Paul's Ministry To The Gentiles
యేసును ఇలా కనుగొనండి: Exalted One Philippians 1 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక మన అధ్యయనంలో ముప్పై మూడవ పుస్తకం మరియు పౌలు చెరసాల పత్రికలలో (లేఖలు) మరొకటి. ఫిలిప్పీలోని విశ్వాసులకు రాసిన పత్రిక, మనం ఇప్పటివరకు అధ్యయనం చేసిన పౌలు యొక్క చాలా పత్రికల మాదిరిగానే, అపొస్తలులకార్యాలలో పౌలు యొక్క ప్రయాణాన్ని తెలియపరుస్తూనే ఉంది. ఫిలిప్పీ సంఘము మాసిదోనియాలో పౌలు ప్రారంభించిన మొదటి సంఘము. పౌలు రోమా నుండి క్రీ.పూ. 60-62లో తన మొదటి చెరసాల శిక్ష సమయంలో పత్రికను వ్రాసాడు. దానికి రుజువు (ఫిలిప్పీయులు 1:13; 4:22), అపొస్తలులకార్యములు (28:16, 30-31), ఎఫెసీయులలో (6:18-20), మరియు కొలొస్సీయులలో (4:2-4) కనుగొనబడింది. అయితే, కొంతమంది పండితులు ఈ పత్రిక సముద్రము మద్యలో ఉన్న కైసరియా ప్రాంతము నుండి వ్రాయబడిందని నమ్ముతారు, అక్కడ పౌలు యొక్క రెండు సంవత్సరాల చెరసాల శిక్ష ముగింపుకు దశలో వ్రాసి ఉండవచ్చు అని నమ్ముతారు.1 ఫిలిప్పీయులు 1:20 ప్రకారం, పౌలు తన చెరసాల శిక్ష ముగుస్తుందని ఊహించాడు.
ఫిలిప్పీ నగరానికి మొదట క్రెనైడ్స్ లేదా ది లిటిల్ ఫౌంటైన్స్ అని పేరు పెట్టారు, ఇది సమీపంలోని చిన్న నీటి బుగ్గలను సూచిస్తుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క తండ్రి అయిన మాసిదొనియా వాడైన ఫిలిప్పు గౌరవార్థం ఈ నగరముకు ఈ పేరు మార్చబడింది. దీని సమీపంలోని బంగారు గనులు ఈ ప్రాంతానికి చాలా మందిని ఆకర్షించాయి. క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో ఫిలిప్ ఈ నగరమును మరియు చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు మరియు క్రీ.పూ. రెండవ శతాబ్దం రోమీయుల ముఖ్య పట్టణముగా మాసీదోనియ ఫిలిప్పి మారింది. క్రీ.పూ. 42లో రోమా సభలో జూలియస్ చక్రవర్తి హత్య జరిగిన తర్వాత, చక్రవర్తికి మద్దతుగా నిలిచిన ఆంటోనీ మరియు ఆక్టేవియన్ల సైన్యాలు, చక్రవర్తిని వ్యతిరేకించిన బ్రూటస్ మరియు కాసియస్ సైన్యాలను ఓడించినప్పుడు దాని కీర్తి నిజంగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. నగరం/ప్రాంతం రోమా కాలనీగా నూతన రోమా సామ్రాజ్యంలోకి మారింది.2
పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఫిలిప్పీలో సంఘమును స్థాపించాడు. పౌలు ఫిలిప్పీకి వచ్చినప్పుడు, అక్కడ కొద్దిమంది యూదులు మాత్రమే ఉన్నారు. యూదుల జనాభా చాలా తక్కువగా ఉంది, పది మంది కంటే తక్కువ మంది పురుషులు ఉన్నారు కాబట్టి అక్కడ సమాజహ మందిరం ఉనికిలో లేదు కాబట్టి అక్కడి నగరంలోని యూదా స్త్రీలు నగరం వెలుపల గంగైట్స్ నది వెంబడి వెళ్లారు. పౌలు అక్కడ స్త్రీలను కలుసుకున్నాడు (అపొస్తలుల కార్యములు 16:13), మరియు వారికి సువార్త ప్రకటించాడు. ఫిలిప్పీలో లూదియ అనే స్త్రీ మొదటి విశ్వాసి. ఆమె ఒక విజయవంతమైన వ్యాపారవేత్త, సంపద మరియు సంఘముగా కూడుకోవాడానికి ఒక పెద్ద ఇల్లును కలిగి ఉంది. ఆమె పౌలు మరియు సీలను తనతో కలిసి ఉండమని ఆహ్వానించింది. దెయ్యం పట్టిన మరో స్త్రీ, సోదే చెప్పు స్త్రీ మరియు బానిస అయిన అమ్మాయి ద్వారా వెంటనే వ్యతిరేకత వచ్చింది. ఆమె అరుపులు మరియు శాపాలకు ప్రతిస్పందనగా, పౌలు దయ్యాన్ని వెళ్లగొట్టాడు, ఆమె యజమానికి కోపం తెప్పించాడు, ఎందుకంటే ఆమె అతని కోసం డబ్బు సంపాదించలేకపోయింది. పౌలు మరియు సీలలను గుంపు పట్టుకుని, అధికారుల యొద్దకువారిని ఈడ్చుకుపోయారు, వారిని కొట్టి, సంకెళ్లతో చెరశాలలో వారిని బంధించారు (అపోస్తుల 16). వారి సంకెళ్ళు విరిగిపోయాయి మరియు భూకంపం ద్వారా ద్వారాలు తెరవబడ్డాయి, కానీ పౌలు మరియు సీల వారు ఉన్న చోటే ఉండిపోయారు. చెరసాల అధికారి వారిని కనుగొన్నప్పుడు, అతను, అతనితోపాటు తన ఇంటి వారు కూడా క్రీస్తును అంగీకరించాడు. మరుసటి రోజు, న్యాయాధికారులు పౌలు మరియు సీల ఇద్దరూ రోమ పౌరులు కాబట్టి వారు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని తెలుసుకున్నారు మరియు వారు పౌలు మరియు సీలలను తమని విడిచిపెట్టమని కోరారు. పౌలు ఫిలిప్పీని మరో రెండుసార్లు దర్శించాడు ఒకసారి అతను తన మూడవ మిషనరీ ప్రయాణం ప్రారంభంలో ఏథెన్సు మరియు కొరింథీ వైపు వెళ్ళాడు మరియు రెండవసారి తిరిగి వచ్చాడు. పౌలు ఫిలిప్పిలోని సంఘమును ప్రేమించాడు (ఫిలిప్పీయులు 4:15-16). ఫిలిప్పీలోని సంఘము యెరూషలేముకు కానుకలను ఉదారంగా ఇచ్చింది. పౌలును తనిఖీ చేయడానికి వారు రోమాకు ఒక ప్రతినిధి బృందాన్ని కూడా పంపారు, అందులో పౌలుకు పరిచర్య చేయడానికి వచ్చిన ఎపఫ్రొదితును కూడా ఉన్నారు. ఎపఫ్రొదితును రోమాకు ప్రయాణిస్తున్నప్పుడు లేదా పౌలుతో ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. పౌలు ఎపఫ్రొదితును అతని ఆరోగ్యం కోసం ఫిలిప్పీకి తిరిగి పంపాడు మరియు అతనితో పాటు అక్కడ ఉన్న సంఘముకు తన పత్రికను పంపాడు.3
ఫిలిప్పీలోని సంఘమునకు పౌలు వ్రాసిన పత్రిక కోసం మాక్ఆర్థర్ ఐదు ప్రయోజనాలను గుర్తించాడు. మొదట, వారి ఉదారమైన బహుమతులకు కృతజ్ఞతలు తెలుపుతూ పౌలు వ్రాశాడు. రెండవది, పౌలు ఎపఫ్రొదితును ఫిలిప్పీకి ఎందుకు పంపించాడో వివరించాలనుకున్నాడు. మూడవది, పౌలు రోమలోని తన పరిస్థితులను వారికి తెలియజేయాలనుకున్నాడు. నాల్గవది, పౌలు వారిని ఐక్యత వైపు ప్రోత్సహించాడు. ఐదవది, తప్పుడు బోధకుల ప్రమాదాల గురించి పౌలు అక్కడి విశ్వాసులను హెచ్చరించాడు.4 మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను (మార్కు 10:45). ఈ హెచ్చింపబడిన వ్యక్తి గూర్చి పౌలు కూడా రాశాడు (2:5-11) . పత్రిక యొక్క రెండవ ఇతివృత్తం ఆనందం. అంశము చాలా ప్రబలంగా ఉంది పౌలు ఆనందం కోసం పత్రిక అంతటా ఐదు వేర్వేరు గ్రీకు పదాలను ఉపయోగించాడు మరియు వేర్వేరు ఆనందాన్ని 15 సార్లు పేర్కొన్నాడు.5
పాఠము
ఫిలిప్పీయులు 1:1: మొదటి 11 వచనాలలో పౌలు శుభాకాంక్షలు ఉన్నాయి. పౌలు క్రీస్తులో తన స్థానాన్ని వివరించడానికి “బానిస” లేదా “దాసుడు” అనే పదాన్ని ఉపయోగించాడు (వ. 1). మాక్ఆర్థర్ ఈ పదాన్ని “తన యజమానితో సంతోషంగా మరియు విధేయతతో అనుసంధానించబడిన ఇష్టపూర్వక బానిసను/దాసుడు సూచిస్తుంది” అని వివరించాడు (యాకోబు 1:1, 2 పేతురు 1:1; యూదా 1).6 అతను “పరిశుద్ధులందరినీ . . . పైవిచారణకర్తలు మరియు పరిచారకులు/ పెద్దలు సహా ఫిలిప్పీలో ఉన్నారు. పౌలు అక్కడ ఉన్నప్పటి నుండి సంఘము అభివృద్ధి చెందుతూనే ఉంది కాబట్టి అక్కడ ఉన్న విశ్వాసులందరి గురించి పౌలుకు తెలియదు.
ఫిలిప్పీయులు 1:2-8: మన తండ్రియగు దేవునినుండియు ప్రభువగు యేసుక్రీస్తు (వ. 2) నుండియు మీకు కృపయు సమాధానమును సంబంధించిన తన సాంప్రదాయ శుభాకాంక్షలతో అతను కొనసాగుతున్నాడు. 3-6 వచనాలలో అతని ప్రకటన ఆచారం కాదు కానీ అతనికి మరియు ఫిలిప్పి సంఘ సమాజానికి మధ్య చాలా వ్యక్తిగత సంబంధాన్ని వ్యక్తపరిచినట్లు అనిపిస్తుంది. అతను వారి కోసం ఖండించకుండానే సంతోషంతో ప్రార్థించాడు, ఎందుకంటే వారు క్రీస్తు యొక్క పనిని మొదటి నుండి ఆపలేదు. అక్కడ సంఘము క్రీస్తు యొక్క పని గురించి బోధించిన దాని నుండి తప్పుదారి పట్టిపోతుందనే ఆందోళన పౌలుకు లేదు. వారు అతనితో నిజమైన భాగస్వాములు, మరియు వారి మధ్య లోతైన ప్రేమ ఉంది (వ. 7-8). 6వ వచనంలోని “క్రీస్తు యేసు దినమున” అనే పదబంధం ప్రభువు దినాన్ని సూచించదు, కానీ “ఆఖరి రక్షణ, బహుమానం మరియు విశ్వాసుల మహిమను చూస్తుంది.”7.
ఫిలిప్పీయులు 1: 9-11: “క్రీస్తు యేసు ప్రేమ”తో తాను వారిని చాలా కోల్పోయానని పౌలు అంగీకరించాడు. ఈ పదబంధం బలమైన గ్రీకు పదం “కరుణపూరితమైన ప్రేమను వ్యక్తపరచడం ఒకరి మొత్తం జీవితముతో కూడిన ప్రేమపై” ఆధారపడింది మరియు “తీవ్రమైన భావోద్వేగాలకు ప్రతిస్పందించే శరీరంలోని అంతర్గత అవయవాలను సూచిస్తుంది.”8 వారి ప్రేమ జ్ఞానం మరియు వివేచనలో పెరగాలని తాను వారి కోసం ప్రార్థిస్తున్నానని పౌలు వారికి చెప్పాడు (వ. 9). వారు శ్రేష్ఠమైన మరియు స్వచ్ఛమైన మరియు నిందారహితమైన వాటిని వివేచించగలరని ఆయన కోరుకున్నాడు (వ. 10). పౌలు కోరుకున్న ఫలితం ఏమిటంటే, ఫిలిప్పీయులు దేవుని నీతితో నిండిపోయి ఆయనకు మహిమ మరియు స్తుతి తీసుకురావాలి (వ. 11).
ఫిలిప్పీయులు 1:12-26: 12-26 వచనాలలో, పౌలు తన పరిస్థితులను ఫిలిప్పీయులతో పంచుకున్నాడు. మొదట, అతను చెరసాలలో ఉండటం “సువార్త పురోగతికి దారితీసింది” మరియు క్రీస్తు కొరకు తాను చెరసాలలో ఉన్నానని సామ్రాజ్య కపలదారులు మరియు రోమా ప్రజలకు చూపించిందని అతను వివరించాడు (వ. 12-13). రెండవది, తన ఖైదును చూసిన తర్వాత ఇతర విశ్వాసులు సువార్త సందేశాన్ని చెప్పడంలో మరింత నిర్భయమైనట్లు ఆయన పంచుకున్నారు (వ. 14). మూడవది, అయితే, పౌలు శత్రువులు అతనికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు, ఎందుకంటే వారు “అతని అపోస్తులత్వం శక్తి మరియు అధికారం, అతని విజయం మరియు అపారమైన బహుమానం"9 (వ. 15-17). నాల్గవది, క్రీస్తు ఇంకా ప్రకటించబడినంత కాలం ప్రజలు ఎందుకు బోధించారు లేదా వారి ఉద్దేశాలు ఏమిటో పట్టింపు లేదని పౌలు పేర్కొన్నాడు! మిగిలిన అధ్యాయంలో, పౌలు తాను అనుభవించిన అన్ని కష్టాల గురించి మరియు తన జీవితంలో ఏమి జరిగినా, తన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ తీసుకురావాలనే కోరికను వివరించాడు.
ముగింపు
పౌలు తనకు, జీవించడమంటే తన జీవితమంతా క్రీస్తు పిలుపుకు అర్పించడమని, మరణించడం అంటే తన ప్రభువు సన్నిధిలో ఉండడం అని నొక్కి చెప్పాడు.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే, థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజి. 1708.
మాక్ఆర్థర్, pp.1708-1709.
మాక్ఆర్థర్, pp.1709-1710.
మాక్ఆర్థర్, పే.1710
మాక్ఆర్థర్, పే. 1711.
మాక్ఆర్థర్, పే. 1711.
మాక్ఆర్థర్, పే. 1711-1712.
మాక్ఆర్థర్, పే. 1712.
మాక్ఆర్థర్, పే. 1713..
ప్రశ్నలు
-
దేవుడు పరిశుద్ధులలో ప్రారంభించిన పనిని పూర్తి చేస్తాడని పౌలు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు మనలో చేస్తున్న పనిని మరియు ఆయన సన్నద్ధత ద్వారా మనం చేస్తున్న పనిని వివరించండి. (ఎఫెసీయులు 2:10; ఫిలిప్పీయులు 1:6; 2:13; 2 తిమోతి 2:15; హెబ్రీ 13:20-21)
దినవాక్యం
Laura Martin Philippians 1:3–5
“I give thanks to my God for every remembrance of you, always praying with joy for all of you in my every prayer, because of your partnership in the gospel from the first day until now.”
ఫిలిప్పీ సంఘము అతని పరిచర్య సమయంలో పౌలు ప్రోత్సహించింది మరియు మద్దతు ఇచ్చింది. పౌలు వారికి వ్రాసినట్లుగా, సువార్తలో వారి భాగస్వామ్యాన్ని బట్టి అతను సంతోషంతో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు మరియు వారి కోసం ప్రభువుకు కృతజ్ఞతలు తెలిపాడు.
నేడు, ప్రభువుతో మీనడక గురించి ఆలోచించండి. ప్రభువులో మీ ఎదుగుదలను ప్రోత్సహించిన మరియు మద్దతు ఇచ్చిన వ్యక్తులను మీ జీవితంలో జ్ఞాపకము చేసుకోనుడి. సువార్తలో మీతో భాగస్వాములు కావడానికి మీరు పూర్తి సమయం మిషనరీగా ఉండవలసిన అవసరం లేదు. బహుశా ఒక యవ్వన సంఘ కాపరి, పాఠశాలలో ఉపాధ్యాయుడు, పని నుండి వచ్చిన స్నేహితుడు లేదా పెద్ద తోబుట్టువు ప్రభువుతో మీ నడకను ప్రోత్సహించారు. మీ జీవితంలో వారి భాగస్వామ్యానికి ప్రభువుకు ధన్యవాదాలు చెప్పడానికి ఈరోజు సమయాన్ని వెచ్చించండి. తదుపరి వారి కొరకు ప్రార్థించండి. వారి ప్రేమ జ్ఞానం మరియు వివేచనలో పెరగాలని ప్రార్థించండి, తద్వారా వారు ఉన్నతమైన, స్వచ్ఛమైన మరియు నిందారహితమైన వాటిని ఆమోదించడం కొనసాగించగలరు. యేసుక్రీస్తు ద్వారా వచ్చే నీతి ఫలాలతో వారు నిండి ఉండాలని ప్రార్థించండి. ఆ తర్వాత, మీరు వారిని గుర్తుంచుకున్న ప్రతిసారీ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మీ జీవితంపై వారు చూపిన ప్రభావాన్ని వారికి తెలియజేయడానికి వారికి గమనిక రాయడానికి లేదా శీఘ్ర వచనాన్ని పంపడానికి సమయాన్ని వెచ్చించండి.
“ముదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు,”
- ఫిలిప్పీయులకు 1:3-5
తదుపరి లేఖనభాగము
ఫిలిప్పీయులకు 1:9-11:- మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.
2తిమోతికి 1:1-2:- క్రీస్తు యేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయు నది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధాన మును కలుగును గాక.
తీతుకు 2:3-4:- ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునైయుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు,
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.