A Cry From Help
యేసును ఇలా కనుగొనండి: King of Glory Psalms 143-145 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఈ మూడు కీర్తనలు దావీదు కీర్తనలు అయితే, మేము 143వ కీర్తనను కోనసాగించాభోవుచున్నాము . తన జీవితంలో ఏదో ఒక సమయంలో, దావీదు తన పరిస్థితి గురించి రోజువారి చేర్యగా వ్రాసాడు. అతను వ్రాసిన ఈ కీర్తన పశ్చాత్తాప కీర్తనలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అతను మోకాళ్లపై ఉండి, ప్రభువు ముందు విజ్ఞాపనచేశాడు.
పాఠము
కీర్తన 143: 1-6: దావీదు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని అడగడం ద్వారా ప్రారంభించాడు. వారెన్ వైర్స్బే ప్రకారం, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు “దేవునికి మీ పరిస్థితిని చెప్పాలి.”1 “నన్ను క్షమించండి,” అని దావీదు చెప్పిన ఏడవ మరియు చివరి కీర్తన, కానీ అతను నిజానికి బయటకు వచ్చి, “నన్ను క్షమించండి,” అని చెప్పలేదు. దావీదు "యెహోవా, నా ప్రార్థన ఆలకించుము" (వ. 1) అని ప్రార్థిస్తున్నప్పుడు కూడా దేవుని విశ్వసనీయత మరియు నీతిని పిలవడం ప్రారంభించాడు. దేవుడు తన విశ్వాసం మరియు నీతి కారణంగా ప్రార్థనకు సమాధానం ఇస్తాడు అనే మనస్తత్వంతో దావీదు దేవుని వద్దకు వచ్చాడు. దేవుడు తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకునే ప్రేమగల తండ్రి (మత్తయి 7:11). ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా మనం ఆయనను మరియు ఆయన స్వభావాన్ని తెలుసుకున్నందున మనం కూడా విశ్వాసంతో దేవుని దగ్గరకు రాగలము.
దావీదు తనకు తీర్పు తీర్చవద్దని దేవుణ్ణి అడిగాడు ఎందుకంటే "సజీవులలో ఒకడును నీ దృష్టికి నీతిమంతుడు కాడు" (వ. 2). ఈ పదబంధం దావీదు గందరగోళంలో పడ్డాడని సూచిస్తుంది, కానీ అందరికి కూడా అలాగే ఉంది. జాన్ మాక్ఆర్థర్ ప్రకారం, “దావీదు తన అనీతిని అంగీకరించాడు మరియు తను అనీతి నుండి విదిపించాబడాలి అంటే అది కేవలము దేవుని నీతివలననే తప్ప నా సొంత నీతివలన కాదు.”2 కానీ దావీదు అలా చేయలేదని నెల్సన్ వ్యాఖ్యానం ఎత్తి చూపింది. అతను చేసిన దానికి చింతిస్తున్నానని చెప్పాడు.3 ఎవరూ పరిపూర్ణులు కాదని దావీదు యొక్క ప్రకటన ఇతర లేఖనాల వచనాలచే సమర్థించబడింది. రోమా 3:23 ఇలా చెబుతోంది, "అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు." యెషయా 64:6 ప్రభువు ఎదుట మనమందరం అపవిత్రులమని చెబుతోంది.
శత్రువులు తనను వెంబడించి నేల పడగోట్టుచున్నారు, తద్వారా అతను గాడంధకారములో జీవించాడని దావీదు చెప్పాడు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ప్రకారం, “వెలుగు మరియు చీకటి రూపకం పరిశుద్దగ్రంధములో ఆదికాండము 1:2-3లో ప్రారంభమవుతుంది. చీకటిలో జీవించడం అంటే గోతిలో ఉండడంతో సమానం (వ. 3).4 దావీదు యొక్క ఆత్మ క్రుంగి యున్నది, మరియు అతను విస్మయనికి గురయ్యాడు (వ. 4). దావీదు వద్ద ఏమీ మిగిలి లేదని మరియు ఆయనకు నీరిక్షణ లేదు చెప్పాడు.
కానీ దావీదు "పూర్వ దినములను" జ్ఞాపకము చేసుకొని, దేవుడు చేసిన క్రియలను ధ్యానించెను (వ. 5). దేవుడు చేసిన ప్రతిదాని గురించి ఆలోచిస్తూ దావీదు తన చేతులను చాపుచున్నాడు (వ. 6), అది తను సమర్పించుకోవడం సూచిస్తుంది. మీరు ఎండాకాలం గుండా వెళ్ళినప్పుడు, మీరు ప్రభువుతో మాట్లాడవలసి ఉంటుంది. మాక్ఆర్థర్ ప్రకారం, “నేరవిచ్చిన భూమి వర్షం కోసం తహతహలాడుతున్నట్లుగా, హింసించబడిన దావీదు తన ప్రాణాన్ని ఇచ్చే విమోచకుని కోసం ఎదురు చూస్తున్నాడు.”5 కొండమీద ప్రసంగంలో, యేసు ఇలా అన్నాడు, “నీటి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు (మత్తయి 5:6). మీరు దేవుణ్ణి ఎక్కువగా అనుభవించాలని కోరుకుంటే, ఆయన మిమ్మల్ని త్రుప్తిపరుస్తాను అని వాగ్దానం చేస్తాడు. ఎండిపోయిన శరీరం నింపబడాలి అంటే , మీరు మీ పరిస్థితిని దేవునికి చెప్పాలి మరియు సమాధానం ఉత్తరమిమ్ము అని అడగాలి. 5వ వచనాన్ని వెనక్కి తిరిగి చూస్తే, దావీదు దేవుని గురించి తనకు తెలిసిన వాటిని పట్టుకున్నాడు. దేవుడు చేసిన ప్రతిదానిని కూడా మనం వెనక్కి తిరిగి చూడవచ్చు: "సృష్టి, అబ్రహము యొక్క పిలుపు, యాకోబు యాత్ర మరియు యోసేపు జీవితం, ఐగుప్తు యొక్క నిర్గమము మరియు కనాను జయించడం."6
దేవుడు చేసిన వాటి గురించి దావీదు ఆలోచించి ధ్యానించాడు. మీరు దేనినైనా ఎలా ప్రతిబింబిస్తారు? వాటిని వ్రాసి చూసుకుంటావా? దానిని పత్రికల చేయాలా? దానిని గీయాలా? మీరు దాని గురించి ఆలోచించగలిగేలా దాన్ని ముందుకు తెచ్చేది చేయండి. దేవునికే సర్వస్వం ఇచ్చే మనస్తత్వం రావాలంటే ఏం చేయాలి? 1 పేతురు 5:7 “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” అని చెబుతోంది.
కీర్తనలు 143:7-12: మన పరిస్థితుల గురించి మనం దేవునికి చెప్తాము మరియు మాకు సమాధానం చెప్పమని ఆయనను అడుగుతాము. వైర్స్బే ప్రకారం, మేము "సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటాము."7 దావీదు తన ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము అని దేవుణ్ణి అడిగాడు (వ. 7a). మనకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకు సామర్థ్యం, పట్టుదల మరియు స్థిరత్వం ఉన్నాయో లేదో మనకు తెలియదు. దేవుడు తన ముఖాన్ని దాచినట్లయితే, అతను "సమాదిలోకి దిగువారివాలే ఉండకుండు నట్లు" (వ. 7b) దేవుని సమాధానం లేకపోతె, దావీడు తాను చనిపోతున్నట్లు భావిస్తానని చెప్పాడు. ఈ రోజు మనం కోరుకునే సమాధానాలే దావీదు కోరుకుంటున్నారని వైర్స్బే ఎత్తి చూపారు.8 అతను దేవుని ముఖాన్ని చూడాలనుకున్నాడు (వ. 7). అతను దేవుని వాక్యాన్ని వినాలనుకున్నాడు (వ. 8). అతను దేవుని రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు (వ. 9). దావీదు తన ప్రార్థన జీవితంలో, అతను దేవుని నుండి అడిగిన దానిలో చాలా నిర్దిష్టంగా ఉన్నాడు. అతను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నాడు (వ. 10). దావీదు దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలని, ఆయన స్వరాన్ని వినాలని, ఆయన రక్షణను పొందాలని మరియు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుకున్నాడు. చివరగా, దావీదు దేవుని గొప్ప పేరుకు మహిమ తీసుకురావాలనుకున్నాడు (వ. 11-12). దావీదు చాలా కష్టమైన స్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ అతను ప్రభువుతో ఎలా మాట్లాడాలో మనకు నమూనాగా చెప్పాడు. అతను ఏదో ఒక విధంగా శ్రమకు గురైనట్లు ఒప్పుకుంటూ దేవునికి మొర పెట్టాడు.
మనం కష్టమైన ప్రదేశంలో ఉన్నప్పుడు, అది నిరాశ కావచ్చు, కానీ అది కేవలం భయము – ఆధ్యాత్మికంగా తేలిపోవడం -లేదా ఒంటరితనం యొక్క కాలము కావచ్చు, మనం ఏమి చేయాలి? బెట్సీ డి క్రజ్ భయము నుండి మళ్లీ దేవుడిపై విశ్వాసం వైపు ఎలా వెళ్లాలనే దానిపై ఒక అధ్యయనం చేశాడు; నిరాశ యొక్క సమాధి నుండి దేవుని భయం వరకు. ఆమె పది విషయాలను అందించింది:
- మీరు ప్రాణము క్రుంగి ఉన్నది అనే అపరాధభావాన్ని విడిచిపెట్టండి (కీర్తన 42:5).
- ఎవరికైనా చెప్పడానికి వెళ్ళండి (యాకోబు 5:16 మీ కోసం ప్రార్థించమని ప్రజలను అడిగే విధానాన్ని వివరిస్తుంది).
- వృత్తిపరమైన సహాయం పొందండి. లేదా ఇతరుల నుండి సలహా మరియు జ్ఞానాన్ని కోరండి (సామెతలు 11:14).
- దేవునికి దగ్గరవ్వండి మరియు ఆయనతో వాస్తవికతను పొందండి (కీర్తన 34:18).
- దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండండి (కీర్తన 23; రోమన్లు 5:1-8; 1 యోహాను 4:9-10).
- మీ వ్యక్తిగతంగా ఆనందం ఉండుటను ప్రారంభించండి. మీకు ఆనందం కలిగించే పని చేయండి.
- మరొకరికి సహాయం చేయండి. మీ దృష్టిని మరల్చడానికి మరియు మరొకరిని ప్రేమించడానికి ఏదైనా చేయండి.
- ఆరాధనలో కీర్తనను పాడండి (కీర్తన 59:16–17). సంగీతం ద్వారా దేవుని మాటలు మీకు సేవ చేయనివ్వండి.
- సృజనాత్మకంగా ఏదైనా చేయండి. మీరు మీ భావాలను వ్యక్తీకరించేటప్పుడు గందరగోళానికి గురిచేసే స్వేచ్ఛను ఇది మీకు ఇస్తుంది.
- మీ దృక్పథాన్నికలిగి ఉండండి. కీర్తనలు 30:5b: “ఏడ్చుచు రాత్రి గడపవచ్చు, ఉదయమున సంతోషము కలుగును.”9
ముగింపు
మీరు ఫంక్లో ఉంటే మరియు మీరు ఈ ప్రక్రియ ద్వారా నడవడం ప్రారంభిస్తే, ఉదయం ఆనందం వస్తుంది. డేవిడ్‌లో నేను ఇష్టపడేది అదే- అతను ఎక్కడున్నాడో పట్టించుకోకుండా ఎప్పుడూ దేవుణ్ణి చూస్తూనే ఉన్నాడు.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: ఓల్డ్ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి. కుక్, 2004), పేజి. 1043.
జాన్ మాక్ఆర్థర్, ది జాన్ మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజి. 691.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), p. 740.
నెల్సన్ యొక్క వ్యాఖ్యానం, p. 740.
మాక్ఆర్థర్, p.691.
వైర్స్బే, పే. 1043.
వైర్స్బే, పే. 1043.
వైర్స్బే, పే. 1043–44.
బెట్సీ డి క్రజ్, “క్రైస్తవులు డిప్రెషన్‌తో పోరాడగల 10 మార్గాలు”; https://www.crosswalk.com/slideshows/10-ways-christians-can-fight-depression.html నుండి అందుబాటులో ఉంది.
ప్రశ్నలు
-
కీర్తన 143:5 ఇలా చెబుతోంది, “నాకు మునుపటి దినములు జ్ఞప్తికి వస్తున్నాయి; నేను నీ క్రియలన్నిటిని ధ్యానిస్తాను; నేను నీ చేతి పనిని ప్రతిబింబిస్తున్నాను." మీరు దేవుని చేతిపనుల గురించి ఎంత తరచుగా ధ్యానిస్తారు? లేదా దేవుని సృష్టి మరియు ఆయన చేసినదంతా గురించి ఆలోచించాలా? మీ దేవుడు ఎంత పెద్దవాడు?
దినవాక్యం
Laura Martin Psalm 143:1, 4
“LORD, hear my prayer. In Your faithfulness listen to my plea, and in Your righteousness answer me . . . My spirit is weak within me; my heart is overcome with dismay.”
స్నేహితులు తరచుగా ఒకరినొకరు పలకరించుకుంటారు, "మీరు ఎలా ఉన్నారు? అని" చాలామంది నవ్వుతూ, "నేను బాగున్నాను" అని చెబుతారు. కానీ ఒక రోజు మీరు బాగుండకపోతే? ఆ రోజు, మీరు ఎలా ఉన్నారని ఎవరైనా అడిగినప్పుడు, “నా ఆత్మ నాలో బలహీనంగా ఉంది; నా హృదయం నిరాశతో నిండిపోయింది." దావీదు ఈ యథార్థ సత్యాన్ని ప్రభువుతో చెప్పాడు మరియు “త్వరగా నాకు జవాబివ్వు!” అని కూడా అన్నాడు. దావీదు ఆత్మ విఫలమైంది, మరియు అతను మరింత గోతిలోనికి వెళ్లడానికి ఇష్టపడలేదు.
నిరాశ, ఒంటరితనం మరియు నిరాశతో కూడిన ఈ ప్రదేశానికి మీరు సంబంధం కలిగి ఉండగలరా? మీ భావాలను ప్రభువుకు తెలియ చేయండి మరియు ఏదైనా అవమానాన్ని లేదా అపరాధాన్ని విడిచిపెట్టండి. మీరు ఒకరి జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్లి చెప్పండి. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీరు ఈ నిరాశ ప్రదేశంలో ఉండవలసిన అవసరం లేదు. ఇతరులు మీతో సహవాసం కలిగి ఉంటారు. ఈ రోజు ప్రభువు నుండి ఈ వాగ్దానాలను స్వీకరించండి మరియు విశ్వసించండి: ప్రభువు నిన్ను ప్రేమించువాడు మరియు మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఆయనే మీ కోట, దుర్గము, విమోచకుడు మరియు మీ రక్షకుడు. ప్రభువు దయగలవాడు, త్వరగా కోపపడడు మరియు నమ్మకమైన ప్రేమలో గొప్పవాడు కాబట్టి ఆయనను ఆశ్రయించండి. నేడు, మీ ఆత్మ బలహీనంగా ఉంటే మరియు మీ హృదయం నిరాశతో అధిగమించినట్లయితే, సహాయం కోసం ప్రార్ధించినప్పుడు మీ ప్రార్థనను ప్రభువు వింటాడు.
“నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము.........కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను.”
- కీర్తనలు 143: 1,4
తదుపరి లేఖన భాగము
కీర్తనలు 143:7-8:- “యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము. నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.”
కీర్తనలు 144:2:- “ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.”
1పేతురు 5:6-7:- “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.