Be Serious! Be Alert!
యేసును ఇలా కనుగొనండి: Builder Nehemiah 3-4 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
నెహెమ్యా కోసం మన పదము నిర్మాణకుడు. నెహెమ్యా దేవునికి విధేయత చూపించాడు మరియు తన పట్టణమైన యెరూషలేము మరియు అక్కడ నివసించే ప్రజల పరిస్థితుల గురించి శ్రద్ధ వహించాడు. అతను యూదాకు వెళ్లి అక్కడ పట్టణ ప్రాకారములను బాగుచేసే పనిని నడిపించడానికి అనుమతి పొందాడు. నెహెమ్యా 2:20 1 మరియు 2 అధ్యాయాలలో మనం ఇప్పటివరకు చూసిన వాటిని క్లుప్తీకరించింది: “పరలోకమందున్న దేవుడే మనకు విజయాన్ని స్తాడు. మేము, ఆయన సేవకులముగా, నిర్మాణాన్ని ప్రారంభిస్తాము. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత, ప్రాకరముపై పనిని ప్రారంభించేందుకు నెహెమ్యా ప్రజలను నడిపించాడు (అధ్యాయం 3). వారు గుమ్మములతో పనిని ప్రారంభించారు: గొఱ్ఱెల గుమ్మము (వ. 1-2), మత్స్యపు గుమ్మము (వ. 3-5), పాత పట్టణ గుమ్మము (వ. 6-12), లోయద్వారము (వ. 13), పెంటద్వారము (వి. 14), ధారయొక్క గుమ్మము (వ. 15), నీటి గుమ్మము (వ. 26-27), గుఱ్ఱపు గుమ్మము (వ. 28), తూర్పు ద్వారము (వ. 29-30), తనిఖీ ద్వారము లేదా మిప్కాదు ద్వారము (వ. 31), మరియు తిరిగి గొఱ్ఱెల గుమ్మము (వ. 32).
పాఠము
నెహెమ్యా 4:1-6: దేవుని పిలుపులో నడవడం వలన వ్యతిరేకత వచ్చింది (హెబ్రీయులు 11:36). మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి “రౌద్రుడై” శక్తివంతమైన షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను యూదులను ఎగతాళిచేసెను. సన్బల్లటు యూదులను “దుర్బలులు” అని పిలిచాడు, తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా?ఒక దినమందే ముగింతురా?కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? (వ. 1-2). అప్పుడు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండివారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను (వ. 3). ప్రతిస్పందనగా, నెహెమ్యా ప్రార్థించి మరియు వారి నింద వారి తలల మీదికి వచ్చునట్లు చేయుమని దేవున్ని కోరెను (వ. 4–5). ప్రజలు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ గోడను కట్టుచుంటిరి (వ. 6).
నెహెమ్యా 4:7–14: నెహెమ్యా మొదటి ఏడు అధ్యాయాలలో శత్రువుల బెదిరింపులు మరియు అపహాస్యం కొనసాగింది. సన్బల్లటును టోబీయాయును గోడలు కట్టబడెను అని కోపముగా ఉన్న అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును తీసుకు వచ్చెను (వ. 7). వారు యెరూషలేమును ఎలా పద ద్రోయాలి అని కలిసి పన్నాగం పన్నారు (వ. 8). ప్రతిస్పందనగా, నెహెమ్యా ప్రజలను ప్రార్థనలో నడిపించాడు మరియు వారి భయముచేత రాత్రింబగళ్లు కావలి ఉంచాడు (వ. 9). గోడను పునర్నిర్మించకముందే చాలా శిథిలాలు మరియు చెత్తను తొలగించారు, పనివారు అప్పటికే తమ పనిలో విసుగు చెందారు మరియు అలసిపోయారు (వ. 10). మన విరోధులు యూదులను భయపెట్టడానికి ప్రయత్నించారు, వారు ఇప్పటికే ఓడిపోయే వరకు ఏమి జరిగిందో వారికి ఎప్పటికీ తెలియదని చెప్పారు (వ. 11). యూదులు తమపై అన్ని వైపుల నుండి దాడి చేస్తున్నారని భావించారు (వ. 12). కాబట్టి నెహెమ్యా గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలబెట్టాడు. (వ. 13). మీరు భయపడకుడి, “మహా ఘనుడును భయంకరుడునగు” యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని వారికి సవాలు చేసెను. (వ. 14).
నెహెమ్యా 4:15-23: వారి శత్రువులు, యూదులు ఒక పని క్రమమును రూపొందించారని కనుగొన్నారు, వారిలో సగము మంది పురుషులు పనిచేశారు, మిగిలిన సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించి కాపలాగా ఉన్నారు (వ. 16). పని చేయు వారు ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకుని ఉండగా, మరి కొంత మంది తమ ఖడ్గమును నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను (వ. 17–18). పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును. (వ. 19–20). ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితివిు; సగముమంది ఉద యము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి మరియు పట్టణ రక్షణలో భాగంగా పనివారందరు రాత్రిపూట యెరూషలేములోనే ఉన్నారు (వ. 21-22). నెహెమ్యా మరియు అతని పనివారు ఉదుకుకొనుటకు తప్ప విశ్రాంతి తీసుకోవడానికి తమ వస్త్రములను తీయలేదు కానీ వారి ఆయుధాలను తీసుకువెళ్లారు (వ. 23).
ముగింపు
యెరూషలేము ప్రజలు గోడపై పని చేస్తున్నప్పుడు గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రాణాపాయం, భయం, హేళన, బెదిరింపుల ద్వారా వారు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. వారు ప్రార్థన మరియు పట్టుదల ద్వారా-కాపలాదారుగా పనిచేయడం ద్వారా దాని నుండి బయటపడ్డారు.
డేవ్ బట్స్ https://www.harvestprayer.com/resources/personal-2/task-of-watchman కాపల దారుని/వాచ్మాన్ పనిని వివరించాడు మరియు ఈ క్రింది సారాంశం:
1. కావలి వారు “ప్రాకారములమీద........... రేయైన పగలైన.... వారు మౌనముగా ఉండరు”. (యెషయా 62:6-7).
2. కావలి వారు తమ పనిలో కళ్లు తెరిచి మెళకువగా ఉండాలి. అందులో ఆధ్యాత్మిక కన్నులు తెరవబడి ఉండాలి, ఇది దేవుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకునేందుకు మెలకువగా ఉండి ప్రార్ధన చేయాలి (మత్తయి 26:40-41).
3. కావలివాడు శత్రువు యొక్క చర్యల గురించి తెలుసుకోవాలి (2 కొరింథీయులు 2:11).
4. దేవుని ప్రజల అవసరాలను గుర్తించేందుకు కావలివాడు పని చేయాలి.
మీ పట్ల మరియు మీ బోధ పట్ల జాగ్రత్తగా ఉండండి (అపొస్తలుల కార్యములు 20:28; 1 తిమో 4:16). “నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:8).
ప్రశ్నలు
-
నెహెమ్యా 3లో, ప్రాకారములోని ప్రతి భాగాన్ని నిర్దిష్ట వ్యక్తులు అనుకోకుండా నిర్మించారని మీరు అనుకుంటున్నారా లేదా దాని వెనుక ఒక ఉద్దేశ్యం ఉందని మీరు అనుకుంటున్నారా?
దినవాక్యం
Laura Martin Nehemiah 4:14
“After I made an inspection, I stood up and said to the nobles, the officials, and the rest of the people, ‘Don’t be afraid of them. Remember the great and awe-inspiring Lord, and fight for your countrymen, your sons and daughters, your wives and homes.’”
నెహెమ్యా మరియు ప్రజలందరూ యెహోవాను వెంబడించి, నగర ప్రాకారాన్ని పునర్నిర్మించడానికి కలిసి పనిచేశారు. అయితే ఆ తర్వాత శత్రువుల నుంచి వ్యతిరేకత వచ్చింది. శత్రువులు కలిసి యెరూషలేముపై పోరాడటానికి పన్నాగం పన్నారు మరియు ప్రజలను గందరగోళం మరియు నిరుత్సాహపరిచారు. ఈ సమయంలో, నెహెమ్యా దేవునికి ప్రార్థనలో ప్రజలను నడిపించాడు. వారు శత్రువులకు భయపడలేదు. ప్రాకారమును పునర్నిర్మించడానికి దేవుడు తమను పిలిచాడని వారు గుర్తు చేసుకున్నారు, మరియు నెహెమ్యా వారిని ఇలా ప్రోత్సహించాడు: “భయపడకు!” పగలు మరియు రేయి కాపలాగా ఉండాలనే ప్రణాళిక కోసం ప్రభువు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు మరియు ఆయన వారి పక్షమున పోరాడతాడని వారు విశ్వసించారు.
మీరు యేసుతో విధేయత కలిగి నడుచుకున్నప్పుడు, శత్రువు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి మరియు గందరగోళానికి గురిచేయడానికి ప్రణాళికలు రచిస్తూ మీ దారికి వస్తారు. మీరు ఇలా అనుకోవచ్చు: ఇది చాలా కష్టం––నేను నిజంగా ప్రభువును అనుసరిస్తున్నానా? మీ పిలుపులో స్థిరముగా ఉండండి. మీ చేతుల పనిని ప్రభువు గుర్తించాడు అని జ్ఞాపకము చేసికోనుడి. ఆయనలో దృడముగా నిలబడండి మరియు అప్రమత్తంగా ఉండండి. ప్రభువు నీ కొరకు పోరాడి నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు శత్రువులు చుట్టుముట్టినట్లు అనిపించినప్పుడు ప్రభువు మిమ్మల్ని యుద్ధంలో రక్షిస్తాడు. లోకంలో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. మీరు దీన్ని చేయవచ్చు! మీరు నాశనం చేయబడరు.
“అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోనువారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని”.
— నెహెమ్యా 4:14
తదుపరి లేఖన భాగము
- అపోస్తులుల 20:28 — “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.”
- 2 కొరింథీ 2:11 — “నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.”
- 1 పేతురు 5:8-9 — “నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్‌లోడ్‌లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్‌లోడ్‌లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.