Equal But Different Roles
యేసును ఇలా కనుగొనండి: The Last Adam 1 Corinthians 11 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
10వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయులు ప్రభువును ఎలా తిరస్కరించారో మరియు దేవుని అసంతృప్తిని ఎలా సంపాదించారో పౌలు కొరింథీ విశ్వాసులకు చెప్పాడు. విచారకరంగా, కొరింథీయులు కూడా ఆ అసంతృప్తిని ఎదుర్కొన్నారు. 11వ అధ్యాయంలో, పౌలు క్రీస్తును పోలి నడుచుకొనడంపై వారి దృష్టిని ఆకర్షించాడు.
పాఠము
1 కొరింథీయులు 11:1-12: తాను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము వారు తనను పోలి నడుచుకోవచ్చని పౌలు కొరింథీయులకు చెప్పాడు (1వ). మన పిల్లలు అదే చేయాలని మనం కోరుకుంటున్నాము - వారి ప్రవర్తన మరియు నమ్మకాలను మనలాగే అనుకరించాలా? నేను ఈ వచనాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, దీని గురించి మాత్రమే బోధించాలని నేను ఆలోచించాను. నేను యేసును పూర్తిగా పోలి నడుచుకొనుచున్నందున నా జీవితాన్ని పోలి నడుచుకొమ్మని నేను ప్రజలకు చెప్పగలనా? నా జీవితం యేసు జీవితంలాగా ఉండటానికి నేను నివారించాల్సిన, లేదా పారిపోవాల్సిన లేదా ప్రతిఘటించాల్సిన విషయాలు ఏమిటి? 1వ వచనములో, పౌలు ఇప్పటివరకు తాను బోధిస్తున్న ప్రతిదాన్ని ఒకే సారాంశ ప్రకటనతో ముడిపెట్టాడు: నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోమ్మని చెప్పాడు.
2వ వచనములో, కొంతమంది పౌలు మందలింపును శాండ్విచ్ అని పిలిచే దానిని ప్రారంభించాడు - మంచి దానితో ప్రారంభించి, తరువాత మందలించి, మంచి దానితో ముగించుట. తనను గుర్తుంచుకుని, తాను బోధించిన సంప్రదాయాలను పాటించినందుకు వారిని మెచ్చుకొన్నాడు. “సంప్రదాయాలు (ఇతర సూచనలు చూపినట్లుగా) క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సత్యాలు, ఈ దశలో (క్రైస్తవ సాహిత్యం ఆవిర్భావానికి ముందు) సువార్తికుడు మరియు గురువు నుండి మతం మారడానికి మౌఖికంగా అందించబడ్డాయి.”1 నెల్సన్ వ్యాఖ్యానం వివరిస్తుంది, “కొరింథీయులు చాలా తప్పులు చేశారు, కానీ అవి పూర్తిగా అవినీతితోకూడుకొన్నవి కావు. కొరింథీయులు కొన్ని రంగాలలో అపొస్తలుడి సూచనలను పాటించారు.”2
3వ వలో, క్రీస్తు ప్రతి పురుషునికి శిరస్సు అని, పురుషుడు ప్రతి స్త్రీకి శిరస్సు అని మరియు దేవుడు క్రీస్తుకు శిరస్సు అని పౌలు ఎత్తి చూపాడు. “శిరస్సు” అనే పదానికి అధికారం లేదా మూలం అని అర్థం.3 పురుషుడు మరియు స్త్రీ మధ్య సంబంధం తక్కువ ఎక్కువ అనేదానిపై ఆధారపడి ఉండదు—యేసు దేవుని కంటే తక్కువ కాదు మరియు స్త్రీ పురుషుడి కంటే తక్కువ కాదు. రెండింటినీ తిరస్కరించకుండా మీరు ఈ ప్రకటనలలో ఒకదాన్ని తిరస్కరించలేరు మరియు అది దేవుడు మరియు యేసు గురించి బైబిల్ బోధించే ప్రతిదానికీ విరుద్ధంగా ఉంటుంది.
నెల్సన్ వ్యాఖ్యానం ఇలా చెబుతోంది, “విధేయత అనేది తక్కువతనాన్ని సూచించదు, కానీ అధీనతను సూచిస్తుంది. క్రీస్తు మరియు దేవుడు సమానంగా దైవికమైనట్లే, పురుషులు మరియు స్త్రీలు సమాన జీవులు. కానీ దేవుని రక్షణ ప్రణాళికలో యేసు మరియు తండ్రి దేవుడు వేర్వేరు పాత్రలను కలిగి ఉన్నట్లే, పురుషులకు మరియు స్త్రీలకు వేర్వేరు పాత్రలను ఇచ్చారు.”4 మనకు ఇవ్వబడిన పాత్రలు కొన్నిసార్లు మనకు నచ్చవని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు ప్రతి ఒక్కరికీ స్పష్టంగా ఒక పాత్ర మరియు నిర్మాణాన్ని కలిగి ఉంటాడు.
4వ వలో, “‘ప్రార్థన’ అంటే ఒకరి ఆలోచనలు మరియు భావాలను దేవునికి వ్యక్తపరచడం మరియు ప్రత్యేకంగా, దేవుని విషయాలను అడగడం.”5 తల కప్పుకుని ప్రార్థించిన/ప్రవచించిన పురుషుడు దేవుడిని అగౌరవపరిరుస్తాడు. కానీ తల కప్పకుండా ప్రార్థించిన/ప్రవచించిన స్త్రీ దేవుడిని అగౌరవపరిరుస్తుంది (5 వ). స్త్రీ తల ఎందుకు కప్పుకోవాలో కానిస్టేబుల్ మూడు వివరణలను సూచిస్తాడు. మొదట, ఆమె తల కప్పుకోవడానికి ఒక వస్త్రం లేదా శాలువా లేకపోయి ఉండవచ్చు. రెండవది, ఆమె జుట్టు చిన్నగా కత్తిరించబడి ఉండవచ్చు మరియు ఆమె తలను పూర్తిగా కప్పుకోలేదు. మూడవదిగా, స్త్రీలు బహిరంగంగా ధరించే ఆచారం ప్రకారం ఆమె జుట్టును పైకి లేపకుండా వదిలేసి ఉండవచ్చు6 (1 కొరింథీయులు 14:34; 1 తిమోతి 2:12; 1 తిమోతి 5:16; తీతు 2:3–4). ఈ వచనాల ఆధారంగా, స్త్రీలు స్త్రీలకు మరియు పిల్లలకు బోధించచ్చని పౌలు చెబుతున్నట్లు అనిపించింది. ఇక్కడే ఇది వివాదాస్పదమవుతుంది. మాక్ఆర్థర్ ప్రకారం, “కొరింథు సంస్కృతిలో, ఒక స్త్రీ తన తలని కప్పుకుని, పరిచర్య చేస్తున్నప్పుడు మరియు ఆరాధిస్తున్నప్పుడు, ఆమె భర్తకు లోబడిన సంబంధాన్ని సూచించడానికి ఒక చిహ్నంగా ఉండేది.”7 తలని కప్పుకోవడం ఆమె పాత్రను స్వీకరించడానికి చిహ్నం. మాక్ఆర్థర్ ఇలా కొనసాగిస్తున్నాడు, “అపొస్తలుడు అన్ని సంఘములలో స్త్రీలు అన్ని కాలాలలోనూ ముసుగులు లేదా కప్పులు ధరించాలని ఒక సంపూర్ణ చట్టాన్ని నిర్దేశించడం లేదు, కానీ దైవికంగా స్థాపించబడిన పురుష మరియు స్త్రీ పాత్రల చిహ్నాలను ప్రతి సంస్కృతిలో నిజంగా గౌరవించాలని ప్రకటిస్తున్నాడు.”8 తలని కప్పుకోలేకపోతే, సంఘములో పురుషులు మరియు స్త్రీలకు వేర్వేరు పాత్రలు ఉన్నాయని దేవుడు చెబుతున్నాడని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. నేడు సంఘములో ఏమి జరుగుతుందంటే, ఈ పాత్రలు ఒకదానిలో కలిసిపోవడాన్ని మనం చూస్తున్నాము.
మనం 1 కొరింథీయులు 11:3కి తిరిగి వెళ్లి, 7వ వచనాన్ని చూడాలి, అక్కడ పురుషుడు దేవుని మహిమ మరియు స్వరూపం కాబట్టి తల కప్పుకోకూడదు, అయితే స్త్రీ పురుషుని మహిమ. 8వ వచనము ఇవన్నీ కలిపి చూపిస్తుంది - పురుషుడు స్త్రీ నుండి రాలేదు, కానీ స్త్రీ పురుషుడి నుండి వచ్చింది. పౌలు ఇలా అన్నాడు, పురుషుడు స్త్రీ కోసం సృష్టించబడలేదు, కానీ స్త్రీ పురుషుడి కోసం సృష్టించబడింది. మనం తల కప్పుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టనప్పుడు, పురుషుడు మరియు స్త్రీకి వేర్వేరు పాత్రలు ఇవ్వబడ్డాయి, భిన్నమైనవి కానీ అవసరమైనవి మరియు ముఖ్యమైనవి. ఇంట్లో ఒక కప్పుకొనే వస్త్రము అవసరమయ్యే పాత్ర స్త్రీకి ఉందని దీని అర్థం కాదు, మరియు ఆమెకు జీవితం లేదని కాదు, అయినప్పటికీ చాలా మందికి అలాంటి ప్రతిబింబమే ఉంది. ఈ లేఖనం ప్రకారం, వారు కలిసి దేవుని మహిమను ప్రతిబింబించేలా స్త్రీ పురుషుడి కోసం సృష్టించబడింది.
దేవదూతల కారణంగా స్త్రీ తలపై అధికార చిహ్నాన్ని కలిగి ఉండాలని పౌలు వివరించాడు. దీని అర్థం దేవదూతలు నిజంగా చూస్తుంటే, పురుషుడికి విధేయత చూపే స్త్రీ ఉందని మాత్రమే వారు చూస్తారు. స్త్రీ పురుషుడి నుండి స్వతంత్రురాలు కాదు, పురుషుడు స్త్రీ నుండి స్వతంత్రుడు కాదు (వచనాలు 10–11). ఆ “ఆమె తలపై ఉన్న అధికార చిహ్నం” ఏమిటో కానిస్టేబుల్ నాలుగు అవకాశాలను పంచుకుంటాడు:
1. ఆమెపై అధికారం ఇవ్వబడిన పురుషుడు చిహ్నం కావచ్చు.
2. ఆమె తలపై ముసుగు చిహ్నం కావచ్చు.
3. తల కప్పుకోవడం వల్ల స్త్రీలు క్రీస్తులో కొత్త స్వేచ్ఛను పొందారని తెలుస్తుంది.
4. స్త్రీకి తన తలపై అధికారం ఉంది మరియు ఆమె ఇష్టపడేది ఏదైనా చేయగలదు.9
ప్రభువులో పురుషుడు మరియు స్త్రీ సమానం, మరియు వారు భిన్నంగా ఉంటారు. సమాజంలో ఏమి జరుగుతుందో పురుషులు తమ కుటుంబాలను విడిచిపెడుతున్నారు, మరియు స్త్రీలు తమ స్వంత పాత్రతో పాటు పురుషుడి పాత్రను కూడా చేపట్టాల్సి వస్తోంది. స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి. (వ 12).
సారంభం ఇది: మన పని ఎల్లప్పుడూ క్రీస్తును ప్రతిబింబించడం. మన వ్యక్తిగత అజెండాలను తొలగించాలి, ఎందుకంటే ఇది మనం ఏమి కోరుకుంటున్నామో దాని గురించి కాదు—ఇది దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దాని గురించి. మన జీవితాలు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి.
ముగింపు
దీని సారంశము ఇది: మన పని ఎల్లప్పుడూ క్రీస్తును ప్రతిబింబించడం. మన వ్యక్తిగత ఉద్దేశ్యములను తొలగించాలి, ఎందుకంటే ఇది మనం ఏమి కోరుకుంటున్నామో దాని గురించి కాదు—ఇది దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దాని గురించి. మన జీవితాలు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి.
చార్లెస్ కింగ్స్లీ బారెట్, ఎ కామెంటరీ ఆన్ ది ఫస్ట్ ఎపిస్టిల్ టు ది కొరింథీయులు, హార్పర్స్ న్యూ టెస్టమెంట్ కామెంటరీస్ సిరీస్ (న్యూయార్క్: హార్పర్ & రో, 1968), పేజి 247; థామ్-యాస్ ఎల్. కానిస్టేబుల్, డాక్టర్ కానిస్టేబుల్స్ ఎక్స్పోజిటరీ బైబిల్ స్టడీ నోట్స్, పేజి 186లో ఉటంకించబడింది; https://planobiblechapel.org/tcon/ notes/pdf/1corinthians.pdfలో ఆన్లైన్లో అందుబాటులో ఉంది.
ఎర్ల్ రాడ్మాచర్, రోనాల్డ్ బి. అల్లెన్, మరియు హెచ్. వేన్ హౌస్, సం., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999), పేజి 1475.
నెల్సన్స్ కామెంటరీ, పేజి 1476.
నెల్సన్స్ కామెంటరీ, పేజి 1476.
థామస్ ఎల్. కానిస్టేబుల్, డాక్టర్ కానిస్టేబుల్స్ ఎక్స్పోజిటరీ బైబిల్ స్టడీ నోట్స్: 1 కొరింథీయులు, పేజి 188; ఆన్లైన్లో https://planobiblechapel.org/tcon/notes /pdf/1corinthians.pdf లో లభిస్తుంది.
గోర్డాన్ డి. ఫీ, ది ఫస్ట్ ఎపిస్టిల్ టు ది కొరింథీయులు, న్యూ ఇంటర్నేషనల్ కామెంటరీ ఆన్ ది న్యూ టెస్టమెంట్ సిరీస్ (గ్రాండ్ రాపిడ్స్: Wm. B. ఈర్డ్మాన్స్ పబ్లిషింగ్, 1987), పేజీలు 495–97, 509–501; కానిస్టేబుల్లో ఉదహరించబడింది, పేజీ 189.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), పేజీ 1588.
మాక్ఆర్థర్, పేజీ 1588.
మాక్ఆర్థర్, పేజీ 1588.
ప్రశ్నలు
-
మీ అభిప్రాయం ప్రకారం, 1 కొరింథీయులు 11:4–7 అక్షరాలా జుట్టు గురించి మాట్లాడుతోందా, లేదా అది వేరే దేనినైనా సూచిస్తుందా? దానికి వేరే అర్థం ఏమిటి?
దినవాక్యం
Laura Martin 1 Corinthians 11:1
“Imitate me, as I also imitate Christ.”
"నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి." అని పౌలు కొరింథీయులతో అన్నాడు. క్రీస్తు నడిచినట్లుగానే పౌలు నడిచాడు. విశ్వాసులకు వారి జీవితాలను ఎలా జీవించాలో ఆయన ఉంచిన మాదిరిని వినయంగా తెలుసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణ జీవితాన్ని గడపడానికి పిలవడం లేదు, తద్వారా ఇతరులు మీ పరిపూర్ణతను అనుకరిస్తారు. కాదు, "నా బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణం చేయబడినందున దేవుని కృప సరిపోతుంది" అని చెప్పిన మొదటి వ్యక్తి పౌలు. పౌలు బలంగా కనిపించి ఉండవచ్చు, కానీ పౌలు బలహీనతలో దేవుని కృప మరియు శక్తి పరిపూర్ణం చేయబడింది. దేవుడు అలాగే పనిచేస్తాడు.
కాబట్టి, క్రీస్తును అనుకరించడంలో ఇతరులను ప్రేమించడానికి, ఇతరులను క్షమించడానికి మరియు ఇతరుల కోసం వినయంగా మీ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిలో నడవడం కూడా ఉంటుంది. మీరు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ మీలో పనిచేస్తోంది. ప్రజలు మిమ్మల్ని అనుకరించినప్పుడు, వారు ఎటువంటి పగుళ్లు లేదా విరిగిన ముక్కలు లేకుండా పరిపూర్ణతను చూడవలసిన అవసరం లేదు. ఇతరులు మీ పగుళ్లు మరియు విరిగిన ముక్కలను చూడటానికి అనుమతించండి. విరిగిన స్థితిలోనే యేసు ప్రేమ మరియు వెలుగు మీ ద్వారా ప్రకాశిస్తుంది. మరియు అది దేవుని అద్భుతమైన కృప మరియు క్రీస్తు శక్తి, ఇతరులు చూడాలని మీరు కోరుకుంటారు.
“నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.”
- 1 కొరింథి 11:1
తదుపరి లేఖన భాగములు
2 కొరింథీయులు 12:9— “అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును”
ఫిలిప్పీయులు 2:5–8— “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాన మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.”
1 యోహాను 2:6— “ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొనబద్ధుడైయున్నాడు”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.