Hearing the Voice of the Holy Spirit
యేసును ఇలా కనుగొనండి: King Matthew 21 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
సంగ్రహంగా చెప్పాలంటే, ఇప్పటివరకు బైబిల్లోని ప్రతి పుస్తకానికి మనం ఏర్పాటు చేసిన పదాలు: ఆదికాండము=సంతానము; నిర్గమకాండము=విమోచకుడు; లేవియకాండము=ప్రాయశ్చిత్తము; సంఖ్యాకాండము=బండ; మరియు ద్వితియోపదేశకాండము=ప్రవక్త. ఆ ఐదు పదాలు పంచగ్రంథాలను పూర్తిచేస్తాయి. మత్తయి యొక్క ఒక పదం రాజు. మత్తయి సువార్తలోని 21వ అధ్యాయం కంటే మరే ఇతర అధ్యాయం యేసును రాజుగా నొక్కి చెప్పలేదు. ఈ అధ్యాయంలో, యేసు తన వైపు దృష్టిని తీసుకురావడానికి ఒక సంఘటనను ఏర్పాటు చేసుకున్న ఏకైక సమయం.
పాఠము
మత్తయి 21:1-5: యేసు మరియు ఆయన శిష్యులు యెరికో నుండి యెరూషలేముకు 17 మైళ్ల ప్రయాణం చేశారు. ఒలీవల కొండపై, గ్రామంలోకి వెళ్ళడానికి యేసు ఇద్దరు శిష్యులను పంపి అక్కడ కట్టబడియున్న గాడిదను మరియు గాడిద పిల్లను తన వద్దకు తీసుకురావాలని చెప్పాడు. గమనించండి, యేసు ఈ శిష్యులకు జంతువులను "ఒక్కసారే" చూస్తారని చెప్పాడు. యేసు పరిశుద్ధాత్మ స్వరాన్ని విశ్వసించడానికి తీవ్రమైన మార్గాలను ఇవ్వడం ప్రారంభించాడు. యోహాను 10:14-16 ఇలా చెబుతోంది:
“నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.”
పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువులో ఎదగడానికి ఇది శుద్ధీకరణ ప్రక్రియ యొక్క ప్రారంభం. శిష్యులు జంతువులను తీసుకెళ్లడానికి అనుమతించడానికి యేసు అప్పటికే వాటి యజమాని హృదయాన్ని సిద్ధం చేశాడు (వ. 3).
పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం విశ్వసించవచ్చు: “వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసి కొని పోవునప్పుడు మీరుఏలాగు ఏమి ఉత్తర మిచ్చెదమా, యేమి మాటలాడు దుమా అని చింతింప కుడి, మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.” (లూకా 12:11-12).
మరియు, మనం ఏమి చెప్పవలసిన దానికి మనకు నిర్దేశాలు ఇస్తాడని మనం దేవునిని నమ్మవచ్చు: “యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. ”(నిర్గమకాండము 4:11-12).
మత్తయి 21:4-5: యెషయా 62:11 మరియు జెకర్యా 9:9 రెండింటిలోనున్న ప్రవచనాల ద్వారా సిద్ధపాటు మరియు సూచనలు శిష్యులను బయటికి నడిపించాయి. మీరు పరిశుద్ధాత్మ నుండి విన్నప్పుడు, ఆయన మిమ్ములను ఏమి చేయమని పంపుతున్నాడో దాని కొరకు ఆయన ఇప్పటికే మిమ్ములను సిద్ధం చేశాడు. ఆయన స్వరాన్ని విశ్వసించండి మరియు దానిని బయటకు నడపండి. 5వ వచనం నేరుగా యేసును రాజుగా సూచిస్తుంది. గాడిదపై ప్రయాణించే రాజు వినయాన్ని సూచిస్తుంది. రాజు గుర్రంపై స్వారీ చేయడం అధికారాన్ని సూచిస్తుంది. యేసు రాజుగా (1 రాజులు 1:33; జెకర్యా 9:9b), తెల్ల గుర్రంపై తిరిగి రావడానికి ముందు వినయంతో రావాలి (ప్రకటన 19:11).
మత్తయి 21:6-8: శిష్యులు యేసు చెప్పినట్లే చేసారు. వారు పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నారు మరియు విశ్వాసంతో ప్రతిస్పందించారు. ఏమి చేయాలో తెలుసుకోవడానికి వారికి సమావేశం అవసరం లేదు. పరిశుద్ధాత్మ స్వరాన్ని అనుసరించడంలో స్వేచ్ఛ ఉంది. సూచనలను అనుసరించి రెండు జంతువులను తిరిగి తీసుకురావడం ద్వారా, వారు రాజు కొరకు మార్గాన్ని సిద్ధం చేయడంలో పాత్ర పోషించారు. పరిశుద్ధాత్మ మనలను ఎదైనా చేయమని కోరితే దాని ప్రాముఖ్యతను మనం తగ్గించకూడదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనలో ఎవరినైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు.
వారు తమ స్వంత వస్త్రాలను జంతువులపై ఉంచారు; ఆయన గాడిద మీద కూర్చోవడానికి వారు ప్రతిదీ ఇచ్చారు––అడవి, ఎవరూ కూర్చొని స్వారీచేయని జంతువు (కీర్తన 8:6-7; మార్కు 11:7; యోహాను 12:14). యేసు ప్రతిదానిపై నియంత్రణ కలిగి ఉన్నాడు, అది ఎప్పుడూ ఎక్కని అడవి జంతువు కూడా. యేసు స్వారీ చేయుటకు జనసమూహము తమ వ్యక్తిగత వస్త్రములను రోడ్డుపై వేయుట మొదలుపెట్టెను. ఇద్దరు తమ వస్త్రాలను విడిచిపెట్టినప్పుడు, గుంపులోని ప్రతిఒక్కరూ అలాగే చేసారు (వ. 8). ఎందుకంటే వారు ప్రభువు స్వరాన్ని విశ్వసించారు గనుక ఇదంతా ప్రారంభమైంది, వారు ప్రవచన్ము నుండి బయటపడ్డారు, వారు విధేయతతో వెళ్ళారు మరియు వారు ప్రతిదీ వదులుకున్నారు. . . ఎందుకంటే రాజు వస్తున్నాడని వారు నమ్మారు మానవులు యేసు ప్రజల పక్షమైన రాజకీయ రాజుగా ఉండాలని కోరుకుంది.
మత్తయి 21:9-10: జనసమూహం యేసుకు ముందు మరియు ఆయన తర్వాత వెళ్ళారు, కీర్తన 118: 25-26 నుండి యేసును స్తుతించారు. రహదారిపై ఖర్జూర కొమ్మలు పరచి వెయ్యేళ్ల యుగం రాబోతుందని, ప్రభువు దినమున ఆ రాజ్యం అమలు చేయబడుతుంది ఎదురు చూశారు. దావీదు రాజు వంశంలో యేసు ఒక భాగమని ప్రజలు చూశారు (మత్తయి 1:1).
హోసన్న అనే పదానికి అర్థం, “ఇప్పుడే మమ్మల్ని రక్షించండి!” ప్రజలు ఆయనను చూసి అరిచారు, వారు ఉన్న రాజకీయ పరిస్థితుల నుండి ఆయన వారిని కాపాడతాడని ఆశించారు. వారు ఆయనను మెస్సీయగా చూడలేదు. మత్తయి 10 నుండి మరియు మత్తయి 28 వరకు, శిష్యులు బయటకు వెళ్లి ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గొర్రెలను కనుగొనమని చెప్పబడ్డారు, కానీ వారు దారి పొడవునా తిరస్కరించబడ్డారు. అందుకే మత్తయి 28లో, మొత్తం పరిచర్య మార్చబడింది మరియు తప్పిపోయిన గొర్రెలకు అన్యులందరూ జోడించబడ్డారు. యేసు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు, ఆయన గొర్రెల ద్వారం గుండా వెళ్ళాడని చాలామంది నమ్ముతారు, ఇక్కడే గొర్రెలను బలి కోసం యెరూషలేములోనికి తీసుకువస్తారు. అది యేసు అంతిమ త్యాగం యొక్క అద్భుతమైన చిత్రాన్ని సృష్టిస్తుంది.
10వ వచనంలోని “కదిలింది” అనే పదాన్ని ఇలా అన్వయించవచ్చు: కదిలించడం, ఊపడం (ఏమి జరుగుతోంది?) లేదా తీవ్రంగా కలత చెందడం. మూడవ వివరణ బహుశా చాలా సరైనది, ఎందుకంటే యెరూషలేము ప్రజలు యేసు ఎవరని ప్రశ్నించారు, మరియు జనసమూహం, "ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయైన యేసు!" అని చెప్పారు. వారు ఆయనను ఎరుగునందున మరియు ఆయన ఎక్కడినుండి వచ్చెనో తెలియక వారు కలత చెందారు. ప్రజలు పరిశుద్ధాత్మ స్వరాన్ని విని ఆ సూచనలను పాటించి, వారు ఒక పట్టణంలోకి ప్రవేశించి, యేసు పేరును పిలిచినప్పుడు, పట్టణము కదిలిపోతుంది!
ముగింపు
రాజుకు మార్గాన్ని సిద్ధం చేయడం మన పని. ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి, ఆయన తదుపరి దశలను మనకు చూపించడానికి మనలోని ప్రతి ఒక్కరూ చేయవలసిన దానిని పరిశుద్ధాత్మ మనకు చూపించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం వినే సందేశానికి విధేయత చూపుదాం.
ప్రశ్నలు
-
ఎగతాళి చేయడానికి, కొరడాలతో కొట్టడానికి మరియు సిలువ వేయడానికి రోమన్లకు అప్పగించబడతారని యేసుకు తెలుసు (మత్తయి 20:19). అతను యెరూషలేములోకి అలాంటి విజయవంతమైన మరియు బహిరంగ ప్రవేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? (జెకర్యా 9:9; మత్తయి 21:2-5)
దినవాక్యం
Laura Martin Matthew 21:6-7
“The disciples went and did just as Jesus directed them. They brought the donkey and the colt; then they laid their robes on them and He sat on them.”
యేసు మరియు శిష్యులు యెరూషలేమును సమీపించి, ఒలీవల కొండపై ఉన్న బేత్ఫాగేకు వచ్చినప్పుడు, యేసు నేరుగా శిష్యులతో మాట్లాడి, వెళ్లి చేయవలసిన నిర్దిష్ట చర్యలను వారికి ఇచ్చాడు. శిష్యులు ఆయన స్వరాన్ని విశ్వసించారు. వేరొకరికి చెందిన గాడిదను మరియు పిల్లను తీసుకురావడానికి వారు యాదృచ్ఛికంగా సూచనలను అందుకుంటున్నప్పటికీ వారు విన్నారు. వారు అన్నింటినీ విడిచిపెట్టి, తమ వీపుపై ఉన్న వస్త్రాలను కూడా విడిచిపెట్టి, “పరలోకంలో సర్వోన్నతుడైన హోసన్నా!” అని యేసు నామాన్ని ప్రకటించారు. మరియు వారి విధేయత కారణంగా, రాజైన యేసు గాడిద పిల్లపై వెళ్లినప్పుడు నగరం కదిలింది.
ఈ విధేయత యేసుకు మార్గాన్ని సిద్ధం చేయడంలో శిష్యుల పాత్ర. రాజైన యేసుకు మార్గాన్ని సిద్ధం చేయడంలో మీ పాత్ర కూడా ఉంది. నేడు, యేసు తిరిగి వచ్చినప్పుడు మీ పాత్ర ఏమిటని ప్రభువును అడగండి. అతని స్వరాన్ని వినండి మరియు విధేయతతో వెళ్ళండి. రాబోవు రాజు మహిమ కొరకు శిష్యులు ప్రభావం చూపినట్లే, మీరు కూడా ప్రభువు స్వరాన్ని విశ్వసించి, విధేయత చూపుతూ బయటకు వెళ్లినప్పుడు మీరు కూడా అలాగే ఉంటారు.
“శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకా రము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.”
- మత్తయి 21:6-7
తదుపరి లేఖన భాగములు
మత్తయి 21:10 — “ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను.”
లూకా 9:23 – “మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.”
యోహాను 10:27 — “నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.