Wisdom Books Psalms

The Priestly King

యేసును ఇలా కనుగొనండి: King of Glory Psalms 110-112 Bible Gateway లో చదవండి (HCSB)

730 రోజులలో 446వ రోజు
డౌన్‌లోడ్‌లు

పాఠము

YouTube లో చూడండి

ఆడియో మాత్రమే

బోధనా గమనికలు

పరిచయం

118 మరియు 110 కీర్తనలు కొత్త నిబంధనలో ఎక్కువగా ప్రస్తావన చేయబడిన కీర్తనలు. అంటే అది బహుశా మెస్సీయను ఉద్దేశించి ఉండవచ్చు. కీర్తన 110లోని 1వ వచనం 25 సార్లు ప్రస్తవించబడింది, 4వ వచనం ఐదుసార్లు ప్రస్తవించబడింది మరియు హెబ్రీయుల గ్రంధములో ఈ కీర్తన పదిసార్లు ప్రస్తావించబడింది.1 ఇది దావీదు వ్రాసిన రాజ కీర్తన, మరియు ఇది చాలా వరకు అందించబడిన కీర్తనలలో ఒకటి. క్రీస్తు రాజుగా మరియు యాజకునివలె ప్రవచనాత్మక చిత్రాలు. కీర్తనల గ్రంధము కోసం మనం మహిమగల రాజు అనే పదబంధాన్ని ఉపయోగిస్తున్నాము, కానీ 110వ కీర్తన కోసం, మనం యాజక మరియు మహిమగలరాజు ఉపయోగించవచ్చు. యేసు మరియు పేతురు ఇద్దరూ వీటి గ్రంధకర్త దావీదు అని ధృవీకరించారు (మత్తయి 22:43-44; అపోస్తుల 2:33-35).

పాఠము

కీర్తన 110:1-3: రాజైన క్రీస్తు: 1వ వచనం దావీదు యొక్క మూలం మరియు సంతానం అయిన "నా ప్రభువు" (తండ్రి అయిన దేవుడు)కి ప్రకటన చేసిన "ప్రభువు" (కుమారుడైన దేవుడు)ని సూచిస్తుంది (మార్కు 12:36 ప్రకటన 5:5; 22:16). క్రీస్తు భూమిపైకి వచ్చే వరకు దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు (1b ). తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను (హెబ్రీయులు 10:10-12). మాక్‌ఆర్థర్ ఇలా వివరించాడు, "పాదపీఠం అనేది ఒకరి శత్రువు ఇప్పుడు పాదాల క్రింద ఉన్నారనే ఆలోచనను చిత్రించే సంపూర్ణ విజయం యొక్క పురాతన సమీప తూర్పు దేశాల చిత్రం"2 (కీర్తన 8:6-7; 47:3). దావీదు క్రీస్తు రెండవ రాకడ యొక్క చిత్రాన్ని వ్రాస్తున్నాడు, యేసు మొదటి రాకడకు సూచనగా కాదు (ప్రకటన 19:11-21). క్రీస్తు తిరిగి రాకముందే తన శత్రువులు ఓడిపోవాలని ఎదురు చూస్తున్నాడు (హెబ్రీ 10:13).

దేవుడు ఏమి చేస్తాడో ఆశీర్వాదాల గురించి దావీదు వ్రాశాడు. మొదటిగా, సీయోను (యెరుషలేము) నుండి విస్తరించే తన రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభువు తన శక్తివంతమైన రాజదండాన్ని క్రీస్తుకు ఇస్తాడు (v. 2a). ఇది భూసంబంధమైన సీయోనును సూచిస్తుంది, పరలోక సీయోను కాదు. ఇది తండ్రి తన పనిని చేయడానికి కుమారుడిని అనుమతించడం. రెండవది, దేవుడు తన శత్రువులను ఓడిస్తాడు (2b వ). క్రీస్తు ప్రజలు క్రీస్తు కొరకు "పరిశుద్ధ శోభ"తో యుద్ధానికి వెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు (3a). సైన్యం స్వచ్ఛమైన తెల్లని గుర్రాలను స్వారీ చేస్తుంది మరియు య్యజకుల వలె తెల్లని వస్త్రాలు ధరిస్తారు (ప్రకటన 19:14). మాక్‌ఆర్థర్ ఈ స్వచ్ఛంద సైన్యాన్ని ఇలా వర్ణించాడు: “భూమిపై విమోచించబడిన నివాసులు రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువుకు ఇష్టపూర్వకంగా సేవ చేస్తారు.”3 “నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు” (3b వ), క్రీస్తును వివరిస్తుంది.

కీర్తన 110:4-7: యాజకుడైన క్రీస్తు: చివరి నాలుగు వచనాలు క్రీస్తు యాజకత్వాన్ని సూచిస్తాయి. క్రీస్తు మెల్కీసెదెకు వలె యాజకునిగా ఉంటాడని దేవుడు ప్రమాణం చేశాడు. పాత నిబంధనలో రాజుగా మరియు యాజకునిగా (ఆదికాండము 14:17-20) పనిచేసిన ఏకైక వ్యక్తి మెల్కీసెదెకు మాత్రమే మరియు రాబోయే మెస్సీయ (వ. 4) గురించి తెలియజేసాడు. యాజకుడు దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్యవర్తిగా సేవచేస్తుండగా, యుద్ధం చేయడానికి వచ్చిన రాజును గుర్రంపై ఉన్న వ్యక్తిగా చిత్రీకరిస్తాము. క్రీస్తు అంతిమ, చివరి రాజు/యాజకుడు.

ఇప్పుడు ప్రభువు మెస్సీయ యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు, మరియు ఆయన తన కోప దినమున రాజులను నలుగగొట్టును (వ. 5). పాత్రలు తారుమారు చేయబడతాయి-తండ్రి కుమారుని కుడి వైపున నిలబడి కుమారుని అవసరాలన్నింటినీ సరఫరా చేస్తాడు. “ఆయన ఉగ్రత దినం” “ప్రభువు దినం” అవుతుంది. "ఆయన కోపము/కోపదినము" అనేది ప్రభువు దినాన్ని సూచిస్తుందని మాక్‌ఆర్థర్ వివరించాడు మరియు "దానియేలు డెబ్బైవ వారం (దానియేలు 9:24-27) ముగింపులో దాని ప్రపంచ వ్యక్తీకరణను కనుగొంటాడు.4 ఆయన కుమారుడు తిరిగి రావడానికి ప్రభువు దినం వస్తోంది.

అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. (వ. 6). ప్రభువు దినానికి సంబంధించిన గ్రంథం అంతటా అనేక సూచనలు ఉన్నాయి (కీర్తన 2:8-9; 50:1-6; యెషయా 2:4; 9:6-7; దానియేలు 2:44-45; 7:21-27; మత్తయి 25:32; ప్రకటన 6:15-17; 18:19–21). అప్పుడు, క్రీస్తు విజేతగా మార్గమున ఏటినీళ్ళు పానము చేసి ఆయన తలపైకి ఎత్తును (వ. 7). దావీదు నిజంగా దేవుని ప్రవక్తగా పని చేస్తున్నాడు, అతను ప్రవచనాత్మక ప్రవచనమును విడుదల చేశాడు (అపొస్తలుల కార్యములు 2:30).

ముగింపు

దావీదు ఈ వచనాలను వ్రాయడానికి పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడ్డాడు-ఈ ప్రవచన వాక్యాన్ని బద్రము/పొందు చేయడానికి. దావీదు రాజు మరియు మహిమగల రాజు గురించి రాశాడు. రాజు మరియు యాజకుడైన యేసు కోసం మార్గము చేయడానికి దేవుడు ప్రభువు దినాన్ని ముందుకు తెస్తాడు.

  1. వారెన్ W. వైర్స్‌బే, ది బైబిల్ ఎక్స్‌పోజిషన్ కామెంటరీ: ఓల్డ్ టెస్టమెంట్ (కొలరాడో స్ప్రింగ్స్: డేవిడ్ సి. కుక్, 2004), పేజి. 291.

  2. జాన్ మాక్‌ఆర్థర్, జాన్ మాక్‌ఆర్థర్ బైబిల్ కామెంటరీ (నాష్‌విల్లే: థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 2005), p. 674.

  3. మాక్‌ఆర్థర్, p.674.

  4. మాక్‌ఆర్థర్, p.674.

ప్రశ్నలు

  1. మీరు కీర్తన 110:1 చదివినప్పుడు, అది మీకు అర్థం ఏమిటి? ఈ చర్యకు మీరు ఎప్పుడైనా సాక్షిగా ఉన్నారా?

తరువాత: దినవాక్యం →

దినవాక్యం

Laura Martin Psalm 110:5–6

“The LORD is at Your right hand; He will crush kings on the day of His anger. He will judge the nations, heaping up corpses; He will crush leaders over the entire world.”

దేవుడు రాజుగా మరియు మహిమగల యాజకునిగా పరిపాలిస్తున్నాడు. దేవుడు తన శత్రువులను ఓడించును. దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. యేసు ఒక గొప్ప సైన్యంతో తిరిగి వస్తున్నాడు. కానీ అప్పటి వరకు, యేసు దేవుని కుడి పార్శ్వంలో కూర్చోనియున్నాడు. దేవుడు తన కోపముచేత శత్రువులందరినీ ఓడించి సమస్త రాజులను నలగగొట్టే సమయం వస్తుంది.

మీరు సిద్ధంగా ఉన్నారా?సిద్ధంగా ఉండటం అంటే ఏమిటి? దేవుని శక్తిని గుర్తించండి. ఆయన ఎవరో గుర్తించండి. మీరు ప్రపంచానికి భయపడి జీవించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలోని విషయాలకు భయపడటం మానేయండి. బదులుగా, ప్రభువుకు భయపడి జీవించండి, ఎందుకంటే అది జ్ఞానానికి నాంది. ఆయన పరక్రమమును బట్టి ప్రభువుకు భయపడుడి. ప్రభువు నామము గొప్పది గనుక ఆయన నామమును స్తుతించుము. మీ శత్రువులను లొంగదీసుకోవడానికి ప్రభువు నామాన్ని పిలవండి మరియు ఆయన విజయాన్ని ప్రకటించండి, తద్వారా ఇతరులు యేసుక్రీస్తు మహిమగల రాజు మరియు యాజకుడని తెలుసుకుంటారు. అవును, యేసులో విజయాన్ని ప్రకటించండి, తద్వారా ఇతరులు యేసుక్రీస్తును తెలుసుకుంటారు ఆమెన్.

“ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.”

  • కీర్తనలు 110:5-6

తదుపరి లేఖన భాగము

కీర్తనలు 47:3 - “ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.”

అపో.కార్యములు 7:55-56 - “అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.”

అపో. కార్యములు 15:17-18 - “పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది.”