David and Zion Were Chosen
యేసును ఇలా కనుగొనండి: King of Glory Psalms 132-133 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఈ వారం మనము కీర్తనల గ్రంధములో మన అధ్యయనాన్ని ముగించాము. కీర్తనల అధ్యయనం ఇప్పటివరకు మనము పరిశుద్ధగ్రంధములో ఏదైనా గ్రంధములో పూర్తి చేసిన అతి పొడవైన బోధనా శ్రేణి మరియు ఇది నాకు గొప్ప అధ్యయనం. కీర్తనల అంతటా పైకి క్రిందికి భావోద్రేకాల అంశాలతో వ్యవహరించడం గురించి నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది నాకు పునరావృతమయ్యేలా అనిపించలేదు. కీర్తనల పుస్తకానికి సంబంధించిన మా పదబంధం మహిమగల రాజు, కానీ నన్ను ఆశ్చర్యపరిచిన అంతర్లీన అంశము ఏమిటంటే, మహిమగల రాజు యేరుషలేము వస్తున్నాడు అని. చాలా కీర్తనలు యేరుషలేమును సూచిస్తాయి-అక్కడ ఆరాధన జరుపుకోవడం, అక్కడ దేవుని ఉనికి మరియు ప్రభువు యొక్క జరుగబోవు క్రియలను గురించి చెప్పబడింది. కీర్తన 132 మూడు విభాగాలుగా సరిపోతుంది. ఇది రాజ కీర్తన, యాత్రా కీర్తన మరియు మెస్సియా కీర్తన. ఇది యాత్రా కీర్తనలలో పొడవైనది.
132వ కీర్తనలో ప్రభువు నివాసస్థలమైన యెరూషలేముకు ఉత్సహాముతో పోదాము రండి (వ. 7). యెరూషలేము దేవుని పట్టణము అని యూదులు అర్థం చేసుకున్నారు. 132వ కీర్తన 89వ కీర్తనను పోలి ఉంటుంది. రెండు కీర్తనలు అభిషేకించబడిన రాజును సూచిస్తాయి మరియు అది వ్రాయబడిన కాలానికి మరియు మహిమగల రాజు యొక్క రాభోవు కాలానికి రెండింటికీ వర్తిస్తుంది. అభిషిక్త రాజుతో పాటు, ఎదుర్కోవాల్సిన శత్రువును రెండు కీర్తనలు తెలియజేస్తాయి. రెండు కీర్తనలు రక్షణ యొక్క కొమ్మును మరియు సింహాసనాన్ని సూచిస్తాయి. మాక్ఆర్థర్ 132వ కీర్తనలో “దావీదు రాజవంశీయుల కోసం దేశం యొక్క ప్రార్థనలు ఉన్నాయి, వారు మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్నారు.”1
పాఠము
కీర్తన 132:1-5: అజ్ఞాత కీర్తనకారుడు దావీదు అనుభవించిన కష్టాలను గుర్తుంచుకోవాలని దేవుణ్ణి అడిగాడు (వ. 1) మరియు అతను "యాకోబు యొక్క బలిష్టునికి" (వ. 2) ఎలా మ్రొక్కుబడి చేశాడో గుర్తుంచుకోవాలి. ఇది దేవుని యొక్క అరుదైన హోదా, దీనిని మొదట యాకోబు ఉపయోగించాడు (ఆదికాండము 49:24-25). యెషయా 1:24 “ఇశ్రాయేలు యొక్క శక్తిమంతుడు” అనే పదాన్ని ఉపయోగిస్తుంది. దేవుడు యాకోబుకు పెట్టిన రెండవ పేరు ఇశ్రాయేలు. కష్ట సమయాల్లో దేవుడు రక్షణ మరియు ఆశీర్వాదం ఇచ్చాడని చూపించడానికి రెండు పదబంధాలు ఉపయోగించబడ్డాయి. 3-5 వచనాలలో, దేవుడు మరియు ఆయన మందసము కొరకు నివాస స్థలాన్ని కనుగొనవలసిన అవసరతతో దావీదు ప్రేరేపించబడ్డాడు (2 సమూయేలు 7:1-2). ఇది దావీదుకు కష్టమైంది (2 సమూయేలు 24), ఎందుకంటే అతను దాని కోసం భూమిని కొనుగోలు చేసినప్పటికీ, దేవుని నివాస స్థలాన్ని నిర్మించడానికి అతనికి అనుమతి లేదు. దేవుడు తన కుమారుడైన సొలొమోను ఆలయాన్ని నిర్మించాలని దావీదుతో చెప్పాడు.
కీర్తనలు 132:6-7: కీర్తనకారుడు దావీదు కష్టాల నుండి దావీదు సంతతికి చేరుకున్నాడు. మందసము బేత్లెహేము సమీపంలో ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఉందని వారు విన్నారని మరియు అది యాయరు (కిర్యత్యారీము అని కూడా పిలుస్తారు) పొలాల్లో కనుగొనబడిందని అతను చెప్పాడు. మందసము యెరూషలేముకు తీసుకెళ్ళడానికి ముందు 20 సంవత్సరాలు (1 సమూయేలు 7:1-2) కిర్యత్యారీము వద్ద ఉంది (2 సమూయేలు 6:1-5). మాక్ఆర్థర్ ఇలా వివరించాడు, “దేవుని సింహాసనం పరలోకములో ఉంది మరియు ఆయన పాదపీఠం భూమిపై ఉంది.”2 ఈ సందర్భంలో, “ఆయన పాదపీఠం” 7వ వచనంలో “భూమిపై ఉన్న ఒడంబడిక పెట్టె వద్ద ఆరాధన” గురించి ప్రస్తావించబడింది.3 కానిస్టేబుల్ ప్రతిస్పందనను వివరిస్తాడు. మందసము తిరిగి యెరూషలేముకు ప్రయాణం:
ఈ కీర్తనను పాడిన ఇశ్రాయేలీయుల యాత్రికులు సియోను పర్వతం మీద, యెరూషలేములోని మందసము నిలిచి ఉంచిన ప్రదేశానికి (వ. 7) దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు (వ. 7), ఇక్కడ దేవుని "పాదపీఠం"గా పేర్కొన్నారు. అక్కడ దేవుడు తన ప్రజల మధ్య స్థానికంగా నివసించాడు. ఇది అతని భూసంబంధమైన సింహాసనం. అక్కడ తమతో కలవాలని దేవుడిని పిలిచారు. వారు "దేవుని బలముగల మందసము" గురించి మాట్లాడారు, ఎందుకంటే ఇది ఇశ్రాయేలు యొక్క మునుపటి యుద్ధాలలో దేవుని శక్తిని సూచిస్తుంది.4
అరణ్యములో ఉన్న ప్రజలకు ముందుగా వెళ్లడం మరియు వారిని యోర్దాను నది దాటి వాగ్దాన దేశములోకి నడిపించడంతో సహా చాలా కష్టమైంది.
కీర్తన 132:8-10: ఇశ్రాయేలీయులు దేవుణ్ణి "యెహోవా, లెమ్ము...నీవు నీ బలసూచకమైన మందసమును" యెరూషలేముకు రమ్ము అని పిలుపు నిచ్చారు (వ. 8a). నెల్సన్ యొక్క వ్యాఖ్యానం వారు దేవుడు వాగ్దానం చేసినట్లుగా తన అభిషిక్తుడిని తమ వద్దకు పంపమని అడిగారు.5 కీర్తనకారుడు దేవుడు తన నగరంలో తన మందసమును, అతని రాజును, అతని యాజకులు మరియు అతని దైవభక్తిగల ప్రజలను ఆరాధనలో ఉంచమని అడిగాడు. (vv. 8b–9). కీర్తనకారుడు తన అభిషిక్తుడికి ఎప్పటికీ వాగ్దానం చేసినందున వారి నుండి దూరంగా ఉండవద్దని దేవుణ్ణి వేడుకున్నాడు (వ. 10).
కీర్తన 132:11-18: దేవుడు తన వంశస్థులను సింహాసనంపై శాశ్వతంగా పరిపాలిస్తారని దావీదుతో ప్రమాణం చేశాడని కీర్తనకారుడు జ్ఞాపకము చేసాడు (వ. 11-12). నెల్సన్ యొక్క వ్యాఖ్యానం పేర్కొంది 11 "దావీదు నిభందన యొక్క ప్రధాన పదాలను కవిత్వ పునర్నిర్మించబడింది " (2 సమూయేలు 7:8-16).6 విచారకరమైన విషయం, దావీదు నుండి వచ్చిన రాజులలో ఎంతమంది చెడ్డ రాజులు ఉన్నారో మనకు తెలుసు. “దావీదుకు చేసిన వాగ్దానం విశ్వాసపాత్రులైన కుమారులపై దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలు, దారితప్పిన కుమారులను శిక్షించడం మరియు ఊహించిన రాబోయే కుమారునిలో అతని అంతిమ నెరవేర్పు పరంగా నిర్దిష్టంగా ఉంటుంది.”7
దేవుడు సీయోను (యెరూషలేము) ఎప్పటికీ తన నివాసంగా మరియు తన విశ్రాంతి స్థలంగా ఎంచుకున్నాడు. ఆయన దానిని కోరుకున్నాడు (వ. 13–14). దేవుడు తన నగరంలో తన ప్రజలను ఆశీర్వదిస్తాడు, తన యాజకులకు రక్షణను వస్త్రముగా దరింప చేస్తాడు మరియు ప్రజలు "బిగ్గరగా ఆనందగానము చేసెదరు" (వ. 15-16). “సంతోషం కోసం కేకలు వేయడం” అంటే “బిగ్గరగా పలకడం” మరియు “హృదయపూర్వకంగా, సంతోషకరమైన గానం” అని వర్ణించడానికి ఉపయోగించబడింది.8 v. 17) (యెషయా 11:1–5). రాబోయే మెస్సీయ కిరీటాన్ని ధరిస్తాడు, అయితే ఆయన శత్రువులు అవమానంతో ధరింస్తారు (వ. 18).
ముగింపు
యెరూషలేము వరకు పాడిన యాత్రా కీర్తనలు మనందరి కోసము. మనమందరము పరలోక సీయోనుకు వెళ్తాము (హెబ్రీయులు 12:22-24). మెస్సీయ యొక్క రాజ్యం శాశ్వతంగా స్థాపించబడుతుంది (యెషయా 9:7), మరియు ఆయన శత్రువు ఆయనను ఎదిరించడు. మహిమగల రాజు పరిపూర్ణుడు ఇది మనందరికీ సిద్ధమయ్యే పాట, ఎందుకంటే ఆయన సమయంలో మనమందరం ఆయన వద్దకు కొనిపోబదతాము.
జాన్ మాక్ఆర్థర్, జాన్ మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 686.
మాక్ఆర్థర్, p.686.
మాక్ఆర్థర్, p.686.
థామస్ కానిస్టేబుల్, డా. కానిస్టేబుల్స్ బైబిల్ ఎక్స్పోజిటరీ స్టడీ నోట్స్: కీర్తనలు, పేజి. 450; https://planobiblechapel.org/tcon/notes/pdf/psalms.pdfలో అందుబాటులో ఉంది.
ఎర్ల్రాడ్మాచర్, రోనాల్డ్ B. అలెన్, మరియు H. వేన్ హౌస్, eds., నెల్సన్స్ న్యూ ఇలస్ట్రేటెడ్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1999) p. 734.
నెల్సన్స్ కామెంటరీ, p.734.
నెల్సన్స్ కామెంటరీ, p.734.
నెల్సన్స్ కామెంటరీ, p.734.
ప్రశ్నలు
-
కీర్తన 132:3–5లోని మందసమును కనుగొని తిరిగి యెరూషలేముకు తీసుకురావాలని దావీదు ఎందుకు పట్టుబట్టాడు? (2 సమూయేలు 6:12)
దినవాక్యం
Laura Martin Psalm 133:1
“How good and pleasant it is when brothers live together in harmony!”
క్రీడా జట్టులో ఐక్యత ఉంటే, ఆట విజయంతో ముగిసే అవకాశం ఉంటుంది. క్రీస్తు శరీరంలో ఐక్యతకలిగి ఉన్నప్పుడు, అది దేవునిరాజ్యంలో విజయానికి దారి తీస్తుంది. ప్రభువు ఏకత్వం మరియు ఐక్యత కోసం కోరుకుంటాడు. క్రీస్తులోని సోదరులు మరియు సోదరీమణుల మధ్య సామరస్యాన్ని చూసినప్పుడు ప్రపంచం యేసును విశ్వసిస్తుంది.
ఒకరితో ఒకరు సామరస్యంగా జీవించడానికి మీరు ఎలా ప్రతి ప్రయత్నం చేస్తారు? ప్రేమ అన్నింటినీ సంపూర్ణ ఐక్యతతో బంధిస్తుంది. కాబట్టి ప్రేమను ధరించండి. ప్రేమ పైనుండి వచ్చిందని గుర్తుంచుకోండి-మీ పరలోకపు తండ్రి ప్రేమ కలిగినవాడు. మీరు ఆయన నుండి నువ్వు పొండుకున్న ప్రేమను పొంగి పోర్లనివ్వండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి. క్రీస్తు శరీరంలోని మీ సోదరులు మరియు సోదరీమణులను ప్రేమించండి. అపకారమును మనసులో ఉంచుకోనవద్దు. ఇతరులను క్షమించండి మరియు క్షమాపణ కోరండి. మీరు ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు, ప్రపంచం గమనిస్తుంది మరియు ఏకత్వాన్ని చూస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకోండి మరియు వినయంతో నడవండి. మీరు సోదరుడు లేదా సోదరితో ఐక్యత లోపించినట్లు భావిస్తే, ఇది సయోధ్యను కోరుకునే సమయం. ఈ రోజు వారిని ఎలా ప్రేమించాలో ప్రభువును అడగడం ప్రారంభించండి మరియు ఆయన మీతో ఉంటాడని విశ్వసిస్తూ విధేయతతో నడవండి.
“యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందని వాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు.”
- కీర్తనలు 133:1
తదుపరి లేఖన భాగము
యోహాను 17:20-23:- మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
1 కొరింథీ 13:4-8a:- ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.
కొలస్సి 3:14:- వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.