించమని మీరు వారిని ప్రోత్సహించడం లేదా ప్రశంసించినట్లే, ఆయన చేసిన మంచి పనుల కోసం ప్రభువును స్తుతించండి.
సరైన గానం లేకపోవడం, సంగీత వరం లేకపోవడం లేదా సమన్వయం లేని నృత్య కదలికలు మిమ్మల్ని నెమ్మదించనివ్వవద్దు. మీరు ఉన్న ప్రతిదానితో మరియు మీకు ఉన్న వాటితో మీరు ప్రభువును స్తుతించవచ్చు. జీవపు ఊపిరి ఉన్న ఏదైనా దేవుని నామాన్ని స్తుతించగలదు. కాబట్టి అది మిమ్మల్ని కలిగి ఉంటుంది! ఈరోజు, ఒక్క క్షణం ఆగి ప్రభువును స్తుతించండి. బిగ్గరగా చెప్పండి, “సింహాసనంపై కూర్చున్న వ్యక్తికి, గొర్రెపిల్లకు ఆశీర్వాదం, గౌరవం, కీర్తి మరియు ఆధిపత్యం, ఎప్పటికీ! ఆమెన్!” జీవితం హెచ్చుతగ్గులతో నిండి ఉంది, కానీ నిన్న, నేడు మరియు నిరంతరం ఒకే విధంగా ఉంటుంది, అది సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు. హల్లెలూయా!
“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.”
- కీర్తనలు 150:6
తదుపరి లేఖన భాగము
కీర్తనలు 148:7-11:- “భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.”
మత్తయి 22:36-38:- “బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.”
ప్రకటన గ్రంథం 5:13:- “అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుటవింటిని.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.