Understanding Jesus' Humanity
యేసును ఇలా కనుగొనండి: Son of Man Luke 2 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
మత్తయి యేసును రాజుగా చిత్రీకరించాడు. మార్కు యేసును సేవకునిగా చిత్రీకరించాడు. లూకా యేసును మనుష్య కుమారునిగా చిత్రీకరించాడు. యేసు ఎలా మనుష్యకుమారుడు? అయన మరియ కుమారుడు, కానీ అయన మానవత్వంతో కూడా ముడిపడి ఉన్నాడు. మానవాళిని విమోచించడానికి యేసు మానవుడు అయ్యాడు.
యేసు జననం యెషయా 7:14లోని మాటలను నెరవేర్చింది, " కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును." శిష్యుడైన యోహాను ఇలా చెప్పాడు, "ఆదియందు వాక్యముండెను" (యోహాను 1:1), ఆపై స్పష్టంగా వివరించాడు, "ఆ వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను" (వ. 14). మనలను బల్లవద్దకు ఆహ్వానించడానికే యేసు భూమిపైకి వచ్చాడు. మనలను గూర్చి యేసుకు బాగుగా ఎరిగియున్నాడు, మరియు ఆయన మన ముందు ప్రతిదీ ఉంచాలనుకుంటున్నాడు. మనం ఎక్కడున్నా యేసు మనతో సంబంధము కలిగియుంటాడు, మనం బల్లవద్దకు వస్తే. మరియ అనే యౌవన కన్యక మెస్సీయకు జన్మనిచ్చింది కాబట్టి ఇది సాధ్యమైంది.
పాఠము
లూకా 2:1-7: ఈ వచనాలు యేసు జననానికి సంబంధించిన కొన్ని వివరాలను అందించాయి. మరియకు ఒక కుమారుడు ఉన్నాడు మరియు అతనికి యేసు అని పేరు పెట్టబడింది (వ. 7).
లూకా 2:8-20: గొర్రెల కాపరులు సువార్త యొక్క మొదటి రాయబారులలో కొందరు. కాపరులు దేవదూతల సూచనలను అనుసరించి, మెస్సీయను చూడడానికి బెత్లెహేముకు వెళ్ళిన తర్వాత, లూకా ఇలా నివేదించాడు, "వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి." (వ. 17). వారి నివేదిక విన్నవారంతా ఆశ్చర్యపోయారు.
లూకా 2:21-24: ఎనిమిదవ రోజు, యేసు సున్నతి పొందాడు. ఆయన మనుష్యకుమారుడు, కాబట్టి ఆయన మానవ రూపంలో మనలాగే ఉన్నాడు. యేసు అనే పేరు దేవదూత ద్వారా ఇవ్వబడింది. ఇమ్మాన్యుయేలు అంటే "దేవుడు మనకు తోడు" మరియు యేసు అంటే "ప్రభువే రక్షణయైయున్నాడు." రక్షణను తీసుకురావడానికి యేసు చేసిన పనిని ఈ రెండు పేర్లూ సూచిస్తున్నాయి.
లూకా 2:25-38: సుమెయోను అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, "ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.” తడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; (వ. 26). యోసేపు మరియు మరియలు మొదటిసారిగా యేసును ఆలయానికి తీసుకువచ్చినప్పుడు, సుమెయోను తన చేతుల్లోకి తీసుకొని అతనిని స్తుతించాడు (వ. 29-32). "ఆ సమయములో, " అన్నా, ఒక ప్రవక్త్రిని, "దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మరియు యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. " (వ. 38).
లూకా 2వ అధ్యాయములోని మిగిలిన భాగం యేసు బాల్యంపై దృష్టి సారించడం ద్వారా మనుష్యకుమారునికి ఆయన చిత్రాన్ని చిత్రించింది. యేసు తండ్రి వడ్రంగివాడు. కొందరు చెక్కపని అంటారు; మరికొందరు రాయి మరియు రాతితో పని చేస్తున్నారని చెప్తారు ఎందుకంటే నజరేతులో చెట్ల కంటే ఎక్కువ రాళ్ళు ఉన్నాయి. యోసేపు యొక్క వృత్తి మత్తయి 13:55 లో వెల్లడి చేయబడింది, యేసు స్వస్థలంలోని ప్రజలు అతని బహిరంగ పరిచర్యకు ప్రతిస్పందిస్తూ, "ఇతను వడ్రంగివాని కుమారుడు కాదా?" చిన్నతనంలో, యేసుకు ఒక కుటుంబం ఉంది: మరియ, యోసేపు మరియు సహోదరులైన, యాకోబు యోసే, సీమోను యూదా, మరియు సహోదరీలు కూడా ఉన్నారు.
లూకా 2:39-40: యేసు కుటుంబం గలిలయలోని నజరేతు పట్టణానికి తిరిగి వచ్చింది. యేసు “పెరిగి బలవంతుడయ్యాడు, జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.” నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ఇది యేసు యొక్క మానవ స్వభావం యొక్క పెరుగుదలను వివరించింది, అతని దైవిక స్వభావం కాదు.1 ఆయన భూమిపై జన్మించిన క్షణంలో పూర్తిగా దేవుడు. మీరు మరియు నేను అనుభవించే వాటిని అనుభవించడానికి అతను మానవత్వంగా ఎదుగుతున్నాడని ఇది సూచించింది.
లూకా 2:41-42: ప్రతి సంవత్సరం, యేసు కుటుంబం పస్కా పండుగ కోసం యెరూషలేముకు వెళ్లేవారు. పస్కా, పెంతెకోస్తు, మరియు గుడారాల పండుగ యెరూషలేములో జరుపుకున్నారు. పస్కా పండుగ నిర్గమకాండము 23 నుండి వచ్చింది. దేవుడు ఐగుప్తులో చేసిన వాటిని జరుపుకోవడానికి వారు యెరూషలేముకు వెళ్లారు. యేసు కూడా తన తల్లిదండ్రులతో చిన్న పిల్లవాడిగా జరుపుకున్నాడు. యేసు 12 సంవత్సరాల వయస్సులో, వారు పండుగ ఆచారం ప్రకారం యెరూషలేముకు వెళ్లారు. 12 సంవత్సరాల వయస్సులో, బాలురు 13 సంవత్సరాల వయస్సులో బాధ్యతాయుతమైన వయస్సు కోసం సన్నద్ధమయ్యే తీవ్రమైన సూచనలను అందుకున్నారు. 13 సంవత్సరాల వయస్సులో, యేసు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన వ్యక్తిగా మతపరమైన సమాజంలోకి అంగీకరించబడ్డాడు.
లూకా 2:43-46: “ఆ దినములు తీరినతరువాత” అనేది నిర్గమకాండము 23ని సూచిస్తుంది, ఇక్కడ ఒకరోజు విందు తర్వాత వారమంతా పులియని రొట్టెల విందు, ఏడు నుండి ఎనిమిది రోజుల వరకు ఉంటుంది. కుటుంబం ఇంటివైపు ప్రయాణమయ్యింది, కానీ యేసు యెరూషలేములో “ఆలస్యము” చేసాడు. ప్రయాణము చేసే బృందము ఎంతో పెద్దదైతే, ఇలా జరగడం సులభమవుతుంది. ఎక్కువ మందితో ఇది ఏడు గంటల నడక, ఒక రోజు ప్రయాణం. మరియ మరియు యోసేపులు వారి బంధువుల మధ్య యేసు కొరకు వెతికారు కాని వారు ఆయనను కనుగొనకపోవడంతో, వారు భయపడ్డారు. మూడు రోజుల తర్వాత, ఆలయ ప్రాంతములో యేసు బోధకుల మాటలు వింటూ, ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. ఆయన వాటిని విడిచిపెట్టలేదు. అతను ఒక చిన్న పిల్లవామిగా, మానవునిగా, రబ్బీల మధ్య నేర్చుకుంటున్నాడు. కీర్తన 119:99-100ని పరిశీలించండి: “నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.. వినయం యొక్క ఎంత అద్భుతమైన చిత్రం ఇది. బోధకుల కంటే ఎక్కువ తెలిసినప్పటికీ యేసు వినయమును చూపాడు. వాక్యము ఆధారంగా వాక్యాన్ని బోధించే వ్యక్తులతో మనల్ని మనం చుట్టుముట్టాలి, తద్వారా మనం వాక్యములో నిమగ్నం అవ్వగలము.
లూకా 2:47-50: యేసు 12 సంవత్సరాల వయస్సులో వేదాంత చర్చలు చేసాడు. ఆయన మాట విన్నవారందరూ ఆయన అవగాహనకు, సమాధానాలకు ఆశ్చర్యపోయారు. అతని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, మరియు మరియ ఇలా చెప్పింది, “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పెరి.” మరియ ఆందోళన బయటకు వచ్చింది. ఆయన “నేను నా తండ్రి[దేవుని] పనులమీద నుండవలెనని మీరెరుగరా” కాబట్టి వారు ఎందుకు వెతుకుతున్నారు అని యేసు ఆశ్చర్యపోయాడు. నెల్సన్ యొక్క వ్యాఖ్యానం ప్రకారం, యేసు అంటే ఆయన ప్రభువు యొక్క పని చేస్తున్నాడని లేదా అతను ఇక్కడ ఉండవలసి ఉందని అర్థం.2 యోసేపు మరియు మరియలకు అర్థం కాలేదు. శిష్యులు ఎన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయారు? లూకా 9:45 అదే మనస్తత్వాన్ని వివరిస్తుంది. శిష్యులు ఈ ప్రకటనను అర్థం చేసుకోలేదు మరియు దాని గురించి యేసును అడగడానికి భయపడ్డారు.
లూకా 2:51-52: యేసు, తన తల్లిదండ్రులకు విధేయత చూపుతూ, నజరేతుకు వెళ్లాడు. అతని తల్లి ఈ విషయాలన్నీ తన హృదయంలో ఉంచుకుంది. ఆమె ఏ అంశాలను ముందుకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? యేసు సమాజ మందిరం నుండి తరిమివేయబడలేదు; ఆయనకు స్వాగతం పలికారు. ఆయన పూర్తి సంభాషణలను కలిగి ఉన్నాడు; అక్కడున్న వారందరినీ ఆకట్టుకుని ఆశ్చర్యపరిచాడు. మరియకు చెప్పడానికి చాలా ఉంది: గాబ్రియేలు ఏమి చెప్పాడో ఆమెకు తెలుసు; యేసు దేవుని కుమారుడని, మనుష్య కుమారుడని, దేవుడు మనతో ఉన్నాడని ఆమెకు తెలుసు. యేసు యెరూషలేములో ఉండుటను బట్టి అవిధేయుడు కాదు. ఇప్పుడు ఆయన తన తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా పది ఆజ్ఞలను గౌరవించాడు. లూకా ఇలా ముగించాడు, " యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను."
ముగింపు
యేసు బాల్యం గురించి మనకు లేఖనము నుండి తెలుసు. అతను బలంగా పెరిగాడు మరియు జ్ఞానంతో నిండి ఉన్నాడు. దేవుని దయ అతనిపై ఉంది, మరియు ఆయన దేవుని దయను మరియు మనుష్యుల దయను పొందాడు. పైగా, వ్యాఖ్యాతలు యేసు మానవుడిగా పెరిగాడని, కానీ అతను దేవుడిగా ఉండటాన్ని ఆపలేదు. జాన్ మాక్ఆర్థర్ యేసు "తండ్రి ఇష్టానికి తన దైవిక లక్షణాల ఉపయోగాన్ని సమర్పించాడు."3 యేసు తండ్రి, దేవునికి సమర్పించాడు మరియు ఈ సామర్ధ్యాలను ఎప్పుడు ఉపయోగించాలో అతనికి చూపించడానికి దేవుడు అనుమతించాడు. "కాబట్టి క్రీస్తు మానవ ఎదుగుదల యొక్క సాధారణ ప్రక్రియకు లోబడి ఉన్నాడు, మేధోపరంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా."4 అతను నిరంతరం తండ్రికి తన దైవిక లక్షణాలను విడిచిపెట్టాడు మరియు మానవుడిగా ఎదగడం కొనసాగించాడు.
సర్వ జ్ఞానము ప్రదర్శించబడే సమయంలోని క్షణాల గురించి లూకా వ్రాసాడు; యేసు తన “దేవుని శక్తిని” ఉపయోగించుకోవడానికి దేవుడు అనుమతించిన క్షణాలు " సమయములు నాకు తెలియవు" (మత్తయి 24:36) అనే ఆయన ప్రకటన ద్వారా ప్రతిదీ ఎల్లప్పుడూ తండ్రికి లోబడి ఉంటుంది. ఇక్కడ భూమిపై ఉన్నప్పుడు ఆయన తండ్రి యొక్క ప్రణాళికపై దైవిక లక్షణాలను ఉపయోగించాడు. కొన్నిసార్లు, దేవుడు తన సర్వజ్ఞ శక్తులను విడుదల చేశాడు. పునరుత్థానం తర్వాత మాత్రమే క్రీస్తు నిజంగా తన పూర్తి దైవిక జ్ఞానాన్ని మరియు శక్తిని పునరుద్ధరించాడు.
ఇది యేసు బాల్యం. లూకా 3లో యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు తన కుమారునికి తన ఆమోదాన్ని తెలుపుతూ తండ్రి అయిన దేవుని యొక్క అద్భుతమైన చిత్రాన్ని చేర్చారు. యేసు బాల్యం అతని తల్లిదండ్రులు మరియు అనేక మంది సహోదరులు మరియు సహోదరీలను కలిగి ఉంది. యేసు మానవ కుమారునిగా భూమిపై మానవునిగా ఉన్నప్పుడు జ్ఞానమందును, వయస్సునందును వర్ధిల్లాడు.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), p. 1254.
రాడ్మాచర్ మరియు ఇతరులు., p. 1254.
జాన్ ఎఫ్. మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ(నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషింగ్, 2005), పే. 1280.
మక్అర్హుర్, పే. 1280.
ప్రశ్నలు
-
కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యం యొక్క జనాభా గణనను చేపట్టాలని ఆదేశించాడు. మీకా 5:2లోని ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు దీన్ని ఎలా ఉపయోగించాడు?
దినవాక్యం
Laura Martin Luke 2:52
“And Jesus increased in wisdom and stature, and in favor with God and with people.”
యేసు కేవలం శిశువుగా సమస్త జ్ఞానం మరియు అనుగ్రహంతో జన్మించలేదు. సంవత్సరాల తరబడి, అయన కూర్చుని, మోషే ధర్మశాస్త్రాన్ని బోధించే విద్వాంసులు మరియు బోధకుల మాటలు విన్నాడు. ఆయన వారిని ప్రశ్నలు అడిగాడు మరియు అయన తన తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. కాలక్రమేణా, యేసు జ్ఞానాన్ని, బుద్ధి మరియు దేవుని దయయందును మరియు మనుష్యుల దయయందును పెరిగాడు.
యేసులాగే, మీరు దేవుని వాక్యంలో సమయాన్ని వెచ్చిస్తూ, ఇతర విశ్వాసులతో లేఖనాలను చర్చిస్తూ, ప్రభువుకు విధేయతతో జీవించినప్పుడు మీరు జ్ఞానంలో వృద్ధి చెందుతూ ఉంటారు. మీరు ఆయనకు అవును అని చెప్పిన క్షణంలో మీరు సమస్తమును కలిగి ఉండాలని ప్రభువు ఆశించడు. మీ బలహీనతలో ఆయన దయ సరిపోతుంది కాబట్టి మీరు సమస్తమును కలిగి ఉండవలసిన అవసరం లేదు. మీరు క్రీస్తులో పెరిగే స్థానాల్లో మిమ్మల్ని మీరు ఉంచుకోవడం కొనసాగించండి. పట్టుదల మరియు ఓర్పుతో నడవండి, ఆయనను మరింత తెలుసుకోవాలని ఒత్తిడి చేయండి.
“యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.”
- లూకా 2:52
తదుపరి లేఖన భాగములు
హెబ్రీయులు 5:12-14 — “కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును.”
యాకోబు 1:2-4 — “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
1 పేతురు 2:2-3 — “ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
3 మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.