Baptism by the Holy Spirit and Fire
యేసును ఇలా కనుగొనండి: King Matthew 3 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
మొదటి రెండు అధ్యాయాలలో, మత్తయి యేసు వంశావళిని మరియు యూదుల రాజును వెతుక్కుంటూ వచ్చిన జ్ఞానులను గూర్చి నమోదు చేశాడు. ఈ అధ్యాయంలో, బాప్తిస్మమిచ్చు యోహాను తాను యూదుల రాజుకు మార్గమును సరాళము చేయడానికి వచ్చానని ప్రకటించాడు. రాజు రాబోతున్నట్లు ప్రకటించిన వ్యక్తిని కూడా ముందుగా పోవువాడు అని పిలుస్తారు. రాజు ఒక పట్టణాన్ని సందర్శించడానికి వస్తున్నాడని మరియు అతనిని స్వీకరించడానికి ఆ పట్టణం మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోవడానికి ముందుగా పోవువాడు రాజు ముందు వెళ్లాడని జాన్ వాల్వోర్డ్ చెప్పారు. కొన్నిసార్లు, రాజు రావడానికి రహదారిని సరాళము చేయడానికి,1 ముందున్న వ్యక్తిని చిన్నపాటి పని చేయమని అడుగుతారు. ఆయన రాకడకు సిద్ధము చేయుట.
పాఠము
మత్తయి 3:1: మృత సముద్రానికి (లేదా ఉప్పు సముద్రం) పశ్చిమ ప్రాంతములో యోహాను ఉన్నాడు. ఎవరూ లేని అరణ్య ప్రాంతంలో రాజు రాకడను ప్రకటించడానికి వచ్చిన వ్యక్తి ఎందుకు బోధిస్తున్నారని మీరు ఆశ్చర్యపోవలసి ఉంటుంది, అయితే దేవుడు దానిని ఈ విధంగా రూపొందించాడని ఇది చూపిస్తుంది (1 కొరింథీయులు 1:26). దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును అరణ్యంలో ఉంచాడు, తద్వారా అది అతని గురించి కాదు, దేవుని గురించి అని అందరూ తెలుసుకొనుటకు.
మత్తయి 3:2: 2వ వచనంలో, యోహాను తన సందేశాన్ని ఇచ్చాడు, " పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను!" మారుమనస్సు పొందడమంటే, మీ పాత పనుల విధానాన్ని సమూలంగా మార్చుకోవడం, మీరు పనులు ఎలా చేస్తున్నారనే దాని గురించి సమూలంగా మార్చుకోవడం, ఆ పాపానికి వెన్నుచూపి, పరలోక రాజ్యాని వైపుకు సమూలంగా పరుగెత్తడం. యూదులు “దేవుడు” అనే పేరు చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే వారు ఆయనను గౌరవించాలని మరియు ఘనపరచాలని కోరుకుంటారు. కాబట్టి మత్తయి “దేవుని రాజ్యం” అనే పదానికి బదులుగా “పరలోక రాజ్యం” అనే పదాన్ని ఉపయోగించాడు. మత్తయి యొక్క "పరలోక రాజ్యం" అతని ప్రజల హృదయాలలో నివసించే "యేసు రాజ్యాన్ని" సూచిస్తుందని మాక్ఆర్థర్ పేర్కొన్నాడు. . . మరియు అంతరంగ పశ్చాత్తాపం అవసరం, బాహ్య సమర్పణ మాత్రమే కాదు.”2 బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలు తమ హృదయాలను మార్చుకోవడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మత్తయి 3:4-6: యోహాను “నడుము చుట్టూ తోలు దట్టీతో ఒంటె వెంట్రుకలను ధరించాడు, అతని ఆహారం మిడతలు మరియు అడవి తేనె.” లేవీయకాండము 11:22లో, వీటిని తినడానికి అనుమతించబడింది: నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును. 2 రాజులు 1:8లో క్రీస్తు యొక్క మరొక పూర్వీకుడు ప్రవక్తయైన ఏలియా యొక్క వర్ణన ఉంది: "నడుము చుట్టూ తోలు దట్టీ కలిగి వెంట్రుకగల వ్యక్తి." ఏలియా మరియు యోహాను లిరువురూ ప్రజల ముందు ఒకే చిత్రాన్ని కలిగి ఉన్నారు. ప్రజలు బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు తరలి వచ్చారు (వ. 5) మరియు " తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి." (వ. 6).
బాప్తిస్మమిచ్చు యోహాను, ముందున్నవాడుగా, యేసు అటు తరువాత చేప్పేదానిని ప్రతిబింబించేలా ఉన్నాడు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసుకు మధ్యనున్న పోలికలను ఇస్తుంది: (1) వారిద్దరూ దేవునిచేత పంపబడిన దేవుని ప్రతినిథులు; (2) వారిద్దరూ ప్రకటించడానికి ఒకే సందేశాన్ని కలిగి ఉన్నారు; (3) వారిద్దరూ ఇశ్రాయేలుతో విభేదాలను అనుభవిస్తారు; (4) వారిద్దరూ ఇశ్రాయేలీయుల చేతికి పట్టబడి చనిపోతారు; (5) వారిద్దరూ హింసాత్మకంగా మరియు అవమానకరమైన రీతిలో మరణిస్తారు.3 ఈ పనులన్నీ ముందుగాపోవువానికి, తరువాత యేసుకు చేయబడతాయి.
బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మము మరియు యేసు బాప్తిస్మము ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉన్నాయి? ఇది రాబోయేదానికి సూచన; అది పూర్తి చిత్రం కాదు. పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులు శుద్దీకరణ ఆచారాలను కలిగి ఉన్నారు, బాప్తిస్మము మరియు పాత నిబంధన మధ్య సంబంధం ఉంది. ఒక యూదుడు ప్రభువు సన్నిధికి రావాలంటే, అతడు ముందుగా శుద్దీకరించబడి శుభ్రమైన బట్టలు ధరించాలి.
మత్తయి 3:7-12: పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు పశ్చాత్తాపపడేందుకు వస్తున్న ప్రజలతో కలిసిపోయారు (7 వ). యోహాను వారితో, “సర్ప సంతానమా! రాబోయే ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము (8 వ). ఇందులోని అతని భాష మరియు ఈ క్రింది వచనాలు యేసు మాటలను పోలి ఉన్నాయి (మత్తయి 12:34). ఈ మత నాయకుల జీవితాల్లో నిజమైన పశ్చాత్తాపం ఉంటే, వారు తమ జీవితాల్లో స్పష్టమైన ఫలాన్ని (మార్పు) చూడటం ప్రారంభించి ఉండాలని యోహాను చెప్పాడు (వ. 8). మొదటి థెస్సలొనీకయులకు 1:9 నిజమైన పశ్చాత్తాపం యొక్క చిత్రాన్ని ఇస్తుంది. పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు పశ్చాత్తాపపడి ఉంటే, వారు ఇకపై తమపై లేదా వారి మతపరమైన విధులపై దృష్టి పెట్టరు, కానీ ప్రభువుపైనే దృష్టి పెడతారు.
అబ్రాహాము వంశస్థులపై తాము ఆధారపడి ఉన్నామని ఆలోచించడం మానేయమని పరిసయ్యులకు మరియు సద్దూకయ్యులకు యోహాను చెప్పాడు (వ. 9). దేవుని ప్రణాళికలో ప్రత్యేక స్థానాన్ని పొందేందుకు వారు తమ మతపరమైన వంశంపై ఆధారపడలేరు, ఎందుకంటే దేవుడు వారి స్థానంలో పిల్లలను పుట్టించగలడు. 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడుతుందని బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు. ముందస్తుగా, బాప్తిస్మమిచ్చు యోహాను చేయవలసింది ఏమిటంటే, ఎగుడుదిగుడుగా ఉన్న రహదారిని సిద్ధం చేయడం, గుంతలను సరిచేయడం మరియు మతపరమైన వ్యర్థాలను తొలగించడం, తద్వారా అందరూ యేసు కొరకు సిద్ధంగా ఉంటారు.
యోహాను పరిసయ్యులకు మరియు సద్దూకయ్యులకు నా వెనుక వచ్చుచున్నవాని చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను (వ. 10) ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును అని చెప్పాడు. మూడు రకాల బాప్తిస్మము ఇక్కడ జాబితా చేయబడిందని మాక్ఆర్థర్ వివరించాడు: (1) బాప్తిస్మము "మారుమనసు కొరకు నీటితో"––బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మారుమనసు యొక్క బాప్తిస్మము; (2) "పరిశుద్ధాత్మతో” బాప్తిస్మము ––విశ్వాసులు పొందుకుంటారు; మరియు (3) "అగ్నితో" బాప్తిస్మము -తీర్పు మరియు శుద్ధీకరణ యొక్క కొలమానంగా4 (అపొస్తలుల కార్యములు1:5,8). బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు పూర్వీకుడిగా వచ్చినట్లే, మనం పరిశుద్ధాత్మ ద్వారా ముందున్నవారిగా ఉండేందుకు అధికారం పొందాము. యేసు మళ్లీ రావడం––ఆయన తిరిగి రావడం. మనం సిద్ధపడే మార్గమేదనగా పరిశుద్ధాత్మ ద్వారా మరియు అగ్ని ద్వారా బాప్తిస్మము పొందడం.
లేవీయకాండము 6:13 ఇలా చెబుతోంది: “బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. " దేవుని సన్నిధిలో అగ్ని ఆరిపోకూడదు. మీలో ఉన్న దేవుని అగ్ని ఎప్పుడూ ఆరిపోదు. మీ దైనందిన జీవితంలో పవిత్రాత్మను వ్యక్తపరచడానికి మీలోపల ఉన్న పొట్టును కాల్చివేయడమే అగ్ని బాప్తిస్మము (వ. 12). ఎందుకు? అందును బట్టి, మెస్సీయ తిరిగి రావడానికి మీరు ఆయనకు ముందుగ పోయేవారు. మనకు పొట్టును కాల్చడం అంటే అది ఎల్లప్పుడూ ఆయనకు మరియు ఇతరులకు సూచించబడుచున్నది. మనలో ఉన్న దేవుని అగ్ని మన జీవితాల్లోని పొట్టును కాల్చివేస్తోందని మనం ఎప్పటికీ అర్థం చేసుకోకపోతే, మన జీవితంలోని సమస్యలను మనం ఎప్పటికీ పరిష్కరించలేము మరియు మనం మళ్లీ మతపరంగా మారతాము. మనం పశ్చాత్తాపం చెందుతామని చెప్పుకునే వారిగా అవుతాము కాని ఎప్పటికీ ఫలించనిదిగానే ఉంటుంది.
మత్తయి 3:13-17: 13-14 వచనాలలో, యేసు బాప్తిస్మము తీసుకొనుట కొరకు బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు వచ్చాడు. యేసు చెప్పులు విప్పడానికి లేదా యేసుకు బాప్తిస్మం ఇవ్వడానికి కూడా తాను అర్హుడనని యోహాను అనుకోలేదు. యేసు ఇలా ప్రతిస్పందించాడు, " యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను." (వ. 15). యేసు అడిగినట్లు యోహాను చేశాడు. యేసు నిజానికి నీటిలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన దానిని తీసుకున్నాడు––ఆయన నిలువెల్లా తడిచిపొయాడు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం యేసు బాప్తిస్మములో మనం చూడవలసిన నాలుగు విషయాలు ఉన్నాయి: (1) ఇది మరణం మరియు పునరుత్థానాన్ని సూచిస్తుంది; (2) ఇది బాప్తిస్మములో యేసును అనుసరించే క్రైస్తవుల ప్రాముఖ్యతను ముంగుర్తుగా ఉన్నది; (3) యేసు ఎవరి పాపాలను భరించాలో దానికి గుర్తుగా ఇది యేసు యొక్క మొదటి బహిరంగము గుర్తింపుమరియు (4) ఇది నేరుగా పరలోకము నుండి వచ్చిన సాక్ష్యం ద్వారా బహిరంగంగా యేసు మెస్సీయత్వాన్ని ధృవీకరించింది.5
ముగింపు
పరలోకము నుండి దేవుడు మూడుసార్లు మాట్లాడాడని వైర్స్బే ఎత్తి చూపాడు: "క్రీస్తు బాప్తిస్మము సమయంలో, రూపాంతరం సమయములో (మత్తయి 17:3), మరియు యేసు సిలువను సమీపిస్తున్నప్పుడు (యోహాను 12:27-30).”6 వైర్స్బే గతంలో దానిని కొనసాగించాడు, దేవుడు తన కుమారునితో మాట్లాడాడు, కానీ నేడు, యేసు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు మరియు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.7 ఇది ఒక అద్భుతమైన చిత్రం. మీరు దేవునితో సంబంధము కలిగియుండాలనుకుంటే, అది ఇకపై మతపరమైన ఆచారాలకు సంబంధించినది కాదు. ఇది తండ్రి పక్కన కూర్చున్న కుమారుని ద్వారా రావడం మాత్రమే జరుగుతుంది. ఇదంతా విధేయతతో మొదలవుతుంది. ప్రభువు నిన్ను తన వైపుకు మరలమని అడుగుతున్నాడా? ఆయన అడుగుచున్నట్లయితే, దానిని చేయండి, ఎందుకంటే తండ్రి తన కుమారుని ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
. జాన్ వాల్వోర్డ్, మాథ్యూ: థై కింగ్డమ్ కమ్ (గ్రాండ్ రాపిడ్స్: క్రెగెల్, 1974), 29; థామస్ L. కానిస్టేబుల్లో కోట్ చేయబడింది, డాక్టర్ థామస్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పోజిటరీ నోట్స్: మాథ్యూ, 76, https://planobiblechapel.org/tcon/notes/pdf/matthew.pdf.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 2005), పేజి. 1124.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds. నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 1999), పేజి. 1142-1143.
మాక్ఆర్థర్, పే. 1125.
రాడ్మాచర్, మరియు ఇతరులు, పే. 1145.
వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: మాథ్యూ–గలటియన్స్ (నాష్విల్లే: థామస్ నెల్సన్, 1989), p. 17.
వైర్స్బే, పే. 17.
ప్రశ్నలు
-
భాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మము మరియు యేసు బాప్తిస్మము మధ్య తేడా ఏమిటి? (మత్తయి 3:2, 11)
దినవాక్యం
Laura Martin Matthew 3:11-12
“I baptize you with water for repentance, but the One who is coming after me is more powerful than I. I am not worthy to remove His sandals. He Himself will baptize you with the Holy Spirit and fire. His winnowing shovel is in His hand, and He will clear His threshing floor and gather His wheat into the barn. But the chaff He will burn up with fire that never goes out.”
క్రీస్తుకు ముందున్న బాప్తిస్మమిచ్చు యోహాను, మారుమనసు మరియు రాబోయే పరలోక రాజ్యంపై దృష్టి సారించిన సందేశాన్ని బోధించాడు. తన అనుచరులకు పరిశుద్ధాత్మ మరియు అగ్నితో బాప్తిస్మమిచ్చే యేసు గురించి ఆయన ముందే చెప్పాడు. మారుమనసు తరచుగా ప్రజల జీవితాల్లో బాహ్య మార్పుకు దారి తీస్తుంది, కానీ యేసు నిజమైన అంతరంగ మార్పును తెస్తాడు.
మీరు క్రీస్తు అనుచరులుగా మారినప్పుడు మరియు మారుమనసుపొందినప్పుడు, మీరు అగ్ని మరియు పరిశుద్ధాత్మ బహుమతిని పొందుతారు. నిప్పు పొట్టును కాల్చేస్తుంది. స్వార్థం, అహంకారం, ఇతర దేవుళ్లను మరియు విగ్రహాలను పూజించడం లేదా కోపం వంటి క్రీస్తును ప్రతిబింబించని మీ జీవితంలోని ప్రాంతాలను తీసివేస్తుంది. పరిశుద్ధాత్మ మీలో పని చేస్తుంది, మిమ్మల్ని మెరుగుపరుస్తుంది, తప్పనిసరిగా మీ జీవితంలోని ఈ ప్రాంతాలను నిరంతర అగ్నితో కాల్చివేస్తుంది, కాబట్టి మీరు క్రీస్తు యొక్క కాంతిని ఎక్కువగా ప్రతిబింబిస్తారు. తండ్రియైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసునందు ఎలా ఆనందిస్తాడో, అలాగే యేసు మీయందు కూడా ఆనందిస్తాడు మరియు ప్రేమిస్తాడు. మీరు ఆయనను వెదకినప్పుడు మరియు ఆయనతో సన్నిహితంగా నడిచినప్పుడు ఆయన మిమ్మును ప్రేమిస్తాడు. ఈ రోజు మీ జీవితంలో పరిశుద్ధాత్మను పని చేయనివ్వండి. ఆయన శక్తి మీ ద్వారా పని చేస్తుంది, కాబట్టి మీరు ఒక ప్రకాశవంతమైన, ప్రకాశించే కాంతి మరియు క్రీస్తు యొక్క రాకడకు ముందుండేవారిగా ఉండండి!
“మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో1 మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను,”
— మత్తయి 3:11-12
తదుపరి లేఖన భాగములు
- యెహెజ్కేలు 36:26 — “నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.”
- మత్తయి 3:17 — “మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.’”
- అపొస్తలుల కార్యములు 1:5 — “యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.