God Will Grant Us Success
యేసును ఇలా కనుగొనండి: Builder Nehemiah 1-2 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
నెహెమ్యా పుస్తకానికి మన పదం నిర్మాణకుడు. నా సెమినరీ కోర్సులలో, మందిరమును మరియు పట్టణము తిరిగి నిర్మించడానికి ప్రజలు తిరిగి వచ్చినప్పుడు నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం ఎలా పని చేస్తుందో నెహెమ్యా పుస్తకం ఒక చిత్రం అని డాక్టర్ హోవార్డ్ హెండ్రిక్స్ పంచుకున్నారు. నెహెమ్యా అనే పేరుకు “యెహోవా ఆదరించును” అని అర్థం మరియు పరిశుద్ధగ్రంధములో కాని ఈ పుస్తకం వెలుపల గాని మరెక్కడా కనిపించదు. యూదుల సంప్రదాయం ప్రకారం ఎజ్రాను ప్రవక్తగాను మరియు నెహెమ్యా అలాగే ఎజ్రా గ్రంధ రచయితగా అంగీకరిస్తుంది. బహుశా, ఎజ్రా మరియు నెహెమ్యా ఒక గ్రంధముగా వ్రాయబడి తరువాత నెహెమ్యా మరియు ఎజ్రా పేరుతో వేరువేరుగా విభజించబడ్డాయి.1
ఇశ్రాయేలీయులు తన నిబంధనను మీరినందుకు 70 సంవత్సరాల బానిసత్వములో పారశీకులకును మరియు బబులోనుకును దాసులుగా ఉందురు అని దేవుడు తీర్పు నిచ్చెను (యిర్మీయా 25:11).2
- 722 BC – అష్షూరీయులు ఇశ్రాయేలీయుల (ఉత్తర రాజ్యం) యొక్క పది గోత్రముల ప్రజలను చెదరగొట్టారు మరియు తెలిసిన లోకమంతట వారిని విస్తరింపచేసేను (2 రాజులు 17).
- 605–586 BC – బబులోను వారు యెరూషలేమును ధ్వంసం చేశారు మరియు మిగిలిన గోత్రములలోని అత్యంత పేదలను మినహాయించి అందరినీ చెదరగొట్టారు (2 రాజులు 25).
ఈ 70 సంవత్సరాల బానిసత్వములో లోకము యొక్క నాయకత్వం మారిపోయింది మరియు బబులోను సామ్రాజ్యం పారశీకుల వశమైంది. ఎజ్రా గ్రంధములో, పారశీక రాజైన కోరెషు మందిరమును పునర్నిర్మించడానికి యెరూషలేముకు తిరిగి రావడానికి మొదటి గుంపును అనుమతించాడు (ఎజ్రా 1:1-2). నెహెమ్యాలో, యెరూషలేము చుట్టూ ఉన్న నగర ప్రాకరమును పునర్నిర్మించడానికి ఎక్కువ మంది ప్రవాసులు తిరిగి వచ్చారు.
నెహెమ్యా అర్తహషస్త రాజుకు పానదాయకుడిగా పనిచేశాడు. జెరుబ్బాబెలు మరియు యేషువా తిరిగి వచ్చిన ప్రవాసుల మొదటి బృందములో భాగం (ఎజ్రా 1-6) మరియు ప్రవాసుల రెండవ బృందముతో యెరూషలేములోని మందిరమును పునర్నిర్మించే పనికి నాయకత్వం వహించారు (ఎజ్రా 7-11). ఎజ్రా రెండవ బృందముతో తిరిగి వచ్చాడు. నెహెమ్యా గ్రంధము యెరూషలేము నగర ప్రాకరమును పునర్నిర్మించడానికి ప్రవాసులు తిరిగి వచ్చిన మూడవ తరంగాన్ని నమోదు చేసింది. మాక్ఆర్థర్ నెహెమ్యా గ్రంధములో ఇలా పేర్కొన్నాడు, “దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యాన్ని చదవడంపై శ్రద్ధ వహించడం అనేది స్థిరమైన ఉద్దేశ్యం.”3 యెరూషలేము నగర ప్రాకరమును పునర్నిర్మించేటప్పుడు ఏమి చేయాలో వారికి ఎలా తెలుసు? వారు దేవుని వాక్యాన్ని సంప్రదించారు. గ్రంధంలోని మరొక స్థిరమైన ఉద్దేశ్యం ఏమిటంటే, పనిని పూర్తి చేయడంలో నెహెమ్యా యొక్క విధేయత మరియు వినయముతో ఉంటూ వ్యతిరేకతను ఎదుర్కోవడం.4 పునర్నిర్మాణం పూర్తి చేయడానికి కేవలం 52 రోజులు పట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఈ మొత్తం గ్రంధంపై దేవుని హస్తం నిరంతరం ఉంటుంది. పుస్తకం యొక్క కాలక్రమం5:
445 BC (నెహెమ్యా 1—12) – కేవలం ఒక సంవత్సరం మాత్రమే వర్తిస్తుంది మరియు నెహెమ్యా గవర్నర్‌గా మొదటి పదవీకాలం గురించి చెబుతుంది (445–433 BC నుండి పనిచేశారు).
425 BC (నెహెమ్యా 13) – నమోదు చేయబడని 20 సంవత్సరాల తర్వాత, 13వ అధ్యాయం నెహెమ్యా కథను ముగించింది మరియు 425 లేదా 424 BC నుండి బహుశా 410 BC వరకు గవర్నర్‌గా రెండవసారి కొనసాగించబడ్డాడు.
నెహెమ్యా 1లో, షుషాను నగరంలో ఉన్నప్పుడు, యూదా నుండి వచ్చిన కొంతమంది మనుష్యులను నెహెమ్యా ఎదుర్కొన్నాడు మరియు అతను యెరూషలేములో మిగిలిపోయిన శేషం గురించి అడిగాడు. నగర ప్రాకారములు పడద్రోయబడినది మరియు శేషించిన వారు సురక్షితంగా లేరని అతను కనుగొన్నాడు. నెహెమ్యా పరిస్థితులను గూర్చి యేడ్చి మరియు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసేను. ఏదో మారాలని నెహెమ్యాకు తెలుసు మరియు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్ధించాడు. మీ పట్టణం మరియు మీ దేశం గురించి మీరు చివరిసారిగా ఎప్పుడు యేడ్చారు మరియు దుఃఖించారు? నెహెమ్యా 1:5-11 నెహెమ్యా తన ప్రజల కొరకు, అతని నగరం కొరకు మరియు అతని దేశం పట్ల ఉన్న ప్రేమను చూపుతుంది.
పాఠము
నెహెమ్యా 2:1–10: క్రీ.పూ. 445 వసంతకాలంలో/నీసాను కాలములో, నెహెమ్యా, రాజు యొక్క పానదాయకుడు, రాజు అర్తహషస్తకు ద్రాక్షారసాన్ని అందించాడు, మరియు రాజు నెహెమ్యా విచారంగా ఉండడం గమనించి అతనిని నీ ముఖము విచారముగా ఉన్నదేమి? అని అడిగాడు (వ 1-2). నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని (వ. 3). నెహెమ్యా ఏమి చేయాలనుకుంటున్నాడో రాజు అడిగినప్పుడు, నెహెమ్యా ప్రార్థన చేసి, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. (వ. 4-5).
నెహెమ్యా నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని రాజు అడిగెను మరియు నెహెమ్యా అతనికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఇచ్చాడు (వ. 6). ఎస్తేరు రాణి ఆహాష్వేరోషు రాజు భార్య మరియు అర్తహషస్తకు రాజుకు సవతి తల్లి, మరియు బహిష్కృతులు ఇశ్రాయేలుకు తిరిగి రావడానికి అనుమతించేలా ఆమె తన సవతి కొడుకును ప్రభావితం చేసి ఉండవచ్చు.6 నెహెమ్యా సురక్షితముగా తనని దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను, ఇవ్వాలని రాజును కోరాడు (వ. 7). అప్పుడు నెహెమ్యా రాజు యొక్క దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని. నెహెమ్యా పునర్నిర్మాణ పనికి మద్దతు కోసం రాజును అడిగాడు మరియు ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది నెహెమ్యా కోరిన ప్రతిదాన్ని రాజు నా మనవి అంగీకరించెను (వ. 8). నెహెమ్యా యొక్క అభ్యర్థన మేరకు, రాజు అతనితో యెరూషలేము వరకు సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను (వ. 9). నెహెమ్యా యెరూషలేముకు వచ్చినప్పుడు, హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని “బహుగా దుఃఖపడిరి” (వ. 10). నెహెమ్యా పనికి వ్యతిరేకత వెంటనే వచ్చింది.
నెహెమ్యా 2:11-20: నెహెమ్యా మూడు రోజులు వేచిన తరువాత కొద్దిమంది మనుషులను తీసుకొని రాత్రిపూట నగర ప్రాకరములను పరిశీలించాడు (వ 11-15). యెరూషలేములోని ఎవరికైనా తాను ఎందుకు అక్కడ ఉన్నానో తెలియజేయడానికి ముందు అతను తన సమాజాన్ని అంచనా వేయడానికి సమయం తీసుకున్నాడు (వ 16). అతను తన అంచనాను పూర్తి చేసినప్పుడు, నెహెమ్యా యెరూషలేములోని ప్రజలకు పరిస్థితిని వివరించాడు మరియు పట్టణ ప్రాకరమును పునర్నిర్మించడంలో తనకు సహాయం చేయమని వారిని బలపరిచెను (వ. 17). నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము తనని వారి యొద్దకు ఎలా చేర్చిందో వారికి తెలియ చేసాడు. ప్రజలు అతని సవాలును స్వీకరించారు మరియు ప్రోత్సహించబడ్డారు (వ. 18). ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. (వ. 19). నెహెమ్యా ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము (వ. 20).
ముగింపు
పానదాయకుడిగా, నెహెమ్యా రాజు యొక్క సేవకుడు మాత్రమే, కానీ అతనికి రాజు వద్దకు ప్రవేశించే ఆస్కారము ఉంది. సమాజంలో మనం ఎలా పని చేస్తున్నామో మనందరికీ ఒక పాత్ర ఉంటుంది. మనమందరం ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా దేవుని యొద్దకు వెళ్ళే అస్కారాన్ని కలిగి ఉంటాము మరియు ఆయన బలం ద్వారా, ఆయన మనకు ఇచ్చిన ఏ పాత్రలోనైన మనం కూడా విజయం సాధించగలము.
వ్యతిరేకతపై ఎలా స్పందిస్తారు? మన నగరాన్ని పునర్నిర్మించమని భావించే మనలో ప్రతి ఒక్కరికి సమాధానం నెహెమ్యా 2:20లో ఉంది: “పరలోకపు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనము, ఆయన సేవకులుగా, నిర్మాణాన్ని ప్రారంభిస్తాము
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 518, 533.
మాక్ఆర్థర్, p.533.
మాక్ఆర్థర్, p.534.
మాక్ఆర్థర్, p.535.
మాక్ఆర్థర్, p.535,536.
మాక్ఆర్థర్, p.536.
ప్రశ్నలు
-
ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా ప్రభువును కోరిన ఇతర వ్యక్తుల గురించి మీరు పరిశుద్ద గ్రంధములో ఆలోచించగలరా? (మత్తయి 4:2; లూకా 2:36-37; అపొస్తలుల కార్యములు 13:1-3)
దినవాక్యం
Laura Martin Nehemiah 1:4
“When I heard these words, I sat down and wept. I mourned for a number of days, fasting and praying before the God of heaven.”
నెహెమ్యా యెరూషలేము నాశనము కావడాన్ని బట్టి యేడ్చి దుఃఖించాడు. ప్రాకారములు పడద్రోయబడినవి మరియు గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడినవి. నెహెమ్యా కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసిన తరువాత, ప్రభువు అతన్ని రాజు ఎదుటకు నడిపించాడు. రాజు నెహెమ్యాను ఇలా అడిగాడు: “నీ మనవి ఏమిటి?” మొదట నెహెమ్యా ప్రార్థించాడు. నెహెమ్యా భయపడినప్పటికీ, పట్టణాన్ని పునర్నిర్మించడానికి యూదాకు పంపమని ధైర్యంగా మనవి చేసెను. తన పానదాయుడైన నెహెమ్యాను యెరూషలేముకు పంపడం రాజుకు నచ్చినట్లుగా అసాధ్యమైనదిగా అనిపించేది జరిగింది!!
మీ జాతి స్థితి కోసం మీరు ఏడుస్తారా? లేదా విధ్వంసం ఇంటికి దగ్గరగా వచ్చి ఉండవచ్చు మరియు మీరు మీ వివాహం లేదా మీ కుటుంబంలోని సంబంధాల కోసం దుఃఖించవచ్చు. మీరు దుఃఖిస్తున్నప్పుడు, ప్రభువును వెదకండి మరియు నెహెమ్యా ఉదాహరణను అనుసరించండి. అతను శక్తి లేని స్థితిలో ఉన్న అమాయకుడు మాత్రమే, మరియు అతను భయపడేవాడు. అయినప్పటికీ, అతను తనను తాను తగ్గించుకొని, ప్రార్థించాడు మరియు ప్రభువును వెదకాడు. ప్రభువు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేశాడు. మీ చుట్టూ ఉన్న విధ్వంసం గురించి మీరు ప్రభువును వెతుకుతున్నప్పుడు, ఆయన సమాధానంతో కనిపిస్తాడని ఆశించండి. మీ ప్రార్థనలు వింటానని వాగ్దానం చేశాడు. ఆపై, అతను తలుపులు తెరిచినప్పుడు, నమ్మకంగా విధేయతతో ముందుకు సాగండి. ప్రభువు నిన్ను బలపరుస్తాడు.
“ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.”
- నెహెమ్యా 1:4
తదుపరి లేఖన భాగము
కీర్తనలు 5:3 — “యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.”
నెహెమ్యా 2: 8b — “నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.”
1 యోహాను 5:14 — మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.