Protection Of The Oppressed
యేసును ఇలా కనుగొనండి: King of Glory Psalms 128-129 Bible Gateway లో చదవండి (HCSB)
పాఠము
ఆడియో మాత్రమే
బోధనా గమనికలు
పరిచయం
ఒక సంవత్సరం పాటు ఉజ్జీవ పాఠశాలలో పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసే ఈ ప్రయాణంలో మనము ఉన్నాము. మనము ఈ రోజు మనం ఏమి మాట్లాడబోతున్నాం అనేదానికి ప్రారంభము చేసిన పరిశుద్ధగ్రంధము యొక్క మొదటి ఐదు పుస్తకాలు పంచగ్రంధాలతో ప్రారంభించాము. కీర్తనకారుడు పంచగ్రధాలు మరియు చారిత్రక పుస్తకాల మధ్య జరిగిన ప్రతిదాని గురించి వ్రాశాడు. ఇశ్రాయేలీయులు తాము అనుభవించిన ప్రతిదానిని ఎలా ఎదుర్కోవాలో ఇది ప్రతిబింబించే కీర్తన.
మనము ఇప్పటికీ యాత్ర కీర్తనలో ఉన్నాము. ఇశ్రాయేలీయులు పులియని రొట్టెల పండుగ, కోతకాల పంట లేదా గుడారాల పండుగ కోసం యేరుషలేముకు వెళ్లినప్పుడు యాత్ర కీర్తన పాడారు. ప్రతి సంవత్సరం మూడుసార్లు, ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రయాణించారు, మరియు వారు కీర్తనలు పాడారు. ఈ యాత్ర సమయాలు ఎల్లప్పుడూ ప్రతిస్పందన మరియు గణపరిచే సమయం. ఈ కీర్తన విలాపం మరియు విశ్వాసం యొక్క పాట మరియు హింస మరియు బాధలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై దృష్టి పెడుతుంది.
పాఠము
కీర్తన 129:1-2: ఈ వచనాలు హింస మరియు బాధలను ఎలా అంగీకరించాలో చర్చించబోతున్నాయి. ఈ వచనాలు తప్పనిసరిగా ఒకే విధంగా ఉన్నాయి, కానీ రెండవ వచనం అదిక బాధలు చేసేవారు జయింపలేరు అని ప్రకటిస్తుంది. ఈ వచనాలు ఇశ్రాయేలీయులు గతంలో దేవుడు వారిని ఎలా విడిపించాడో ప్రతిబింబిస్తుంది. ఇశ్రాయేలీయులు హింసలను ఎలా ఎదుర్కొన్నారో మనం చూడబోతున్నాం.
- ఆదికాండము 12:1–3: అబ్రహాము పిలువబడ్డాడు. అబ్రాహాము ప్రయాణిస్తున్నప్పుడు, కొందరు ఆయనను ఆశీర్వదిస్తారు లేదా కొందరు దూషిస్తారు మరియు దేవుడు ఆ ఆశీర్వాదాలు లేదా శాపాలను తిరిగి ఇస్తాడు. దేవుడు దానిని జాగ్రత్తగా చూసుకున్నాడని అబ్రాహాము అర్థం చేసుకోవాలి. ఇది మనలను 19వ కీర్తనకు తీసుకువెళుతుంది, ఇది వాక్యాన్ని విశ్వసించమని చెబుతుంది.
- ఆదికాండము 21:8–13: ఇస్సాకు ఇస్మాయేలుచే హింసించబడ్డాడు. వెంటనే, ఇస్మాయేలు ఇస్సాకును పరిహసించాడు. వారిరువురి మధ్య ఎల్లప్పుడు ఉద్రిక్తత ఉండేది. ఇస్సాకు తన సహోదరుని నుండి నిరంతరం హింసించబడుటతో ఈ నిబంధన వచ్చింది. గలతీయులు 4:21-31 ముస్లిములు (ఇష్మాయేలు), యూదులు (ఐజాక్) మరియు క్రైస్తవుల మధ్య వ్యేతిరేకతను మనం ఇప్పటికీ అనుభవిస్తున్న ఉద్రిక్తతను వివరిస్తుంది. యూదులు భూమ్మీద నుండి తుడిచిపెట్టబడరని వాస్తవం గురించి ఒక నానుడి ఉంది. లేఖనములలో కథ తర్వాత కథ ఈ భూమి యొక్క ముఖం నుండి యూదులను తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన నాయకులు దేశాలు అయినను అవి నెగ్గలేదు.
- నిర్గమకాండము 1:9–14: ఇశ్రాయేలీయులు ఎంత ఎక్కువగా హింసించబడ్డారో, వారు అంతగా అభివృద్ధి చెందారు మరియు ఒక జాతిగా మలచబడ్డారు. వారు నాశనం కాలేదు. కీర్తన 88:15 మరియు హోషేయ 11:1లో బాధల నుండి విముక్తి యొక్క భాషను మనం చూస్తాము.
- నిర్గమకాండము 14:19–31: ఐగుప్తుయులు యూదులను ముంచివేయాలని ప్రయత్నించారు, కానీ ప్రభువు బదులుగా ఫరో సైన్యాన్ని ముంచివేశాడు.
- యెషయా 37–38: అష్షూరు, ఇశ్రాయేలీయులును లొంగిపోవాలి అని ఆకలితో చంపడానికి ప్రయత్నించారు, కానీ దేవుడు వారి సైన్యాన్ని తుడిచిపెట్టాడు.
- దానియేలు 3: రాజు నెబుకద్నెజరు (బబులోను పాలకుడు) యూదులను కాల్చివేయడానికి ప్రయత్నించాడు, కానీ ప్రభువు వారిని విడిపించాడు.
- దానియేలు 5: బెల్షస్సరు ఇఇశ్రాయేలీయుల దేవుణ్ణి దూషించినప్పటికీ, పవిత్రమైన పాత్రలను అపవిత్రం చేసినప్పటికీ, ఆ రాత్రి మాదీయులు మరియు పారశీకులు అతనిని చంపారు.
- దానియేలు 6: పారశీకులు దానియేలును సింహాల గుహలోకి పడవేశారు, కానీ దేవుడు అతనిని రక్షించాడు మరియు నిందమోపిన వారిని సింహములు చంపాయి.
- హిట్లర్, అన్ని కాలాలలోనూ అధ్వాన్నమైన దృశ్యాలలో, 6 మిలియన్లకు పైగా యూదులను గ్యాస్ ఛాంబర్లలో చంపాడు, కానీ అతను చివరికి ఓడిపోయాడు మరియు ఇశ్రాయేలు దేశం 1948లో ఏర్పడింది.1
ప్రతి ఒక్కరూ ఒక చిన్న దేశాన్ని, చిన్న సమూహాన్ని ఎందుకు తుడిచిపెట్టాలనుకుంటున్నారు? శత్రువు ఎందుకు అంత ఆందోళన చెందాడు? యేసు తన ప్రజలను ఒక చోటుకు చేర్చాలని కోరుకున్నాడని, కానీ వారు నిరాకరించి నిర్జనమైన దేశంగా మారారని మాథ్యూ పేర్కొన్నాడు మరియుఆయన తిరిగి వచ్చే వరకు వారు ఆయనను చూడలేరని యేసు ముగించాడు మరియు ఆయన ఎన్నుకున్న ప్రజలు ఇలా అంటారు, " ప్రభువు వలన వచ్చిన వాడు దీవించబడును" (మత్తయి 23:37-39)! కాబట్టి దీని ప్రకారం, శత్రువు ఇశ్రాయేలును నాశనం చేస్తే, యేసు వాగ్దానం చేసినట్లు ప్రభువు తిరిగి రాలేడు. కానీ దేవుడు శత్రువుకు ఇశ్రాయేలు దేశాన్ని తుడిచిపెట్టడానికి అనుమతించలేదు, అతను ఎలాంటి హింసను లేదా ప్రతికూలతను కలిగించడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రభువు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు. మరియు ఆయన తిరిగి వచ్చి గృహమును పరిశుద్ధ పరుస్తాడు (జెకర్యా 14).
కీర్తన 129:3: ఇశ్రాయేలీయులు హింసించబడడాన్ని అంగీకరించడమే కాదు, ఇశ్రాయేలీయులు హింస నుండి ప్రయోజనం పొందడం నేర్చుకోవాలని వైర్స్బే ఎత్తి చూపారు.2 ఈ వచనం చాలా బాధలను సూచిస్తుంది. కీర్తనకారుడు “వ్యవసాయ సారూప్యతను . . . ఇశ్రాయేలుపై ఆమె శత్రువులు చేసిన లోతైన, కానీ ప్రాణాంతకం కాని గాయాలను వివరించాడు.”3
కీర్తన 129:4: కానిస్టేబుల్ ఇలా వ్రాశాడు, “ఇశ్రాయేలును బంధించిన వాస్తవమైన పాలనలు లేదా విషయాలు ఇప్పుడు తెంపివేయబడ్డాయి”4 ఈ వచనం మనకు వేదన ఆగిపోయిందని చూపిస్తుంది. ఇశ్రాయేలీయులు హింసతో తమ అనుభవాలను తరువాతి తరానికి అందించడం చాలా ముఖ్యం.
కీర్తనలు 129:5–8: “సీయోనును ద్వేషించువారందరు అవమానకరముగా వెనుకకు వెళ్లగొట్టబడును గాక” అని కీర్తనకారుడు వ్రాశాడు. ఇక్కడ అవమానం అనే పదానికి సిగ్గు అని అర్థం. అవమానం అంటే సిగ్గుపడడం మరియు అవమానించడం అని మాక్ఆర్థర్ వివరించాడు.5 ఇశ్రాయేలును హింసించే వారి విధిని వివరించడానికి కీర్తనకారుడు వాడిపోయిన గడ్డి వంటి వారి వుందురు. మాక్ఆర్థర్ ఇలా వ్రాశాడు, “నిస్సారమైన మూలాలు కలిగిన గడ్డి . . . సూర్యోదయ వేడితో ఎదుగక ముందే అది వాడి పోవును ఇది దుష్టులను గూర్చి వర్ణిస్తుంది.”6
ముగింపు
సాతాను ఇశ్రాయేలును ద్వేషిస్తున్నాడు. యూదులను తుడిచిపెట్టడానికి తాను చేయగలిగినదంతా చేయబోతున్నాడు. అందుకే మనం విమోచన కోసం ప్రార్థించాలి. శత్రువును ఓడించాలని మేము కోరుకుంటున్నాము. రక్షణ యూదుల నుండి వస్తుంది; యేసే రక్షణ (యోహాను 4:22)! యేసు అంటే స్వాతంత్ర్యము . తన సమయం పరిమితం అని సాతానుకు తెలుసు. రక్షణ ఎవరికైనా అందించబడుతుంది. శత్రువు విజయం పొందడు.
వైర్స్బే, ది బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ: ఓల్డ్ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి. కుక్, 2004), పే. 350.
వైర్స్బే, పే. 350.
జాన్ మాక్ఆర్థర్, ది మాక్ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్విల్లే, TN: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 685.
థామస్ కానిస్టేబుల్, డాక్టర్. కానిస్టేబుల్ ఎక్స్పోజిటరీ బైబిల్ స్టడీ నోట్స్: కీర్తనలు, పేజి. 448; https://planobiblechapel.org/tcon/notes/pdf/psalms.pdfలో అందుబాటులో ఉంది.
మాక్ఆర్థర్, p.685.
మాక్ఆర్థర్, p.685.
ప్రశ్నలు
-
ఎవరైనా ప్రభువుకు భయపడడం ద్వారా ఎందుకు సంతోషంగా ఉంటారు లేదా ఆశీర్వదించబడతారు? ప్రభువుకు భయపడడం అంటే ఏమిటి?
దినవాక్యం
Laura Martin Psalm 129:1–2
“Since my youth they have often attacked me—let Israel say—Since my youth they they have often attacked me, but they have not prevailed against me.”
ప్రభువు సంవత్సరాలుగా ఇశ్రాయేలును నమ్మకంగా రక్షించాడు మరియు శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడతానని ఆయన వాగ్దానం చేశాడు. గుర్తుంచుకోండి, క్రీస్తులో, జీవితం ఉంది. క్రీస్తులో, విజయం ఉంది. క్రీస్తులో స్వేచ్ఛ ఉంది. నీకు విరోదముగా రూపించిన ఏ ఆయుధం వర్దిల్లదు. మీరు పదే పదే దాడి చేయబడవచ్చు, కానీ మీరు క్రీస్తు యేసులో పాతుకుపోయి, స్థిరపడినప్పుడు, మీరు విజయం పొందుతారు. శత్రు ప్రణాళికలు ఫలించవు.
దాడుల మధ్య కూడా పోరాడుతూనే ఉండడం ఎలా అనిపిస్తోంది? ప్రభువు నుండి నమ్మకంగా నిలబడండి. విశ్వాసం ద్వారా ముందుకు కొనసాగుతూ ఉండండి, దేవుడు విజేయుడు అని విశ్వసించండి, అందువల్ల మీరు ఆయనలోనే విజయం సాధింస్తారు. యేసు మరియు ఆయన జ్ఞానం మీద మీ దృష్టిని ఉంచడం ద్వారా విజయం వస్తుంది. ఆయనను వెతకండి. ఆయన వాక్యంలో సమయాన్ని గడపండి. మిమ్మల్ని నడిపించడానికి అతని స్వరానికి అనుమతించండి. మీరు నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా, ఆయన మీ కోసం పోరాడుతున్నాడు అని తెలుసుకోండి. శత్రువు విజయం పొందలేడు. క్రీస్తులో ఉండండి. ఆయనే మీ కోట.
“ఇశ్రాయేలు ఇట్లనును నా యౌవనకాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి నాయౌవనకాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి.”
-కీర్తన 129:1,2
తదుపరి లేఖన భాగము
- యెషయా 54 :17:- “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.”
- యిర్మియా 1:19:- “వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.”
- 1 యోహాను 4:4:- “చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.”
పాఠము మరియు దినవాక్యం
ప్రతి రోజుకు రెండు భాగాలు ఉన్నాయి: పాఠము మరియు దినవాక్యం. ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళడానికి ఈ బటన్లను ఉపయోగించండి.
బోధనా గమనికలు మరియు ప్రశ్నలు
వీడియో పక్కన, ఈ ట్యాబ్‌లు బోధనా గమనికలను మరియు ప్రశ్నలను చూపిస్తాయి. మీరు జవాబు పెట్టె నుండి బయటకు వెళ్ళినప్పుడు ప్రశ్నకు మీ జవాబు సేవ్ అవుతుంది.
బైబిలు భాగం
ఈ లింక్ Bible Gateway లో భాగాన్ని తెరుస్తుంది, దానితో ఆ భాగానికి టిక్ పడుతుంది. మీరు దానిని మీ సొంత బైబిలులో చదివితే, ప్రగతిలో చేతితో టిక్ చేయండి.
ఈ పాఠంలో మీ ప్రగతి
మీరు వీడియో లేదా ఆడియోను చివరి వరకు ప్లే చేసినప్పుడు, గమనికలను లేదా దినవాక్యాన్ని చివరి వరకు చదివినప్పుడు, లేదా ప్రతి ప్రశ్నకు జవాబిచ్చినప్పుడు ఒక భాగానికి దానంతట అదే టిక్ పడుతుంది. ఇక్కడ మీరు ఒక భాగాన్ని చేతితో కూడా టిక్ చేయవచ్చు.
డౌన్లోడ్లు
ఇక్కడ మీరు వీడియో, ఆడియో మరియు పాఠాన్ని PDF ఫైళ్లుగా సేవ్ చేయవచ్చు. డౌన్లోడ్లు మీ ప్రగతిలో లెక్కించబడవు.
సహాయం కావాలా?
మాకు ప్రశ్న పంపడానికి లేదా సమస్య గురించి చెప్పడానికి ఈ బటన్‌ను ఉపయోగించండి. అక్కడి నుండి ఈ టూర్‌ను మళ్ళీ కూడా చూడవచ్చు.