Ordinances Regarding Slaves & Personal Injury
యేసును ఇలా కనుగొనండి: Deliverer Exodus 21 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయము
నిర్గమకాండము కొరకు మా పూర్తి అంశం “విమోచకుడు.” ఐగుప్తునుండి ప్రజలను విడిపించినవాడు యేసు. అవును, ఆయన మోషేను ఉపయోగించాడు. కానీ పెద్ద చిత్రం ఏమిటంటే, బందీలను విడిపించేవాడు యేసు (లూకా 4). మోషే నిబంధన అనేది ఇశ్రాయేలీయులతో ప్రభువు చేసిన షరతులతో కూడిన నిబంధన. నిర్గమకాండము 20 పది ఆజ్ఞలను తెలుపుతుంది. దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ కీలకమైన మార్గదర్శకాలను ఇచ్చాడు. అప్పుడు అతను కొనసాగించి మొత్తం 613 ఆజ్ఞలు ఇచ్చాడు.
పాఠము
నిర్గమకాండము 21:1:పది ఆజ్ఞలు మంచివి, అయితే దేవునికి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఇప్పుడు చదవబోయేది పది ఆజ్ఞల కంటే మరింత వివరంగా ఇవ్వబడిన నిర్దిష్ట సందర్భాలు. శాసనాలను అధ్యయనం విమోచకుడైన యేసును మనకు ఎలా బయలుపరుస్తుంది?
- దేవుడు వారి హృదయ సమస్యలను పరిపాలించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను వారి ఆలోచనలను మరియు ఆలోచనా విధానాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది వారి హృదయ స్థితిని మార్చడానికి దారి తీస్తుంది.
- వారు అరణ్యంలో తిరుగుతున్నారు మరియు దేవుడు వారి కోసం ఒక సంస్కృతిని సృష్టించాలని కోరుకున్నాడని మనం గుర్తుంచుకోవాలి.
నిర్గమకాండము 21:2: 2-6 వచనాలు బానిసత్వం గురించి వ్రాయబడినవి. బానిసలు కలిగియుండాలనే ఈ ఆలోచన హెబ్రీయులకు ఎందుకు? అప్పుడే వారు బానిసత్వం నుండి బయటకు వచ్చారు. ఇది వాస్తవానికి బానిస మనస్తత్వం కంటే సేవకుడి మనస్తత్వమే ఎక్కువ. ఆరేళ్ల తర్వాత వారిని విడుదల చేయాల్సి ఉంది. బహుశా, హెబ్రీ బానిసలు ఎవరికైనా ఋణపడి ఉండడం వల్ల బానిసలుగా మారవచ్చు. ఉదాహరణకు, రాహేలు మరియు లేయాలను వివాహం చేసుకోవడానికి యాకోబు లాబాను కొరకు పనిచేశాడు. ఒనేసీమును స్నేహితునిగా, సహోదరునిగా తన కొరకు పనిచేసినట్లుగా భావించమని పౌలు ఫిలేమోనును కోరాడు (ఫిలేమోను 15). కాన్స్టేబుల్ ఇలా వ్రాశాడు, "బానిసల యొక్క మానవ హక్కులను ఇతరులు అగౌరపరచినప్పుడు ఒక సామాజిక సంస్థగా బానిసత్వం చెడ్డదిగా మారుతుంది."1 దేవుడు మానవ హక్కులకు విలువనిచ్చే సంరక్షకులను సృష్టిస్తున్నాడు.
నిర్గమకాండము 21:3-6:ఒక బానిస తన కుటుంబంతో ఉండాలనుకుంటే, దానికి ఒక విధానం ఉంది. బానిసకు వాని చెవి కదురుతో గుచ్చబడియుంటుంది. ఇది బానిస జీవితాంతం తన యజమానికి చెందినదని సూచిస్తుంది. కదురు అనేది తోలు పనిలో ఉపయోగించే పొడవైన పదునైన సాధనం. నెల్సన్ ఇలా వ్రాశాడు, "బానిసను న్యాయమూర్తుల ముందుకు తీసుకువెళతారు, అక్కడ అతనికి తన ఉద్దేశాలను ప్రకటించడానికి అవకాశం ఇవ్వబడుతుంది."2 బానిస తన భార్య మరియు పిల్లలతో ఉండటానికి ఉద్దేశపూర్వకంగా తన యజమానికి సేవ చేయడానికి తన జీవితాన్ని వదులుకుంటాడు.
ఈ సమయంలో బానిస దాసునిగానే ఉంటాడని మాక్ఆర్థర్ పేర్కొన్నాడు.3 ఐగుప్తులో (ఇశ్రాయేలీయులు కఠినంగా ప్రవర్తించబడ్డారు మరియు బానిసలుగా ఉంచబడ్డారు) బానిసత్వ సంస్కృతి నుండి బయటకు వచ్చిన తర్వాత, బానిసలు మరియు దాసుల జీవితాలకు విలువ ఉంటుందని దేవుడు ఇశ్రాయేలీయులకు బోధిస్తున్నాడు. ఐగుప్తులో వలె కాకుండాదాసులు మరియు బానిసలు ఈ విధంగా వ్యవహరించాలి.
నిర్గమకాండము 21:7-10: ఇప్పుడు స్త్రీలు బానిసలుగా ఉండుటను చూడబోతున్నాం. ఒక తండ్రి తన కూతురిని అమ్మివేసినప్పుడు, ఆమెకు అధికారం లేదు. ఇది పెళ్లి విషయములో జరిగింది. మామగారు ఆమెను విదేశీయులకు అమ్మలేకపోయారు. కూతుర్ని అమ్మితే ఆచారాల ప్రకారం మామగారు ఆమెను కూతురిలా చూడాలి. ఆమె కుమారునికిచ్చి పెళ్ళిచేసిన తరువాత, అ కుమారుడు రెండో భార్యను చేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అతను తన మొదటి భార్యను తన రెండవ భార్యకు వ్యత్యాసముగా చూడలేడు. అతను ఇంకా ఆహారం, దుస్తులు మరియు వివాహ హక్కులను ఆమెకు అందించాలి.
నిర్గమకాండము 21:11:స్త్రీ యొక్క అవసరతలను తీర్చకపోతే ఆమె విడిచిపెట్టవచ్చు. ఆరు సంవత్సరాల తర్వాత, ఒక మగ బానిస విడిచిపెట్టవచ్చు, కానీ ఈ సమయములో మాత్రమే బానిసయైన స్త్రీ విడిచిపెట్టాలి. ఆదికాండములో, లేయా యాకోబుకు జిల్పాను భార్యగా ఇచ్చింది (ఆదికాండము 30:9). అప్పుడు యాకోబు లేయాతో వ్యవహరించినట్లే ఈ చట్టం ప్రకారం జిల్పాతో కూడా వ్యవహరించాలి. వారి ప్రవర్తనలకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు శాసనాలను ఉంచవలసి వచ్చింది.
నిర్గమకాండము 21:12-14:ఇప్పుడు మనం ముఖ్యంగా మరణశిక్ష అంటే ఏమిటో చూడబోతున్నాం. ఆదికాండము 9:6 ఇలా చెబుతోంది, " నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను." కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, "దేవుడు మానవ జీవితపు పవిత్రతను స్థలం యొక్క పవిత్రత కంటే గొప్పగా భావించాడు."4 పురాతన తూర్పుదేశాలలో, వారు ఎవరినైనా చంపవచ్చు, వదిలివేయవచ్చు మరియు దాచవచ్చు. ఒక వ్యక్తి ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా చంపితే ఆ వ్యక్తి చనిపోవాలని దేవుని ఆజ్న కోరుతుంది.
ఉద్దేశ్యపూర్వకము కాని నరహత్యల ఫలితముగా ఆశ్రయ పురాలలోనికిబహిష్కరణ బహిష్కరించబడ్డాయి. ఆశ్రయ పురాలు కోసం సంఖ్యాకాండము35 మరియు ద్వితీయోపదేశకాండము 19 వ అధ్యాయాలు చూడండి. ముందస్తుగా చేసిన హత్య ఫలితంగా హంతకుడికి మరణశిక్ష విధించబడింది. జాన్ డేవిస్ ఇలా వ్రాశాడు, “సారాంశమేదనగా, జీవితం దేవుని ఆస్తి; కొన్ని సంవత్సరాల పాటు మానవులు దానిని స్వాధీనం చేసుకొనుటకు లీజుకు ఇవ్వబడింది. . . [ఒక హంతకుడు] దేవుని యొక్క ముఖ్యమైన ఆజ్ఞలలో ఒకదానిని ఉల్లంఘించినట్లయితే అతడు జీవితాన్ని స్వాధీనం చేసుకునే హక్కును కోల్పోతాడు.”5
3. జాన్ ఎఫ్. మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజి. 116.
4. కానిస్టేబుల్, పేజి. 206.
5. జాన్ డేవిస్, మోసెస్ అండ్ ది గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ (గ్రాండ్ రాపిడ్స్, MI: బేకర్ బుక్ హౌస్, 1971), p. 221.
నిర్గమకాండము 21:15-19: తన తల్లిని లేదా తండ్రిని కొట్టిన వ్యక్తి మరణశిక్ష విధించబడతాడు. ఇది ఎందుకు అంత తీవ్రంగా ఉంది? ఇది పది ఆజ్ఞలలో ఒకదానిని ఉల్లంఘించే చర్య! దేవుడు గౌరవించే సంస్కృతిని స్థాపించాడు. బబులోను కాలంలో ఉన్న హమ్మురాబీ సూచనప్రకారము తన తండ్రిని కొట్టిన వ్యక్తి చేయి నరికివేయబడుతుందని పేర్కొంది. బలవంతముగా ఎత్తుకుపోయేవారిని కూడా చంపేశారు. పది ఆజ్ఞలలో కిడ్నాప్‌ని ఎక్కడ ఉంచవచ్చు? కిడ్నాప్ చేయడమంటే దొంగతనం. ఇప్పుడు మనం శారీరక దండన సమస్యలకు గురవుతున్నాము. మీరు గొడవపడితే, మీరు పనివాడికి పరిహారం చెల్లించాలి. ఈ చట్టాలన్నింటినీ ఎవరూ పాటించలేరు! మరియు మీరు దోషులైతే, మీకు మరణశిక్ష విధించబడుతుంది. మన విమోచకుడైన మెస్సీయాని బట్టి ప్రభువును స్తుతించండి!
నిర్గమకాండము 21:20-21: ఒక యజమాని తన బానిసను చంపినట్లయితే, అతని శిక్ష కేవలం తన బానిసను కోల్పోవడమే. 21వ వచనం, " వాడు అతని సొమ్మేగదా." ఇది కష్టం. బానిసలను ఆస్తిగా పరిగణించకూడదని, దాసులుగా పరిగణించాలని మనము చర్చిస్తున్నామని నేను అనుకుంటున్నాను? కాని దాసులు? మోషే ఇలా రాశాడు. అతను ఎవరినీ చంపలేదా?
నిర్గమకాండము 21:22–23: ప్రాణమునకు ప్రాణమనే మనస్తత్వం ఇక్కడ. ప్రజలు దీనిని గర్భవిచ్చిత్తికి అనుకూల వచనముగా ఉపయోగిస్తారు, ఎందుకంటే శిశువు చనిపోతే, జరిమానా మాత్రమే అవసరం; కానీ స్త్రీకి హాని జరిగితే, అది కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. గర్భం లోపలా, బయటా జీవం ఉందని ప్రభువుకు మొదటి నుంచీ తెలుసు. పిండమనగా ఒక వ్యక్తి:
కీర్తన 51:5: “పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.”
కీర్తన 58:3: “తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు.”
కీర్తన 139:13-15: "నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను."
నిర్గమకాండము 21: 24-28:కంటికి కన్ను, పంటికి పన్ను ఎలా పని చేసింది? చాలా మంది వ్యాఖ్యాతలు ఇది అలంకారికమని చెబుతారు, అంటే మీరు తీసుకున్న దానికి మీరు చెల్లించాలి. మీరు ఈ సంస్కృతిని మరింత ఎక్కువగా అధ్యయనం చేస్తే, కోల్పోయిన దానికి చెల్లించడం గురించి మీరు చాలా చూస్తారు. మిగిలిన వాటి కోసం, తప్పు చేసిన దాని బాధ్యస్తవహించి తీసుకోవడం గురించి.
నిర్గమకాండము 21:33–36: ఇది మొత్తం చెల్లింపు మరియు తప్పు చేసిన దానికి పరిహారం ఇవ్వడం. ప్రతిదీ సమానంగా తయారు చేయబడింది. మీరు పూర్తిగా పరిహారం చెల్లించాలి. ఇది న్యాయపరమైన ఒప్పందం.
ముగింపు
ప్రజలు కొనసాగించలేని చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ––613. తీవ్రమైన ఒత్తిడిగల బరువు యూదా ప్రజలు నేడు మోయవలసి ఉంది. అది, దాని సంపూర్ణత కూడా వారికి తెలియని ఒక భారీ బరువు. మీరు మొత్తం 613 ఆజ్ఞలకు పేరు పెట్టగలిగినప్పటికీ, మీరు వాటిని పాటించలేరు.
ఆ భారం నుండి మనం విముక్తి పొందామనేది ఆ ఒప్పందం! ఇవన్నీ రాబోయే మెస్సీయను మరియు ఆయన కొరకైన మన అవసరాన్ని సూచిస్తాయి! అయన ఇప్పటికే వచ్చాడు కాబట్టి, మనం పూర్తి స్వేచ్ఛతో నడుచుకోవచ్చు కాబట్టి ఈ విషయాలను వదిలేయాల్సిన సమయం వచ్చింది!
థామస్ L. కానిస్టేబుల్, డా. కానిస్టేబుల్ ఎక్స్పోజిటరీ (అధ్యయనం) గమనికలు: ఎక్సోడస్ ఆన్లైన్లో https://planobiblechapel.org/tcon/notes/pdf/exodus.pdf, p. 204.
ఎర్ల్ డి. రాడ్మాచర్, రోనాల్డ్ బి. అలెన్, మరియు హెచ్. వేన్ హౌస్, ఎడిషన్స్., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే, TN: థామస్ నెల్సన్, ఇంక్, 1999), p. 124.
ప్రశ్నలు
-
నిర్గమకాండము 21:17 లేవీయకాండము 20:9లో పునరావృతమైంది మరియు మత్తయి 15:4 మరియు మార్కు 7:10లో యేసుచే చెప్పబడింది. మీ తండ్రిని లేదా మీ తల్లిని శపించడం అంటే ఏమిటి?
దినవాక్యం
Laura Martin Exodus 21:1
“These are the ordinances that you must set before them.”
దేవుడు సీనాయి పర్వతంపై మోషేకు పది ఆజ్ఞలను ఇచ్చిన తర్వాత, మోషే ప్రజలతో పంచుకోవడానికి నిర్దిష్ట శాసనాలను వివరించాడు. ఈ శాసనాలు పౌర వివాదాల తీర్పు మరియు పరిష్కారానికి హద్దులవంటివి. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి బయటపడ్డారు మరియు వారు కొత్తగా కనుగొన్న స్వేచ్ఛలో జీవించడానికి వారికి ఈ హద్దులు అవసరమని ప్రభువుకు తెలుసు.
మీ జీవితంలో సరైన మరియు తప్పులకు సంబంధించిన హద్దుల కోసం మీరు ఎక్కడ తిరుగుతారు? మీరు ప్రపంచాన్ని వెతుకుతున్నారా లేదా అంతర్దృష్టి కోసం దేవుని వాక్యాన్ని వెతుకుతున్నారా? దేవుని వాక్యం సజీవమైనది, ప్రభావవంతమైనది మరియు రెండంచుల కత్తి కంటె పదునైనది. సమాధానాల కోసం దేవుని వాక్యాన్ని వెతకండి, ఆయన మీకు మార్గాన్ని చూపిస్తాడు.
“వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా.”
— నిర్గమకాండము 21:1
తదుపరి లేఖన భాగములు
- కీర్తన 103:7 — “ఆయన తన మార్గాలను మోషేకు, తన క్రియలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసాడు.”
- కీర్తన 119:105 — "నీ వాక్యము నా పాదములకు దీపము మరియు నా మార్గమునకు వెలుగు."
- హెబ్రీయులు 4:12 — “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.