The Gospels Matthew

The Last Shall Be First

యేసును ఇలా కనుగొనండి: King Matthew 20 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 130వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

20వ అధ్యాయంలో, రాజైన యేసు పరిచర్య పట్ల ఉండవలసిన సరియైన వైఖరి గురించి తన శిష్యులకు బోధించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తును పోలి ఉండమని యేసు వారికి సూచించాడు.

పాఠము

మత్తయి 20:1: పనివాళ్ల అవసరం ఉన్న ఇంటి యజమాని గురించిన ఉపమానంతో ప్రారంభమైంది. మొదటి పదం "కోసం" ఈ ఉపమానాన్ని 19వ అధ్యాయం ముగింపును మరియు 27వ వచనంలో పేతురు ప్రశ్నకు అనుసంధానిస్తుంది. యేసు ఈ ఉపమానంతో మత్తయి 19:28-30 నుండి పేతురుకు తన ప్రతిస్పందనను కొనసాగించాడు. ఈ ఉపమానం "మొదటిది చివరిది మరియు చివరిది మొదటిది" (మత్తయి 19:30; 20:16) అనే ప్రకటనతో బ్రాకెట్ చేయబడింది.

మత్తయి 20:2-7: పంటను త్వరగా సేకరించాల్సిన అవసరం ఉంది, మరియు ఈ వచనాలు పంట చుట్టూ ఉన్న సాధారణ ఆవశ్యకతను తెలియజేస్తాయి. ఇంటి యజమాని మరింత మంది కార్మికులను కనుగొనడానికి సంతకు తిరిగి రావడం కొనసాగించాడు, వారికి "ఏదైతే సరైనదో"అదే చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. రోజు యొక్క పని ప్రారంభించే గంటల తర్వాత నియమించబడిన కార్మికులు పూర్తి రోజు వేతనాల కంటే చాలా తక్కువ వేతనం పొందుతామని అనుకున్నారు. యేసు కాలంలో, పని దినం దాదాపు ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఉండేది, మరియు గంటలు ఒకటి నుండి 12 వరకు లెక్కించబడ్డాయి.1 మూడవ, ఆరవ, తొమ్మిదవ మరియు పదకొండవ గంటలు అనగా ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం, 3 గంటలు మరియు సూర్యాస్తమయానికి ఒక గంట ముందు, లేదా వరుసగా సాయంత్రం 5గంటలు. ఇంటి యజమాని ప్రతి కూలీకి ఒక పూర్తి రోజు పనిచేసిన కూలీకి ఒక దేనారము చెల్లించడానికి అంగీకరించాడు. ఈ పూర్తి-రోజు పనివారు లేదా ఇతర కార్మికుల సమూహాలలో ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో (జీవితంలో ఎక్కువ భాగం క్రీస్తును గురించి తెలిసిన వారు లేదా అంత నమ్మకంగా లేని వారికి వ్యతిరేకముగా ప్రత్యేకంగా విశ్వాసముతో ఉన్నవారు) అటువంటి వారిని గుర్తించే మన ప్రయత్నాలలో మనం జాగ్రత్తగా ఉండటం ముఖ్యము.

మత్తయి 20:8-12: యూదుల చట్టం ప్రకారం కార్మికులకు వారు పనిచేసిన రోజునే చెల్లించాలి మరియు ఆ రోజు అవసరాలకు మాత్రమే వేతనాలు పుష్కలంగా ఉంటాయి (ద్వితీయోపదేశకాండము 24:14-15). పని దినం ముగిసినప్పుడు, ఇంటి యజమాని కార్మికులకు జీతాలు చెల్లించమని ఆదేశించాడు, జీతాల చెల్లింపు చివరిగా నియమించబడిన వారితో ప్రారంభించి మొదటి పనికి తీసుకున్న వారితో ముగుస్తుంది. చివరిగా నియమించబడిన వారికి పూర్తి రోజు వేతనం లభించింది – ఒక దేనారము. ఉదయం 6 గంటలకు పని ప్రారంభించిన కార్మికులు కూడా ఒక దేనారమును అందుకోగా, ఆలస్యముగా వచ్చిన వారితో సమానంగా తమకు చెల్లించారని వారు ఫిర్యాదు చేశారు.

నిజాయితీ పరిశీలన: మనం రోజంతా పనిచేసినా, చివరి గంట మాత్రమే పనిచేసిన వ్యక్తికి కూడా మనకు ఇచ్చే వేతమే వారికి అందితే మనలో ఎంతమందిమి సంతోషిస్తాం? తర్వాత వచ్చిన వారికి కూడా ఇంతే వేతనాలు చెల్లించడం సరికాదని కార్మికులు వాపోయారు." వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి.!" (వ. 12). వారి ఫిర్యాదు పోలిక మరియు అర్హత అనే రెండింటినీ చూపిస్తుంది మరియు ఇది మత్తయి 19:27 లో పేతురు యొక్క ప్రకటన వలె ఉంటుంది, ఇది బైబిల్ పరంగా “మన గురించి ఏమిటి? ఇది సరికాదు." అని అడిగినట్లు అర్థము.

మత్తయి 20:13-16: మైరాన్ ఆగ్స్‌బర్గర్ మాట్లాడుతూ, “స్నేహితుడు” అనే పదమును మత్తయిలో యేసు మూడుసార్లు ఉపయోగించిన వ్యక్తీకరణ, మరియు, సంబోధించిన ప్రతిసారీ ఆ వ్యక్తి సరియైనవాడు కాదు (మాథ్యూ 22:12; 26:50).2 నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా NASB వెర్షన్ 15వ వచనాన్ని అనువదిస్తుంది. "లేదా నేను ఉదారంగా ఉన్నందున మీ కన్ను అసూయపడుతుందా?" కార్మికుల దృక్పథమే సమస్యకు మూలం అని చూపించడానికి యేసు దానిని ఉపయోగించాడు. వారు ముందస్తుగా చెల్లించే భత్యముకు ఒప్పందం చేసుకున్నందున అది తప్పు. వైర్స్‌బే ఇలా అంటాడు, “మనం ఆశించిన ప్రతిఫలాన్ని పొందాలని కోరుకొని ఆయనకు సేవ చేయకూడదు మరియు మనకు ఏమి లభిస్తుందో తెలుసుకోవాలని పట్టుబట్టకూడదు.”3 మనం ప్రయోజనాల కోసం మాత్రమే (తాత్కాలిక మరియు శాశ్వతమైన) క్రీస్తుకు పరిచర్య చేస్తే మన పట్ల ఆయన కలిగి ఉన్న అత్యుత్తమ ఆశీర్వాదాలను మనం కోల్పోతాము. ఆగ్స్‌బర్గర్ ఒక ఉపమానంలోని అంశాలు ప్రాథమిక ఉద్దేశ్యాన్ని సమర్ధించాలి మరియు స్పష్టం చేయాలి మరియు అవి ఆ నిర్ణయానికి వెళ్లాలి అని చెప్పాడు: (1) అవసరానికి ప్రత్యక్ష సంబంధంగా సేవకు పిలుపు ఉంటుంది; (2) సేవకు ప్రతిఫలం అనేది మన అవసరాలను దయతో తీర్చడం; మరియు (3) అవసరాలను సమానంగా తీర్చడంలో సేవ యొక్క యథార్థత యథార్థమైన దయను గౌరవిస్తుంది.4

మత్తయి 20:17-19: యేసు తన శిష్యులకు తన మరణం మరియు పునరుత్థానాన్ని గూర్చి ముందే చెప్పాడు. “మనుష్యకుమారుడు” అనే బిరుదు మెస్సీయను బాధలతో ముడిపెడుతుంది. అతను " ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. " (వ. 19). గ్రీకు భాష యొక్క కాలములు మూడు క్రియలు కూడా అది ఊహించిన వాస్తవం అని చూపించాయి.

మత్తయి 20:20-28: వీయర్సబీ "జెబదయి కుమారుల తల్లి"ని సలోమిగా గుర్తించాడు.5 ఆ విన్నపము వెనుక సలోమియే తన కుమారులను ప్రోత్సహించింది. మార్కు 10:35-45లో, సహోదరులు అభ్యర్థించుకున్నారు. తన కుమారులను ఆయన రాజ్యంలో యేసు కుడి మరియు ఎడమ వైపున ఉంచాలని ఆమె కోరింది. సింహాసనాలపై కూర్చోవడం (మత్తయి 19:28) గురించి యేసు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మడానికి వారు ధైర్యం చేశారు (మత్తయి 19:28) కాబట్టి వారి క్రియ విశ్వాసానికి సంబంధించినది.6 యేసు సిలువ గురించి మాట్లాడుతున్నప్పుడు, వారు కిరీటం మరియు ప్రత్యేక సింహాసనాలపై ఆసక్తి కలిగి ఉన్నారు.

అభ్యర్థనలో తప్పుగా ఉన్న అనేక విషయాలను వీయర్సబీ నమోదు చేసాడు. మొదట, అది అజ్ఞానంలో పుట్టింది, ఎందుకంటే వారు ఏమి అడుగుతున్నారో వారికి అర్థం కాలేదు. హతసాక్షియైన మొదటి శిష్యుడు యాకోబు, మరియు యోహాను పత్మాసులో కష్టాలను భరించాడు. రెండవది, ఇది పరలోకపు దిశలో లేకపోవడం మరియు లోకానుసారమైన మరియు స్వార్థపూరిత ఆలోచనపై ఇది ఆధారపడింది, తమ కోసం కీర్తిని కోరుకున్నారు. మూడవది, అహంకారంతో ప్రేరేపించబడిన శరీరానికి సంబంధించిన విన్నపము, యేసును తన సింహాసనంపై కూర్చోబెట్టడానికి సాతాను చేసిన ప్రతిపాదనను గుర్తుచేస్తుంది (మత్తయి 4:8-11). యేసు వారి త్యాగాన్ని అంచనా వేయడం ద్వారా ప్రతిస్పందించాడు.7 ఇతర శిష్యుల యొక్క ప్రతిచర్యలు ఒకరినొకరు సేవించడం ద్వారా నడిపించబడుటను గురించి బోధించదగిన క్షణమును యేసుకు ఇచ్చాయి.

యేసు సిలువ వేయబడినప్పుడు సలోమి సిలువ వద్ద ఉంది మరియు ఆయన శ్రమను మరియు బాధను పంచుకుంది. ఆయన కుడి మరియు ఎడమ వైపున రెండు సింహాసనాలకు బదులుగా, ఆమె సిలువపై ఇద్దరు దొంగలను చూసింది. దేవుని రాజ్యం అంటే ఏమిటో మనం చూడటం ప్రారంభించడానికి మానవ హృదయంలోకి దైవిక హృదయం చొప్పించబడటం అవసరం.

మత్తయి 20:29-34: ఈ వచనాలు యేసు యెరూషలేములోకి ప్రవేశించే ముందు చివరిగా కనికరముతో కూడిన స్వస్థతను కలిగి ఉన్నాయి. తిరస్కరించబడిన, అంధులైన ఇద్దరు బిచ్చగాళ్లకు సేవకుడిగా మారినప్పుడు యేసు తన శిష్యులకు తన అంచనాలను ప్రదర్శించాడు. వారు స్వస్థత కోసం ఆయనను అడిగారు మరియు వారు తమ విన్నపములో నిర్దిష్టంగా ఉన్నారు (యాకోబు 5:13-16).

మన సంప్రదాయంలో, స్వస్థత విషయములో ఈ కింది వాటిలో ఒకటి సంభవించే వరకు మనము అభిషేకిస్తాము మరియు ప్రార్థిస్తాము: (1) వారు ఈ జీవితంలో స్వస్థత పొందుతారు; (2) యేసు తిరిగి వస్తాడు; లేదా (3) వారు పరలోకములో స్వస్థత పొందారు. జీసస్ షేప్డ్ లైఫ్‌లో, మైక్ బ్రీన్ మాట్లాడుతూ, స్వస్థత జరగకపోతే, కనీసం యేసు తిరిగి వచ్చేటప్పటికి, ఆయన మనకు ఏమి చేయమని చెప్పాడో అది మనం చేస్తున్నట్లు కనుగొంటాడు. ఇది యుద్ధ ప్రకటన!8 ఈ అద్భుతం యొక్క మెస్సియా ప్రాముఖ్యత యెషయా యొక్క ప్రవచనాన్ని నెరవేర్చబడటములో నున్నది (యెషయా 29:18-19; 35:5-6).

ముగింపు

స్వీకరించడములో మరియు ఆచరించడములోనున్న కష్టమైన విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయని వీయర్స బీ చెప్పాడు:

• మనం ఈ ప్రపంచంలోని వస్తువులను ప్రేమిస్తే, మనం దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించలేము.

• మనం ఆయన చిత్తానికి పూర్తిగా లొంగిపోకపోతే, మనం నిశ్చింతగా ఆయనకు లోబడలేము.

• మనం మన కొరకు మహిమను కోరుకుంటే, లేదా ఇతర విశ్వాసులతో మనల్ని మనం పోల్చుకుంటే, మనం ఆయనను మహిమపరచలేము.

మనం ఆయనను అత్యున్నతంగా ప్రేమించలేకపోతే మనం యేసును మన రాజుగా గుర్తించలేము, , ఆయనకు నిస్సంకోచంగా విధేయత చూపకపోతే ఆయనను పూర్తిగా మహిమపరచలేము. రాజుయొక్క సేవ పట్ల ఉండవలసిన సరైన వైఖరి గురించి తన అనుచరులకు అప్పుడు మరియు ఇప్పుడు సూచించాడు. మరియు యేసు ఇంకా పూర్తి చేయలేదు – రేపు పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వడానికి ఎంపిక చేయబడిన రోజునే అతను గాడిదపై రాజుగా యెరూషలేములోకి ప్రవేశిస్తాడు (మత్తయి 21).

  1. D. A. కార్సన్, ది ఎక్స్‌పోజిటర్స్ బైబిల్ కామెంటరీ: మాథ్యూ, v. 8; ed. ఫ్రాంక్ E. గేబెలీన్ (గ్రాండ్ రాపిడ్స్, MI: జోండర్వాన్ పబ్లిషింగ్, 1984), పేజి. 428.

  2. మైరాన్ ఆగ్స్‌బర్గర్, ది ప్రీచర్స్ కామెంటరీ: మాథ్యూ(నాష్‌విల్లే, థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1982), np.

  3. వారెన్ W. వైర్స్బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: మాథ్యూ-గలటియన్స్(కొలరాడో స్ప్రింగ్స్, CO: డేవిడ్ C. కుక్, 1989), p. 74.

  4. ఆగ్స్‌బర్గర్, np.

  5. వైర్స్బే, పేజి. 75.

  6. వైర్స్బే,పేజి. 74-75.

  7. ఆగ్స్‌బర్గర్, np.

  8. మైక్ బ్రీన్, బాబ్ రోగ్న్లీన్, ఏ జీసస్ షేప్డ్ లైఫ్: డిసిప్లిషిప్ అండ్ మిషన్ ఫర్ ఎవ్రీడే పీపుల్ (Gx బుక్స్, 2016)లో కోట్ చేయబడింది.

ప్రశ్నలు

  1. మత్తయి 20 1-16 వచనాలలో కార్మికుల ఉపమానంతో ప్రారంభమవుతుంది. మీరు దీన్ని చదివినప్పుడు, 12వ వచనంలో పనివారి మొదటి సెట్ చేసినట్లుగా మీకు కూడా అనిపిస్తుందా? ఎందుకు లేదా ఎందుకు కాదు? ఈ వచనాలలో యేసు ఏమి చెబుతున్నాడని మీరు అనుకుంటున్నారు?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Matthew 20:31

“There were two blind men sitting by the road. When they heard that Jesus was passing by, they cried out, ‘Lord, have mercy on us, Son of David!’ The crowd told them to keep quiet, but they cried out all the more, ‘Lord, have mercy on us, Son of David!’”

యేసు యెరికో నుండి బయలుదేరుతున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు తమను కనికరించి కళ్ళు తెరవమని కేకలు వేశారు. యేసు తర్వాతి పరిచర్య స్థలానికి వెళ్లే మార్గంలో ఉన్నప్పుడు కూడా, ఆగి, వారికి ఏమి కావాలో అడిగాడు. ఆయన వారిపట్ల కనికరం చూపించాడు మరియు వారు చూడగలిగేలా వారి కళ్లను తాకాడు.

అదే విధంగా, యేసు మీ పట్ల తనకున్న గొప్ప ప్రేమ కారణంగా ఆగిపోయి మీకు కనికరం చూపించాడు. మీ స్వంత జీవితంలో ఆయన ప్రేమ మరియు దయ ద్వారా మీ కళ్ళు తెరిచినట్లయితే, మీరు మీ మార్గంలో ఎవరికైనా అదే కరుణను చూపవచ్చు. నేడు, యేసు అంధుల పట్ల చూపిన కనికరాన్ని మరియు కనికరాన్ని ఎవరికైనా చూపించడానికి సమయాన్ని వెచ్చించండి.

“ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని వినిప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారుప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.”

  • మత్తయి 20:30-31

తదుపరి లేఖన భాగములు

2 కొరింథీయులకు 1:3 – “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్ర హించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.”

తీతుకు 3:5 – “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.”

1 పేతురు 2:10 – “ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.”